యౌవనులు
విరామము


విరామము

Hand holding a smartphone

నేను ఆగి, విరామము తీసుకోవడం మంచిది.

కొన్నిసార్లు నేను సంతోషంగా ఉండడానికి లేదా ఇతర వ్యక్తులతో జతచేరడానికి సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించాలని అనిపిస్తుంది. లేదా నేను ఒంటరిగా ఉన్నందున లేదా తోచక స్క్రోల్ చేస్తాను. కొన్నిసార్లు నేను హింసాత్మకమైన, భయానకమైన లేదా లైంగిక విషయాలను చూస్తాను మరియు ఎలా స్పందించాలో నాకు తెలియదు.

నేను ఆగి, విరామము తీసుకోవడం మంచిదని నేను తెలుసుకున్నాను. ఆత్మ నాకు మార్గనిర్దేశం చేస్తారు, నన్ను హెచ్చరిస్తారు మరియు నేను ఎలా చర్య తీసుకుంటున్నానో, అనుభూతి చెందుతున్నానో ఆలోచించడంలో నాకు సహాయం చేస్తారు. అప్పుడు నేను వేరే ఎంపిక చేయాలా వద్దా అని నిర్ణయించుకోగలను.

నాకు ఇది ఉపయోగకరంగా ఉందని నేను కనుగొన్నాను:

  • ఎదుర్కోండి: నిర్దిష్టమైన విషయాన్ని లేదా నాకు చెడుగా, ఒంటరిగా లేదా విచిత్రంగా అనిపించే దానిని నేను చూసినప్పుడు, “ఇది సరైనది కాదు” అని నేను చెప్పగలను.

  • మెరుగైన ఎంపిక చేసుకోండి: నేను పరికరాన్ని ఆపు చేయగలను లేదా నా ప్రకటన‌లను నిశ్శబ్దం చేయగలను. నేను పరికరం లేకుండా బయటికి వెళ్లగలను లేదా మరొక గదికి వెళ్లగలను.

  • ఎవరితోనైనా జతచేరండి: నేను ఎలా భావిస్తున్నాను అనే దాని గురించి ఒక స్నేహితుడితో లేదా కుటుంబ సభ్యునితో నేను మాట్లాడగలను. కొన్నిసార్లు నేను స్క్రీన్ ద్వారా కాకుండా ముఖాముఖిగా ఎవరితోనైనా జతచేరాలి.

3:45

ఉద్దేశము. ప్రణాళిక. విరామము. మూడు చిన్న పదాలు పెద్ద మార్పును కలిగించగలవు.

సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించడానికి మీ ప్రణాళిక ఏమిటి? మీరు ముఖ్యాంశాలు వ్రాసుకోవడానికి లేదా కొన్ని జ్ఞాపికలను వ్రాయడానికి ఈ పేజీని ఉపయోగించవచ్చు.

Icons