Scripture Stories
నెహెమ్యా


“నెహెమ్యా,” పాత నిబంధన కథలు (2022)

“నెహెమ్యా,” పాత నిబంధన కథలు

నెహెమ్యా 1–2; 4; 6.

నెహెమ్యా

యెరూషలేములో గోడను తిరిగి నిర్మించుట

చిత్రం
నెహెమ్యా, గమనిస్తున్న రాజు

నెహెమ్యా ఒక యూదుడు, పర్షియాలో నివసించేవాడు. అతడు రాజుగారి నమ్మినబంటు. యెరూషలేములో ఉన్న యూదులు కష్టపడుతున్నారని ఒకరోజు నెహెమ్యా విన్నాడు. యెరూషలేమును రక్షిస్తున్న గోడలు నాశనం చేయబడి, మరలా ఎన్నడూ తిరిగి నిర్మించబడలేదు. యెరూషలేము ప్రమాదంలో ఉంది. ప్రభువు యొక్క సహాయం కోసం నెహెమ్యా ఉపవాసముండి, ప్రార్థించాడు.

నెహెమ్యా 1

చిత్రం
గోడ గురించి నెహెమ్యాతో మాట్లాడుతున్న రాజు

అతను ఎందుకు బాధపడుతున్నాడని నెహెమ్యాను అడిగాడు రాజు. యెరూషలేములోని ప్రమాదం గురించి అతడు రాజుకు చెప్పాడు. తాను సహాయం చేయగలనని రాజు చెప్పాడు. యెరూషలేముకు వెళ్ళి, గోడను తిరిగి నిర్మించమని నెహెమ్యా అడిగాడు. రాజు నెహెమ్యాను నాయకుడిగా చేసి, అతనికి కావలసిన సామాగ్రిని ఇచ్చాడు.

నెహెమ్యా 2:2–8

చిత్రం
గోడను నిర్మిస్తున్న నెహెమ్యా, గమనిస్తున్న శత్రువులు

నెహెమ్యా మరియు యూదులు యెరూషలేము యొక్క గోడలను తిరిగి నిర్మించడం మొదలుపెట్టారు. కానీ వారి శత్రువులు వారిని ఎగతాళి చేస్తూ, ఆపడానికి ప్రయత్నించారు.

నెహెమ్యా 2:17–20

చిత్రం
నెహెమ్యాను ఎగతాళి చేస్తున్న జనులు

నెహెమ్యా ఊరు వదిలి వెళ్ళిపోయేలా మోసం చేయడానికి శత్రువులు ప్రయత్నించారు. కానీ నెహెమ్యా వెళ్ళలేదు. అతడు ప్రభువును నమ్మాడు. అతడు గొప్ప పని చేస్తున్నాడు.

నెహెమ్యా 6:2–4.

చిత్రం
పూర్తయిన గోడమీద నిల్చున్న నెహెమ్యా

భయపడవద్దని నెహెమ్యా తన జనులకు చెప్పాడు. గోడను కాపాడడానికి అక్కడ వారు కావలివారిని ఉంచారు. యూదులు గోడను నిర్మించసాగారు. ప్రభువు యూదులకు బలమునిచ్చారు మరియు వారు 52 రోజుల్లో గోడను పూర్తిచేసారు. యెరూషలేము మరలా సురక్షితంగా ఉంది.

నెహెమ్యా 4:6–15; 6:5–9, 15–16