రక్షకుని విధానములో బోధించుట
నాయకుల కొరకు—బోధకులకు శిక్షణ మరియు మద్దతునివ్వడం


“నాయకుల కొరకు—బోధకులకు శిక్షణ మరియు మద్దతునివ్వడం,” రక్షకుని విధానములో బోధించుట: గృహములో మరియు సంఘములో బోధించువారందరి కొరకు (2022)

“బోధకులకు శిక్షణ మరియు మద్దతునివ్వడం,” రక్షకుని విధానములో బోధించుట

మాట్లాడుకుంటున్న జనులు

నాయకుల కొరకు—బోధకులకు శిక్షణ మరియు మద్దతునివ్వడం

ఒక నాయకునిగా, మీ నిర్మాణంలో “క్రొత్తగా పిలువబడిన బోధకులను కలవడం” మరియు “వారి పిలుపుల కోసం సిద్ధపడడంలో వారికి సహాయపడే” బాధ్యతను మీరు కలిగియున్నారు (ప్రధాన చేతిపుస్తకము, 17.3, సువార్త గ్రంథాలయము). ఈ సమావేశాలు క్రొత్త బోధకులను వారి పవిత్రమైన పిలుపులకు పరిచయం చేయడానికి మరియు రక్షకుని విధానములో బోధించుట అంటే ఏమిటనే దర్శనంతో వారిని ప్రేరేపించడానికి ఒక అవకాశం. ఒక నాయకునిగా, మీరు ఈ క్రింది వాటిని చేయడం ద్వారా క్రొత్త బోధకులు సేవ చేయడానికి సిద్ధపడుటలో సహాయం చేయవచ్చు:

  • వారి పిలుపులో రక్షకుడు వారికి సహాయం చేస్తారనే విశ్వాసాన్ని వ్యక్తం చేయండి (సిద్ధాంతము మరియు నిబంధనలు 88:78 చూడండి).

  • క్రొత్త బోధకులకు ఈ వనరు యొక్క ప్రతిని ఇవ్వండి మరియు వారి బోధనలో దాని సూత్రాలను అన్వయించే మార్గాల కోసం వెదకమని వారిని ప్రోత్సహించండి.

  • క్రొత్త బోధకులకు సహాయపడేలా మీ నిర్మాణం గురించి వారు తెలుసుకోవలసిన ఏ విషయమైనా వారితో పంచుకోండి.

  • అవసరమైనప్పుడు, క్రొత్త బోధకులు ఏ గదిలో బోధించాలో మరియు ఏ పాఠంతో ప్రారంభించాలో చెప్పండి. వారి తరగతి మరియు తరగతి సభ్యుల గురించి వారికి అవసరమైన ఏ సమాచారాన్నైనా అందించండి.

  • వారి పిలుపులో మీరు వారికి సహాయం చేయగలరని క్రొత్త బోధకులకు వివరించండి. అవసరమైతే తరగతి గదిలో మద్దతునివ్వండి మరియు బోధనా వనరులకు ప్రవేశాన్ని కల్పించండి.

  • అప్పుడప్పుడు బోధకుల తరగతులను గమనిస్తామని ప్రతిపాదించండి మరియు ఆత్మ ప్రేరేపించిన విధంగా అభిప్రాయాన్ని తెలియజేయండి.

  • త్రైమాసిక బోధకుల సలహామండలి సమావేశాలలో పాల్గొనడానికి బోధకులను ఆహ్వానించండి.

బోధకులు సేవ చేస్తున్నంత కాలం, కొనసాగుతున్న మద్దతును అందించడానికి వారితో కాలానుగుణంగా కలుసుకోవడాన్ని కొనసాగించండి. ఉదాహరణకు, నాయకులుగా మీరు రక్షకుని విధానములో బోధించుట యొక్క సూత్రాలను చర్చించడానికి తరగతికి ముందు లేదా తర్వాత బోధకునితో క్లుప్తంగా చర్చించవచ్చు. వారు బాగా చేస్తున్నారని భావించే వాటి గురించి మరియు వారు మెరుగుపరచాలనుకుంటున్న విధానాల గురించి బోధకుడిని అడగండి. వారు అందించే సేవకు దయతో, కృతజ్ఞతతో వారిని ప్రోత్సహించండి.

బోధకుడు బోధించడాన్ని గమనించడం ద్వారా మీరు ఈ చర్చలకు సిద్ధం కావాలి. బోధకుని బలాలను బాగా అర్థం చేసుకోవడానికి మరియు మీరు మద్దతు అందించగల మార్గాలను కనుగొనడానికి ప్రయత్నించండి. అభివృద్ధికి అవకాశాలను గుర్తించడం ఎంత ముఖ్యమో, బోధకుని బలాలపై నిర్మించడం కూడా అంతే ముఖ్యము.