దేవాలయ సిఫారసు మౌఖికాలు
దేవాలయము ప్రభువు యొక్క మందిరము. దేవాలయంలోకి ప్రవేశించడం మరియు అక్కడి విధులలో పాల్గొనడం ఒక పవిత్రమైన విశేషాధికారము. యాజకత్వ అధికారం కలిగియున్న నాయకులచేత నిర్ణయించబడినట్లుగా, ఆధ్యాత్మికంగా సిద్ధపడి, ప్రభువు యొక్క ప్రమాణాల ప్రకారం జీవించడానికి కృషి చేసే వారికి ఈ విశేషాధికారము ప్రత్యేకించబడింది.
ఈ నిర్ణయం తీసుకోవడానికి, యాజకత్వ నాయకులు దిగువ ప్రశ్నలను ఉపయోగించి సభ్యుడిని మౌఖికం చేస్తారు.
దేవాలయ సిఫారసు మౌఖిక ప్రశ్నలు
-
నిత్యుడగు తండ్రియైన దేవునియందు, ఆయన కుమారుడైన యేసు క్రీస్తునందు మరియు పరిశుద్ధాత్మయందు మీరు విశ్వాసమును మరియు సాక్ష్యమును కలిగియున్నారా?
-
యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తమును గూర్చి మరియు రక్షకునిగా, విమోచకునిగా ఆయన పాత్రను గూర్చి మీరు సాక్ష్యము కలిగియున్నారా?
-
యేసు క్రీస్తు సువార్త యొక్క పునఃస్థాపనను గూర్చి మీరు సాక్ష్యము కలిగియున్నారా?
-
యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క అధ్యక్షుడిని ప్రవక్తగా, దీర్ఘదర్శిగా మరియు బయల్పాటుదారునిగా, సమస్త యాజకత్వ తాళపుచెవులను ఉపయోగించుటకు భూమిపై అధికారము పొందిన ఏకైక వ్యక్తిగా మీరు ఆమోదిస్తున్నారా?
ప్రథమ అధ్యక్షత్వము మరియు పన్నెండుమంది అపొస్తలుల సమూహము యొక్క సభ్యులను ప్రవక్తలుగా, దీర్ఘదర్శులుగా మరియు బయల్పాటుదారులుగా మీరు ఆమోదిస్తున్నారా?
సంఘము యొక్క ఇతర ప్రధాన అధికారులు మరియు స్థానిక అధికారులను మీరు ఆమోదిస్తున్నారా?
-
ఆయన యెదుట అన్ని సంగతులు “స్వచ్ఛతతో చేయబడవలెను“ అని ప్రభువు చెప్పారు ( సిద్ధాంతము మరియు నిబంధనలు 42:41).
మీ ఆలోచనలలో, ప్రవర్తనలో నైతిక స్వచ్ఛత కొరకు మీరు ప్రయాసపడుతున్నారా?
పవిత్రత యొక్క చట్టమునకు మీరు విధేయులైయున్నారా?
-
మీ కుటుంబ సభ్యులతో మరియు ఇతరులతో మీ వ్యక్తిగత మరియు బహిరంగ ప్రవర్తనలో యేసు క్రీస్తు సంఘము యొక్క బోధనలను మీరు అనుసరిస్తున్నారా?
-
యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘ బోధనలు, ఆచరణలు లేదా సిద్ధాంతములకు వ్యతిరేకముగా ఉన్న వేటికైనా మీరు మద్దతిస్తున్నారా లేదా ప్రోత్సహిస్తున్నారా?
-
గృహములో మరియు సంఘములో విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు; మీ కూడికలకు హాజరగుటకు; సంస్కారము కొరకు సిద్ధపడి యోగ్యతతో దానిలో పాలుపొందుటకు మీరు ప్రయాసపడుతున్నారా? మీ జీవితమును సువార్త యొక్క చట్టములు మరియు ఆజ్ఞలకు అనుగుణముగా జీవిస్తున్నారా?
-
మీరు చేయు వాటన్నిటిలో నిజాయితీగా ఉండుటకు ప్రయాసపడుతున్నారా?
-
మీరు పూర్తి దశమభాగమును చెల్లించువారిగా ఉన్నారా?
ప్రాతినిధ్య బాప్తిస్మములు మరియు నిర్ధారణలను నిర్వహించడానికి సిఫారసును కోరుకునే క్రొత్త సభ్యుల కొరకు: దశమభాగము చెల్లించాలనే ఆజ్ఞకు విధేయులవడానికి మీరు సమ్మతిస్తున్నారా?
-
జ్ఞాన వాక్యమును మీరు అర్ధము చేసుకొని, విధేయులవుతారా?
-
(పిల్లలు లేదా యువతను మౌఖికము చేస్తున్నప్పుడు ఈ ప్రశ్న విస్మరించబడింది.) మాజీ భార్య, భర్త లేదా పిల్లలతో ఆర్ధిక లేదా ఇతర బాధ్యతలను మీరు కలిగియున్నారా?
అలాగైతే, ప్రస్తుతం ఆ బాధ్యతలను మీరు నిర్వహిస్తున్నారా?
-
(వరము పొందని సభ్యుడిని మౌఖికము చేస్తున్నప్పుడు ఈ ప్రశ్న విస్మరించబడింది.) దేవాలయములో మీరు చేసిన నిబంధనలను మీరు పాటిస్తున్నారా?
-
(వరము పొందని సభ్యుడిని మౌఖికము చేస్తున్నప్పుడు ఈ ప్రశ్న విస్మరించబడింది.) ఆరంభ విధులలో ఉపదేశించబడినట్లుగా వస్త్రమును ధరించే మీ విశేషాధికారమును మీరు గౌరవిస్తున్నారా? (ప్రతి సభ్యునికి క్రింద చేర్చబడిన “దేవాలయ వస్త్రమును ధరించుట” ప్రకటనను చదవండి.)
-
మీ పశ్చాత్తాపములో భాగముగా యాజకత్వ అధికారులతో పరిష్కరించబడవలసియున్న తీవ్రమైన పాపములు మీ జీవితంలో ఏవైనా ఉన్నాయా?
-
ప్రభువు యొక్క మందిరములోనికి ప్రవేశించుటకు మరియు దేవాలయ విధులందు పాల్గొనుటకు మిమ్మల్ని మీరు యోగ్యులుగా పరిగణిస్తున్నారా?
దేవాలయ వస్త్రమును ధరించుట
వస్త్రాన్ని ధరించడంపై ప్రథమ అధ్యక్షత్వము క్రింది మార్గదర్శకాలను అందించింది:
“పరిశుద్ధ యాజకత్వ వస్త్రము దేవాలయములోని తెరను మనకు జ్ఞాపకం చేస్తుంది మరియు ఆ తెర యేసు క్రీస్తుకు సంకేతంగా ఉంది. మీరు మీ వస్త్రాన్ని ధరించినప్పుడు, మీరు యేసు క్రీస్తు యొక్క పవిత్రమైన సంకేతాన్ని ధరిస్తున్నారు. దానిని ధరించడం ఆయనను అనుసరించాలనే మీ అంతర్గత నిబద్ధత యొక్క బహిర్గత వ్యక్తీకరణ. వస్త్రము మీ దేవాలయ నిబంధనల యొక్క జ్ఞాపిక కూడా. మీరు మీ వస్త్రాన్ని మీ జీవితాంతము పగలు రాత్రి ధరించవలెను. వస్త్రాన్ని ధరించి సహేతుకంగా చేయలేని ప్రోత్సాహ కార్యక్రమాల కొరకు దానిని తొలగించవలసి వచ్చినప్పుడు, వీలైనంత త్వరగా దానిని తిరిగి ధరించవలెను. ఆరంభ విధులలో సూచించబడినట్లుగా వస్త్రమును ధరించే పవిత్రమైన విశేషాధికారముతో పాటు మీరు మీ నిబంధనలను పాటించినప్పుడు, రక్షకుని యొక్క కనికరము, రక్షణ, బలము మరియు శక్తికి మీరు అధిక ప్రాప్యతను కలిగియుంటారు.”
అదనపు నిర్దేశము
యాజకత్వ నాయకుడు సభ్యునికి అతని లేదా ఆమె సిఫారసును కాపాడుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతాడు. దానిని ఎన్నడూ ఎవ్వరికీ ఇవ్వరాదు మరియు పోగొట్టుకున్నా లేదా దొంగిలించబడినా వెంటనే జారీ చేసేవారికి నివేదించాలి.