Scripture Stories
ఇష్మాయేలు, అతని కుటుంబము


“ఇష్మాయేలు, అతని కుటుంబము,” మోర్మన్ గ్రంథ కథలు (2023)

1 నీఫై 7

ఇష్మాయేలు, అతని కుటుంబము

వాగ్దానదేశముకు ప్రయాణంలో చేరడం

చిత్రం
నీఫై మరియు అన్నలు నది వద్ద సూర్యాస్తమయం వైపు నడుస్తున్నారు

లీహై మరియు శరయ కుటుంబం అరణ్యములో ఒంటరిగా నివసించారు. ఒకరోజు, ప్రభువు లీహై తన కుమారులైన లేమన్, లెముయెల్, శామ్ మరియు నీఫైలను యెరూషలేముకు పంపమని చెప్పారు. ఇష్మాయేలు, అతని కుటుంబము వారితో చేరమని అడగడానికి వారు పంపబడ్డారు. కలిసి వారి కుటుంబాలు పిల్లల్ని వాగ్దాన దేశములో పెంచవచ్చు.

1 నీఫై 7:1–3

చిత్రం
ఇష్మాయేలు కుటుంబముతో మాట్లాడుతున్న నీఫై

ఇష్మాయేలు, అతని కుటుంబము ప్రభువును అనుసరించాలని కోరుకున్నారు. లీహై, శరయ కుటుంబంతో చేరాలని ప్రభువు వారిని కోరుతున్నారని వారు నమ్మారు. వారు యెరూషలేమును విడిచి వెళ్లాడానికి, అరణ్యములో లీహై కుటుంబాన్ని కలుసుకోవడానికి ఎన్నుకున్నారు.

1 నీఫై 7:4–5

చిత్రం
మాట్లాడుకుంటున్న లేమన్, లెముయెల్

వారి మార్గములో, కొందరు జనులు విధేయులు కావడానికి ఇష్టపడలేదు. వారు ఇంటికి తిరిగి వెళ్ళాలని కోరుకున్నారు. ప్రభువునందు విశ్వాసం కలిగియుండమని నీఫై వారిని అడిగాడు.

1 నీఫై 7:6–13

చిత్రం
నీఫై చెట్టుకు కట్టబడ్డాడు

వారు విశ్వాసము కలిగియుంటే ప్రభువు ఏమైన చేయగలరని నీఫై చెప్పాడు. కానీ లేమన్, లెముయెల్ కోపగించారు. వారు నీఫైను కట్టి వేసారు మరియు అతడిని అరణ్యములో వదిలి వేయాలనుకున్నారు.

1 నీఫై 7:12, 16

చిత్రం
నీఫైను కాపాడుతున్న ఇష్మాయేలు కుమార్తె

నీఫై సహాయం కోసం ప్రార్థించాడు. తాళ్ళు వదులైనవి, మరియు నీఫై లేచి నిలబడ్డాడు. కానీ లేమన్, లెముయెల్ అతడిని ఇంకా గాయపరచాలనుకున్నారు. ఇష్మాయేలు కుమార్తెలలో ఒకరు నీఫైను సమర్ధించింది. ఆమె తల్లి మరియు ఆమె అన్నలలో ఒకరు కూడా అతడిని సమర్ధించారు. లేమన్, లెముయెల్ వారిని విని, నీఫైను గాయపరచడానికి ప్రయత్నించడం ఆపారు.

1 నీఫై 7:17–19

చిత్రం
నీఫై యెదుట మోకరించిన లేమన్, లెముయెల్

లేమన్, లెముయెల్ తాము చేసిన దాని గురించి విచారించారు. తమను క్షమించమని వారు నీపైను అడిగారు. నీఫై తన అన్నలను క్షమించాడు. తరువాత లేమన్, లెముయెల్ ప్రార్థించారు, వారిని క్షమించమని ప్రభువును అడిగారు.

1 నీఫై 7:20–21

చిత్రం
తమ కుటుంబాల వైపు చూస్తున్న లీహై మరియు ఇష్మాయేలు

వారందరు తమ ప్రయాణాన్ని కొనసాగించారు మరియు లీహై, శరయ గుడారాన్ని చేరుకున్నారు. చివరికి, రెండు కుటుంబాలు కలిసి ఉన్నాయి. వారు ప్రభువుకు ధన్యవాదాలు తెలిపి, ఆయనను ఆరాధించారు.

1 నీఫై 7:21–22