Scripture Stories
స్వేచ్ఛాపతాకము


“స్వేచ్ఛాపతాకము,” మోర్మన్ గ్రంథ కథలు (2023)

ఆల్మా 46–50

స్వేచ్ఛాపతాకము

దేవుణ్ణి విశ్వసించే హక్కును కాపాడుకోవడం

చిత్రం
అమలిక్యా తన ప్రజల ముందు చేతులు చాచినప్పుడు వారు ఉత్సాహంగా ఉన్నారు

అమలిక్యా ఒక పెద్ద, బలమైన నీఫైయుడు. అతడు రాజు కావాలనుకున్నాడు. తనకు సహకరించిన వారికి అధికారం అందజేస్తానని హామీ ఇచ్చాడు. చాలా మంది అతనిని ఇష్టపడ్డారు మరియు ఇతరులు అతనిని అనుసరించడానికి ప్రయత్నించారు. అమలిక్యా ప్రజలను చెడు పనులు చేసేలా నడిపించాడు. అతడు మరియు అతని అనుచరులు యేసు క్రీస్తు గురించి బోధించే ప్రజలను చంపాలనుకున్నారు.

ఆల్మా 45:23–24; 46:1–10

చిత్రం
సేనాధిపతి అయిన మొరోనై, అమలిక్యా మరియు అతని ప్రజల నుండి దూరంగా వెళ్ళిపోయాడు.

నీఫైయుల సైన్యాల నాయకుడు సేనాధిపతి అయిన మొరోనై యేసును విశ్వసించాడు. నీఫైయులు దేవుని ఆజ్ఞలను పాటించినందున వారు ఆశీర్వదించబడ్డారని అతనికి తెలుసు. అమలిక్యా ప్రజలను దేవుని నుండి దూరం చేస్తున్నాడని, రాజు కావాలని ప్రయత్నిస్తున్నాడని మరియు ప్రజలను బాధపెట్టడానికి ప్రయత్నిస్తున్నాడని అతను చాలా కోపంగా ఉన్నాడు.

ఆల్మా 46:9–11, 13–15, 18

చిత్రం
సేనాధిపతి అయిన మొరోనై స్వేచ్ఛాపతాకమును పట్టుకొనియున్నాడు

మొరోనై తన పై వస్త్రమును చింపేశాడు. ప్రజలు తమ దేవుణ్ణి, వారి స్వేచ్ఛను మరియు వారి కుటుంబాలను గుర్తుంచుకోవాలని అతను దానిపై వ్రాసాడు. అప్పుడు అతను దానిని ఒక స్తంభానికి కట్టి, దానిని స్వేచ్ఛాపతాకముగా పేర్కొన్నాడు. మొరోనై దేవుని దీవెన కోసం ప్రార్థించాడు. అతడు నీఫైయులకు స్వేచ్ఛాపతాకమును చూపించాడు మరియు అమలిక్యాతో పోరాడడంలో తనతో కలిసి ఉండమని వారిని కోరాడు.

ఆల్మా 46:12–20, 23–24, 28

చిత్రం
సేనాధిపతి అయిన మొరోనై తన సైన్యం మరియు కుటుంబాల ముందు నిలబడతాడు.

ప్రజలు తమ కవచాలను ధరించి మొరోనై వద్దకు పరుగులు తీశారు. వారు దేవుని కోసం మరియు వారి గృహాలు, కుటుంబాలు మరియు స్వాతంత్ర్యం కోసం పోరాడటానికి సిద్ధంగా ఉన్నారు. వారు ఎల్లప్పుడూ ఆయనను అనుసరిస్తామని దేవునితో ఒక నిబంధనను లేదా ప్రత్యేక వాగ్దానాన్ని చేసారు. అప్పుడు వారు అమలిక్యాతో పోరాడటానికి సిద్ధమయ్యారు.

ఆల్మా 46:21–22, 28

చిత్రం
అమలిక్యా మరియు అతని సైనికులు కొందరు పారిపోయారు

మొరోనై యొక్కసైన్యం పెద్దది. అమలిక్యా భయపడిపోయాడు. అతడు తన అనుచరులతో కలిసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. కానీ వారిలో చాలా మంది అమలిక్యా తప్పుడు కారణాలతో పోరాడుతున్నాడని ఆందోళన చెందారు. చాలామంది అతనిని ఇకపై అనుసరించలేదు. మొరోనై సైన్యం అమలిక్యాను అనుసరించిన వారిని ఆపింది, కానీ అమలిక్యా మరియు మరికొందరు తప్పించుకున్నారు.

ఆల్మా 46:29–33

చిత్రం
అమలిక్యా లేమనీయులతో మాట్లాడుతున్నాడు

అమలిక్యా లేమనీయుల దేశానికి వెళ్లాడు. నీఫైయులకు వ్యతిరేకంగా పోరాడటానికి లేమనీయులు సహాయం చేయాలని అతను కోరాడు. అప్పుడు అతనికి మరింత పెద్ద, బలమైన సైన్యం ఉంటుంది. అతడు చాలా మంది లేమనీయులకు నీఫైయులపై కోపాన్ని తెప్పించాడు. లేమనీయుల రాజు నీఫైయులతో పోరాడటానికి సిద్ధపడమని లేమనీయులందరికి చెప్పాడు.

ఆల్మా 47:1

చిత్రం
అమలిక్యా ఒక కిరీటం కోసం లేమనీయుల రాజు ముందు మోకరిల్లాడు

రాజు అమలిక్యాను ఇష్టపడ్డాడు. అతడు అమలిక్యాను లేమనీయుల సైన్యంలోని నాయకులలో ఒకరిగా చేసాడు. కానీ అమలిక్యా మరింత అధికారం కావాలనుకున్నాడు.

ఆల్మా 47:1–3

చిత్రం
అమలిక్యా కిరీటాన్ని ధరించాడు

అమలిక్యా లేమనీయులను పరిపాలించటానికి ఒక ప్రణాళిక వేసాడు. అతడు మొత్తం లేమనీయుల సైన్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అప్పుడు అతడు తన సేవకులు రాజును చంపేలా చేసి, దానిని ఎవరు చేశారనే దాని గురించి అబద్ధం చెప్పాడు.

ఆల్మా 47:4–26

చిత్రం
లేమనీయుల సైనికులు ఉత్సాహంగా నినాదాలు చేస్తున్నప్పుడు అమలిక్యా వారి ముందు ఒక పిడికిలిని బిగించాడు.

రాజు చంపబడ్డాడని అమలిక్యా కోపంగా నటించాడు. లేమనీయులు అమలిక్యాను ఇష్టపడ్డారు. అతడు రాణిని వివాహం చేసుకొని కొత్త రాజు అయ్యాడు. అతడు నీఫైయులను కూడా పరిపాలించాలనుకున్నాడు. లేమనీయులకు కోపం వచ్చేలా అతడు నీఫైయుల గురించి చెడుగా మాట్లాడాడు. వెంటనే, చాలా మంది లేమనీయులు వారితో పోరాడాలనుకున్నారు.

ఆల్మా 47:25–35; 48:1–4

చిత్రం
సేనాధిపతి అయిన మొరోనై మరియు అతని సైనికులు గోడలు కట్టారు.

అమలిక్యా అబద్ధం చెప్పడం ద్వారా అధికారాన్ని పొందగా, మొరోనై దేవుణ్ణి విశ్వసించడానికి నీఫైయులను సిద్ధం చేశాడు. అతడు వారి వాగ్దానాన్ని వారికి గుర్తు చేయడానికి దేశంలోని ప్రతి శిఖరముపై స్వేచ్ఛాపతాకమును ఉంచాడు. మొరోనై యొక్క సైన్యాలు నీఫైయుల నగరాలను కూడా యుద్ధానికి సిద్ధం చేశాయి. వారు నగరాలను సురక్షితంగా మరియు బలంగా ఉంచడానికి గోడలను నిర్మించారు మరియు కందకాలను త్రవ్వారు.

ఆల్మా 46:36; 48:7–18

చిత్రం
అమలిక్యా యొక్క సైనికులు నీఫైయుల నగరంపై బాణాలు వేశారు.

లేమనీయులు పోరాడటానికి వచ్చినప్పుడు, వారు నీఫైయుల నగరాల్లోకి ప్రవేశించలేకపోయారు. మొరోనై యొక్క సైన్యాలు నిర్మించిన గోడలు మరియు కందకాల వలన వారు ఆపబడ్డారు. నీఫైయులపై దాడి చేసినప్పుడు చాలామంది లేమనీయులు మరణించారు. అమలిక్యాకు చాలా కోపం వచ్చింది. అతడు మొరోనైని చంపేస్తానని వాగ్దానం చేశాడు.

ఆల్మా 49:1–27

చిత్రం
సేనాధిపతి అయిన మొరోనై యుద్ధం తర్వాత నీఫైయులతో మాట్లాడతాడు.

తమకు సహాయం చేసినందుకు మరియు రక్షించినందుకు నీఫైయులు దేవునికి కృతజ్ఞతలు తెలిపారు. వారు తమ నగరాలను మరింత సురక్షితమైనవిగా చేసి మరిన్ని నగరాలను నిర్మించారు. లేమనీయులతో యుద్ధం కొనసాగింది, కానీ దేవుడు మొరోనై అతని సైన్యాలను మరియు నీఫైయులను సురక్షితంగా ఉంచేందుకు సహాయం చేశారు. నీఫైయులు సంతోషించారు. వారు దేవునికి విధేయులై మరియు ఆయనకు నమ్మకంగా ఉన్నారు.

ఆల్మా 49:28–30; 50:1–24