సంస్కారము
సంఘ సభ్యులు విశ్రాంతిదినమున దేవుడిని ఆరాధించడానికి మరియు సంస్కారములో పాలుపంచుకోవడానికి సమావేశమవుతారు. ఈ విధి సమయంలో, రక్షకుడు తన శరీరమును మరియు రక్తాన్ని త్యాగం చేసిన విషయాన్ని గుర్తుంచుకోవడానికి మరియు వారి పవిత్రమైన నిబంధనలను నూతనపరచుకోవడానికి వారు రొట్టె మరియు నీటిని తీసుకుంటారు.
-
యాజకులు మరియు మెల్కీసెదెకు యాజకత్వమును కలిగియున్నవారు సంస్కారమును దీవించవచ్చు.
-
పరిచారకులు, బోధకులు, యాజకులు మరియు మెల్కీసెదెకు యాజకత్వమును కలిగియున్నవారు సంస్కారమును అందించవచ్చు.
-
రొట్టెని దీవించే వ్యక్తి మోకాళ్లపై నిలబడి రొట్టె కోసం సంస్కార ప్రార్థనను చదువుతారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 20:77 చూడండి).
ఓ దేవా, నిత్యుడవగు తండ్రీ, ఈ రొట్టెను దానిలో పాలుపొందుచున్న వారందరి ఆత్మల కొరకు ఆశీర్వదించి, పరిశుద్ధపరచమని మీ కుమారుడైన యేసు క్రీస్తు నామములో మిమ్ములను అడుగుచున్నాము; తద్వారా మీ కుమారుని శరీరము యొక్క జ్ఞాపకార్థము వారు దానిని తిని, ఓ దేవా, నిత్యుడవగు తండ్రీ, వారు మీ కుమారుని నామమును తమపై తీసుకొనుటకు, ఎల్లప్పుడు ఆయనను జ్ఞాపకము చేసుకొనుటకు, ఆయన వారికిచ్చిన ఆయన ఆజ్ఞలను పాటించుటకు సమ్మతించుచున్నామని మీకు సాక్ష్యమిచ్చెదరు గాక, తద్వారా వారు ఎల్లప్పుడు ఆయన ఆత్మను వారితో కలిగియుండెదరు గాక. ఆమేన్.
-
నీటిని ఆశీర్వదించే వ్యక్తి మోకాళ్లపై నిలబడి నీటి కోసం సంస్కార ప్రార్థనను చదువుతారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 20:79 చూడండి).
ఓ దేవా, నిత్యుడవగు తండ్రీ, ఈ నీటిని దానిని త్రాగుచున్న వారందరి ఆత్మల కొరకు ఆశీర్వదించి, పరిశుద్ధపరచమని మీ కుమారుడైన యేసు క్రీస్తు నామములో మిమ్ములను అడుగుచున్నాము; తద్వారా వారి కొరకు చిందించబడిన మీ కుమారుని రక్తము యొక్క జ్ఞాపకార్థము వారు దానిని చేసి, ఓ దేవా, నిత్యుడవగు తండ్రీ, వారు ఎల్లప్పుడు ఆయనను జ్ఞాపకము చేసుకొందురని మీకు సాక్ష్యమిచ్చెదరు గాక, తద్వారా వారు ఆయన ఆత్మను వారితో కలిగియుండెదరు గాక. ఆమేన్.