Scripture Stories
నీఫై మరియు కంచు పలకలు


“లీహై మరియు శరయ యెరూషలేమును విడిచిపెట్టారు,” మోర్మన్ గ్రంథ కథలు (2023)

1 నీఫై 4–5

నీఫై మరియు కంచు పలకలు

ఆత్మను అనుసరించుట నేర్చుకొనుట

చిత్రం
నీఫై భవనాన్ని చేరుకుంటున్నాడు మరియు అన్నలు గమనిస్తున్నారు

రాత్రియందు లేమన్, లెముయెల్, శామ్, మరియు నీఫై యెరూషలేముకు తిరిగి వెళ్ళారు. అతడి అన్నలు పట్టణము బయట దాక్కొని యుండగా నీఫై లేబన్ ఇంటికి వెళ్లాడు.

1 నీఫై 4:4–5

చిత్రం
నేలపైన ఉన్న లేబన్‌ను చూస్తున్న నీఫై

నీఫై, ఆత్మ తనని నడిపించనిచ్చాడు. అతడికి ఏం చేయాలో తెలియలేదు, కానీ కంచు పలకలు పొందడానికి ప్రభువు తనకు సహాయపడతారని అతనికి తెలుసు.

1 నీఫై 4:6

చిత్రం
లేబన్ కత్తిని పట్టుకున్న నీఫై

నీఫై లేబన్ ఇంటికి దగ్గరగా ఉన్నప్పుడు, అతడు లేబన్ నేలపై ఉండుట చూసాడు. లేబన్ తాగి ఉన్నాడు. నీఫై లేబన్ కత్తిని చూసి, దానిని పైకి తీసాడు.

1 నీఫై 4:7–9

చిత్రం
నీఫై లేబన్ నుండి దూరంగా వెళ్ళాడు

నీఫై కత్తివైపు చూసినప్పుడు, లేబన్‌ను చంపమని ఆత్మ అతనితో చెప్పింది. కానీ నీఫై అతడిని చంపడానికి ఇష్టపడలేదు. నీఫై కుటుంబం లేఖనాలను కలిగి లేకుండా ఉండటం కంటె లేబన్ చనిపోవడం మేలని ఆత్మ నీఫైతో చెప్పింది. కంచు పలకలపై వ్రాయబడిన దేవుని ఆజ్ఞలు వారికి అవసరం.

1 నీఫై 4:10–11, 13–17

చిత్రం
ప్రార్థిస్తున్న నీఫై

లేబన్ తనను చంపడానికి ప్రయత్నించాడని నీఫైకు తెలుసు. లేబన్ వారి ఆస్తిని కూడా దొంగిలించాడు మరియు దేవుని ఆజ్ఞలకు విధేయుడు కాడు.

1 నీఫై 4:11

చిత్రం
లేబన్ దుస్తులను ధరించిన నీఫై

లేబన్‌ను చంపమని ఆత్మ నీఫైకు మరలా చెప్పింది. కంచు పలకలు పొందడానికి ప్రభువు అతని కోసం ఒక మార్గమును సిద్ధపరిచారని నీఫైకు తెలుసు. ఆత్మకు విధేయుడు కావడానికి అతడు కోరుకున్నాడు. నీపై లేబన్ చంపి, లేబన్ దుస్తులను ధరించాడు.

1 నీఫై 4:12–13; 17–19

చిత్రం
జోరమ్‌తో మాట్లాడుతున్న నీఫై

అప్పుడు నీఫై లేబన్ ధనాగారము వైపు వెళ్ళి, లేబన్ సేవకుడైన జోరమ్‌ను కలిసాడు. నీఫై లేబన్ వలె నటించి మాట్లాడాడు.

1 నీఫై 4:20–23, 35

చిత్రం
కంచు పలకలను పట్టుకొన్న జోరమ్

తనకు కంచు పలకలు అవసరమని నీఫై జోరమ్‌తో చెప్పాడు. తరువాత తనతో రమ్మని నీఫై జోరమ్‌తో అన్నాడు. నీఫైను లేబన్ అని జోరమ్ అనుకున్నాడు, కనుక అతడు నీఫై చెప్పినట్లుగా చేసాడు.

1 నీఫై 4:24–26

చిత్రం
నీఫై నుండి పరుగెత్తుతున్న సోదరులు

నీఫై మరియు జోరమ్ పట్టణము బయటకు వచ్చినప్పుడు, లేమన్, లెముయెల్, మరియు శామ్ నీఫైను లేబన్ అనుకున్నారు. వారు భయపడి పారిపోవటం ప్రారంభించారు.

1 నీఫై 4:28

చిత్రం
సోదరులు మాట్లాడుకుంటున్నారు మరియు జోరమ్ వెనక్కి తిరిగి చూస్తున్నాడు

నీఫై తన అన్నలను పిలిచాడు. అది నీఫై అని వారు ఎరిగినప్పుడు, వారు పరుగెత్తడం ఆపేసారు. కానీ అప్పుడు జోరమ్ భయపడ్డాడు మరియు యెరూషలేముకు తిరిగి వెళ్ళడానికి ప్రయత్నించాడు.

1 నీఫై 4:29–30

చిత్రం
జోరమ్‌తో మాట్లాడుతున్న నీఫై

నీఫై జోరమ్‌ను ఆపాడు. పలకలు తెమ్మని ప్రభువు వారికి ఆజ్ఞాపించాడని అతడు జోరమ్‌తో చెప్పాడు. వాగ్దాన దేశమునకు వారితోపాటు రమ్మని అతడు జోరమ్‌ను అడిగాడు. జోరమ్‌కు తాను స్వతంత్రుడిగా ఉండగలనని, సేవకుడు కాదని తెలుసు, మరియు నీఫై, అతడి కుటుంబంతో వెళ్లడానికి వాగ్దానము చేసాడు.

1 నీఫై 4:31–37

చిత్రం
శరయ, లీహైను పలుకరిస్తున్న నీఫై, అన్నలు మరియు జోరమ్

వారు లీహై మరియు శరయ వద్దకు తిరిగి వెళ్ళారు. లీహై మరియు శరయ వారి కొడుకులను చూడటానికి చాలా సంతోషించారు. తన కొడుకులు చనిపోయారని శరయ అనుకున్నది. ప్రభువు తన కొడుకులను భద్రంగా కాపాడారు కనుక, వారి కుటుంబం యెరూషలేమును విడిచి వెళ్ళమని ఆజ్ఞాపించబడిందని ఇప్పుడు ఆమె నమ్మింది. ప్రభువుకు కృతజ్ఞత తెలుపడానికి లీహై మరియు శరయ కుటుంబం బలులు అర్పించారు.

1 నీఫై 4:38; 5:1–9

చిత్రం
తన కుటుంబంతో కంచు పలకల్ని చదువుతున్న లీహై

లీహై కంచు పలకలను చదువుతాడు. పలకలు ప్రవక్తల బోధనలు కలిగియున్నవని అతడు చూసాడు. చాలాకాలం క్రితం తన అన్నల చేత ఐగుప్తులోనికి అమ్మివేయబడిన, యోసేపు, తన పూర్వీకులలో ఒకరని కూడా అతడు తెలుసుకున్నాడు. కంచు పలకలు చాలా ముఖ్యమైనవని లీహైకు తెలుసు. అతడి కుటుంబం ఆజ్ఞలను కలిగియుండాలని ప్రభువు కోరుతున్నాడని అతడికి తెలుసు

1 నీఫై 5:10–22