విధులు మరియు ప్రకటనలు
నిర్ధారణ


నిర్ధారణ మరియు పరిశుద్ధాత్మ వరము

ఒక వ్యక్తి బాప్తిస్మము పొందిన తర్వాత, అతను లేదా ఆమె సంఘములో సభ్యునిగా నిర్ధారించబడి, హస్తనిక్షేపణం ద్వారా పరిశుద్ధాత్మను పొందుతారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 20:41; అపొస్తలుల కార్యములు 19:1–6 చూడండి). ఈ రెండు విధులు పూర్తి చేయబడి, సరిగ్గా నమోదు చేయబడిన తర్వాత ఆ వ్యక్తి సంఘములో సభ్యుడవుతాడు (యోహాను 3:5; సిద్ధాంతము మరియు నిబంధనలు 33:11; 3 నీఫై 27:20 చూడండి).

బిషప్రిక్కు ఆధ్వర్యంలో, మెల్కీసెదెకు యాజకత్వమును కలిగియున్నవారు ఒకరు లేదా అంతకంటే ఎక్కువమంది నిర్ధారణలో పాల్గొనవచ్చు. వారు తమ చేతులను వ్యక్తి తలపై తేలికగా ఉంచుతారు. అప్పుడు వారిలో ఒకరు మాట్లాడుతూ:

  1. వ్యక్తిని అతని లేదా ఆమె పూర్తి పేరుతో పిలుస్తారు.

  2. మెల్కీసెదెకు యాజకత్వము యొక్క అధికారం ద్వారా విధి నిర్వహించబడుతోందని పేర్కొంటారు.

  3. ఆ వ్యక్తిని యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘ సభ్యునిగా నిర్ధారిస్తారు.

  4. “పరిశుద్ధాత్మను స్వీకరించండి” అని పేర్కొంటారు (“పరిశుద్ధాత్మ వరమును స్వీకరించండి” అని కాదు).

  5. ఆత్మ మార్గనిర్దేశం చేసినట్లుగా దీవెన ఇస్తారు.

  6. యేసు క్రీస్తు నామంలో ముగిస్తారు.