Scripture Stories
ప్రవక్తయైన హానోకు


“ప్రవక్తయైన హానోకు,” పాత నిబంధన కథలు (2022)

“ప్రవక్తయైన హానోకు” పాత నిబంధన కథలు (2022)

ఆదికాండము 5; మోషే 6–7

ప్రవక్తయైన హానోకు

ప్రభువునదు విశ్వాసము ఒక పట్టణాన్ని ఎలా కాపాడింది

చిత్రం
హానోకుతో మాట్లాడుచున్న దేవుడు

ప్రభువైన యేసు క్రీస్తు జనులను పశ్చాత్తాపపడమని చెప్పమని హానోకును అడిగాడు. కానీ హానోకు సరిగా మాట్లాడలేనని అనుకున్నాడు. జనులు అతడి మాట వినరని అతడు భయపడ్డాడు.

ఆదికాండము 5:22; మోషే 6:26–31

చిత్రం
హానోకును ఎగతాళి చేస్తున్న జనులు

హానోకు బోధించిన దానిని కొందరు ఇష్టపడక పోయినప్పటికీ, హానోకును బలపరచి, కాపాడతానని ప్రభువు వాగ్దానమిచ్చాడు.

మోషే 6:32–39

చిత్రం
జనులకు బోధిస్తున్న హానోకు

ప్రభువు యొక్క వాగ్దానము హానోకుకు ధైర్యము ఇచ్చింది. హానోకు ప్రభువుకు విధేయుడయ్యాడు, జనులకు శక్తితో బోధించాడు. అతడు యేసు క్రీస్తు, పశ్చాత్తాపము, బాప్తీస్మము మరియు పరిశుద్ధాత్మ గురించి బోధించాడు. కొందరు హానోకును నమ్మారు మరియు ప్రభువును అనుసరించాలని కోరారు.

మోషే 6:47–68

చిత్రం
స్త్రీకి బాప్తీస్మమిస్తున్న హానోకు

బాప్తీస్మమివ్వడానికి హానోకుకు దేవుని నుండి అధికారమున్నది. హానోకును నమ్మిన జనులందరూ బాప్తీస్మం పొంది, దేవునికి దగ్గరయ్యారు. వారు ఒకరికొకరు సహాయం చేసుకొన్నారు గనుక, ఏ ఒక్కరూ పేదవారిగా లేరు. వారు ప్రేమ, నీతియందు కలిసి జీవించారు గనుక, వారు సీయోను అని పిలవబడ్డారు.

మోషే 7:10–20

చిత్రం
యేసు యొక్క జీవితం, మరణం మరియు పునరుత్థానము

ఒక రోజు ప్రభువు హానోకుకు భూమి మీద జరగబోయేదంతా ఒక దర్శనంలో చూపించాడు. హానోకు యేసు క్రీస్తు యొక్క జీవితం, మరణం మరియు పునరుత్థానమును చూసాడు. కడవరి దినాలలో సువార్త పునఃస్థాపించబడుతుందని హానోకు తెలుసుకున్నాడు. అతడు యేసు యొక్క రెండవ రాకడను కూడా చూసాడు.

మోషే 7:21–67

చిత్రం
సీయోను జనులతో మాట్లాడుచున్న దేవుడు

చివరకు, సీయోను పట్టణంలో జనులందరూ హానోకును నమ్మి, పశ్చాత్తాపపడ్డారు. వారు ఒకరికొకరు సహాయం చేసుకొని, శాంతితో జీవించారు గనుక, ఆయనతో జీవించుటకు ప్రభువు వారిని తీసుకొని వెళ్ళాడు.

ఆదికాండము 5:24; మోషే 7:18, 21, 68–69