Scripture Stories
జేకబ్ మరియు షెరేమ్


“జేకబ్ మరియు షెరేమ్,” మోర్మన్ గ్రంథ కథలు (2023)

జేకబ్ 7

జేకబ్ మరియు షెరేమ్

యేసు క్రీస్తు గురించి ఒక ప్రవక్త యొక్క సాక్ష్యము

చిత్రం
పిల్లలకు బోధిస్తున్న జేకబ్

జేకబ్ యేసు క్రీస్తును చూచిన ఒక ప్రవక్త. జనులు యేసునందు నమ్మకముంచాలని జేకబ్ కోరాడు. దేవుని ఆజ్ఞలు పాటించమని జనులకు జేకబ్ బోధించాడు. యేసు గురించి జనులకు బోధించడానికి అతడు కష్టపడి పనిచేసాడు.

2 నీఫై 11:2–3; జేకబ్ 1:1–8, 17–19

చిత్రం
జనులతో మాట్లాడుతున్న షరేమ్

ఒకరోజు, షెరేమ్ అని పేరుగల వ్యక్తి జనులకు బోధించడం ప్రారంభించాడు. కానీ యేసు నిజము కాదని షెరేమ్ బోధించాడు. షెరేమ్ బాగా మాట్లాడగలడు, మరియు అతడు చెప్పిన దానిని అనేకమంది నీఫైయులు నమ్మారు. అతడి వలన, అనేకమందు జనులు యేసును నమ్మడం మానేసారు. జేకబ్ కూడ యేసునందు నమ్మడం మానాలని షెరేమ్ కోరాడు.

జేకబ్ 7:1–5

చిత్రం
షెరేమ్ మాట్లాడుతున్నాడు మరియు జేకబ్ వైపు చూపిస్తున్నాడు.

భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదని షెరేమ్ చెప్పాడు. దీని అర్థము యేసు నిజమో కాదో ఎవరూ తెలుసుకోలేరని, ఎందుకంటే యేసు ఇంకా భూమి మీదకు రాలేదని అతడు అన్నాడు. కానీ లేఖనాలు మరియు ప్రవక్తలందరు యేసు గురించి బోధించారని జేకబ్ అన్నాడు యేసు భూమి మీదకు వస్తాడని దేవుడు జేకబ్‌కు చూపించాడు.

జేకబ్ 7:6–12

చిత్రం
షెరేమ్ మాట్లాడుతున్నాడు, నవ్వుతున్నాడు

షెరేమ్ ఇంకా నమ్మలేదు. యేసు నిజమని ఒక సూచనను తనకు చూపించమని అతడు జేకబ్‌ను కోరాడు.

జేకబ్ 7:13

చిత్రం
జేకబ్ తన చేతిని పైకెత్తెను

యేసు వస్తాడని షెరేమ్‌కు తెలుసని, ఒక సూచన అవసరం లేదని జేకబ్ అన్నాడు. కానీ దేవునికి శక్తి ఉందని మరియు యేసు నిజమని చూపించడానికి దేవుడు షెరేమ్ మూర్చపోయేలా చేస్తారని జేకబ్ చెప్పాడు.

జేకబ్ 7:14

చిత్రం
దగ్గరలో ఉన్న వ్యక్తులతో షెరేమ్ తన మోకాళ్ల మీద పడిపోతున్నాడు

హఠాత్తుగా, షెరేమ్ అనారోగ్యంతో నేలమీద పడిపోయాడు. చాలా రోజుల తరువాత, తాను చనిపోతానని అతడికి తెలుసు. తాను సాతాను చేత మోసగించబడ్డానని అతడు జనులతో చెప్పాడు. అతడు దేవునితో అబద్ధమాడానని చెప్పాడు యేసు నిజమని మొత్తం సమయం అతనికి తెలుసు. తరువాత షెరేమ్ చనిపోయాడు. జనులు లేఖనాలు చదివారు మరియు యేసునందు నమ్మకముంచారు.

జేకబ్ 7:15–23