2026 అక్టోబరు సర్వసభ్య సమావేశము శనివారం ఉదయకాల సభ శనివారం ఉదయకాల సభ2026, అక్టోబరు 3-4 తేదీలలో నిర్వహించబడిన, యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క 196వ అర్థవార్షిక సర్వసభ్య సమావేశపు శనివారం ఉదయకాల సభ. D. Todd Christoffersonసంఘము యొక్క ప్రధాన అధికారులు, ప్రాంతీయ డెబ్బదులు మరియు ప్రధాన అధిపతులను ఆమోదించుట అధ్యక్షులు క్రిస్టాఫర్సన్, ప్రధాన అధికారులు, ప్రాంతీయ డెబ్బదులు మరియు ప్రధాన సహాయక అధ్యక్షత్వములను ఆమోదించు ఓటు కొరకు సమర్పిస్తున్నారు. గెరిట్ డబ్ల్యు. గాంగ్ఆయన పరిశుద్ధ మందిరములో ప్రభువు వద్దకు రండిఎల్డర్ గాంగ్ ప్రభువు మందిరం గురించిన ప్రాథమిక సిద్ధాంతాన్ని పంచుకుంటున్నారు, అది మన వ్యక్తిగత దేవాలయ సంస్కృతిని సుసంపన్నం చేయగలదు. తమారా డబ్ల్యు. రూనియా మన ఆత్మల రూపకల్పనదేవుడు మీ అనుభవాన్ని క్షుణ్ణంగా ఎరిగియున్నారని మరియు మీ కొరకు ఒక ప్రణాళికను కలిగియున్నారని సహోదరి రూనియా బోధిస్తున్నారు. జెరాల్డ్ కాస్సేసాక్ష్యపు వరంయేసు క్రీస్తును గూర్చిన సాక్ష్యం అనేది ఆత్మ అనుగ్రహించే వ్యక్తిగత బహుమానమని, దానిని పంచుకోవడానికి మనలో ప్రతీ ఒక్కరం అవకాశాలను వెతుక్కోవాలని ఎల్డర్ కాస్సే బోధిస్తున్నారు. వేయాంజినా సికహేమప్రవక్తలు, దీర్ఘదర్శులు మరియు బయల్పాటుదారులుమన ప్రవక్తల మరియు అపొస్తలుల మాటలను విని, వాటిని అనుసరించడం ఎంత ముఖ్యమో ఎల్డర్ సికహేమ బోధిస్తున్నారు. కెవిన్ జె. హాతవేయేసు క్రీస్తు గొప్ప విమోచకుడు!మనం యేసు క్రీస్తు వైపు తిరిగితే, మన బాధల నుండి ఆయన మనల్ని విడిపించగలరని ఎల్డర్ హాతవే బోధిస్తున్నారు. యులిసెస్ సోవారెస్ఉన్నతమైన మరియు పరిశుద్ధమైన ఉపవాసంఉపవాస చట్టాన్ని పాటించడం అనేది మన శిష్యరికాన్ని తీర్చిదిద్ది, శుద్ధి చేసి, మనల్ని ప్రభువుకు మరింత చేరువ చేసే ఒక ఆరాధన అని ఎల్డర్ సోవారెస్ బోధిస్తున్నారు. షాన్ డగ్లస్నీ పరిచర్య గడియ వచ్చియున్నదిఆధునిక ప్రవక్తల ఉపదేశాలను అనుసరించి, మిషన్లలో సేవ చేయమని బిషప్పు డగ్లస్ భావి తరానికి ఆహ్వానం పలుకుతున్నారు. డి. టాడ్ క్రిస్టాఫర్సన్జ్ఞానులుగా ఉండుడిఅధ్యక్షులు క్రిస్టాఫర్సన్ జూదం వల్ల కలిగే ప్రమాదాల గురించి బోధిస్తూ, మన సమయాన్ని మంచి పనులకు ఉపయోగించుకోవాలని మనల్ని ప్రోత్సహిస్తున్నారు. శనివారం మధ్యాహ్నకాల సభ శనివారం మధ్యాహ్నకాల సభ2026, అక్టోబరు 3-4 తేదీలలో నిర్వహించబడిన, యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క 196వ అర్థవార్షిక సర్వసభ్య సమావేశపు శనివారం మధ్యాహ్నకాల సభ. డేల్ జి. రెన్లండ్“ఎన్నాళ్లవరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు?”జీవితంలోని సవాళ్ల మధ్యలో కూడా, దేవుని మంచితనాన్ని గుర్తుంచుకోవడం మరియు ఆయన వాగ్దానాలను విశ్వసించడం, యేసు క్రీస్తు ద్వారా మనకు ఆనందాన్ని మరియు శాంతిని కనుగొనడంలో సహాయపడగలదని ఎల్డర్ రెన్లండ్ బోధిస్తున్నారు. టిమోతి ఎల్. ఫార్నెస్దైవిక నియామకాలుయేసు క్రీస్తు యొక్క నిబంధన అనుచరులుగా, మన ఎదుట ఉన్న వ్యక్తిని తీర్పుతో కాకుండా కరుణతో చూసి, ఆ తర్వాత వారికి సహాయం చేయడానికి చర్య తీసుకోవాలని అధ్యక్షులు ఫార్నెస్ బోధిస్తున్నారు. క్రిస్టియన్ సి. చిగ్బుండుఆధ్యాత్మిక రక్షణ శక్తిలేఖన అధ్యయనం, ప్రార్థన, సంస్కారం మరియు నిబంధనలు జీవితంలోని సవాళ్లను తట్టుకోవడానికి మనకు సహాయపడతాయని ఎల్డర్ చిగ్బుండు బోధిస్తున్నారు. పట్రీసియో ఎమ్. జూఫ్రాదశమభాగములు మరియు కానుకల ద్వారా ప్రభువును విశ్వసించుటకష్టమైన ఆర్థిక పరిస్థితులలో కూడా, దశమభాగ చట్టాన్ని పాటించడం వల్ల కలిగే ఆశీర్వాదాల గురించి ఎల్డర్ జూఫ్రా బోధిస్తున్నారు. జెరెమియా జె. మోర్గాన్మన నిబంధనలలో దేవుని అనంతమైన శక్తిదేవునితో చేసే నిబంధనలకు గొప్ప శక్తి ఉందని, అవి మనపై మాత్రమే కాకుండా తరతరాలుగా మన సంతానంపై కూడా ప్రభావం చూపుతాయని ఎల్డర్ మోర్గాన్ బోధిస్తున్నారు. హచ్ యు. ఫేల్నేను దేవుని బిడ్డనుమనమందరం దేవుని ప్రియమైన పిల్లలమని మరియు ఆయన ప్రణాళికను అనుసరించినప్పుడు మనం ఆశీర్వదించబడతామని ఎల్డర్ ఫేల్ బోధిస్తున్నారు. ప్యాట్రిక్ కీరన్యేసు ఉద్ధరించడానికే జీవిస్తున్నారుమనం యేసు క్రీస్తు వైపు తిరిగినప్పుడు, ఆయనే మనకు ఆధ్యాత్మిక ఉన్నతి అని ఎల్డర్ కీరన్ బోధిస్తున్నారు. మైఖెల్ ఎ. డన్తొంభై మరియు పదిఒక స్నేహితుడు తనకు పరుగు పందెం పూర్తి చేయడంలో సహాయం చేసిన కథను ఉదహరిస్తూ, జీవిత ప్రయాణంలో యేసు క్రీస్తు మనకు ఏ విధంగా పరిచర్య చేస్తారనే దాని గురించి ఎల్డర్ డన్ సాక్ష్యమిచ్చారు. మాథ్యూ జె. ఐరింగ్పరిశుద్ధాత్మ నుండి ఓదార్పుమనం యేసు క్రీస్తు వైపు తిరిగినప్పుడు, పరిశుద్ధాత్మ ద్వారా శాంతి, నిరీక్షణ మరియు ఓదార్పును పొందగలమని ఎల్డర్ ఐరింగ్ బోధిస్తున్నారు. రోనాల్డ్ ఎ. రాస్బాండ్యేసువలె ప్రేమించండిదారి తప్పిన పిల్లలు ఉన్నవారు తమ నిరాశ భావాలను యేసు క్రీస్తుకు అప్పగించాలని ఎల్డర్ రాస్బాండ్ బోధిస్తున్నారు, ఎందుకంటే దారి తప్పిన వారి హృదయాలను మార్చగలిగేది ఆయనే. ఆదివారం ఉదయకాల సభ ఆదివారం ఉదయకాల సభ2026, అక్టోబరు 3-4 తేదీలలో నిర్వహించబడిన, యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క 196వ అర్థవార్షిక సర్వసభ్య సమావేశపు ఆదివారం ఉదయకాల సభ. హెన్రీ బి. ఐరింగ్“నేను నీకు తోడైయున్నాను, భయపడకుము”మనకు సవాళ్లు ఎదురైనప్పుడు మన ప్రియమైన పరలోక తండ్రి మనకు సహాయం చేస్తారని అధ్యక్షులు ఐరింగ్ బోధిస్తున్నారు. రోస్మేరీ కె. చిబోటాదేవుని బిడ్డఇతరులను దేవుని బిడ్డలుగా చూడాలని, ఆయన చూసుకున్నట్లే మనం కూడా వారిని చూసుకోవాలని అధ్యక్షురాలు చిబోటా మనల్ని ఆహ్వానిస్తున్నారు. నీల్ ఎల్. ఆండర్సెన్యేసు క్రీస్తుపై మనకున్న విశ్వాసం నుండి పుట్టిన ధైర్యంయేసు క్రీస్తుపై తమ విశ్వాసాన్ని వ్యక్తపరచడానికి ధైర్యం చేసిన వ్యక్తుల యొక్క అనేక ఉదాహరణలను ఎల్డర్ ఆండర్సెన్ పంచుకున్నారు. జేమ్స్ జి. ఓ. ఫంటొనెఆయన నామాన్ని మనపై తీసుకొనుటరక్షకుని నామాన్ని మనపై తీసుకోవడం అంటే, మన జీవితాంతం ఆయనకు మరియు మన తోటి మానవులకు సేవ చేస్తామని నిబంధన చేసుకోవడమేనని ఎల్డర్ ఫంటొనె బోధిస్తున్నారు. ఎడ్వర్డ్ డ్యూబ్క్రీస్తు నొద్దకు రండిప్రజలను క్రీస్తు వద్దకు రమ్మని, వారి శక్తి మేరకు ఉత్తమంగా చేయమని మనం ఆహ్వానించవచ్చని, తద్వారా ఆయన తన కృపతో వారిని పరిపూర్ణులను చేయగలరని ఎల్డర్ డ్యూబ్ బోధిస్తున్నారు. క్వింటిన్ ఎల్. కుక్యథార్థత మరియు సుగుణము సంతోషానికి దారితీస్తాయియేసు క్రీస్తు యొక్క జీవితకాల శిష్యులు, యథార్థత మరియు సుగుణాలతో కూడిన జీవితాలను ఆనందంగా జీవించినప్పుడు, వారు రక్షకుని బోధనను మరియు మార్గదర్శకత్వాన్ని ఉత్తమంగా ప్రతిబింబిస్తారని ఎల్డర్ కుక్ బోధిస్తున్నారు. ఆల్ఫ్రెడ్ క్యుంగుసమాధానపరచువారి భాషను ఉపయోగించడందయ మరియు గౌరవంతో కూడిన భాషను ఉపయోగించడం ద్వారా మనం సమాధానపరచువారిగా ఉండగలమని ఎల్డర్ క్యుంగు బోధిస్తున్నారు. సిరో ష్మైల్మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి, ఇది మొదలుకొని ప్రభువు మిమ్మును ఆశీర్వదించెదరునిబంధన మార్గంలో మనకు మార్గనిర్దేశం చేయడానికి, అలాగే మన సవాళ్లు మరియు బలహీనతలను అధిగమించడంలో సహాయపడటానికి మన రక్షకుడు మరియు మన నిబంధనలు ప్రధానమైనవి అని ఎల్డర్ ష్మైల్ బోధిస్తున్నారు. డాలిన్ హెచ్. ఓక్స్యేసు క్రీస్తు సువార్త అందరి కొరకైనదియేసు క్రీస్తు సువార్త ప్రజలందరి కొరకైనదని అధ్యక్షులు ఓక్స్ బోధిస్తున్నారు మరియు క్రీస్తు వద్దకు వచ్చి ఆయన వాగ్దానాలను విశ్వసించమని మనల్ని ప్రోత్సహిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నకాల సభ ఆదివారం మధ్యాహ్నకాల సభ2026, అక్టోబరు 3-4 తేదీలలో నిర్వహించబడిన, యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క 196వ అర్థవార్షిక సర్వసభ్య సమావేశపు ఆదివారం మధ్యాహ్నకాల సభ. డీటర్ ఎఫ్. ఉఖ్డార్ఫ్క్రీస్తు-కేంద్రీకృత ఐక్యతపరిశుద్ధుల సంఘంగా మనం క్రీస్తులో ఎలా ఏకం కాగలము అని అధ్యక్షులు ఉఖ్డార్ఫ్ బోధిస్తున్నారు. ఆండ్రియా మున్యోస్ స్పాన్నాస్దేవుడు మీకు తోడైయిన్నారుపదమూడవ విశ్వాస ప్రమాణం నుండి ప్రేరణ పొంది, ప్రభువు వారికి మార్గనిర్దేశం చేసి సహాయం చేస్తారని సాక్ష్యమిస్తూ, తమ ఆశయాల జాబితాను రూపొందించుకోవాలని సహోదరి స్పాన్నాస్ యువతులను ఆహ్వానిస్తున్నారు. మొయిసెస్ విల్లానుయేవా“దీని చేసి మీరు నన్ను శోధించండి”మనం దశమభాగ చట్టాన్ని పాటించినప్పుడు, ప్రభువు మనల్ని సూక్ష్మమైన కానీ ముఖ్యమైన రీతులలో ఆశీర్వదిస్తారని ఎల్డర్ విల్లానుయేవా బోధిస్తున్నారు. డేవిడ్ ఎ. బెడ్నార్పరిశుద్ధాత్మ వాగ్దానము చేత ముద్రవేయబడినదిమన పరలోక తండ్రి వద్దకు తిరిగి వెళ్లే మన ప్రయాణంలో విధులు మరియు నిబంధనల ప్రాముఖ్యత గురించి ఎల్డర్ బెడ్నార్ బోధిస్తున్నారు. థాబో లెబెతోవాయేసు క్రీస్తు లోకము యొక్క వెలుగు మరియు జీవమైయున్నారుమన జీవితాలలో రక్షకుని ప్రభావాన్ని మరింతగా అనుభూతి చెందగల మూడు మార్గాలను ఎల్డర్ లెబెతోవా బోధిస్తున్నారు. పౌల్ హెచ్. సింక్లేర్సహాయం చేయడంలో త్వరపడండి, తీర్పు తీర్చడంలో నెమ్మదిగా ఉండండిఎల్డర్ సింక్లేర్, ప్రజలను తీర్పుతీర్చే బదులు వారికి సహాయం చేసి, ఆశీర్వదించమని మనల్ని ప్రోత్సహించడానికి, యేసు మరియు బావి దగ్గర ఉన్న స్త్రీ కథను ఉపయోగిస్తున్నారు. గ్యారీ ఈ. స్టీవెన్సన్ఒకరిని సంతోషపరచుటకు కోరదగిన ఫలముఎల్డర్ స్టీవెన్సన్ యేసు క్రీస్తు సువార్త యొక్క మూడు ఫలాలను వివరిస్తూ, ఆ ఫలాలను ఇతరులతో పంచుకోవాలని పిల్లలను ప్రోత్సహిస్తున్నారు. గేబ్రియెల్ డబ్ల్యు. రీడ్మీరు బోధించడానికి తగినంత సమర్థులుప్రభువును ప్రేమించడం మరియు మనం బోధించే వారిని ప్రేమించడం సువార్త బోధనకు మూలమని సహోదరుడు రీడ్ సాక్ష్యమిస్తున్నారు. క్లార్క్ జి. గిల్బర్ట్ప్రేమతో సత్యాన్ని బోధించండిసత్యం గురించిన మన సాక్ష్యంలో స్థిరంగా నిలబడుతూనే, మన పొరుగువారి పట్ల ప్రేమను చూపించడం గురించి ఎల్డర్ గిల్బర్ట్ బోధిస్తున్నారు. డాలిన్ హెచ్. ఓక్స్ముగింపు వ్యాఖ్యలుఅధ్యక్షులు ఓక్స్ గారు రక్షకుని బోధనలపై దృష్టి పెట్టమని మనకు బోధిస్తూ, సభ్యసమావేశ సందేశాలను అధ్యయనం చేయమని మనల్ని ఆహ్వానిస్తూ, రాబోయే సాల్ట్ లేక్ దేవాలయ వేడుకకు ప్రపంచాన్ని స్వాగతిస్తున్నారు.