Scripture Stories
అరణ్యములో ఇశ్రాయేలీయులు


“అరణ్యములో ఇశ్రాయేలీయులు,” పాత నిబంధన కథలు (2022)

“అరణ్యములో ఇశ్రాయేలీయులు,” పాత నిబంధన కథలు

నిర్గమకాండము 16

అరణ్యములో ఇశ్రాయేలీయులు

ప్రభువుపై ఆధారపడుటను నేర్చుకొనుట

చిత్రం
ఫిర్యాదు చేస్తున్న ఇశ్రాయేలీయులు

ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచిపెట్టిన వెంటనే వారికి తగినంత ఆహారము లేదని వారు ఫిర్యాదు చేసారు. అరణ్యములో పస్తుండేకంటే ఐగుప్తులో బానిసలుగా ఉండడం మంచిదని వారు అన్నారు.

నిర్గమకాండము 16:1–3

చిత్రం
మన్నాను పోగుచేస్తున్న ఇశ్రాయేలీయులు

ఆయనను నమ్మాలని ఇశ్రాయేలీయులకు బోధించడానికి వారి కోసం ప్రతిరోజు ప్రభువు పరలోకం నుండి ఆహారం పంపారు. వారు దానిని మన్నా అని పిలిచారు. అది రుచికి తేనెలా ఉండేది. వారంలో ఏడవ రోజైన విశ్రాంతిదినము నాడు ప్రభువు మన్నాను పంపలేదు. కాబట్టి ఆరవ రోజున, రెండు రోజులకు సరిపడా మన్నాను తీసుకోమని ఆయన వారికి చెప్పారు.

నిర్గమకాండము 16:4–5, 14–31

చిత్రం
పూరేడులను పోగుచేస్తున్న ఇశ్రాయేలీయులు

కొంతకాలం ఇశ్రాయేలీయులు తినడానికి ప్రభువు పూరేడులను కూడా పంపారు. ఉదయం వారు మన్నా తీసుకొనేవారు మరియు సాయంత్రం పూరేడులను పోగుచేసేవారు. ఇశ్రాయేలీయులు ఆయనను నమ్మడం నేర్చుకోవాలని ప్రభువు కోరారు. ఈ విధంగా, ఆయన అరణ్యములో వారిని చూసుకున్నారు.

నిర్గమకాండము 16:11–13