Scripture Stories
ఆదాము హవ్వలు


“ఆదాము హవ్వలు,” పాత నిబంధన కథలు (2022)

“ఆదాము హవ్వలు,” పాత నిబంధన కథలు

ఆదికాండము 2–3; మోషే 3–5; అబ్రాహము 5

ఆదాము హవ్వలు

ఎంపికలు చేయడం ద్వారా అనుభవాన్ని సంపాదించుట

చిత్రం
జంతువులతో ఆదాము హవ్వలు

ఆదాము, హవ్వలు భూమి మీద జీవించిన పరలోక తండ్రి యొక్క పిల్లలలో మొదటివారు. వారు అందమైన ఏదేను వనములో నివసించారు, దాని చుట్టూ అన్ని రకాల మొక్కలు మరియు చెట్లు ఉన్నాయి. దేవుడైన మన పరలోక తండ్రి మరియు ప్రభువైన యేసు క్రీస్తు వారిని దర్శించి వారితో మాట్లాడారు.

ఆదికాండము 2:8–9; 3:8; మోషే 3:8­–9; అబ్రాహాము 5:8, 14–19

చిత్రం
మంచి చెడుల జ్ఞానమిచ్చే వృక్షము

దేవుడు ఒక్కటి తప్ప ప్రతీ చెట్టు ఫలమును వారిని తిననిచ్చాడు. మంచి చెడుల జ్ఞానమిచ్చే వృక్ష ఫలమును వారు తింటే, వారు వనమును విడిచి వెళ్ళాలి మరియు చివరకు చనిపోతారు. సాతాను ఆదాము, హవ్వలతో అబద్ధమాడాడు. వారు ఫలము తింటే వారు చనిపోరని, వారికి మంచి చెడులు తెలుస్తాయని సాతాను చెప్పాడు.

ఆదికాండము 2:16–17; 3:1–5; మోషే 3:9; 4:6–11; అబ్రాహము 5:9, 12–13

చిత్రం
పండును కోస్తున్న హవ్వ

పండు తినడానికి హవ్వ ఎంచుకొంది.

ఆదికాండము 3:5–6; మోషే 4:12

చిత్రం
ఫలమును పట్టుకొన్న చేతులు

పండులో కొంత భాగము హవ్వ ఆదాముకిచ్చింది. అతడు కూడా దానిని తినడానికి ఎన్నుకున్నాడు.

ఆదికాండము 3:6–7; మోషే 4:12

చిత్రం
దేవుడు మరియు యేసు నుండి దాగుకొన్న ఆదాము హవ్వలు

దేవుడు మరియు ప్రభువు వారి దర్శించారు కాని ఆదాము హవ్వలు భయపడి, దాక్కున్నారు. మంచి చెడుల జ్ఞానమిచ్చే వృక్ష ఫలమును తిన్నారా అని దేవుడు వారిని అడిగాడు.

ఆదికాండము 3:8–13; మోషే 4:13–14

చిత్రం
ఏదెను వనమును వదిలి వెళ్ళుచున్న ఆదాము హవ్వలు

ఆదాము హవ్వలు ఫలమును తినడానికి ఎంచుకున్నామని దేవునితో చెప్పారు. వారి ఎంపిక వలన, వారు ఏదేను వనము విడిచి వెళ్ళాల్సి వచ్చింది. వారు దేవుని నుండి వేరు చేయబడ్డారు, కానీ ఆయన వారి కోసం ఒక ప్రణాళికను కలిగియున్నాడు. ఇప్పుడు వారికి తప్పు ఒప్పులు తెలుసు మరియు పిల్లల్ని కనగలరు.

ఆదికాండము 3:16–24; మోషే 4:15–31

చిత్రం
మంటవైపు చూస్తున్న ఆదాము హవ్వల కుటుంబము

దేవుని ఆజ్ఞలన్నిటికీ విధేయులవుతామని ఆదాము, హవ్వలు వాగ్దానమిచ్చారు. జంతు బలి అర్పించమని వారు బోధించబడ్డారు. వారు విధేయులయ్యారు, దేవుని కుమారుడైన యేసు క్రీస్తు గురించి ఎక్కువగా వారు తెలుసుకున్నారు. వారి కుటుంబము దేవుని వద్దకు తిరిగి వెళ్ళడానికి ఆయన సహాయడపడతాడు గనుక, వారిరువురు గొప్ప సంతోషాన్ని పొందారు.

ఆదికాండము 3:23; మోషే 5:1–12