Scripture Stories
ప్రభువు ఏలీయాతో మాట్లాడుట


“ప్రభువు ఏలీయాతో మాట్లాడుట,” పాత నిబంధన కథలు (2022)

“ప్రభువు ఏలీయాతో మాట్లాడుట,” పాత నిబంధన కథలు

1 రాజులు 19

ప్రభువు ఏలీయాతో మాట్లాడుట

ప్రభువు యొక్క స్వరమును వినుట

చిత్రం
యెజెబెలుతో మాట్లాడుతున్న అహాబు, నేపథ్యంలో అగ్ని

ప్రభువు బయలు యాజకులను జయించారని అహాబు రాజు యెజెబెలు రాణితో చెప్పాడు. యెజెబెలు కోపముతో నుండి, ఏలీయా ప్రవక్తను చంపుతానని చెప్పింది.

1 రాజులు 19:1–2

చిత్రం
గుహను కనుగొన్న ఏలీయా

సురక్షితంగా ఉండడానికి ఏలీయా ఇశ్రాయేలు దేశాన్ని విడిచివెళ్ళాడు. అతడు నలువది రాత్రింబగళ్ళు ప్రయాణించాడు, ప్రయాణంలో ఉపవాసమున్నాడు. తర్వాత అతడు సీనాయి కొండకు వచ్చి, దాగుకోవడానికి ఒక గుహను కనుగొన్నాడు. ఆయన ఏలీయాతో మాట్లాడగలిగేలా ఏలీయాను పర్వతము పైకి వెళ్ళమని ప్రభువు చెప్పారు.

1 రాజులు 19:3, 8–11

చిత్రం
గాలి, భూకంపము, మెరుపులను చూస్తున్న ఏలీయా

బలమైన గాలి వచ్చి, గుహ చుట్టూ ఉన్న రాళ్ళను ముక్కలు చేసింది. దాని తర్వాత, భూకంపము నేలను కదిలించింది. తర్వాత మెరుపు పుట్టింది. ఏలీయా గాలి, భూకంపము మరియు మెరుపుల భీకర శబ్దాలను విన్నాడు. కానీ ఆ భీకర శబ్దాలలో ప్రభువు యొక్క స్వరము లేదు.

1 రాజులు 19:11–12

చిత్రం
ప్రభువు ఏలీయాతో మాట్లాడుట

అప్పుడు మిక్కిలి నిమ్మళముగా మాట్లాడు ఒక స్వరమును ఏలీయా విన్నాడు. అది ప్రభువేనని అతనికి తెలుసు. అతను అక్కడ ఏమి చేస్తున్నాడని ప్రభువు ఏలీయాను అడిగారు.

1 రాజులు 19:12–13

చిత్రం
ప్రభువుతో మాట్లాడుతున్న ఏలీయా

సురక్షితంగా ఉండడానికి దాగుకుంటున్నానని ఏలీయా చెప్పాడు. ప్రవక్తలందరు చంపబడ్డారు మరియు జనులు ప్రభువును తిరస్కరించారు.

1 రాజులు 19:14.

చిత్రం
ఎలీషాను కనుగొన్న ఏలీయా

ప్రభువు ఏలీయాను ఓదార్చి, ఇంకా అనేకమంది ఇశ్రాయేలీయులు ప్రభువును ఆరాధిస్తున్నారని చెప్పారు. ఇంటికి తిరిగివెళ్ళి, మరొక ప్రవక్తను సిద్ధం చేయమని ప్రభువు ఏలీయాతో చెప్పారు. ఈ క్రొత్త ప్రవక్త పేరు ఎలీషా.

1 రాజులు 19:15–18