ప్రణాళిక
నేను ముందుగా ప్రణాళిక చేసినప్పుడు, నేను మంచి అనుభూతిని పొందుతాను మరియు మంచి ఎంపికలు చేస్తాను.
నేను గిటార్ వాయించాలనుకుంటున్నాను మరియు నేను బాగా వాయిస్తాను. నా ప్రదర్శన రాబోతున్నప్పుడల్లా, నేను సాధన చేయాలని, ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని నాకు తెలుసు. సాంకేతిక విజ్ఞానం విషయంలో కూడా అంతే: నేను ముందుగా ప్రణాళిక చేసినప్పుడు, నేను మంచి అనుభూతిని పొందుతాను మరియు మంచి ఎంపికలు చేస్తాను.
నేను నా ప్రణాళికకు కట్టుబడి ఉండడానికి సహాయపడే కొన్ని సాధారణ నియమాలివి:
-
స్క్రీన్ సమయం కోసం నాకు నేనే రోజువారీ పరిమితిని పెట్టుకుంటాను.
-
నేను సన్నిహిత కుటుంబాన్ని, స్నేహితులను మాత్రమే సంప్రదిస్తాను మరియు “ఫాలో చేస్తాను.”
-
ఇంటిలో నేను ఎలక్ట్రానిక్ పరికరాలు లేని ప్రాంతాలను కలిగియున్నాను, నా పడకగది మరియు నా స్నానాలగది వంటివి.
-
నేను కుటుంబ ఛార్జింగ్ ప్రదేశాన్ని ఏర్పాటు చేసాను, కాబట్టి ప్రతీ ఒక్కరి పరికరాలు రాత్రిపూట చార్జింగ్‌లో పెట్టబడి, అందుబాటులో లేకుండా ఉంటాయి.
-
నేను అనుచితమైన లేదా అసురక్షిత అప్లికేషన్‌లు మరియు విషయాలను బ్లాక్ చేయడానికి ఫిల్టర్‌లను ఉపయోగిస్తాను.
సాంకేతిక విజ్ఞానం విషయంలో నేను చేసే ప్రతి ఎంపికకు సరైన లేదా తప్పు నిర్ణయం అనేది లేదు. కానీ ముందస్తు ప్రణాళిక సహాయం చేస్తుంది. నేను నా స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో వారి ఆలోచనల గురించి కూడా మాట్లాడగలను.
యౌవనుల బలము కొరకు: ఎంపికలు చేయుటకు ఒక మార్గదర్శి