Scripture Stories
ఎలీషా నయమానును స్వస్థపరచుట


“ఎలీషా నయమానును స్వస్థపరచుట,” పాత నిబంధన కథలు (2022)

“ఎలీషా నయమానును స్వస్థపరచుట,” పాత నిబంధన కథలు

2 రాజులు 5

ఎలీషా నయమానును స్వస్థపరచుట

మామూలు విశ్వాసంతో గొప్ప అద్భుతం జరిగింది

చిత్రం
రోగముతో మంచంపై నున్న నయమాను

దూరంగా సిరియాలో నయమాను అనే వ్యక్తి నివసించేవాడు. అతడు సిరియా సైన్యంలో గొప్ప సైన్యాధిపతి. కానీ నయమానుకు కుష్ఠురోగం అనే బాధాకరమైన చర్మవ్యాధి ఉండేది.

2 రాజులు 5:1

చిత్రం
నయమాను భార్యతో మాట్లాడుతున్న ఇశ్రాయేలు బాలిక

నయమాను భార్య యొక్క సేవకురాలు ఒక ఇశ్రాయేలు బాలిక. ఆ బాలిక ప్రభువునందు విశ్వాసము కలిగియుంది. నయమాను ప్రవక్తయైన ఎలీషాను దర్శించినట్లయితే, నయమాను వ్యాధి బాగుచేయబడుతుందని ఆమె చెప్పింది.

2 రాజులు 5:2–4

చిత్రం
ఎలీషాను కనుగొనడానికి ప్రయాణిస్తున్న నయమాను

ఎలీషాను కనుగొనడానికి నయమాను చాలా దూరం ప్రయాణించాడు. గొప్ప అద్భుతంతో తాను బాగుచేయబడతానని నయమాను అనుకున్నాడు.

2 రాజులు 5:5–8

చిత్రం
ఎలీషా సేవకునితో మాట్లాడుతున్న నయమాను

తన సేవకులు, గుర్రాలు, రథాలతో నయమాను ఎలీషా ఇంటికి వచ్చాడు. నయమానుకు ప్రభువు యొక్క సూచనలు ఇవ్వమని ఎలీషా తన సేవకుడిని పంపాడు. యొర్దాను నదిలో ఏడుసార్లు అతడు స్నానము చేసినట్లయితే, ప్రభువు నయమానును బాగుచేస్తారు.

2 రాజులు 5:9–10

చిత్రం
నది దగ్గర ఫిర్యాదు చేస్తున్న నయమాను

నయమానుకు కోపం వచ్చింది, ఎందుకంటే ప్రభువు యొక్క ప్రవక్త బయటకు వచ్చి వెంటనే అతడిని బాగుచేయాలని అతను కోరుకున్నాడు. యొర్దాను నది సిరియాలో ఉన్న గొప్ప నదుల కంటే శ్రేష్ఠమైనదేమీ కాదని నయమాను ఫిర్యాదు చేసాడు.

2 రాజులు 5:11–12

చిత్రం
నది దగ్గర నయమానుతో మాట్లాడుతున్న సేవకుడు

కానీ, ఇంత సులువైన పనిని నయమాను ఎందుకు చేయడం లేదని నయమాను సేవకులు అడిగారు. నయమానుకు అది అర్థంలేనిదిగా అనిపించినప్పటికీ, ప్రభువు యొక్క ప్రవక్త దానిని చేయమని అతనికి చెప్పాడు.

2 రాజులు 5:13

చిత్రం
యొర్దాను నదిలో బాగుచేయబడిన నయమాను

నయమాను గర్వపడడం మానివేసి, తన సేవకుల మాట విన్నాడు. అతను ఏడుసార్లు యొర్దాను నదిలో స్నానం చేసాడు. అప్పుడు ఎలీషా చెప్పినట్లు ప్రభువు నయమానును బాగుచేసారు. ఎలీషా ఒక ప్రవక్త అని, ప్రభువు నిజంగా ఉన్నారని నయమాను తెలుసుకున్నాడు.

2 రాజులు 5:14–15