Scripture Stories
దానియేలు మరియు రాజు కల


“దానియేలు మరియు రాజు కల,” పాత నిబంధన కథలు (2022)

“దానియేలు మరియు రాజు కల,” పాత నిబంధన కథలు (2022)

దానియేలు 2

దానియేలు మరియు రాజు కల

రాజుకు దేవుని రహస్య సందేశం

చిత్రం
కలగనుచున్న రాజు

బబులోను రాజు ఒక కల కన్నాడు, అది అతడిని కలవరపెట్టింది. దాని అర్థము చెప్పమని అతడు తన యాజకులను, జ్ఞానులను గట్టిగా కోరాడు.

దానియేలు 2:1–3

చిత్రం
ఆలోచిస్తున్న రాజు

రాజు కలను వారికి చెప్పడు. యాజకులు, జ్ఞానులు నిజంగా శక్తిగలవారైతే ఆ కల ఏమిటి, దాని అర్థము ఏమిటో చెప్పగలరని అతడు అన్నాడు.

దానియేలు 2:4–9

చిత్రం
జ్ఞానులను బహిష్కరిస్తున్న రాజు

అతడు తన కల ఏమిటో చెప్పని యెడల, వారు దాని భావం చెప్పలేమని యాజకులు, జ్ఞానులు రాజుకు చెప్పారు. ఏ వ్యక్తీ దానిని చేయలేడని వారు అన్నారు. రాజుకు కోపం వచ్చి, దానియేలు, అతడి స్నేహితులతో కలిపి రాజ్యములో ఉన్న జ్ఞానులందరిని చంపిస్తానని అతడు చెప్పాడు.

దానియేలు 2:10–13

చిత్రం
సైనికునితో మాట్లాడుచున్న దానియేలు

దానియేలును, అతడి స్నేహితులను తీసుకొని వెళ్ళుటకు రాజు కావలివాడు వచ్చినప్పుడు, ఇంకొంచెం సమయం ఇవ్వమని, తద్వారా అతడు రాజు యొక్క కలకు అర్థము చెప్పగలనని అన్నాడు. దేవునికి అంతా తెలుసని, ఆయన అన్నిటిని చూస్తున్నాడని, కలలు కూడ తెలుసని దానియేలుకు తెలుసు. తనతోపాటు ప్రార్థన చేయమని దానియేలు తన స్నేహితులను అడిగాడు.

దానియేలు 2:14–18

చిత్రం
ప్రార్థన చేస్తున్న దానియేలు

దేవుడు ఒక దర్శనములో రాజు కలను దానియేలుకు చూపించి, దాని అర్థమును బోధించాడు. అతడివి మరియు అతడి స్నేహితుల ప్రార్థనలకు జవాబిచ్చినందుకు, వారి ప్రాణాలు కాపాడినందుకు దానియేలు దేవునికి కృతజ్ఞత తెలిపాడు. తరువాత అతడు కలకు అర్థమును రాజుకు చెప్పడానికి వెళ్ళాడు.

దానియేలు 2:19–25

చిత్రం
రాజుతో మాట్లాడుచున్న దానియేలు

రాజుకు వచ్చిన కల ఒక పెద్ద ప్రతిమ గురించి అని, అది పర్వతం నుండి తీయబడిన రాయిచేత నాశనం చేయబడుతుందని దానియేలు చెప్పాడు. ప్రతిమ భూమి యొక్క రాజ్యాలను సూచిస్తుంది. పర్వతమునుండి తీయబడిన రాయి భూమిని నింపు దేవుని రాజ్యమును సూచిస్తుంది. దానియేలు నిజము చెప్పాడని రాజుకు తెలుసు.

దానియేలు 2:26–49