Scripture Stories
పాత నిబంధన గురించి


“పాత నిబంధన గురించి,” పాత నిబంధన కథలు (2022)

“పాత నిబంధన గురించి,” పాత నిబంధన కథలు

పాత నిబంధన గురించి

పూర్వకాలము తన పిల్లలకు పరలోక తండ్రి వాగ్దానాలు

చిత్రం
పూర్వ మర్త్య జీవితపు వివరణ

పాత నిబంధన పరిశుద్ధ బైబిలు యొక్క మొదటి భాగము. ఈ లేఖనాలు పూర్వకాలములో, యేసు క్రీస్తు పుట్టకముందు వ్రాయబడ్డాయి. ఇది ఆయనపై విశ్వాసం కలిగియుండేందుకు సహాయపడే కథలను కలిగియుంది. భూమిపైనున్న ప్రతి వ్యక్తి పరలోక తండ్రి కుటుంబంలో భాగమని, ఆయన తన పిల్లల్ని ప్రేమిస్తారని ఇది మనకు బోధిస్తుంది.

ద్వితీయోపదేశకాండము 7:7–9; యెషయా 45:10–12

చిత్రం
ఏదేను తోటలో ఆదాము హవ్వలు

పాత నిబంధనలో యేసు క్రీస్తు యెహోవా అని, ప్రభువు అని పిలువబడ్డారు. ఆయన పరలోక తండ్రి ఉపదేశాలను అనుసరిస్తారు. ఆదాము హవ్వల కాలం నుండి తన ప్రవక్తలతో మాట్లాడేందుకు పరలోక తండ్రి ప్రభువైన యేసు క్రీస్తును పంపారు. ఒక ప్రవక్త మాటలు నిజమని తెలుసుకోవడానికి మనకు సహాయపడేందుకు పరలోక తండ్రి పరిశుద్ధాత్మను పంపుతారు.

నిర్గమకాండము 6:2–3; 2 దినవృత్తాంతములు 20:20; ఆమోసు 3:7; 2 పేతురు 1:21; మోషే 2:1

చిత్రం
ఆదాము సంతతి

వారి కుటుంబము వృద్ధి చెంది, భూమినంతటినీ ఆశీర్వదిస్తుందని ప్రభువు ప్రవక్తయైన అబ్రాహాము, అతని భార్య శారాలకు వాగ్దానమిచ్చాడు. వారి మనవడైన యాకోబుకు పెద్ద కుటుంబమున్నది, అది ఒక జనముగా అయ్యింది. వారు ఇశ్రాయేలు సంతతి లేదా ఇశ్రాయేలీయులు అని పిలువబడ్డారు. యేసు క్రీస్తు ఎప్పుడు వస్తారోనని ఎదురు చూడమని ప్రవక్తలు వారికి బోధించారు.

ఆదికాండము 15:5–6; 17:1–8; ద్వితీయోపదేశకాండము 18:15; యెషయా 7:14

చిత్రం
ఇంద్రధనుస్సు వైపు చూస్తున్న జనులు

ప్రభువు ఇశ్రాయేలీయులతో తన వాగ్దానాలను నిలుపుకున్నారని పాత నిబంధనలో చాలా కథలు చూపుతాయి.

ఆదికాండము 9:13–17; యిర్మియా 11:4–5; హెబ్రీయులకు 11:1–35

చిత్రం
జనులకు దండమును చూపుతున్న మోషే

ఇశ్రాయేలీయులు ప్రవక్తలను విని, ఆజ్ఞలు పాటించినప్పుడు ప్రభువు వారికి సహాయపడ్డారు. వారు విననప్పుడు ఆయన వారికి సహాయం చేయలేకపోయారు.

ద్వితీయోపదేశకాండము 11:26–28; యోబు 36:11–12

చిత్రం
లేఖనాలను చదువుతున్న పిల్లలు

మీరు పరలోక తండ్రి కుటుంబములో భాగస్థులు. పరలోక తండ్రి దయామయుడు, ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. ఆయన మీ కొరకు ఒక ప్రణాళికను కలిగియున్నారు. ప్రభువైన యేసు క్రీస్తు వలన మీరు మరలా పరలోక తండ్రితో జీవించడానికి తిరిగి వెళ్ళగలరు. ఇశ్రాయేలీయులు బోధింపబడినట్లుగా, ప్రభువునందు విశ్వాసము కలిగియుండి, ఆయన ఆజ్ఞలను పాటించడానికి మీరు ఎన్నుకోగలరు.

నిర్గమకాండము 15:2; ద్వితీయోపదేశకాండము 4:31; 5:10; మోషే 1:39