Scripture Stories
ప్రవక్త ఈథర్


“ప్రవక్త ఈథర్,” మోర్మన్ గ్రంథ కథలు (2023)

ఈథర్ 6; 12–15

ప్రవక్త ఈథర్

ఒక దేశానికి ప్రభువు యొక్క హెచ్చరిక

చిత్రం
నగర మార్కెట్‌లో సంతోషంగా ఉన్న వ్యక్తులు

ప్రభువు జెరెడ్‌ యొక్క సహోదరుడిని మరియు అతని కుటుంబాన్ని వాగ్దాన దేశానికి తీసుకువచ్చారు. వారు వినయము కలిగినవారు మరియు దేవుని ఆజ్ఞలను పాటించేవారు. వారి సమూహం చాలా సంవత్సరాలు పెరిగింది, మరియు వారు తమను నడిపించడానికి ఒక రాజును కోరుకున్నారు. రాజును కలిగి ఉండటం కష్టాలకు దారితీస్తుందని, జెరెడ్‌ యొక్క సహోదరుడు వారిని హెచ్చరించాడు, కానీ వారిని రాజును ఎన్నుకునేందుకు అతను అనుమతించాడు.

ఈథర్ 6:5, 12–18, 22–24, 27

చిత్రం
జెరెడీయులు కోపంగా ఉన్నారు మరియు ఈథర్‌వైపు వేళ్లు చూపారు

వందల సంవత్సరాలుగా, జెరెడీయులు వాగ్దాన దేశంలో నివసించారు. కొన్నిసార్లు వారి రాజులు వారిని మంచి చేయడానికి నడిపించారు, కానీ మరి కొన్నిసార్లు వారు అలా చేయలేదు. దేవుని ప్రవక్తలు ప్రజలను పశ్చాత్తాపపడమని హెచ్చరిస్తారు. వారు దేవుని ఆజ్ఞలను విని, పాటించినప్పుడు, ఆయన వారిని ఆశీర్వదించారు. జెరెడీయుల చివరి ప్రవక్త పేరు ఈథర్.

ఈథర్ 7:23–27; 9:26–30; 10:16–17, 28; 11:1–8, 12–13, 20–22; 12:2

చిత్రం
ఈథర్ కూర్చుని బోధిస్తున్నాడు, మరియు కొంతమంది కోపంగా ఉన్నారు

ప్రజలు దేవునికి విధేయత చూపలేదు. అయితే ప్రభువు యొక్క ఆత్మ ఈథర్‌తో ఉంది. అతడు ఉదయం నుండి రాత్రి వరకు వారికి బోధించాడు. దేవుడిని నమ్మి పశ్చాత్తాపపడాలని, లేదంటే వారు నశిస్తారని అతడు చెప్పాడు. వారికి విశ్వాసం ఉంటే, వారు మళ్లీ దేవునితో జీవించగలరని మరియు మంచి పనులు చేయడానికి శక్తిని కలిగి ఉంటారని వారు ఆశించవచ్చు. ప్రజలు విశ్వసించలేదు.

ఈథర్ 11:22; 12:2–5; 13:2

చిత్రం
ఈథర్ ఒక గుహలో కూర్చుని వ్రాస్తున్నాడు

ప్రజలు ఏమి చేస్తున్నారో ఈథర్ చూసాడు. అతడు పగటి పూట గుహలో దాక్కొని తాను చూసిన వాటిని రాసుకున్నాడు. ప్రజలు పశ్చాత్తాపపడలేదు మరియు ఒకరితో ఒకరు పోట్లాడుకోవడం ప్రారంభించారు.

ఈథర్ 13:13–15

చిత్రం
కొరియాంటమర్ ఎదురు చూస్తున్నాడు

రాజుగా ఉండాలనుకునే చాలా మంది వ్యక్తులతో జెరెడీయుల రాజైన కొరియాంటమర్ పోరాడవలసి వచ్చినట్లు ఈథర్ చూసాడు. కొరియాంటమర్ తనను తాను రక్షించుకోవడానికి తన సైన్యాన్ని ఉపయోగించుకున్నాడు.

ఈథర్ 12:1; 13:15–19

చిత్రం
ఈథర్ కొరియాంటమర్‌తో మాట్లాడతాడు

ఒకరోజు, కొరియాంటమర్ మరియు అతని ప్రజలను పశ్చాత్తాపపడడానికి హెచ్చరించమని ప్రభువు ఈథర్‌కు చెప్పారు. వారు అలా చేస్తే, ప్రభువు ప్రజలకు సహాయం చేస్తారు మరియు కొరియాంటమర్ తన రాజ్యాన్ని కొనసాగించేలా చేస్తారు. లేని యెడల, ప్రజలు ఒకరినొకరు నాశనం చేసుకుంటారు. ప్రభువు మాటలు నిజమని చూడడానికి కొరియాంటమర్ చాలా కాలం జీవిస్తాడు. అప్పుడు అతను కూడా చనిపోతాడు.

ఈథర్ 13:20–21

చిత్రం
షిజ్ మరియు అతని సైన్యం కొరియాంటమర్ సైన్యంతో పోరాడుతుంది, మరియు ఈథర్ గమనిస్తున్నాడు

కొరియాంటమర్ మరియు అతని ప్రజలు పశ్చాత్తాపం చెందలేదు. ప్రజలు ఈథర్‌ను చంపడానికి ప్రయత్నించారు, కానీ ఈథర్ తన గుహలోకి పారిపోయాడు. షిజ్ అనే వ్యక్తి కొరియాంటమ్‌ర్‌కి వ్యతిరేకంగా పోరాడాడు. ప్రజలు షిజ్ సైన్యంలో లేదా కొరియాంటమర్ సైన్యంలో చేరాలని ఎంచుకున్నారు. రెండు సైన్యాలు ఎన్నో యుద్ధాలు చేశాయి. చాలా మంది చనిపోయారు.

ఈథర్ 13:22–25; 14:17–20; 15:2

చిత్రం
కొరియాంటమర్ యొక్క సైన్యం షిజ్ సైన్యంతో పోరాడుతుంది,మరియు కొరియాంటమర్ ఒక లేఖ వ్రాస్తాడు

కొరియాంటమ్‌ర్‌కి ఈథర్‌ చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది. తన ప్రజలు చాలా మంది చనిపోయారని అతను విచారించాడు. ఇలా జరుగుతుందని ప్రవక్తలందరూ హెచ్చరించారని అతను గుర్తు చేసుకున్నాడు. అతను పశ్చాత్తాపపడటం ప్రారంభించాడు మరియు షిజ్‌కు ఒక లేఖ పంపాడు. తన ప్రజలు కాపాడబడితే అతడు రాజ్యాన్ని వదులుకుంటానని చెప్పాడు. కానీ షిజ్ పోరాడాలనుకున్నాడు.

ఈథర్ 15:1–5

చిత్రం
పురుషులు, స్త్రీలు, మరియు పిల్లలు సైనికులుగా కవాతు చేస్తన్నారు, మరియు ఈథర్ గమనిస్తున్నాడు

కొరియాంటమర్ యొక్క ప్రజలు కోపంగా ఉన్నారు మరియు పోరాడాలని కోరుకున్నారు. షిజ్ యొక్క ప్రజలు కూడా కోపంగా ఉన్నారు మరియు పోరాడాలని కోరుకున్నారు. ఎవరూ పశ్చాత్తాపపడాలని కోరుకోలేదు. ప్రతి ఒక్క వ్యక్తి యుద్ధానికి వెళ్లడం ఈథర్ చూసాడు. ఇంకా చాలా మంది చనిపోయారు.

ఈథర్ 15:6, 12–17

చిత్రం
కొరియాంటమర్ ఈటె పట్టుకుని వర్షంలో మోకరిల్లాడు.

కొరియాంటమర్ యుద్ధాన్ని ఆపాలనుకున్నాడు. అతడు షిజ్‌ను రాజ్యాన్ని స్వాధీనం చేసుకోమని మరియు తన ప్రజలను గాయపరచవద్దని కోరాడు. కానీ ప్రతిఒక్కరూ కోపంగా ఉన్నారు. వారు ప్రభువు యొక్క ఆత్మను కలిగి లేరు. అందరూ పోరాడుతూ చివరకు జెరెడీయులలో కొరియాంటమర్ మాత్రమే బ్రతికి ఉండడం ఈథర్ చూసాడు. తర్వాత కొరియాంటమర్ స్పృహతప్పి పడిపోయాడు.

ఈథర్ 15:18–30, 32

చిత్రం
ఈథర్ ఒక కొండపై ఉన్న బలిపీఠం వద్ద మోకాళ్లపై కూర్చుని దేవునికి ప్రార్థిస్తాడు, మరియు నివేదికలు సమీపంలోని ఒక గుహలో భద్రపరచబడ్డాయి

ప్రభువు చెప్పినదంతా నిజమైందని ఈథర్ చూసాడు. ఈథర్ జరిగిన దానిని రాయడం పూర్తి చేసాడు. అప్పుడు అతడు పోయిన తర్వాత తన రచనలను ప్రజలు కనుగొనగలిగేలా అతడు నిశ్చయపరిచాడు. ఈథర్ దేవునిని విశ్వసించాడు మరియు ఒకరోజు ఆయనతో ఉండేందుకు ఎదురుచూశాడు.

ఈథర్ 15:33–34