Scripture Stories
లీహై మరియు శరయ యెరూషలేమును విడిచిపెట్టారు


“లీహై మరియు శరయ యెరూషలేమును విడిచిపెట్టారు,” మోర్మన్ గ్రంథ కథలు (2023)

“లీహై మరియు శరయ యెరూషలేమును విడిచిపెట్టారు,” మోర్మన్ గ్రంథ కథలు

1 నీఫై 1–2

లీహై మరియు శరయ యెరూషలేమును విడిచిపెట్టారు

ఒక కుటుంబానికి ప్రభువు యొక్క హెచ్చరిక

చిత్రం
ప్రభువు యొక్క దర్శనము

లీహై మరియు శరయ తమ పిల్లలతోపాటు యెరూషలేములో నివసించారు. లీహై ప్రభువు నుండి ఒక దర్శనాన్ని (కలను) చూసాడు. ఒక రోజు ఒక రక్షకుడు లోకానికి వస్తాడని అతడు చూసాడు. యెరూషలేము నాశనము కాబోతుందని కూడ ప్రభువు అతనికి చూపించారు.

1 నీఫై 1:4–18

చిత్రం
కోపంగా ఉన్న వ్యక్తులతో మాట్లాడుతున్న లీహై

తన కల గురించి లీహై జనులతో చెప్పాడు. లోకమును రక్షించడానికి యేసు క్రీస్తు ఒకరోజు వస్తారని అతడు వారికి చెప్పాడు.

1 నీఫై 1:18–19

చిత్రం
నాశనం చేయబడిన భవనాల దర్శనము

యెరూషలేము నాశనము కాబోతుందని కూడ లీహై జనులతో చెప్పాడు. పశ్చాత్తాపపడమని అతడు వారిని అడిగాడు.

1 నీఫై 1:14, 18–19

చిత్రం
కోపంతో ఉన్న జనులు

జనులు కోపంగా ఉన్నారు. ఒక కలలో మరొకసారి ప్రభువు లీహైతో మాట్లాడారు, అతడు, అతని కుటుంబం యెరూషలేములో క్షేమంగా ఉండరని లీహై తెలుసుకున్నాడు. వారు వెళ్ళవలసి వచ్చింది.

1 నీఫై 1:19–20; 2:1–2

చిత్రం
కుటుంబం పట్టణాన్ని విడిచి వెళ్ళుట

లీహై, శరయ ప్రభువుకు విధేయులయ్యారు. వారు తమ కుటుంబంతో పట్టణాన్ని విడిచి వెళ్ళారు. లీహై మరియు శరయకు నలుగురు కొడుకులున్నారు, వారి పేర్లు లేమన్, లెముయెల్, శామ్, నీఫై. వారు తమ గృహాన్ని, వారి మంచి వస్తువులను విడిచిపెట్టాల్సి వచ్చింది.

1 నీఫై 2:3–5

చిత్రం
కుటుంబం ప్రయాణించుట

కుటుంబం ఎర్ర సముద్రం ప్రక్కన ఉన్న అరణ్యములో ప్రయాణించింది. తన కుటుంబాన్ని దీవించినందుకు లీహై ప్రభువుకు కృతజ్ఞతను తెలిపాడు. ప్రభువును అనుసరించమని, ఆయన ఆజ్ఞలను పాటించమని అతడు తన కుటుంబానికి బోధించాడు.

1 నీఫై 2:5–10

చిత్రం
ఎడారిలో కుటుంబము

లేమన్, లెముయెల్ ఫిర్యాదు చేసారు. వారు తమ ఇంటిని, వారు విడిచిపెట్టిన వస్తువులు అన్నిటిని గుర్తు చేసుకున్నారు. వారిని విడిచి వెళ్ళమని ప్రభువు ఎందుకు అడిగారో వారికి అర్థం చేసుకోలేదు. యెరూషలేము వంటి పెద్ద పట్టణము నాశనము కావచ్చని వారు నమ్మలేదు.

1 నీఫై 2:11–13

చిత్రం
లేమన్, లెముయెల్

లీహై తన కలలను ఊహించుకుంటున్నాడని లేమన్, లెముయెల్ అనుకున్నారు. వారి కుటుంబం అరణ్యములో శాశ్వతంగా తప్పిపోతే ఏమిటి?

1 నీఫై 2:11

చిత్రం
నీఫై

లీహై చెప్పినది సత్యమని తనకై తాను తెలుసుకోవాలని నీఫై కోరుకున్నాడు. అతడు ప్రార్థన చేసి, ప్రభువును అడిగాడు.

1 నీఫై 2:16

చిత్రం
నీఫై

అతని తండ్రి మాటలు నమ్మడానికి నీఫైకు సహాయపడటానికి ప్రభువు పరిశుద్ధాత్మను పంపారు. నీఫై ప్రభువును నమ్మాడు మరియు తాను నేర్చుకున్న దానిని తన అన్నలకు తెలిపాడు. శామ్ నీఫైను విన్నాడు, అతడిని నమ్మాడు, కానీ లేమన్, లెముయెల్ వినలేదు.

1 నీఫై 2:16–18