Scripture Stories
పస్కాపండుగ


“పస్కాపండుగ,” పాత నిబంధనలు కథలు (2022)

“పస్కాపండుగ,” పాత నిబంధన కథలు

నిర్గమకాండము 11–12; 14–15

పస్కాపండుగ

ప్రభువు చేత రక్షించబడుట

చిత్రం
ప్రార్థించుచున్న మోషే

ఫరో ఇశ్రాయేలీయులను స్వేచ్ఛగా వెళ్ళనివ్వడు, కాబట్టి చివరిగా ఒక తెగులు పంపుతానని ప్రభువు మోషేతో చెప్పారు. ఐగుప్తు దేశములోని ప్రతి కుటుంబములో తొలి సంతతి మరణిస్తుంది, వారి జంతువులలో తొలిచూలు కూడా మరణిస్తుంది.

నిర్గమకాండము 11:1, 4–10

చిత్రం
జనులతో మాట్లాడుతున్న మోషే

ఇశ్రాయేలీయులు ఆయన సూచనలను పాటించినట్లైతే, తెగులు వారిని దాటుకొని వెళుతుంది కానీ వారిని బాధించదని ప్రభువు వాగ్దానం చేసారు.

నిర్గమకాండము 12:3, 13, 23

చిత్రం
ఇంటి గుమ్మానికి రంగు వేస్తున్న మనిషి, చూస్తున్న పిల్లలు

పరిపూర్ణమైన మగ గొఱ్ఱెపిల్లను బలిగా అర్పించాలని మరియు వారి ఇంటి గుమ్మాలపై గొఱ్ఱెపిల్ల రక్తాన్ని పూయాలని ప్రభువు ప్రతి ఇశ్రాయేలీయ కుటుంబానికి చెప్పారు.

నిర్గమకాండము 12:4–7

చిత్రం
కలిసి భోంచేస్తున్న కుటుంబము

గొఱ్ఱెపిల్లను వండి, త్వరగా తినమని ఇశ్రాయేలీయులకు ప్రభువు చెప్పారు. వారు తినేటప్పుడు దుస్తులు ధరించి, వారి ఇళ్ళను వదిలి వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి. ఇశ్రాయేలీయులు ఈ పనులు చేస్తే, వారి తొలి సంతతి తెగులు నుండి రక్షించబడుతుందని ప్రభువు చెప్పారు.

నిర్గమకాండము 12:8–11

చిత్రం
మరణించిన ఫరో కుమారుడు

ప్రభువు హెచ్చరించినట్లే, ఆ తెగులు వచ్చింది. ఫరో యొక్క పెద్దకుమారునితో పాటు, ఐగుప్తులో తొలి సంతతి మరణించారు. కానీ ఇంటి గుమ్మముపై గొఱ్ఱెపిల్ల రక్తమున్న ప్రతి ఇంటిని ఆ తెగులు దాటి వెళ్ళింది. ఇశ్రాయేలీయుల యొక్క తొలి సంతతి రక్షించబడ్డారు, ఎందుకంటే వారు ప్రభువుకు విధేయత చూపించారు.

నిర్గమకాండము 12:12–13, 29–30

చిత్రం
మోషే అహరోనులు వెళ్ళిపోవాలని విచారముగా ఉన్న ఫరో చెప్తున్నాడు

ఈ తెగులు కారణంగా తన స్వంత కుమారుడు చనిపోయాడని ఫరో చూసినప్పుడు, ఇశ్రాయేలీయులందరినీ తీసుకొని ఐగుప్తు విడిచివెళ్ళమని మోషే, అహరోనులతో అతడు చెప్పాడు.

నిర్గమకాండము 12:31–33

చిత్రం
కోపముగా ఉన్న ఫరో తన సైన్యాన్ని పంపుతున్నాడు

ఇశ్రాయేలీయులు వెళ్ళిపోయారు, కానీ ఫరో కోపంగా ఉన్నాడు. అతడు తన సైన్యాన్ని, రథాలను సమకూర్చి ఇశ్రాయేలీయులను వెంటాడాడు.

నిర్గమకాండము 12:37–41; 14:5–8

చిత్రం
ఇశ్రాయేలీయులను వెంటాడుతున్న సైన్యము

ఇశ్రాయేలీయులు ఎఱ్ఱసముద్రము దగ్గర దండుదిగారు. త్వరలోనే ఫరో మరియు అతని సైన్యం వారిని సమీపించారు. ఐగుప్తీయులు రావడం చూచినప్పుడు ఇశ్రాయేలీయులు భయపడ్డారు. కానీ ప్రభువు వారిని కాపాడతారని మోషే ఇశ్రాయేలీయులతో చెప్పాడు.

నిర్గమకాండము 14:9–14

చిత్రం
దండమును ఎత్తుచున్న మోషే, పాయలుగా విడిపోతున్న ఎఱ్ఱసముద్రము

ఐగుప్తీయులు దగ్గరకు వచ్చినప్పుడు తన దండాన్ని పైకి ఎత్తమని ప్రభువు మోషేతో చెప్పారు. మోషే అలా చేసినప్పుడు, ప్రభువు ఆ సముద్రాన్ని పాయలుగా విడగొట్టారు. ఆరిన నేలపై ఇశ్రాయేలీయులు ఆ సముద్రాన్ని దాటారు. ఫరో మరియు అతని సైన్యము వద్దనుండి వారు పారిపోయారు.

నిర్గమకాండము 14:15–16, 21–22

చిత్రం
ఐగుప్తీయుల సైన్యముపై పడుతున్న ఎఱ్ఱసముద్రము

ఐగుప్తీయుల సైన్యము ఇశ్రాయేలీయులను తరిమింది. ఇశ్రాయేలీయులందరూ సముద్రము అవతలి వైపు సురక్షితంగా ఉన్నప్పుడు, ప్రభువు నీటిని క్రిందికి వచ్చేలా చేసారు. ఐగుప్తీయుల సైన్యము సముద్రములో మునిగిపోయింది.

నిర్గమకాండము 14:23–30

చిత్రం
నాట్యము చేస్తున్న ఇశ్రాయేలీయులు

చివరికి ఇశ్రాయేలీయులు స్వేచ్ఛను పొందారు. వారు పాటలు పాడారు, నాట్యం చేసారు మరియు ప్రభువుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభువు వారి ప్రాణాలను కాపాడి, ఐగుప్తు నుండి బయటకు తీసుకొని వెళ్ళిన సమయముగా వారు ఎల్లప్పుడూ పస్కా పండుగను జ్ఞాపకం చేసుకున్నారు.

నిర్గమకాండము 14:31; 15:1–22