పిల్లలకు నామకరణం చేయడం మరియు దీవించడం
పిల్లలు సాధారణంగా వారి తల్లిదండ్రులు నివసించే వార్డులో ఉపవాసము మరియు సాక్ష్యపు సమావేశంలో పేరు పెట్టబడతారు మరియు దీవించబడతారు. పిల్లల దీవెన యొక్క సాధారణ సమయం మరియు ప్రదేశానికి మినహాయింపులు తప్పనిసరిగా బిషప్పు ద్వారా ఆమోదించబడాలి.
బిషప్రిక్కు ఆధ్వర్యంలో, మెల్కీసెదెకు యాజకత్వమును కలిగియున్నవారు ఒక బిడ్డకు పేరు పెట్టడానికి మరియు దీవించడానికి వలయాకారంలో సమకూడుతారు. వారు తమ చేతులను శిశువు క్రింద ఉంచుతారు లేదా వారు తమ చేతులను పెద్ద పిల్లల తలపై తేలికగా ఉంచుతారు. అప్పుడు వారిలో ఒకరు మాట్లాడుతూ:
-
ప్రార్థనలో వలె పరలోక తండ్రిని సంబోధిస్తారు.
-
మెల్కీసెదెకు యాజకత్వము యొక్క అధికారం ద్వారా దీవెన నిర్వహించబడుతోందని పేర్కొంటారు.
-
బిడ్డకు పేరు పెడతారు.
-
బిడ్డను ఉద్దేశించి.
-
ఆత్మ మార్గనిర్దేశం చేసినట్లుగా బిడ్డకు దీవెన ఇస్తారు.
-
యేసు క్రీస్తు నామంలో ముగిస్తారు.