Scripture Stories
ప్రవక్తయైన ఎలీషా


“ప్రవక్తయైన ఎలీషా,” పాత నిబంధన కథలు (2022)

“ప్రవక్తయైన ఎలీషా,” పాత నిబంధన కథలు

2 రాజులు 2; 4

ప్రవక్తయైన ఎలీషా

ప్రభువు యొక్క అద్భుతములు

చిత్రం
ఎలీషాతో మాట్లాడుచున్న ఏలీయా

ఏలీయా ప్రవక్త ద్వారా, తరువాత ప్రవక్తగా ఉండటానికి ప్రభువు ఎలీషాను సిద్ధపరిచాడు. తరువాత ప్రభువు ఏలీయాను పరలోకమునకు తీసుకొనివెళ్ళాడు.

2 రాజులు 2:1–15

చిత్రం
నూనెను క్రుమ్మరిస్తున్న స్త్రీ

అనేక అద్భుతాలను చేయడానికి ప్రభువు ఎలీషా ప్రవక్తకు సహాయపడ్డాడు. ఒకసారి ఎలీషా చాలా పాత్రలు నింపడానికి ఒక పేద స్త్రీ యొక్క నూనెను దీవించాడు. తరువాత ఆ స్త్రీ తన అప్పులను తీర్చడానికి నూనెను అమ్మింది.

2 రాజులు 4:1–7

చిత్రం
కుటుంబముతో మాట్లాడుచున్న ఎలీషా

మరొకసారి, విశ్వాసురాలైన ఒక స్త్రీ ఎలీషాకు సేవ చేసి, అతడిని చాలా దయగా చూసింది. ఆమెకు సేవ చేయడానికి తాను ఏమి చేయగలనని ఎలీషా ఆమెను అడిగాడు. ఆమె ఒక బిడ్డ కోసం ఆశపడుచున్నది. ఎలీషా ఆమెను, ఆమె భర్తను ఒక కుమారుడిని కలిగియుండేలా ఆశీర్వాదించాడు.

2 రాజులు 4:8–17

చిత్రం
వేడుక చేసుకొంటున్న కుటుంబము

కాని కొన్ని సంవత్సరాల తరువాత, కుమారుడు అస్వస్థత చెంది చనిపోయాడు. ఆ స్త్రీ ఎలీషా కోసం వెదికింది, ఎందుకనగా అతడు తన కుమారుడిని రక్షించగలడని ఆమెకు విశ్వాసమున్నది. ఎలీషా వచ్చి, బాలుడిని ఆశీర్వదించాడు మరియు అతడు మరలా బ్రతికాడు. అనేక అద్భుతాలను చేయడానికి ప్రభువు ఎలీషాకు సహాయపడ్డాడు. అతడు ప్రభువు యొక్క గొప్ప ప్రవక్త.

2 రాజులు 4:18–37