Scripture Stories
దానియేలు, అతడి స్నేహితులు


“దానియేలు, అతడి స్నేహితులు,” పాత నిబంధన కథలు (2022)

“దానియేలు, అతడి స్నేహితులు,” పాత నిబంధన కథలు

దానియేలు 1

దానియేలు, అతడి స్నేహితులు

రాజ భోజనాన్ని తిరస్కరించుట

చిత్రం
సైనికుల చేత తీసుకొని వెళ్ళబడిన బాలురు

బబులోను రాజ్యము యెరూషలేమును జయించింది. వారు యెరూషలేములోని కుటుంబాలలో నుండి తెలివైన, బలమైన యువకులలో కొందరిని రాజుకు సేవ చేయడానికి బబులోనుకు తీసుకొని వెళ్ళారు.

దానియేలు 1:1–4

చిత్రం
రాజు ఆస్థానములో యువకులు

ఈ యువకులలో కొందరు దానియేలు, అతడి స్నేహితులు. రాజు ఆస్థానములో సేవ చేయడానికి, అతడి జ్ఞానులుగా ఉండటానికి వారు ఎంపిక చేయబడ్డారు.

దానియేలు 1:4–6

చిత్రం
ఆహారము మరియు ద్రాక్షారసము

దానియేలు, అతడి స్నేహితులకు రాజు ఆహారము, ద్రాక్షారసము ఇచ్చాడు. కానీ వాళ్ళు రాజ భోజనము తినలేదు లేక ద్రాక్షారసము త్రాగలేదు. అది దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకమైనది.

దానియేలు 1:5–8

చిత్రం
భోంచేస్తున్న యువకులు

ఇది రాజ సేవకుడు తన ప్రాణం కొరకు భయపడేలా చేసింది. దానియేలు, అతడి స్నేహితుల పట్ల అతడు శ్రద్ధ తీసుకొన్నాడు, వారు రాజ భోజనమును తిరస్కరించిన యెడల, వారు మిగిలిన యువకుల కంటె బలహీనమవుతారని అతడు అనుకున్నాడు. తరువాత రాజు కోపం వచ్చి సేవకుడిని చంపిస్తాడు.

దానియేలు 1:9–10

చిత్రం
సేవకునితో మాట్లాడుచున్న దానియేలు

కానీ దానియేలు దేవుడిని నమ్మాడు, ఆయన ఆజ్ఞలకు విధేయుడిగా ఉండాలని కోరాడు. దానియేలు 10 రోజులు నీళ్ళు, ధాన్యాలు వారికి ఇవ్వమని, తరువాత ఇతర యువకుల ఆరోగ్యముతో వారి ఆరోగ్యమును పోల్చమని సేవకుడిని అడిగాడు. సేవకుడు అంగీకరించాడు.

దానియేలు 1:11–14

చిత్రం
అధ్యయనం చేస్తున్న దానియేలు, అతడి స్నేహితులు

10 రోజుల తరువాత, దానియేలు, అతడి స్నేహితులు మిగిలిన యువకులందరి కంటె ఆరోగ్యంగా ఉన్నారు. దానియేలు, అతడి స్నేహితులు దేవుడు ఆజ్ఞలను అనుసరించారు, దేవుడు వారిని రాజు యొక్క న్యాయసభలో జ్ఞానులుగా చేసాడు.

దానియేలు 1:15–20