Scripture Stories
వాగ్దానదేశములో ఒక క్రొత్త ఇల్లు


“వాగ్దానదేశములో ఒక క్రొత్త ఇల్లు,” మోర్మన్ గ్రంథ కథలు (2023)

“వాగ్దానదేశములో ఒక క్రొత్త ఇల్లు,” మోర్మన్ గ్రంథ కథలు

2 నీఫై 4–5

వాగ్దానదేశములో ఒక క్రొత్త ఇల్లు

నీఫైయులు మరియు లేమనీయులు

చిత్రం
లీహై చుట్టూ కుటుంబాలు

లీహై మరియు శరయ కుటుంబం వాగ్దాన దేశంలో అభివృద్ధి చెందుట కొనసాగించింది. వారి పిల్లలకు వారి స్వంత పిల్లలు కలిగారు. లీహై వృద్ధుడు అవుతున్నాడు. అతడు మరణించకముందు, తన కుటుంబంలోని జనులకు అతడు దీవెనలు ఇచ్చాడు. వారు దేవుని ఆజ్ఞలు పాటించినప్పుడు, ప్రభువు వారికి సహాయపడతారని అతడు వారికి చెప్పాడు.

2 నీఫై 4:3–12

చిత్రం
నీఫైను గమనిస్తున్న లేమన్, లెముయెల్

లీహై మరణించిన తరువాత, నీఫై జనులను నడిపించాడు. ప్రభువుకు విధేయులుగా ఉండమని అతడు వారితో చెప్పాడు. లేమన్, లెముయెల్ కోపగించారు. వారు నీఫైను చంపాలనుకున్నారు, ఆవిధంగా వారు అతనికి బదులుగా నడిపించవచ్చు.

2 నీఫై 4:13; 5:1–4

చిత్రం
ప్రయాణిస్తున్న జనుల గుంపు

ప్రభువు నీఫైని తన కుటుంబముతో మరియు ఇంకా ప్రభువును అనుసరించాలనుకునే వారితో బయలుదేరమని చెప్పారు. వారు అనేక రోజులు ప్రయాణించారు మరియు నివసించడానికి కొత్త ప్రదేశాన్ని కనుగొన్నారు.

2 నీఫై 5:1, 5–8

చిత్రం
వ్యవసాయం చేస్తున్న జనులు

నీఫైయులతో వెళ్లిన వారు నీఫైయులని పిలవబడ్డారు మరియు వెళ్లని వారు లేమనీయులని పిలవబడ్డారు. నీఫైయులు తమను నడిపించమని నీఫైను అడిగారు. వారు కష్టపడి పనిచేసారు. వారు వ్యవసాయం చేసారు, జంతువులు పెంచారు, మరియు దేవాలయము, ఇతర భవనాలను నిర్మించారు. యాజకులు మరియు బోధకులు ప్రభువు గురించి వారికి బోధించారు, మరియు జనులు సంతోషంగా ఉన్నారు.

2 నీఫై 5:9–11, 13–17, 26–27