Scripture Stories
దానియేలు మరియు సింహముల గుహ


“దానియేలు మరియు సింహముల గుహ,” పాత నిబంధన కథలు (2022)

“దానియేలు మరియు సింహముల గుహ,” పాత నిబంధన కథలు

దానియేలు

దానియేలు మరియు సింహముల గుహ

ప్రార్థన చేయడానికి ఒక వ్యక్తి యొక్క ధైర్యము

చిత్రం
రాజుతో మాట్లాడుచున్న దానియేలు

దర్యావేషు బబులోనుపై పరిపాలకుడయ్యాడు. అతడు దానియేలును ప్రేమించాడు మరియు దేశమంతటిపై అతడిని నాయకునిగా చేయాలని కోరాడు. రాజు యొక్క జ్ఞానులు కొందరు అసూయపడ్డారు.

దానియేలు 6:1–4

చిత్రం
కుట్రపన్నుచున్న జ్ఞానులు

దానియేలు దేవునికి ప్రార్థన చేస్తాడని జ్ఞానులకు తెలుసు గనుక, వారు కొత్త చట్టాన్ని రూపొందించడానికి రాజును మోసగించారు. దేవునికి ప్రార్థన చేసినవారు ఎవరైనా సింహముల గుహలో వేయబడతారు.

దానియేలు 6:5–9

చిత్రం
ప్రార్థించుచున్న దానియేలు

అయినప్పటికీ దేవునికి ప్రార్థన చేయడానికి దానియేలు ఎన్నుకున్నాడు. రాజు యొక్క జ్ఞానులు దానియేలు ప్రార్థన చేయడం చూసి దానియేలు చట్టమును ఉల్లంఘిస్తున్నాడని రాజుకు చెప్పారు. అతడి జ్ఞానులు అతడిని మోసగించారని రాజు గ్రహించాడు. దానియేలును రక్షించడానికి ఒక మార్గమును కనుగొనటానికి అతడు ప్రయత్నించాడు, కానీ రాజు తన స్వంత చట్టమును అనుసరించాలి.

దానియేలు 6:10–15

చిత్రం
సింహముల గుహలో దానియేలు

సింహముల గుహలోనికి దానియేలు పడద్రోయబడ్డాడు. రాజు రాత్రంతా మేల్కోనియున్నాడు, దానియేలు కాపాడబడునట్లు ఉపవాసమున్నాడు.

దానియేలు 6:16–18

చిత్రం
సింహాల గుహలోని దానియేలు వైపు చూస్తున్న రాజు

తరువాత ఉదయము, రాజు సింహముల గుహకు త్వరగా వెళ్ళాడు. అతడు దానియేలు బ్రతికి ఉన్నాడా లేదా అని చూడటానికి అతడిని పిలిచాడు. దానియేలు తిరిగి జవాబిచ్చాడు! సింహముల నోళ్ళను మూయించడానికి దేవుడు దేవదూతను పంపాడని అతడు రాజుతో చెప్పాడు. సింహములు అతడికి హాని చేయలేదు.

దానియేలు 6:19–23

చిత్రం
దానియేలును హత్తుకొనుచున్న రాజు

దానియేలు క్షేమంగా ఉన్నందుకు రాజు సంతోషించాడు. తనను మోసం చేసిన ఆ జ్ఞానులను అతడు శిక్షించి, ఆ చట్టమును ముగించాడు. అతడు తన రాజ్య ప్రజలకు దేవుని శక్తిని, మంచితనమును బోధించాడు.

దానియేలు 6:19–23