సర్వసభ్య సమావేశము
వరుస క్రమమైన ఒక గృహము
2021 అక్టోబరు సర్వసభ్య సమావేశము


వరుస క్రమమైన ఒక గృహము

ఆయన బిడ్డలమైన మనకు ముఖ్యమైన సూత్రములు బోధించడానికి ప్రభువుకు సరళమైన, సహజమైన మరియు ప్రభావవంతమైన మార్గము “వరుస క్రమము.”

నా వృత్తిపరమైన జీవితంలో మరియు నా సంఘ సేవలో దానిని నేను వేలాది సార్లు చేసాను, కానీ నా వెనుక నేరుగా కూర్చున్న 15 మంది ముందు ఎన్నడూ చేయలేదు. మీ ప్రార్థనలను, వారి ప్రార్థనలను నేను అనుభూతి చెందుతున్నాను.

సహోదర, సహోదరీలారా, నేను దక్షిణ ఫసిఫిక్‌లో టోంగా రాజ్య స్వదేశీయుడను, కానీ దక్షిణ అమెరికాలో పెంచబడ్డాను. ఈ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా సేవ చేస్తున్న వందలాది, బహుశా వేలాది మంది యువ టోంగా సువార్తికులు వారి ప్రియమైన మాతృభూమికి తిరిగి రాకుండా చేసింది, ఎందుకంటే దాని సరిహద్దులు మూసివేయబడినవి. కొందరు టోంగా ఎల్డర్లు మూడు సంవత్సరాలు మరియు సహోదరీలు రెండు సంవత్సరాలకు పైగా వారి సువార్తసేవలో ఉన్నారు. ప్రసిద్ధి చెందిన మన జనుల విశ్వాసముతో వారు ఓపికగా ఎదురు చూసారు. ఇంతలో, మీ వార్డులలో మరియు స్టేకులలో పనిచేస్తున్న వారిలో కొందరు నావలె వృద్ధులుగా, తెల్ల వెంట్రుకలతో కనిపిస్తుంటే చాలా భయపడవద్దు. మహమ్మారి వలన వారు ఆశించిన దానికంటె ఎక్కువ కాలము లేక తక్కువ కాలము సేవ చేసినప్పుడు, ప్రతిచోట వారి సమర్పించబడిన సేవ కొరకు సువార్తికులకు మేము కృతజ్ఞత కలిగియున్నాము.

ఒక ఆదివారము నేను పరిచారకునిగా ఉన్నప్పుడు, అప్పుడే ఒక స్త్రీ భవనములోనికి నడిచినప్పుడు నేను సంస్కారపు నీళ్ళుగల ట్రేతో హాలులో ఉన్నాను. విధిగా, నేను సమీపించి, ఆమెకు ట్రేను అందించాను. ఆమె తల ఊపి, చిరునవ్వు నవ్వి, నీటిని తీసుకున్నది. ఆమె రొట్టె తీసుకోవడానికి ఆలస్యంగా చేరుకున్నది. ఈ అనుభవము తరువాత వెంటనే నా గృహ బోధకుడైన నెడ్ బ్రిమ్లే వరుస క్రమములో మనకు ఇవ్వబడిన యేసు క్రీస్తు సువార్త యొక్క అనేక దీవెనలు మరియు అంశములను నాకు బోధించాడు.

మరుసటి వారము, నెడ్ బ్రిమ్లే మరియు అతడి సహవాసి ఒక మరవరాని ఒక పాఠముతో మా ఇంటికి వచ్చారు. దేవుడు భూమిని సృష్టించిన విధానములో క్రమమున్నదని నెడ్ గుర్తు చేసాడు. ఆయన భూమిని సృష్టించిన దానిలో క్రమాన్ని మోషేకు వివరించిన దానిలో ప్రభువు గొప్ప శ్రద్ధను తీసుకున్నారు. ముందుగా, ఆయన చీకటి నుండి వెలుగును, తరువాత పొడి నేల నుండి నీటిని వేరు చేయడం ద్వారా ప్రారంభించారు. ఆదాము హవ్వలతో మొదలుకొని, ఆయన గొప్ప సృష్టియైన మానవజాతిని ఆయన క్రొత్తగా సృష్టించిన గ్రహానికి పరిచయం చేయకముందు ఆయన చెట్లను మరియు జంతువులను సృష్టించారు: .

“దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురుషునిగాను వారి సృజించెను. …

“దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగనుండెను.” (ఆదికాండము 1:27, 31)

ప్రభువు సంతోషించారు. మరియు ఆయన ఏడవ దినమున విశ్రమించారు.

భూమి సృష్టించబడిన వరుస క్రమం దేవునికి ఏది అత్యంత ప్రాముఖ్యమైనదో దాని గురించి మనకు క్షణికదృష్టిని ఇవ్వడమే కాకుండా, భూమిని ఎందుకు మరియు ఎవరి కోసం సృష్టించారు అనే విషయాన్ని కూడా మనకు తెలియజేస్తుంది.

చిత్రం
నెడ్ బ్రిమ్లీ మరియు అతని కుటుంబం

నెడ్ బ్రిమ్లే తన ప్రేరేపించబడిన పాఠాన్ని ఒక సరళమైన ప్రకటనతో విరామ చిహ్నముతో చెప్పాడు: “వాయ్, దేవుని యొక్క గృహము ఒక క్రమము. నీ జీవితాన్ని క్రమముతో జీవించాలని ఆయన కోరుతున్నారు. అది సరైన క్రమము. నీవు వివాహము చేసుకొనక ముందు సువార్త పరిచర్య చేయాలని ఆయన నిన్ను కోరుచున్నారు.” ఈ అంశము గురించి మరింత వివరంగా చెప్పాలంటే, సంఘ నాయకులు ప్రస్తుతము ఇలా బోధిస్తున్నారు, “ప్రతి సమర్ధవంతమైన యువకుడు సేవ చేయడానికి సిద్ధపడాలని ప్రభువు ఆశిస్తున్నారు. … సేవ చేయాలని కోరే యువతులు కూడా… సిద్ధపడాలి” (General Handbook: Serving in The Church of Jesus Christ of Latter-day Saints, 24.0, ChurchofJesusChrist.org). సహోదరుడు బ్రిమ్లే కొనసాగించాడు: “నీకు పిల్లలు కలుగముందే నీవు వివాహము చేసుకోవాలని దేవుడు కోరుతున్నాడు. మరియు నీవు విద్యను ఆర్జించినప్పుడు నీ ప్రతిభలను నిరంతరం వృద్ధి చేసుకోవాలని ఆయన నిన్ను కోరుతున్నారు.” క్రమం లేకుండా నీ జీవితాన్ని జీవించాలని నీవు కోరుకుంటే, జీవితము ఎక్కువ కష్టమైనదిగా మరియు సంక్లిష్టమైనదిగా నీవు కనుగొంటావు.

మన స్వంతవి లేక ఇతరుల యొక్క బలహీనమైన ఎంపికల ద్వారా అస్తవ్యస్తం చేయబడి లేక క్రమం తప్పితే, మన జీవితాలకు క్రమాన్ని తిరిగి ఇవ్వడానికి ఆయన ప్రాయశ్చిత్త త్యాగము ద్వారా రక్షకుడు సహాయపడతాడని కూడా సహోదరుడు బ్రిమ్లే మాకు బోధించాడు.

అప్పటి నుండి, నేను “వరుస క్రమము” గురించి ఆకర్షించబడ్డాను. జీవితంలో మరియు సువార్తలో క్రమమైన మాదిరుల కొరకు వెదకే అలవాటును నేను పెంపొందించుకున్నాను.

ఎల్డర్ డేవిడ్ ఎ. బెడ్నార్ ఈ సూత్రమును బోధించారు: “మనము యేసు క్రీస్తు యొక్క సువార్తను అధ్యయనము చేసి, నేర్చుకొని మరియు జీవించినప్పుడు క్రమము అనేది తరచుగా బోధనాత్మకంగా ఉంటుంది. ఉదాహరణకు, ఈ కడవరి దినాలలో రక్షకుని సంపూర్ణ సువార్త పునఃస్థాపించబడినప్పుడు సంభవించిన ప్రధాన సంఘటనల క్రమం నుండి ఆత్మీయ ప్రాధాన్యతలను గూర్చి మనము నేర్చుకొనే పాఠాలను పరిగణించండి.”

బాలుడైన ప్రవక్తకు మొదట దేవుని యొక్క స్వభావము మరియు గుణమును బోధించుటకు జోసెఫ్ స్మిత్‌కు మొదటి దర్శనము కలుగుట మరియు మొరోనై మొదటిసారి ప్రత్యక్షమగుట, తరువాత ఈ కడవరి దినములో తెరకు రెండువైపులా ఇశ్రాయేలీయులను సమకూర్చుటలో మోర్మన్ గ్రంథము మరియు ఏలీయా వహించే పాత్రను బోధించుటను ఎల్డర్ బెడ్నార్ వరసగా చెప్పారు.

ఎల్డర్ బెడ్నార్ ఇలా ముగించారు: “ఈ ప్రేరేపించబడిన క్రమము ఆత్మీయ విషయాల గురించి దేవునికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తుంది.” (“The Hearts of the Children Shall Turn,” Liahona, Nov. 2011, 24).

నేను చేసిన ఒక పరీశీలన ఏమిటంటే, ఆయన బిడ్డలమైన మనకు ముఖ్యమైన సూత్రములు బోధించడానికి ప్రభువుకు సరళమైన, సహజమైన మరియు ప్రభావవంతమైన మార్గము “వరుస క్రమము.”

మనము మరొక విధంగా పొందలేని జ్ఞానమును మరియు అనుభవాన్ని పొందడానికి మనము భూమి మీదకు వచ్చాము. మన ఎదుగుదల వ్యక్తిగతంగా ప్రతిఒక్కరికి ప్రత్యేకమైనది మరియు పరలోక తండ్రి యొక్క ప్రణాళికలో ముఖ్యమైన భాగము. మన భౌతిక మరియు ఆత్మీయ అభివృద్ధి స్థాయిలుగా ప్రారంభమవుతుంది మరియు మనము వరుసగా అనుభవాన్ని పొందినప్పుడు నెమ్మదిగా వృద్ధి చెందుతుంది.

విత్తనం యొక్క సారూప్యతను ఉపయోగిస్తూ—ఆల్మా విశ్వాసముపై ఒక శక్తివంతమైన ప్రసంగాన్ని ఇచ్చారు, ఆ విత్తనముపై శ్రద్ధ చూపి సరిగా పోషించిన యెడల, చిన్న మొక్క నుండి పూర్తి పరిపక్వత చెందిన చెట్టుగా ఎదిగి మధురమైన ఫలమును ఉత్పత్తి చేస్తుంది (ఆల్మా 32:28–43 చూడండి). ఆ పాఠము ఏమిటంటే మీ హృదయాలలో—విత్తనము—లేక దేవుని వాక్యము కొరకు మీరు స్థలమిచ్చి పోషించినప్పుడు, మీ విశ్వాసము వృద్ధి చెందుతుంది. దేవుని వాక్యము “మీ రొమ్ములలో పొంగుట”(28 వచనము) మొదలు పెట్టినప్పుడు మీ విశ్వాసము వృద్ధి చెందుతుంది. అది “ఉబ్బి, మొలిచి మరియు పెరుగుటకు ప్రారంభించుట” (30 వచనము) దృశ్యమానమైనది మరియు బోధనాత్మకమైనది. అది వరుస క్రమమైనది కూడా.

నేర్చుకొనుటకు మనకు గల సామర్ధ్యము మరియు మనము నేర్చుకొనే విధానము ప్రకారము ప్రభువు వ్యక్తిగతంగా మనకు బోధిస్తారు. మన అభివృద్ధి అనేది మన సమ్మతి, సహజమైన కుతూహలము, విశ్వాసము యొక్క స్థాయి మరియు జ్ఞానముపై పూర్తిగా ఆధారపడుతుంది.

2,300 పైగా సంవత్సరాల తరువాత ఒహైయోలోని కర్ట్‌లాండ్‌లో, జోసెఫ్ స్మిత్ నేర్చుకోబోయే దానిని నీఫై బోధించారు: “ఏలయనగా ప్రభువైన దేవుడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు: నేను నరుల సంతానమునకు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, ఇచ్చట కొంత అచ్చట కొంత ఇచ్చెదను; నా సూక్తులను ఆలకించు వారు, నా సలహాకు చెవియొగ్గు వారు ధన్యులు, వారు జ్ఞానము నేర్చుకొందురు; ఏలయనగా స్వీకరించువానికి నేను మరి ఎక్కువ ఇచ్చెదను, మాకు చాలును అని చెప్పు వారి నుండి వారు కలిగియున్నది కూడా తీసివేయబడును.” (2 నీఫై 28:30).

మనము నేర్చుకొనే “ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, ఇచ్చట కొంత అచ్చట కొంత,” మరలా క్రమమైనది.

మన జీవితమంతా మనము ఎక్కువగా వినిన క్రింది వ్యాఖ్యలను పరిగణించండి: “మొదటి విషయాలు మొదట రావాలి” లేక “అన్నము ఇవ్వకముందు వారికి పాలు ఇవ్వండి.” “మనము పరుగెత్తక ముందు నడవాలి” అనేది ఎలా ఉంది? ఈ ప్రత్యక్షసూత్రములలో ప్రతిఒక్కటి ఏదో ఒక క్రమము కలిగియున్నవి.

అద్భుతాలు వరుస క్రమము ప్రకారము పనిచేస్తాయి. మనము మొదట విశ్వాసము సాధన చేసినప్పుడు అద్భుతాలు సంభవిస్తాయి. అద్భుతానికి ముందు విశ్వాసముంటుంది.

యువకులు కూడా అహరోను యాజకత్వ స్థానాలకు వారు నియమించబడే వయస్సు ప్రకారము క్రమములో నియమించబడతారు: పరిచారకుడు, బోధకుడు, మరియు తరువాత యాజకుడు.

రక్షణ విధులు మరియు ఉన్నతస్థితి క్రమమైన స్వభావాన్ని కలిగియున్నవి. మనము పరిశుద్ధాత్మ యొక్క వరమును పొందక ముందు బాప్తీస్మము పొందాలి. దేవాలయ విధులు అదేవిధంగా క్రమమైనవి. అవును నా స్నేహితుడైన నెడ్ బ్రిమ్లే చాలా తెలివిగా నాకు బోధించాడు, సంస్కారము క్రమమైనది—అది రొట్టెతో ప్రారంభమైన తరువాత నీళ్ళు ఇవ్వబడును.

“వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని, దాని నాశీర్వదించి, విరిచి తన శిష్యునికిచ్చి—మీరు తీసికొని తినుడి; ఇది నా శరీరమని చెప్పెను.

“మరియు ఆయన గిన్నె పట్టుకొని, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరందరు త్రాగుడి;

“ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము” (మత్తయి 26:26-28).

యెరూషలేములో మరియు అమెరికాలో, రక్షకుడు ఖచ్చితంగా అదే క్రమములో సంస్కారాన్ని ఇచ్చారు.

“ఇదిగో, నా మందిరము క్రమమైన మందిరము, అది కలవరపెట్టు మందిరము కాదు.” (సిద్ధాంతము మరియు నిబంధనలు 132:8).

పశ్చాత్తాపము క్రమమైనది. కేవలము ఒక రేణువు అయిన కూడా, అది యేసు క్రీస్తునందు విశ్వాసముతో ప్రారభమవుతుంది. విశ్వాసానికి దీనమనస్సు అవసరము, “విరిగిన హృదయము మరియు నలిగిన మనస్సు”(2 నీఫై 2:7) కలిగియుండటానికి ఆవశ్యమైన అంశము.

వాస్తవానికి, యేసు క్రీస్తు సువార్త సూత్రములలో మొదటి నాలుగు సూత్రములు వరుసగా ఉన్నాయి. “సువార్త యొక్క మొదటి నియమములు, విధులు: మొదటిది, యేసు క్రీస్తు నందు విశ్వాసము; రెండవది పశ్చాత్తాపము; మూడవది, పాపక్షమాపణ కొరకు ముంచుట ద్వారా బాప్తిస్మము; నాల్గవది, పరిశుద్ధాత్మ వరము కొరకు హస్తనిక్షేపణము అని మేము నమ్ముచున్నాము.” (విశ్వాస ప్రమాణములు 1:4)

రాజైన బెంజమిన్ తన జనులకు ఈ ముఖ్యమైన సత్యమును బోధించాడు: “ఈ క్రియలన్నియు వివేకమందు, క్రమమందు చేయబడునట్లు చూడుము; ఏలయనగా ఒక మనుష్యుడు తన శక్తికి మించి వేగముగా పరుగెత్తనవసరము లేదు. అయితే దానిని బట్టి అతడు బహుమానము గెలుచుకొనునట్లు శ్రద్ధగా ఉండుట అవసరము; కాబట్టి సమస్త క్రియలు క్రమమందు చేయబడవలెను.”(మోషైయ 4:27).

మన జీవితాలను మనము క్రమముతో జీవించి, ప్రభువు మనకోసం సంగ్రహించిన క్రమమును అనుసరించడానికి కోరుకోవాలని మనము ఆశిద్దాము. ఆయనకు అత్యంత ముఖ్యమైనదని ప్రభువు బోధించే దానిలో మాదిరులను, క్రమమును మనము వెదకి, అనుసరించినప్పుడు మనము దీవించబడతాము. యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో, ఆమేన్.