యౌవనులు
పెద్దల పాఠము: సాంకేతిక విజ్ఞానముపై తల్లిదండ్రుల కొరకు శిక్షణా పాఠము


పెద్దల పాఠము: సాంకేతిక విజ్ఞానముపై తల్లిదండ్రుల కొరకు శిక్షణా పాఠము

నలుగురు గల కుటుంబము

I. పరిచయము

తల్లిదండ్రులుగా మనం మన పిల్లలకు ఉత్తమమైనది ఇవ్వాలనుకుంటాము మరియు డిజిటల్ ప్రపంచంలో సురక్షితంగా ఎలా ప్రయాణించాలో వారికి నేర్పించడం కూడా అందులో ఉంటుంది. ఈ పాఠంలో, పిల్లలు వారి సాంకేతిక విజ్ఞానము యొక్క వినియోగానికి బాధ్యతను తీసుకొనుటలో మనము ఎలా సహాయపడగలమో చర్చిస్తాము, కనుక అది వారిని నియంత్రించదు. సాంకేతిక విజ్ఞానాన్ని ఉద్దేశపూర్వకంగా మరియు సానుకూలంగా ఉపయోగించుకునేలా పిల్లలకు మార్గనిర్దేశం చేయడంలో సహాయపడే ఆచరణాత్మక పద్ధతులను మరియు సాంకేతిక ప్రక్రియలను మనము నేర్చుకుంటాము.

II. సాంకేతిక విజ్ఞానము యొక్క ప్రయోజనాలు మరియు ఖర్చులు

ప్రయోజనాలు

  • సంఘము ప్రపంచవ్యాప్తంగా సంభాషించడానికి మరియు సువార్తను వ్యాప్తి చేయడానికి సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగిస్తుంది.

  • సాంకేతిక విజ్ఞానం ప్రపంచంలోని సామూహిక జ్ఞానానికి ప్రవేశాన్ని ఇస్తుంది మరియు మన జేబులో సరిగ్గా సరిపోతుంది.

ఖర్చులు

  • సాంకేతిక విజ్ఞానం యొక్క ఖర్చు, మన సమయం మరియు శ్రద్ధ లేదా ఇంకా చెప్పాలంటే, అవకాశం మరియు ఆశీర్వాదాలను వృధా చేయడం.

  • మనం జాగ్రత్తగా ఉండకపోతే, మన దృష్టికి విలువైనది కాని దాని ద్వారా మనం పక్కదారి పట్టవచ్చు లేదా మన నిబంధనలు మరియు విలువల నుండి కూడా అది మనల్ని మళ్ళించవచ్చు.

ఫిలిప్పీయులకు 4:8

  • మెట్టుకు సహోదరులారా, యే యోగ్యతయైనను మెప్పైనను ఉండినయెడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో, వాటిమీద ధ్యానముంచుకొనుడి.

సాంకేతిక విజ్ఞానంపై కుటుంబము

III. సాంకేతిక విజ్ఞానం యొక్క సవాళ్ళు

పరిశోధకులు, విజ్ఞానం మరియు రూపురేఖ‌లు ఎక్కువ సమయం పాటు శ్రద్ధ వహించడానికి మరియు సంతృప్తి చెందడానికి వ్యక్తులకు సహాయపడే పద్ధతులను నేర్చుకున్నారు. ఇది ఆహార పరిశ్రమను పోలి ఉంటుంది. “ఆనందకరమైన స్థితికి” లేదా ఆహారం అత్యంత ఆహ్లాదకరంగా రుచించే దశకు చేరుకోవడానికి విజ్ఞానం వ్యాపారాలకు కావలసినదాన్ని అందించడంలో సహాయపడింది. మీకు ఎప్పుడూ ఇంకొక్కటి కావాలని అనిపించడం మీ తప్పా?

సరే, అవును … మరియు కాదు. సాంకేతిక విజ్ఞానానికి దాని స్వంత “ఆనందకరమైన స్థితి” ఉంది మరియు దానిని నిలబెట్టుకోవడానికి అది మన భావోద్వేగాలను మరియు శరీర రసాయనాలను నడిపిస్తుంది. సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించడాన్ని మానేయడం మీకు కష్టమనిపిస్తే మీరు క్రుంగిపోతారా? మీరు ఆధ్యాత్మికంగా బలహీనంగా ఉన్నారా? లేదు. సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించడాన్ని ఆస్వాదించడం పూర్తిగా సాధారణం, కానీ మన సాంకేతిక విజ్ఞాన వినియోగాన్ని నియంత్రించడం న్యాయబద్ధమైన పోరాటం. మీరు విజ్ఞానం, మెదడు రసాయనాలు మరియు మన దృష్టి కోసం పోటీపడే పోటీ పరిశ్రమలకు వ్యతిరేకంగా ఉన్నారు—మరియు ఇది న్యాయమైన పోరాటం కాదు.

పెద్దలు కూడా పిల్లలతో సమానంగా సాంకేతిక విజ్ఞానంతో కష్టపడగలరని గుర్తించడం చాలా ముఖ్యం. యువత మరియు పిల్లలు చేసే విధంగానే మనం కూడా సాంకేతిక విజ్ఞానం యొక్క “ఆనందకరమైన స్థితి”లో మునిగిపోతాము మరియు సమయాన్ని కోల్పోతాము.

సాంకేతిక విజ్ఞానం యొక్క “ఆనందకరమైన స్థితి”

  • సాంకేతిక విజ్ఞానం అనేది ప్రపంచంలోని సామూహిక జ్ఞానానికి ప్రవేశాన్ని అందించే ఒక సాధనం మరియు మంచి కోసం ఉపయోగించబడవచ్చు.

  • సాంకేతిక విజ్ఞానంపై మనం ఎంత ఎక్కువ శ్రద్ధ చూపిస్తామో, అంత ఎక్కువ సాంకేతిక సృష్టికర్తలకు పరిహారం అందుతుంది.

  • ఆహార పరిశ్రమ యొక్క “ఆనందకరమైన స్థితి” మాదిరిగానే మనం సాంకేతిక విజ్ఞానంతో నిమగ్నమై, సంతృప్తి చెందేలా చేయడానికి పరిశోధకులు మరియు రూపకర్తలు సాంకేతిక ప్రక్రియలను ఉపయోగిస్తారు.

  • పరలోక తండ్రి మరియు మన రక్షకుడు సాంకేతిక విజ్ఞానంతో మన కష్టాలను అర్థం చేసుకుంటారు మరియు మనల్ని బలపరుస్తారు.

2 కొరింథీయులకు 12:9

  • నా కృప నీకు చాలును, బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము, విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుదును.

“ఆనందకరమైన స్థితి”ని అధిగమించడం

  • మన భావోద్వేగాలను మరియు శరీర రసాయనాలను నడిపించే సాంకేతిక విజ్ఞానానికి దాని స్వంత “ఆనందకరమైన స్థితి” ఉందని గుర్తించండి.

  • సాంకేతిక విజ్ఞానంతో కష్టపడటం సహజమే. మనము విజ్ఞానం, మెదడు రసాయనాలు మరియు మన దృష్టి కోసం పోటీపడే పోటీ పరిశ్రమలకు వ్యతిరేకంగా ఉన్నాము.

  • మనల్ని మనం ఉద్దేశపూర్వక ప్రశ్నలు అడగడం, ప్రణాళికను రూపొందించడం మరియు అవసరమైనప్పుడు విరామం తీసుకోవడం ద్వారా మన సాంకేతిక విజ్ఞానాన్ని మనం నియంత్రించవచ్చు.

  • మనము వినియోగించే విషయంపై శ్రద్ధ వహించడం మరియు మన ఇళ్లలో పరికర రహిత ప్రాంతాలను ఏర్పాటు చేయడం కూడా సాంకేతిక విజ్ఞానం యొక్క “ఆనందకరమైన స్థితి”ని అధిగమించడంలో మనకు సహాయపడుతుంది.

మత్తయి 26:41

  • మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థనచేయుడి; ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనము.

తల్లిదండ్రులుగా, మన స్వంత సాంకేతిక విజ్ఞాన వినియోగం ద్వారా మనం మన పిల్లలకు ఒక మాదిరిని ఉంచవచ్చు. సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించడంపై పరిమితులు ఎక్కడ అవసరమో గుర్తించడం మరియు దానిని అతిగా ఉపయోగించాలనే లేదా దుర్వినియోగం చేయాలనే శోధన‌ను అధిగమించడానికి చర్యలు తీసుకోవడం ద్వారా మనకు మరియు మన కుటుంబాలకు సాంకేతిక విజ్ఞానంతో ఆరోగ్యకరమైన సంబంధాన్ని ఏర్పరచవచ్చు. గుర్తుంచుకోండి, మన సాంకేతిక విజ్ఞానాన్ని మనం నియంత్రిస్తాము, అది మనల్ని నియంత్రించదు.

IV. సాంకేతిక విజ్ఞానము యొక్క బాధ్యతను తీసుకొనుట

మూడు ఫోనులు

ఎ. ఉద్దేశము: నేర్చుకోవడానికి మరియు రూపొందించడానికి ఉద్దేశ్యపూర్వకంగా సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించడం.

కొలొస్సయులకు 3:23

  • మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి.

  • “నేను ప్రస్తుతం నా పరికరాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నాను?” మరియు “నేను చేస్తున్న దాని గురించి నేను మంచిగా భావిస్తున్నానా?” వంటి ప్రశ్నలను మిమ్మల్ని మీరు అడగండి.

సాంకేతిక విజ్ఞానాన్ని ఉద్దేశపూర్వకంగా వినియోగించడం కోసం ఆచరణాత్మక సూచనలలో సానుకూల సందేశాన్ని పంపడం, శాంతియుత సంగీతాన్ని వినడం మరియు మీ స్వంత విషయాన్ని సృష్టించడం వంటివి ఉన్నాయి. మీరు ఏ ఇతర వినియోగాలను గుర్తించగలరు?

ఆకుపచ్చరంగు ఫోను

బి. ప్రణాళిక: మెరుగైన ఎంపికల కొరకు ముందుగా ప్రణాళిక చేయడం.

సామెతలు 16:3

  • నీ పనుల భారము యెహోవామీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును.

  • “నా పరికరాన్ని ఉపయోగించడం కోసం నా ప్రణాళిక ఏమిటి?” మరియు “నేను నా సమయాన్ని ఎలా ఉపయోగించుకుంటాననే దానిచేత నేను దేవునికి ఏ సంకేతమిస్తున్నాను?” వంటి ప్రశ్నలను మిమ్మల్ని మీరు అడగండి.

మెరుగైన ఎంపికల కొరకు ముందుగా ప్రణాళిక చేయడానికి ఆచరణాత్మక సూచనలలో స్క్రీన్ సమయానికి మీకు మీరే రోజువారీ పరిమితిని పెట్టుకోవడం, సన్నిహిత కుటుంబం మరియు స్నేహితులను మాత్రమే ఫాలో చేయడం మరియు సంప్రదించడం, ఇంట్లో పరికర రహిత ప్రాంతాలను కలిగియుండడం, కుటుంబ ఛార్జింగ్ ప్రదేశాన్ని ఏర్పాటు చేయడం మరియు ఫిల్టర్‌ని ఉపయోగించడం వంటివి ఉన్నాయి. సాంకేతిక విజ్ఞాన వినియోగానికి సంబంధించి మీకు మరియు మీ పిల్లలకు మెరుగైన ఎంపికలు చేయడానికి ఏ ఇతర వ్యూహాలు సహాయపడతాయి?

నారింజరంగు ఫోను

సి. విరామము: అవసరమైనప్పుడు విరామం తీసుకోవడం.

కీర్తనలు 46:10

  • ఊరకుండుడి, నేనే దేవుడనని తెలిసికొనుడి.

  • “సరైనది కాదని లేదా ఉద్దేశ్యపూర్వకంగా లేదని నాకు తెలిసిన విషయాన్ని నేను నివారిస్తున్నానా?” మరియు “ఆత్మ వెళ్ళిపోయినట్లు నేను భావించానా?” వంటి ప్రశ్నలను మిమ్మల్ని మీరు అడగండి.

సాంకేతిక విజ్ఞానం నుండి విరామం అందించడానికి ఆచరణాత్మక సూచనలలో మీ పరికరాన్ని క్రింద పెట్టి దూరంగా వెళ్ళడం, బలము కొరకు ప్రార్థించడం మరియు ఎవరితోనైనా మాట్లాడడం వంటివి ఉన్నాయి. అవసరమైనప్పుడు మీ కుటుంబం సాంకేతిక విజ్ఞానం నుండి ఎలా విరామం తీసుకోవచ్చు?

ఎరుపురంగు ఫోను

V. సామూహిక చర్చ

ఇప్పుడు మనం సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించడం కోసం కొన్ని ఆచరణాత్మక పద్ధతుల గురించి మాట్లాడాము, కాబట్టి సమూహంతో చర్చను ప్రారంభిద్దాం. నేను మీ అందరి నుండి సాంకేతిక విజ్ఞానంతో మీ అనుభవాలను మరియు మీ జీవితాల్లో మీరు దానిని ఎలా నిర్వహిస్తారో తెలుసుకోవాలనుకుంటున్నాను.

  1. మీ ఇంటిలో సాంకేతిక విజ్ఞానాన్ని నిర్వహించడంలో మీరు ఎదుర్కొనే అతిపెద్ద సవాళ్లు ఏమిటి?

  2. సాంకేతిక విజ్ఞాన వినియోగం విషయంలో మీరు మీ పిల్లల్లో ఎలాంటి విలువలను పెంపొందించాలనుకుంటున్నారు?

  3. సాంకేతిక విజ్ఞానం మీ కుటుంబ సంబంధాలు మరియు సంభాషణల‌పై ఎలా ప్రభావం చూపుతుంది?

  4. కుటుంబ సమేతంగా మీరు సాంకేతిక విజ్ఞానాన్ని ఏయే మార్గాల్లో ఉపయోగిస్తున్నారు? మీరు కలిసి ఉండే నాణ్యమైన సమయానికి ఇది ఎలా ప్రయోజనం చేకూరుస్తుంది లేదా దృష్టి మళ్లిస్తుంది?

  5. మీ కుటుంబ దైనందిన జీవితంలో సాంకేతిక విజ్ఞాన వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలను మరియు లోపాలను మీరు ఎలా సమతుల్యం చేయవచ్చు?

  6. మీ పిల్లల విద్యలో సాంకేతిక విజ్ఞానం ఏ పాత్ర పోషిస్తుందని మీరు చూస్తున్నారు? వారు దానిని సమర్థవంతంగా ఉపయోగిస్తున్నారని మీరు ఎలా నిర్ధారిస్తారు?

  7. సాంకేతిక విజ్ఞానం మీ పిల్లల మానసిక ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? ఏవైనా ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి మీరు ఏ చర్యలు తీసుకుంటారు?

  8. మీ ఇంటిలో సాంకేతిక విజ్ఞాన వినియోగం కోసం మీరు ఏ పరిమితులను కలిగి ఉన్నారు? మీరు వాటిని ఎలా అమలు చేస్తారు?

  9. మీ పిల్లలకు బాధ్యతాయుతమైన సాంకేతిక విజ్ఞాన వినియోగాన్ని మీరు ఎలా చూపిస్తారు?

  10. మీ ఇంటిలో సాంకేతిక విజ్ఞానాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి మీకు ఏ వనరులు లేదా మద్దతు అవసరం?

  11. నా పిల్లలతో నా సంబంధాన్ని సాంకేతిక విజ్ఞానం ఎలా ప్రభావితం చేసింది?

  12. ఇంట్లో సాంకేతిక విజ్ఞాన వినియోగంతో సంబంధం ఉన్న కొన్ని సంభావ్య ప్రమాదాలు ఏమిటి? మీరు ఆ ప్రమాదాలను ఎలా తగ్గించగలరు?

  13. సాంకేతిక విజ్ఞాన వినియోగం విషయంలో మీరు మీ పిల్లలలో ఏ విలువలను పెంపొందించాలనుకుంటున్నారు? ఆ విలువలను మీకై మీరు ఎలా పాటించగలరు?

  14. మార్పులు మరియు సవాళ్లకు అనుగుణంగా ఉన్నప్పటికీ నిర్మాణాన్ని, పరిమితులను అందించడానికి సరిపోయేంత అనువైన సాంకేతిక ప్రణాళికను మీరు మీ కుటుంబం కోసం ఎలా రూపొందించగలరు?

  15. వినోదం లేదా పరధ్యానానికి మూలంగా కాకుండా, మీ పిల్లల అభ్యాసం మరియు అభివృద్ధిని మెరుగుపరచడానికి మీరు సాంకేతిక విజ్ఞానాన్ని ఒక సాధనంగా ఎలా ఉపయోగించగలరు?

VI. ఇంటిలో సాంకేతిక విజ్ఞాన వినియోగం గురించి బోధించడానికి సూచనలు

ఎలక్ట్రానిక్ పరికరాల చిత్రం

మన జీవితంలో సాంకేతిక విజ్ఞానం పోషిస్తున్న పాత్ర మరియు అది ప్రవర్తనను, భావోద్వేగాలను ఎలా ప్రభావితం చేస్తుందనే దాని గురించి చర్చించడం ద్వారా ప్రారంభించండి.

ఎ. సాంకేతిక విజ్ఞానం యొక్క బాధ్యతను తీసుకొనుట యొక్క ప్రాముఖ్యతను వివరించండి

సాంకేతిక విజ్ఞానము మంచి కోసం ఎలా ఉపయోగపడుతుందో పంచుకోండి, కానీ అది మనల్ని నియంత్రించినప్పుడు సమస్యగా కూడా మారవచ్చు. సాంకేతిక విజ్ఞానం మనల్ని నియంత్రించకుండా చూసుకోవడం చాలా ముఖ్యం అని వివరించండి.

బి. సాంకేతిక విజ్ఞానము యొక్క బాధ్యతను తీసుకొనుటకు ఆచరణాత్మక సూచనలను బోధించండి

సాంకేతిక విజ్ఞానం యొక్క బాధ్యతను తీసుకోవడానికి వ్యాసం యొక్క అంశాలలో జాబితా చేయబడిన (ఉద్దేశము, ప్రణాళిక మరియు విరామము) ప్రతి సూచనను సమీక్షించండి. సాంకేతిక విజ్ఞాన వినియోగాన్ని నియంత్రించడంలో ప్రతి సూచన వారికి ఎలా సహాయపడుతుందో వివరించండి.

సి. ఇంట్లో సూత్రాలను వర్తింపజేయడానికి మార్గాలను రూపొందించండి

సాంకేతిక విజ్ఞానం సమస్యగా ఉండగల విభిన్న పరిస్థితులను చర్చించండి, సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడపడం లేదా గంటల తరబడి వీడియో గేమ్‌లు ఆడడం వంటివి.

ఈ పరిస్థితులలో సాంకేతిక విజ్ఞానం యొక్క బాధ్యతను తీసుకొనే సూత్రాలను వర్తింపజేయడానికి మార్గాలను రూపొందించండి, రోజువారీ పరిమితులను ఏర్పాటు చేయడం, పరికర రహిత ప్రదేశా‌లను సృష్టించడం లేదా అవసరమైనప్పుడు విరామాలు తీసుకోవడం వంటివి.

డి. బహిరంగ సంభాషణను మరియు జవాబుదారీతనాన్ని ప్రోత్సహించండి

కుటుంబంలో సాంకేతిక విజ్ఞాన వినియోగం గురించి బహిరంగంగా మాట్లాడడం మరియు సాంకేతిక విజ్ఞానాన్ని బాధ్యతాయుతంగా ఉపయోగించడం కోసం ఒకరికొకరు జవాబుదారీగా ఉండడం ముఖ్యం అని వివరించండి.

ఇంట్లో సాంకేతిక విజ్ఞాన వినియోగం కోసం అంచనాలను, మార్గదర్శకాలను ఏర్పాటు చేయండి మరియు వాటిని అనుసరించడానికి కలిసి పని చేయమని ప్రతీ ఒక్కరిని ప్రోత్సహించండి.

ఇ. తదనంతర చర్య మరియు నమోదు

మీ పిల్లలు సాంకేతిక విజ్ఞానము యొక్క బాధ్యతను తీసుకొనుటతో ఎలా పని చేస్తున్నారో చూడడానికి క్రమానుగతంగా వారిని అడుగుతూ ఉండండి. వారికి అవసరమైతే సహాయం కోసం అడగమని వారిని ప్రోత్సహించండి మరియు అవసరమైన విధంగా మద్దతును, మార్గదర్శకత్వాన్ని అందించడానికి సిద్ధంగా ఉండండి.

ఎఫ్. ఆరోగ్యకరమైన సాంకేతిక విజ్ఞాన వినియోగానికి మాదిరిగా ఉండండి

ఆరోగ్యకరమైన సాంకేతిక విజ్ఞాన వినియోగానికి మాదిరిగా ఉండడంలో తల్లిదండ్రులు పోషించే ముఖ్యమైన పాత్రను వివరించండి. దీనర్థం వారి స్వంత సాంకేతిక విజ్ఞాన వినియోగం గురించి తెలుసుకోవడం మరియు మంచి మాదిరిగా ఉండడం. వారి జీవితాలను నియంత్రించకుండా సాంకేతిక విజ్ఞానాన్ని ఆస్వాదించవచ్చని మరియు సాంకేతిక విజ్ఞానాన్ని ఇతర ముఖ్యమైన కార్యకలాపాలతో, సంబంధాలతో సమతుల్యం చేసుకోవచ్చని తల్లిదండ్రులు పిల్లలకు చూపించవచ్చు.

జి. సానుకూల మద్దతును ఉపయోగించండి

మంచి అలవాట్లను, ప్రవర్తనలను నెలకొల్పడానికి మరియు బలోపేతం చేయడానికి సానుకూల మద్దతును ఎలా ఉపయోగించవచ్చో చర్చించండి. పిల్లలు తమ సాంకేతిక విజ్ఞాన వినియోగంపై బాధ్యత వహించి, దానిని బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నాలు చేసినప్పుడు, వారిని ప్రశంసించడం మరియు ప్రోత్సహించడం చాలా ముఖ్యం.

హెచ్. దానిని కుటుంబ ప్రయత్నంగా చేయండి

సాంకేతిక విజ్ఞానంతో ఆరోగ్యకరమైన సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి కుటుంబంలోని ప్రతి ఒక్కరినీ కలిసి పని చేయమని ప్రోత్సహించండి. సాంకేతిక విజ్ఞానము యొక్క బాధ్యతను తీసుకొనుట అనేది వ్యక్తిగత ప్రయత్నం మాత్రమే కాదు, కుటుంబ ప్రయత్నం. సాంకేతిక విజ్ఞాన వినియోగం కోసం కుటుంబ నియమాలను మరియు పరిమితులను ఏర్పాటు చేయడం, కుటుంబంగా చేయడానికి ప్రత్యామ్నాయ కార్యకలాపాలను కనుగొనడం మరియు సాంకేతిక విజ్ఞానాన్ని బాధ్యతాయుతంగా ఉపయోగించడం వల్ల వచ్చే సవాళ్లు మరియు విజయాల గురించి బహిరంగంగా, నిజాయితీగా సంభాషించడం ఇందులో ఉంటాయి.

ఐ. ఓపికగా మరియు అవగాహనతో ఉండండి

సాంకేతిక విజ్ఞాన వినియోగంలో అలవాట్లను మరియు ప్రవర్తనలను ఎలా మార్చవచ్చో తల్లిదండ్రులతో ప్రణాళిక చేయండి. దీనికి సమయం మరియు కృషి అవసరమని అర్థం చేసుకోవడంలో వారికి సహాయపడండి. పిల్లలు తమ సాంకేతిక విజ్ఞాన వినియోగంపై బాధ్యత వహించడానికి పని చేస్తున్నందున ఓపికగా ఉండడం మరియు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. వారు మద్దతు, మార్గదర్శకత్వం అందించవచ్చు మరియు పిల్లలు సాంకేతిక విజ్ఞానంతో ఆరోగ్యకరమైన సంబంధాన్ని ఏర్పరచుకోవడంలో ముందడుగు వేసినప్పుడు చిన్న చిన్న విజయాలను వేడుక చేసుకోవచ్చు.

VII. ముగింపు

సాంకేతిక విజ్ఞానం అనేది ఒక అద్భుత సాధనం, కానీ మనం దానిని ఉద్దేశపూర్వకంగా ఉపయోగించనప్పుడు అది కూడా ఒక భారం కాగలదు. మన సాంకేతిక విజ్ఞాన వినియోగానికి బాధ్యత వహించడం ద్వారా మరియు పిల్లలకు అదే విధంగా మార్గనిర్దేశం చేయడం ద్వారా, అది మనల్ని నియంత్రించదని మనం నిర్ధారించుకోవచ్చు. నేర్చుకోవడానికి మరియు రూపొందించడానికి సాంకేతిక విజ్ఞానాన్ని ఉద్దేశపూర్వకంగా ఉపయోగించాలని గుర్తుంచుకోండి, మెరుగైన ఎంపికల కోసం ముందుగా ప్రణాళిక చేయండి మరియు అవసరమైనప్పుడు విరామం తీసుకోండి. సత్యమైనవి, మాన్యమైనవి, న్యాయమైనవి, పవిత్రమైనవి, రమ్యమైనవి మరియు ఖ్యాతిగల విషయాలపై దృష్టి పెట్టమని మనల్ని ప్రోత్సహించే లేఖనాలను కూడా గుర్తుంచుకోండి. అలా చేయడం ద్వారా, పిల్లలు సాంకేతిక విజ్ఞానాన్ని సురక్షితంగా మరియు సానుకూలంగా ఉపయోగించుకోవడంలో మనం సహాయపడగలము.