రక్షకుని విధానములో బోధించుట
క్రీస్తును పోలిన బోధన యొక్క సమీక్ష


“క్రీస్తును పోలిన బోధన యొక్క సమీక్ష,” రక్షకుని విధానములో బోధించుట (2022)

క్రీస్తును పోలిన బోధన యొక్క సమీక్ష

క్రింది పటములు ఈ వనరులో బోధించబడిన సూత్రాల యొక్క సమీక్షను అందిస్తాయి.

యేసు క్రీస్తుపై కేంద్రీకరించండి

మీరు ఏమి బోధిస్తున్నప్పటికీ యేసు క్రీస్తు గురించి బోధించండి

  • యేసు క్రీస్తు యొక్క మాదిరిని నొక్కి చెప్పండి.

  • యేసు క్రీస్తు యొక్క బిరుదులు, పాత్రలు మరియు లక్షణాల గురించి బోధించండి.

  • యేసు క్రీస్తు గురించి సాక్ష్యమిచ్చే చిహ్నాల కొరకు చూడండి.

అభ్యాసకులు యేసు క్రీస్తు యొద్దకు వచ్చుటకు సహాయము చేయండి

  • వారి జీవితాలలో ప్రభువు యొక్క ప్రేమ, శక్తి మరియు దయను గుర్తించుటకు అభ్యాసకులకు సహాయము చేయండి.

  • పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తుతో వారి సంబంధాన్ని బలోపేతం చేసుకొనుటకు అభ్యాసకులకు సహాయము చేయండి.

  • ఉద్దేశపూర్వకంగా యేసు క్రీస్తు వలె ఎక్కువగా ఉండుటకు కృషి చేయడంలో అభ్యాసకులకు సహాయము చేయండి.

క్రీస్తును పోలిన బోధన యొక్క సూత్రాలు

మీరు బోధించే వారిని ప్రేమించండి

  • అభ్యాసకులను దేవుడు చూసే విధంగా మీరూ చూడండి.

  • వారి గురించి తెలుసుకొనుటకు ప్రయత్నించండి—వారి పరిస్థితులు, అవసరాలు మరియు బలాలు అర్థం చేసుకోండి.

  • వారి కోసం పేరు పేరున ప్రార్థించండి.

  • అందరూ గౌరవించబడేలా మరియు వారి సహకారం విలువైనదని తెలుసుకొనేలా సురక్షితమైన వాతావరణాన్ని సృష్టించండి.

  • మీ ప్రేమను వ్యక్తపరచడానికి తగిన మార్గాలను కనుగొనండి.

ఆత్మచేత బోధించండి

  • ఆత్మీయంగా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి.

  • అభ్యాసకుల అవసరాలకు సంబంధించిన ఆత్మీయ ప్రేరేపణలకు స్పందించుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి.

  • అభ్యాసకులు పరిశుద్ధాత్మ చేత బోధించబడేలా పరిస్థితులను మరియు అవకాశాలను సృష్టించండి.

  • వ్యక్తిగత బయల్పాటును వెదకుటకు, గుర్తించుటకు మరియు దానిపై పనిచేయుటకు అభ్యాసకులకు సహాయపడండి.

  • తరచుగా సాక్ష్యం చెప్పండి మరియు వారి మనోభావాలను, అనుభవాలను, సాక్ష్యాలను పంచుకోమని అభ్యాసకులను ఆహ్వానించండి.

సిద్ధాంతాన్ని బోధించండి

  • మీ అంతట మీరు యేసు క్రీస్తు సిద్ధాంతాన్ని తెలుసుకోండి.

  • లేఖనాల నుండి మరియు కడవరి దిన ప్రవక్తల మాటల నుండి బోధించండి.

  • లేఖనాలలోని సత్యాలను వెదకుటకు, గుర్తించుటకు మరియు అర్థం చేసుకొనుటకు అభ్యాసకులకు సహాయం చేయండి.

  • పరివర్తనకు దారితీసే సత్యాలపై దృష్టి పెట్టండి మరియు యేసు క్రీస్తుపై విశ్వాసాన్ని పెంపొందించండి.

  • యేసు క్రీస్తు యొక్క సిద్ధాంతంలో వ్యక్తిగత సంబంధాన్ని కనుగొనుటకు అభ్యాసకులకు సహాయపడండి.

శ్రద్ధగల అభ్యాసాన్ని ఆహ్వానించండి

  • అభ్యాసకులు తమ అభ్యాసానికి బాధ్యత వహించడంలో సహాయపడండి.

  • అనుదినము సువార్తను అధ్యయనం చేయడం ద్వారా రక్షకుని గురించి తెలుసుకునేలా అభ్యాసకులను ప్రోత్సహించండి.

  • నేర్చుకొనుటకు సిద్ధపడమని అభ్యాసకులను ఆహ్వానించండి.

  • వారు నేర్చుకుంటున్న సత్యాలను పంచుకునేలా అభ్యాసకులను ప్రోత్సహించండి.

  • వారు నేర్చుకుంటున్న వాటిని జీవించడానికి అభ్యాసకులను ఆహ్వానించండి.

2:19
క్రీస్తును పోలిన బోధన యొక్క సమీక్షా పట్టిక