యౌవనులు
సమీక్ష


“సమీక్ష,” సాంకేతిక విజ్ఞానము యొక్క బాధ్యతను తీసుకొనుట (2025)

“సమీక్ష,” సాంకేతిక విజ్ఞానము యొక్క బాధ్యతను తీసుకొనుట

సమీక్ష

సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగిస్తూ నవ్వుతున్న ఇద్దరు స్త్రీలు

ఉద్దేశము—నేను సాంకేతిక విజ్ఞానాన్ని ఒక ఉద్దేశముతో ఉపయోగించగలను. అది నన్ను నియంత్రించదు.

“ప్రభువైన నేను, నీ కొరకు గొప్ప కార్యమును కలిగియున్నాను” (సిద్ధాంతము మరియు నిబంధనలు 112:6).

ప్రణాళిక—నేను ముందుగా ప్రణాళిక చేసినప్పుడు, నేను మంచి అనుభూతిని పొందుతాను మరియు మంచి ఎంపికలు చేస్తాను.

“ఈ జీవితము దేవుడిని కలుసుకొనుటకు మనుష్యులు సిద్ధపడు సమయమైయున్నది” (ఆల్మా 34:32).

విరామము—నేను ఆగి, విరామము తీసుకోవడం మంచిది.

“ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి” (సిద్ధాంతము మరియు నిబంధనలు 101:16).

ఉద్దేశము, ప్రణాళిక, విరామము

ఉద్దేశము

ప్రణాళిక

విరామము

నేను సాంకేతిక విజ్ఞానాన్ని ఒక ఉద్దేశముతో ఉపయోగించగలను. అది నన్ను నియంత్రించదు.

నేను ముందుగా ప్రణాళిక చేసినప్పుడు, నేను మంచి అనుభూతిని పొందుతాను మరియు మంచి ఎంపికలు చేస్తాను.

నేను ఆగి, విరామము తీసుకోవడం మంచిది.

ఆలోచించాల్సిన ప్రశ్నలు

ఉద్దేశము

ప్రణాళిక

విరామము

  • ఇప్పుడు నేను సాంకేతిక విజ్ఞానాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నాను?

  • నేను చేస్తున్న దాని గురించి నేను మంచిగా భావిస్తున్నానా?

  • నేను ఎంత సేపు సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాను?

  • సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించడానికి నా ప్రణాళిక ఏమిటి?

  • నేను నా సమయాన్ని ఎలా ఉపయోగించుకుంటాను అనే దానిచేత నేను దేవునికి ఏ సంకేతమిస్తున్నాను?

  • సరైనది కాదని లేదా ఉద్దేశ్యపూర్వకంగా లేదని నాకు తెలిసిన ఆన్‌లైన్ విషయాన్ని నేను నివారిస్తున్నానా?

  • ఆత్మ విడిచి వెళ్ళుటను నేను భావిస్తున్నానా?

ఆచరణాత్మక సలహాలు

ఉద్దేశము

ప్రణాళిక

విరామము

  • ఎవరికైనా ఒక సానుకూలమైన సందేశాన్ని పంపండి.

  • మీరు శాంతిని అనుభూతి చెందడానికి సహాయపడే సంగీతాన్ని వినండి.

  • మీ స్వంత ఆన్‌లైన్ విషయాన్ని సృష్టించండి.

  • నేర్చుకోవడానికి ఉద్దేశ్యపూర్వకంగా సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించండి.

  • స్క్రీన్ సమయం కోసం నాకు నేనే రోజువారీ పరిమితిని పెట్టుకుంటాను.

  • సన్నిహిత కుటుంబాన్ని, స్నేహితులను మాత్రమే సంప్రదించండి మరియు “ఫాలో చేయండి.”

  • ఇంటిలో ఎలక్ట్రానిక్ పరికరాలు లేని ప్రాంతాలను కలిగియుండండి.

  • ఒక కుటుంబ చార్జింగ్ ప్రదేశాన్ని ఏర్పాటు చేయండి.

  • ఫిల్టర్‌ను ఉపయోగించండి.

  • పరికరాన్ని క్రింద పెట్టి దూరంగా వెళ్ళండి.

  • బలము కొరకు ప్రార్థించండి.

  • ఎవరితోనైనా మాట్లాడండి.