విధులు మరియు ప్రకటనలు
ప్రత్యేకపరచడం


పిలుపులలో సేవ చేయడానికి సభ్యులను ప్రత్యేకపరచడం

చాలామట్టుకు సంఘ స్థానాలకు పిలువబడిన మరియు ఆమోదించబడిన సభ్యులు ఆ స్థానంలో పనిచేయడానికి ప్రత్యేకపరచబడాలి (యోహాను 15:16; సిద్ధాంతము మరియు నిబంధనలు 42:11 చూడండి). ప్రత్యేకపరిచే సమయంలో, వ్యక్తికి (1) పిలుపులో చర్య తీసుకునే అధికారం మరియు (2) ఆత్మ ద్వారా మార్గనిర్దేశం చేయబడిన దీవెన ఇవ్వబడతాయి.

స్టేకు అధ్యక్షులు, బిషప్పులు మరియు సమూహ అధ్యక్షులు ప్రత్యేకపరచబడినప్పుడు అధ్యక్షత్వ తాళపుచెవులను అందుకుంటారు. అయితే, అధ్యక్షత్వము‌లలో సలహాదారులతో సహా ఇతర పిలుపు‌లలో సేవ చేయడానికి సభ్యులను ప్రత్యేకపరిచేటప్పుడు తాళపుచెవులు అనే పదం ఉపయోగించకూడదు.

మెల్కీసెదెకు యాజకత్వము కలిగివున్న ఒకరు లేదా అంతకంటే ఎక్కువమంది తమ చేతులను వ్యక్తి తలపై తేలికగా ఉంచుతారు. అప్పుడు వారిలో ఒకరు మాట్లాడుతూ:

  1. వ్యక్తిని అతని లేదా ఆమె పూర్తి పేరుతో పిలుస్తారు.

  2. అతను మెల్కీసెదెకు యాజకత్వము యొక్క అధికారంతో వ్యవహరిస్తున్నాడని పేర్కొంటారు.

  3. స్టేకు, వార్డు, సమూహము లేదా తరగతిలో పిలుపుకు వ్యక్తిని ప్రత్యేకపరుస్తారు.

  4. వాటిని పొందవలసియుంటే వ్యక్తికి తాళపుచెవులను అనుగ్రహిస్తారు.

  5. ఆత్మ మార్గనిర్దేశం చేసినట్లుగా దీవెన ఇస్తారు.

  6. యేసు క్రీస్తు నామంలో ముగిస్తారు.