Scripture Stories
యేసు పుట్టుక గురించి సూచనలు


“యేసు పుట్టుక గురించి సూచనలు,” మోర్మన్ గ్రంథ కథలు (2023)

3 నీఫై 1

యేసు పుట్టుక గురించి సూచనలు

ప్రవక్త బోధనలపై విశ్వాసం

చిత్రం
బిడ్డ మరియు పిల్లలతో తల్లి మరియు తండ్రి నగరంలో నడుస్తున్నారు

అప్పటికి సమూయేలు ప్రవక్త యేసు క్రీస్తు పుట్టుక యొక్క సూచనల గురించి బోధించి దాదాపు ఐదు సంవత్సరాలైంది. చాలా మంది ప్రజలు నమ్మారు మరియు సూచనల కోసం చూశారు. ఇతర వ్యక్తులు సమూయేలు తప్పని మరియు సూచనల కోసం సమయం ఇప్పటికే గడిచిపోయింది అని చెప్పారు. వారు విశ్వాసులను ఎగతాళి చేశారు మరియు యేసు రాడు అని చెప్పారు.

హీలమన్ 14:2–7; 3 నీఫై 1:4–6

చిత్రం
కుటుంబం ఇంట్లో కూర్చునియున్నారు, తండ్రి మాట్లాడుతున్నాడు

విశ్వాసులు ఆందోళన చెందారు, కానీ వారు విశ్వాసము కలిగియున్నారు. వారు సూచనల కోసం చూస్తూనే ఉన్నారు. ఒక సూచన చీకటి పడని రాత్రి. సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా అది పగటిపూటలా ప్రకాశవంతంగా ఉంటుంది. చీకటి లేని రాత్రి యేసు మరుసటి రోజు వేరొక దేశంలో జన్మిస్తాడనడానికి సూచనగా ఉంటుంది.

హీలమన్ 14:2–4; 3 నీఫై 1:7–8

చిత్రం
కేకలు వేయబడడంతో కుటుంబము భయపడింది

నమ్మని ప్రజలు ఒక ప్రణాళిక చేశారు. వారు ఒక రోజును ఎంచుకుని, ఆ రోజులోగా సూచన జరగకపోతే, విశ్వాసులకు మరణశిక్ష విధించబడుతుందని చెప్పారు.

3 నీఫై 1:9

చిత్రం
ప్రజలు కుటుంబం పట్ల అసభ్యంగా ప్రవర్తించడం నీఫై చూస్తాడు.

ఆ సమయంలో నీఫై అనే వ్యక్తి ప్రవక్తగా ఉన్నాడు. విశ్వాసులను చంపాలని కొందరు చూస్తున్నారని తెలిసి ఆయన చాలా బాధపడ్డాడు.

3 నీఫై 1:10

చిత్రం
నీఫై ప్రార్థన చేయడానికి మోకరిల్లాడు

నీఫై నేలపై వంగి, తమ విశ్వాసం కారణంగా చనిపోబోతున్న విశ్వాసుల కోసం దేవునికి ప్రార్థించాడు. అతడు రోజంతా ప్రార్థించాడు.

3 నీఫై 1:11–12

చిత్రం
నీఫై తన చేతులు దగ్గరగా జోడించి ప్రార్థిస్తున్నాడు

తన ప్రార్థనకు సమాధానంగా, నీఫై యేసు స్వరాన్ని విన్నాడు. ఆ రాత్రే ఆ సూచన జరుగుతుందని, ఆ తర్వాత మరుసటి రోజు తాను పుడతానని యేసు చెప్పారు.

3 నీఫై 1:12–14

చిత్రం
ప్రజలు ఆశ్చర్యంతో ఆకాశం వైపు చూస్తారు

ఆ రాత్రి సూర్యుడు అస్తమించినా చీకటి లేదు. సమూయేలు మాటలు నమ్మని ప్రజలు చాలా ఆశ్చర్యపోయారు, వారు నేలమీద పడిపోయారు. వారు నమ్మలేదు కాబట్టి భయపడ్డారు. నమ్మిన ప్రజలకు మరణశిక్ష విధించబడలేదు.

3 నీఫై 1:15–19

చిత్రం
కుటుంబాలు ప్రకాశవంతమైన నీలి ఆకాశాన్ని ఆశ్చర్యంగా చూస్తాయి

మరుసటి రోజు,సూర్యుడు మళ్లీ ఉదయించాడు మరియు ఆకాశం ప్రకాశవంతంగా ఉంది. యేసు పుట్టబోయే రోజు ఇదేనని ప్రజలందరికీ తెలిసింది.

3 నీఫై 1:19

చిత్రం
ప్రజలు ఆకాశం వైపు చూశారు మరియు కొత్త నక్షత్రాన్ని చూశారు

ప్రజలు మరొక గుర్తును చూశారు. ఆకాశంలో కొత్త నక్షత్రం కనిపించింది. సమూయేలు చెప్పిన సూచనలన్నీ నిజమయ్యాయి. ఇంకా చాలా మంది ప్రజలు యేసును నమ్మి బాప్తిస్మము తీసుకున్నారు.

హీలమన్ 14:2–7; 3 నీఫై 1:20–23