“అధ్యాయము 10: యేసు క్రీస్తు నందు విశ్వాసము పెంపొందించడానికి బోధించండి,” నా సువార్తను ప్రకటించండి: యేసు క్రీస్తు యొక్క సువార్తను పంచుకొనుటకు మార్గదర్శి (2023)
“అధ్యాయము 10,” నా సువార్తను ప్రకటించండి
అధ్యాయము 10
యేసు క్రీస్తు నందు విశ్వాసము పెంపొందించడానికి బోధించండి
దీనిని పరిగణించండి
-
నేను ఆత్మ ద్వారా ఎలా బోధించగలను?
-
నేను లేఖనాల నుండి ఎలా బోధించగలను?
-
బోధించేటప్పుడు నా సాక్ష్యాన్ని నేను ఎలా పంచుకోవాలి?
-
జనుల అవసరాలను తీర్చడానికి నా బోధనను నేను ఎలా ప్రణాళిక చేసుకోవచ్చు మరియు సర్దుబాటు చేసుకోవచ్చు?
-
నేను మంచి ప్రశ్నలు ఎలా అడగగలను మరియు మంచి శ్రోతగా ఎలా ఉండగలను?
-
జనులు తమ ప్రశ్నలకు సమాధానాలు కనుగొనడంలో మరియు మార్గదర్శకత్వాన్ని, బలాన్ని పొందడంలో నేను ఎలా సహాయపడగలను?
మిమ్మల్ని స్వీకరించినంత మందికి యేసు క్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన సువార్తను బోధించడానికి మీరు పిలువబడ్డారు. మీరు చేసే ప్రతిదానికీ బోధన కేంద్రంగా ఉంటుంది. మీరు సహాయం కోసం ప్రభువుపై ఆధారపడినప్పుడు, ఆయన ఇలా వాగ్దానం చేశారు:
“ఎవరైతే మిమ్ములను చేర్చుకొనునో, అక్కడ నేనును ఉందును, ఏలయనగా నేను మీ యెదుట వెళ్ళెదను. నేను మీ కుడివైపున, మీ ఎడమవైపున ఉందును, నా ఆత్మ మీ హృదయములందుండును, మిమ్ములను ఎత్తుకొనుటకు మీ చుట్టూ నా దేవదూతలు కావలియుందురు” (సిద్ధాంతము మరియు నిబంధనలు 84:88).
మీ బోధనా సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రార్థించండి, అధ్యయనం చేయండి మరియు సాధన చేయండి. ఈ అధ్యాయంలోనివి మరియు ఈ పుస్తకంలోని ఇతర అధ్యాయాలలోని సూత్రాలను అన్వయించుకోండి. మీరు ఇతరులను ఆశీర్వదించి, దేవుణ్ణి మహిమపరచగలిగేలా బోధనా బహుమానాన్ని హృదయపూర్వకంగా వెదకండి. మీరు శ్రద్ధగా ఆయనను వెదుకుతూ, ఆయన వాక్యాన్ని నేర్చుకుంటున్నప్పుడు శక్తి మరియు అధికారంతో బోధించడానికి ప్రభువు మీకు సహాయం చేస్తారు.
రక్షకుడు బోధించినట్లుగా బోధించడానికి ప్రయత్నించండి
తన భూలోక పరిచర్యలో, యేసు “బోధించుచు… ప్రకటించుచు… స్వస్థపరచుచు … సంచరించుచుండెను” (మత్తయి 4:23). ఆయన అనేక సందర్భాలలో—సమాజమందిరములలో, ఇళ్లలో మరియు రోడ్డు మీద బోధించారు. ఆయన పెద్ద సమావేశాలలో మరియు వ్యక్తిగత సంభాషణలలో బోధించారు. ఆయన యొక్క అత్యంత శక్తివంతమైన సంభాషణలు కొన్ని చాలా క్లుప్తంగా లేదా అసాధారణ సందర్భాలలో ఉండేవి. ఆయన తన చర్యల ద్వారా అలాగే తన మాటల ద్వారా బోధించారు.
రక్షకుడు ప్రతి వ్యక్తికి అతని లేదా ఆమె ప్రత్యేక అవసరాల ప్రకారం బోధించారు. ఉదాహరణకు, పక్షవాతానికి గురైన వ్యక్తికి సేవ చేస్తున్నప్పుడు, ఆయన అతని పాపాలను క్షమించి, అతన్ని స్వస్థపరిచారు (మార్కు 2:1–12 చూడండి). వ్యభిచారం చేసిన స్త్రీకి సేవ చేస్తున్నప్పుడు, ఆయన ఆమెను రక్షించారు మరియు ఆమెను ఇకపై పాపం చేయవద్దని ఆహ్వానించారు (యోహాను 8:2–11 చూడండి). నిత్యజీవాన్ని కోరుకునే ధనవంతుడితో మాట్లాడుతున్నప్పుడు, ఆ యువకుడు తనను అనుసరించమనే ఆయన ఆహ్వానాన్ని అంగీకరించడానికి నిరాకరించినప్పటికీ ఆయన “అతన్ని ప్రేమించారు” (మార్కు 10:21; 17–21 వచనాలు చూడండి).
రక్షకుడు ఎలా బోధించారో నేర్చుకోవడం ద్వారా మీరు మీ బోధనను మెరుగుపరచుకోవచ్చు. ఉదాహరణకు, ఆయన తండ్రిని మరియు ఆయన బోధించిన వారిని ప్రేమించారు. ఆయన ప్రార్థనాపూర్వకంగా ఉన్నారు. ఆయన లేఖనాల నుండి బోధించారు. ఆయన ఆధ్యాత్మికంగా సిద్ధమయ్యారు. ఆయన ప్రేరేపిత ప్రశ్నలు అడిగారు. జనులను విశ్వాసంతో వ్యవహరించమని ఆయన ఆహ్వానించారు. ఆయన సువార్త సూత్రాలను దైనందిన జీవితంతో పోల్చారు.
రక్షకుడు బోధించినట్లుగా బోధించడానికి ప్రయత్నించడం జీవితాంతం అనుసరించాల్సిన విషయం. మీరు ఆయనను అనుసరిస్తున్నప్పుడు అది మీకు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞగా వస్తుంది (2 నీఫై 28:30; ఈథర్ 12:41 చూడండి).
“నా వాక్యమును పొందుటకు ప్రయత్నించుము”
యేసు క్రీస్తు సువార్తను బోధించడానికి, మీరు దాని ప్రాథమిక సిద్ధాంతం మరియు సూత్రాలను తెలుసుకోవాలి. మీకు ఆధ్యాత్మిక జ్ఞానం మరియు సువార్త సత్యాల నిర్ధారణ కూడా అవసరం. ప్రభువు ఇలా చెప్పారు, “నా వాక్యమును ప్రకటించుటకు ప్రయత్నించవద్దు, కానీ మొదట నా వాక్యమును పొందుటకు ప్రయత్నించుము.”
ప్రభువు వాక్యమును “పొందడం” అంటే దానిని అధ్యయనం చేసి మీ హృదయంలో లోతుగా పాతుకుపోయేలా చేయడం. మీరు ఈ ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఆయనిలా వాగ్దానం చేశారు, “అప్పుడు నీ నాలుక సడలించబడును; అప్పుడు నీవు కోరిన యెడల, మనుష్యులను ఒప్పించుటకు దేవుని శక్తియగు నా ఆత్మను, నా వాక్యమును నీవు కలిగియుందువు” (సిద్ధాంతము మరియు నిబంధనలు 11:21).
“నిత్యజీవపు మాటలను ఎడతెగక మీ మనస్సులలో భద్రపరచుకొనుడి” (సిద్ధాంతము మరియు నిబంధనలు 84:85) అని కూడా ప్రభువు చెప్పారు. ప్రభువు మాటలను భద్రపరచుకోవడం వల్ల మీ జ్ఞానం పెరుగుతుంది మరియు మీ సాక్ష్యం బలపడుతుంది. సువార్తను బోధించాలనే మీ కోరిక మరియు సామర్థ్యం కూడా పెరుగుతుంది. (జేకబ్ 4:6–7; ఆల్మా 32:27–42; 36:26; 37:8–9 చూడండి.)
లేఖనాలను, సజీవ ప్రవక్తల మాటలను మరియు 3వ అధ్యాయంలోని పాఠాలను అధ్యయనం చేయడం ద్వారా ప్రార్థనాపూర్వకంగా ప్రభువు వాక్కును పొంది, దానిని భద్రపరచుకోండి.
ఆత్మచేత బోధించండి
యేసు క్రీస్తు యొక్క సువార్త “నమ్ము ప్రతివానికి రక్షణ కలుగజేయుటకు దేవుని శక్తియై యున్నది” (రోమా 1:16). ఆ కారణంగా, పునఃస్థాపించబడిన సువార్త యొక్క సందేశం దైవిక శక్తి చేత—పరిశుద్ధాత్మ శక్తి చేత బోధించబడాలి.
మీరు బోధనా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం ముఖ్యం. మీరు బోధించే సిద్ధాంతం మరియు సూత్రాలను మీరు నేర్చుకోవడం కూడా ముఖ్యం. అయితే, ఆధ్యాత్మిక సత్యాలను బోధించేటప్పుడు, మీరు ప్రధానంగా మీ స్వంత సామర్థ్యాలు మరియు జ్ఞానంపై ఆధారపడరు.
ఆధ్యాత్మిక సత్యాలు పరిశుద్ధాత్మ శక్తి చేత బోధించబడతాయి. ప్రభువు ఇలా అన్నారు, “విశ్వాస సహితమైన ప్రార్థన ద్వారా ఆత్మ మీకు అనుగ్రహించబడును; మీరు ఆత్మను పొందనియెడల, మీరు బోధించరాదు” (సిద్ధాంతము మరియు నిబంధనలు 42:14; సిద్ధాంతము మరియు నిబంధనలు 50:13–14, 17–22 కూడా చూడండి).
ఆత్మ చేత బోధించడం అంటే ఏమిటి
మీరు ఆత్మ చేత బోధించేటప్పుడు, మీ బోధనలో పరిశుద్ధాత్మ శక్తి ఉండాలని మీరు ప్రార్థిస్తారు. జనులు ఆత్మ ద్వారా సత్యాలను పొందాలని కూడా మీరు ప్రార్థిస్తారు. జనులు కొన్ని సత్యాల గురించి ఒప్పించబడవచ్చు, కానీ పరివర్తన చెందడానికి, వారు ఆత్మతో అనుభవాలను కలిగి ఉండాలి (సిద్ధాంతము మరియు నిబంధనలు 8:2–3 చూడండి).
ఆత్మ బోధించగల సాధనంగా ఉండడానికి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. బోధనలో పరిశుద్ధాత్మను మీ సహచరుడిగా భావించండి.
ఏమి చెప్పాలో తెలుసుకోవడానికి మీకు సహాయం చేయడానికి ఆత్మపై ఆధారపడండి. మీరు అధ్యయనం చేసిన సిద్ధాంతాన్ని ఆయన మీకు జ్ఞాపకం చేస్తారు. మీరు బోధించే వాటిని ఒక వ్యక్తి అవసరాలకు అనుగుణంగా ప్రణాళిక చేసి, సర్దుబాటు చేసుకోవడానికి ఆయన మీకు సహాయం చేస్తారు.
మీరు ఆత్మ ద్వారా బోధించినప్పుడు, ఆయన మీ సందేశాన్ని జనుల హృదయాలకు తీసుకువెళతారు. మీరు మీ సాక్ష్యాన్ని చెప్పినప్పుడు ఆయన మీ సందేశాన్ని ధృవీకరిస్తారు. మీరు మరియు ఆత్మ ద్వారా మీరు బోధించే వాటిని స్వీకరించేవారు క్షేమాభివృద్ధి చెందుతారు, ఒకరినొకరు అర్థం చేసుకుంటారు మరియు కలిసి ఆనందిస్తారు. (2 నీఫై 33:1; సిద్ధాంతము మరియు నిబంధనలు 50:13–22 చూడండి.)
“ఈ పనిలో ఆత్మ అనేది అత్యంత ముఖ్యమైన ఏకైక అంశం. ఆత్మ మీ పిలుపును ఘనపరచడంతో, మీరు సువార్తసేవా క్షేత్రంలో ప్రభువు కొరకు అద్భుతాలు చేయగలరు. ఆత్మ లేకుండా, మీకు ప్రతిభ మరియు సామర్థ్యం ఉన్నప్పటికీ మీరు ఎప్పటికీ విజయం సాధించలేరు” (Ezra Taft Benson, seminar for new mission presidents, June 25, 1986).
మీ పిలుపు యొక్క వాగ్దానం
మీరు “ఆత్మచేత అనగా సత్యమును బోధించుటకు పంపబడిన ఆదరణకర్త చేత నా సువార్తను ప్రకటించుటకే” (సిద్ధాంతము మరియు నిబంధనలు 50:14) పిలువబడ్డారు మరియు ప్రత్యేకించబడ్డారు. కొన్నిసార్లు మీరు భయపడవచ్చు లేదా అసమర్థులుగా భావించవచ్చు. బహుశా మీకు తగినంత తెలియదని లేదా మీకు తగినంత అనుభవం లేదని మీరు చింతించవచ్చు.
మీ గురించి పరిపూర్ణంగా తెలిసిన మీ పరలోక తండ్రి, యేసు క్రీస్తు యొక్క నిబద్ధత గల అనుచరుడిగా మీరు అందించగల దాని కోసం మిమ్మల్ని పిలిచారు. ఆయన మిమ్మల్ని విడిచిపెట్టరు. ఆత్మ మీ సామర్థ్యాలను పెంచుతారని మరియు స్వీకరించే వారికి సత్యాన్ని బోధిస్తారని నమ్మండి.
ఎల్డర్ నీల్ ఎల్. ఆండర్సన్ ఇలా అన్నారు: “నేను సువార్తసేవ యొక్క సవాలు గురించి ఆలోచించినప్పుడు, నేను చాలా అసమర్థుడిగా మరియు సిద్ధంగా లేనట్లుగా భావించాను. ‘పరలోక తండ్రీ, నాకు చాలా తక్కువ తెలిసినప్పుడు నేను సువార్తసేవ ఎలా చేయగలను?’ అని ప్రార్థించడం నాకు గుర్తుంది. నేను సంఘాన్ని నమ్మాను, కానీ నా ఆధ్యాత్మిక జ్ఞానం చాలా పరిమితంగా ఉందని నేను భావించాను. నేను ప్రార్థిస్తున్నప్పుడు, ఈ భావన కలిగింది: ‘నీకు అన్నీ తెలియదు, కానీ నీకు తగినంత తెలుసు!’ ఆ భరోసా నాకు సువార్తసేవా క్షేత్రంలో తదుపరి అడుగు వేయడానికి ధైర్యాన్ని ఇచ్చింది” (“You Know Enough,” Liahona, Nov. 2008, 13).
మీరు బోధించడం ప్రారంభించేటప్పుడు ఆత్మను ఆహ్వానించండి
జనులతో మొదటి కొన్ని క్షణాలు చాలా ముఖ్యమైనవి. నిజాయితీగా మరియు గౌరవంగా ఉండండి. నిజాయితీగా ఆసక్తిని మరియు ప్రేమను చూపించండి. వారి నమ్మకాన్ని సంపాదించడానికి ప్రయత్నించండి. జనులు మీతోపాటు ఆత్మను అనుభవించినప్పుడు అది నమ్మకాన్ని సంపాదించడానికి ఒక మార్గం.
వారి నేపథ్యాన్ని మరియు మీ సందర్శనల గురించి వారి అంచనాలను అర్థం చేసుకోవడానికి మీకు సహాయపడే కొన్ని సాధారణ ప్రశ్నలు అడగండి. జాగ్రత్తగా వినండి.
మీరు ప్రారంభించడానికి ముందు, హాజరైన వారందరినీ పాఠంలో చేరమని ఆహ్వానించండి. ప్రభువు యొక్క ఆత్మను అనుభూతి చెందేలా పరధ్యానాలను తొలగించమని వారిని ప్రోత్సహించండి.
ప్రతి పాఠాన్ని ప్రార్థనతో ప్రారంభించి ముగించాలని మీరు కోరుకుంటున్నారని వివరించండి. ప్రారంభ ప్రార్థన చేయడానికి ముందుకు రండి. మీరు బోధిస్తున్న వ్యక్తులను వారి జీవితంలోని ప్రతి అంశంలోనూ దేవుడు ఆశీర్వదించాలని సరళంగా మరియు హృదయపూర్వకంగా ప్రార్థించండి. మీరు బోధించే దాని యొక్క సత్యాన్ని వారు అనుభూతి చెందాలని ప్రార్థించండి. “నీతిమంతుని [వ్యక్తి] విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదైయుండును” (యాకోబు 5:16) అని గుర్తుంచుకోండి.
పరిశుద్ధాత్మ యొక్క పరివర్తన శక్తిపై విశ్వాసం కలిగి ఉండండి. ఆత్మచేత నడిపించబడినట్లుగా, మీరు బోధించడం ప్రారంభించినప్పుడు ఈ క్రింది ఆలోచనలను వ్యక్తపరచవచ్చు:
-
దేవుడు మన ప్రియమైన పరలోక తండ్రి. మనందరము సహోదర, సహోదరీలము. మనం ఆనందాన్ని అనుభవించాలని ఆయన కోరుకుంటున్నారు.
-
మనందరికీ సవాళ్లు మరియు శ్రమలు ఉంటాయి. మీరు ఏమి ఎదుర్కొంటున్నా, యేసు క్రీస్తు మరియు ఆయన బోధనలు మీకు సహాయం చేయగలవు. మీరు శాంతి, నిరీక్షణ, స్వస్థత మరియు ఆనందాన్ని కనుగొనడంలో ఆయన మీకు సహాయం చేయగలరు. జీవితపు సవాళ్లపట్ల ఎక్కువ బలాన్ని కలిగియుండడానికి యేసు మీకు సహాయం చేయగలరు.
-
మనమందరం తప్పులు చేస్తాము, అవి అపరాధ భావన, అవమానం మరియు విచారం కలిగించవచ్చు. మనం పశ్చాత్తాపపడి దేవుని క్షమాపణ కోరినప్పుడే ఈ భావాలు తొలగిపోతాయి. యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తం ద్వారా మాత్రమే మనం మన పాపాల నుండి పూర్తిగా స్వస్థత పొందగలము.
-
మా సందేశం యొక్క సత్యాన్ని మీరు నేర్చుకోగలిగేలా మేము మార్గదర్శకులుగా ఉంటాము. చదవడం, ప్రార్థించడం మరియు సంఘానికి హాజరు కావడం వంటి కొన్ని పనులు చేయమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తాము. ఈ ఆహ్వానాలపై చర్య తీసుకోవడానికి మరియు మీరు పొందగల ఆశీర్వాదాలను వివరించడానికి సహాయపడడమే మా పాత్ర. దయచేసి ప్రశ్నలు అడగండి.
-
మాకు తెలిసిన వాటిని పంచుకోవడానికి దేవుని ప్రవక్త చేత మేము పిలువబడ్డాము. మా సందేశం నిజమని మాకు తెలుసు.
-
దేవునితో నిబంధనలు లేదా ప్రత్యేక వాగ్దానాలు ఎలా చేయాలో మేము మీకు నేర్పుతాము. ఈ నిబంధనలు మిమ్మల్ని దేవునితో అనుసంధానిస్తాయి మరియు ఆయన నుండి ఆనందము, బలము మరియు ప్రత్యేక వాగ్దానాలను పొందేందుకు మిమ్మల్ని అనుమతిస్తాయి.
-
మీ జీవితంలో మార్పులు ఎలా చేయాలో మరియు యేసు క్రీస్తును, ఆయన బోధనలను ఎలా అనుసరించాలో మీరు నేర్చుకుంటారు. యేసు క్రీస్తు యొక్క ఒక ముఖ్యమైన బోధన మరియు మనం చేసే మొదటి నిబంధన ఏదనగా, ఆయన మాదిరిని అనుసరించడం మరియు సరైన అధికారం ద్వారా బాప్తిస్మం తీసుకోవడం (యోహాను 3:5; సిద్ధాంతము మరియు నిబంధనలు 22 చూడండి).
ఒక పాఠం బోధించే ముందు, మీరు ఏమి బోధిస్తారనే దాని గురించి సరళమైన అవలోకనం ఇవ్వండి. అది వారికి ఎలా వర్తిస్తుందో జనులు అర్థం చేసుకోవడానికి సహాయపడండి. ఉదాహరణకు, మీరు ఇలా అనవచ్చు, “యేసు క్రీస్తు నేడు భూమిపై తన సంఘాన్ని స్థాపించారు మరియు మనకు మార్గనిర్దేశం చేయడానికి సజీవ ప్రవక్తలను పిలిచారు అనే సందేశాన్ని పంచుకోవడానికి మేము ఇక్కడ ఉన్నాము.” లేదా మీరు ఇలా అనవచ్చు, “దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు మరియు మీ సంతోషం కోసం ఒక ప్రణాళికను కలిగియున్నారు అని మీరు తెలుసుకోవడంలో సహాయపడేందుకు మేము ఇక్కడ ఉన్నాము.”
యేసు క్రీస్తు యొక్క సువార్తను అంగీకరించి, దాని ప్రకారం జీవించినప్పుడు జనులందరూ ప్రయోజనం పొందుతారు. మీరు కనుగొనే జనులను విలువైన ఆత్మీయ సిద్ధపాటుతో పరలోక తండ్రి దీవించియుండవచ్చు (ఆల్మా 16:16–17 చూడండి).
మొదటి సమావేశంలోనే ఆత్మను ఆహ్వానించడం మరియు సత్యాన్ని పంచుకోవడం జనులు మిమ్మల్ని ప్రభువు యొక్క సేవకులుగా గుర్తించడంలో సహాయపడుతుంది.
వ్యక్తిగత లేదా సహచర అధ్యయనము
పాఠాన్ని ప్రారంభించడానికి వివిధ మార్గాలను అభ్యసించడానికి ఈ విభాగంలోని సూచనలను ఉపయోగించండి.
లేఖనాలను ఉపయోగించండి
యేసు క్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన సువార్తను బోధించడానికి సంఘము యొక్క ప్రామాణిక గ్రంథాలు మీ ప్రాథమిక వనరులు. మీ బోధనకు ఆధారంగా లేఖనాలను ఉపయోగించడం ఎందుకు చాలా ముఖ్యం అనేదానికి అనేక కారణాలు ఉన్నాయి. ఉదాహరణకు:
-
లేఖనాలు మీ బోధనలోకి పరిశుద్ధాత్మను ఆహ్వానిస్తాయి (లూకా 24:13–32 చూడండి).
-
లేఖనాలు అన్నిటికన్నా ఎక్కువగా జనుల మనస్సులపై శక్తివంతమైన ప్రభావాన్ని చూపుతాయి (ఆల్మా 31:5 చూడండి).
-
లేఖనాలు ఆత్మ యొక్క గొప్ప ప్రశ్నలను ప్రస్తావిస్తాయి (5వ అధ్యాయం చూడండి; 2 నీఫై 32:3; యాకోబు 2:8 కూడా చూడండి).
-
లేఖనాలు మీ బోధనకు అధికారాన్ని మరియు ప్రామాణికతను ఇస్తాయి.
-
ప్రభువు మరియు ఆయన ప్రవక్తలు అలా చేయాలని చెప్పారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 42:12, 56–58; 71:1 చూడండి).
మీ బోధనలో లేఖనాలను ఉపయోగించడం ద్వారా, ఇతరులు స్వయంగా లేఖనాలను అధ్యయనం చేయడం ప్రారంభించడానికి మీరు సహాయపడవచ్చు. లేఖనాల పట్ల మీకున్న ప్రేమ స్పష్టంగా ఉన్నందున, వారు అధ్యయనం చేయడానికి ప్రోత్సహించబడతారు. లేఖనాలను అధ్యయనం చేయడం వారు సువార్తను నేర్చుకోవడానికి మరియు దేవుని ప్రేమను అనుభూతి చెందడానికి ఎలా సహాయపడుతుందో చూపించండి. లేఖనాలు వారి ప్రశ్నలకు సమాధానాలు కనుగొనడంలో మరియు మార్గదర్శకత్వాన్ని, బలాన్ని పొందడంలో వారికి ఎలా సహాయపడతాయనే దాని గురించి ఉదాహరణలు ఇవ్వండి.
లేఖనాలను అధ్యయనం చేయడానికి మిమ్మల్ని మీరు అంకితం చేసుకోండి, తద్వారా మీరు వాటి నుండి సమర్థవంతంగా బోధించగలరు (2వ అధ్యాయం చూడండి). మీరు ప్రతిరోజూ వ్యక్తిగతంగా మరియు మీ సహచరుడితో కలిసి లేఖనాలను అధ్యయనం చేస్తున్నప్పుడు వాటి నుండి బోధించే మీ సామర్థ్యం మెరుగుపడుతుంది.
లేఖనాలను, ముఖ్యంగా మోర్మన్ గ్రంథాన్ని అధ్యయనం చేయడం ద్వారా జనులు యేసు క్రీస్తుపై విశ్వాసాన్ని పెంపొందించుకోవడంలో సహాయపడండి. క్రింది సూచనలు సహాయపడవచ్చు:
లేఖనాన్ని పరిచయం చేయండి
ఈ గద్యభాగం యొక్క నేపథ్యాన్ని క్లుప్తంగా వివరించండి. ఒక లేఖనాన్ని పరిచయం చేయడానికి కొన్ని మార్గాలను ఈ క్రింది ఉదాహరణలు చూపుతాయి:
-
“జోసెఫ్ స్మిత్ చరిత్రలో, జోసెఫ్ ప్రార్థన చేయడానికి వనములోకి వెళ్ళినప్పుడు ఏమి జరిగిందో తన స్వంత మాటలలో మనకు చెబుతాడు. ‘నేను ఒక కాంతి స్తంభాన్ని చూశాను…’ అని అతను చెప్పాడు.”
-
“ఈ గద్యభాగంలో, దేవుని వాక్యంపై విశ్వాసం ఉంచమని ప్రవక్త ఆల్మా పేదవారికి బోధిస్తున్నాడు. అతడు దేవుని వాక్యాన్ని మన హృదయాలలో నాటగల విత్తనంతో పోల్చాడు. మీరు … వచనం చదవడం ప్రారంభిస్తారా?”
గద్యభాగాన్ని చదవండి
వచనాలను బిగ్గరగా చదవండి లేదా మీరు బోధిస్తున్న వ్యక్తిని బిగ్గరగా చదవమని అడగండి. చదవడానికి ఇబ్బంది పడే వారి పట్ల సున్నితంగా ఉండండి. ఒక గద్యభాగాన్ని అర్థం చేసుకోవడం వారికి కష్టంగా ఉంటే, వారితోపాటు చదివి అవసరమైన విధంగా వివరించండి. కష్టమైన పదాలు లేదా వాక్యభాగాలను నిర్వచించండి. లేదా చదవడానికి వారికి సరళమైన గద్యభాగాన్ని ఇవ్వండి. గద్యభాగంలో నిర్దిష్ట అంశాలను వెదకమని వారిని ఆహ్వానించండి.
లేఖనాలను అన్వయించండి
“అవి మాకు ప్రయోజనకరముగా ఉండునట్లు మరియు మేము నేర్చుకొనునట్లు లేఖనములన్నిటినీ మాతో పోల్చితిని” అని నీఫై చెప్పాడు (1 నీఫై 19:23). “పోల్చడం” అంటే లేఖనాలను మీ జీవితానికి అన్వయించడం.
కథలు మరియు సూత్రాలు వారితో వ్యక్తిగతంగా ఎలా సంబంధం కలిగియున్నాయో చూపడం ద్వారా మీరు బోధించే వారితో లేఖనాలను పోల్చండి. ఉదాహరణకు:
-
“మీలాగే, ఆల్మా యొక్క జనులు కూడా వారు భరించగలిగే దానికంటే ఎక్కువ భారాలను కలిగి ఉన్నారు. కానీ వారు విశ్వాసం చూపిస్తూ ప్రార్థించినప్పుడు, వారు సవాళ్లను భరించగలిగేలా దేవుడు వారిని బలపరిచారు. తర్వాత ఆయన వారిని వారి శ్రమల నుండి విడిపించారు. ఆయన ఈ వ్యక్తులకు చేసినట్లుగానే, మీరు … మీ శ్రమలలో దేవుడు మీకు కూడా సహాయం చేస్తారని నాకు తెలుసు” (మోషైయ 24 చూడండి.)
-
“మోర్మన్ జలాల వద్ద జనులకు ఆల్మా ఇచ్చిన సూచన నేడు మనకు వర్తిస్తుంది. యోహాను, … కి నీవు సిద్ధంగా ఉన్నావా?” (మోషైయ 18 చూడండి.)
లేఖనాలను స్వయంగా ఎలా “పోల్చుకోవాలో” జనులకు నేర్పండి. వ్యక్తిగత అన్వయాలను కనుగొనడం వారు దేవుని వాక్యం యొక్క శక్తిని అన్వయించుకోవడానికి మరియు అనుభవించడానికి సహాయపడుతుంది.
స్వంతంగా చదవడానికి జనులను ఆహ్వానించండి మరియు సహాయం చేయండి
మీరు బోధించే వ్యక్తులు సత్యం యొక్క సాక్ష్యాన్ని పొందడానికి లేఖనాలను, ముఖ్యంగా మోర్మన్ గ్రంథాన్ని చదవాలి. మీ బోధనలో లేఖనాలను సమర్థవంతంగా ఉపయోగించడం ద్వారా, జనులు స్వయంగా లేఖనాలను అధ్యయనం చేయడం ప్రారంభించడానికి మీరు సహాయపడవచ్చు.
ప్రతి సందర్శన తర్వాత, వారు చదవడానికి నిర్దిష్ట అధ్యాయాలు లేదా వచనాలను సూచించండి. వారు చదువుతున్నప్పుడు పరిగణించవలసిన ప్రశ్నలను వారికి సూచించండి. ప్రతిరోజూ స్వయంగా మరియు వారి కుటుంబాలతో కలిసి లేఖనాలను అధ్యయనం చేయమని వారిని ప్రోత్సహించండి. పాఠాల మధ్య వారితో కలిసి చదవమని మీరు సభ్యులను కూడా అడగవచ్చు.
తదుపరి పాఠాన్ని ప్రారంభించే ముందు, ఏమి చదవమని మీరు జనులను ఆహ్వానించారో చర్చించడం ద్వారా చర్య తీసుకోండి. అవసరమైన విధంగా, ఈ లేఖనాలను అర్థం చేసుకోవడానికి మరియు “పోల్చడానికి” వారికి సహాయపడండి. వారి ఆలోచనలను మరియు ప్రశ్నలను నమోదు చేయమని వారిని ప్రోత్సహించండి.
లేఖనాలను—ముఖ్యంగా మోర్మన్ గ్రంథాన్ని—చదవడానికి, అర్థం చేసుకోవడానికి మరియు అన్వయించడానికి మీరు జనులకు సహాయం చేసినప్పుడు, వారు దేవుని వాక్యంతో ఆధ్యాత్మిక అనుభవాలను పొందుతారు. వారు స్వయంగా చదివి, లేఖనాలను వారి జీవితాల్లో ఒక ముఖ్యమైన భాగంగా చేసుకునే అవకాశం ఉంటుంది.
లేఖనాలకు ప్రవేశం పొందడంలో జనులకు సహాయం చేయండి
లేఖనాలు మరియు సజీవ ప్రవక్తల మాటలు గతంలో కంటే ఎక్కువ మార్గాల్లో మరియు మరిన్ని భాషలలో అందుబాటులో ఉన్నాయి. ఏ ముద్రణ మరియు డిజిటల్ ఎంపికలు మీరు బోధించే వ్యక్తులకు అందుబాటులో ఉన్నాయో తెలుసుకోండి. వారి అవసరాలు మరియు ప్రాధాన్యతలకు సరిపోయే విధంగా లేఖనాలకు ప్రవేశం పొందడంలో జనులకు సహాయం చేయండి. ఈ క్రింది వాటిని పరిగణించండి:
-
జనులు లేఖనాలను ఏ భాషలో చదవాలనుకుంటున్నారో లేదా వినాలనుకుంటున్నారో అడగండి.
-
చదవడానికి ఇబ్బంది పడేవారు లేదా చదివిన వాటిని అర్థం చేసుకోవడానికి ఇబ్బంది పడేవారు కలిసి బిగ్గరగా చదవడం లేదా ఆడియో రికార్డింగులను వినడం ద్వారా ప్రయోజనం పొందవచ్చు. ఇవి ఉచిత సంఘ యాప్‌లు మరియు వెబ్‌సైట్‌ల ద్వారా అందుబాటులో ఉన్నాయి.
-
ఒక వ్యక్తి వద్ద డిజిటల్ పరికరం ఉంటే, అతను లేదా ఆమె లేఖనాలకు, ముఖ్యంగా మోర్మన్ గ్రంథానికి ప్రవేశం పొందడంలో సహాయపడండి. మోర్మన్ గ్రంథ యాప్ మరియు సువార్త గ్రంథాలయము ఉచితం మరియు పంచుకోవడం సులభం.
-
టెక్స్ట్, చాట్ లేదా ఇమెయిల్ ఉపయోగిస్తుంటే, లేఖనాల లింక్‌లు లేదా చిత్రాలను పంపండి. వీడియో చాట్‌లో బోధించేటప్పుడు, మీరు కలిసి వచనాలను చదవగలిగేలా మీ స్క్రీన్‌ను పంచుకోవడాన్ని పరిగణించండి.
-
సజీవ ప్రవక్తల మాటలకు ప్రవేశం పొందడానికి జనులకు సహాయం చేయండి.
వ్యక్తిగత లేదా సహచర అధ్యయనము
మీరు మరియు మీ సహచరుడు మీ ఫోనులో మోర్మన్ గ్రంథ యాప్ మరియు సువార్త గ్రంథాలయముతో సహా నవీకరించబడిన లేఖన వనరులను కలిగి ఉన్నారని నిర్ధారించుకోండి.
క్రింది లేఖన గద్యభాగాలలో ఒకదానిని ఎంచుకోండి: మోర్మన్ గ్రంథము యొక్క శీర్షిక పేజీ; 3 నీఫై 11; మొరోనై 10:3–8; యోహాను 17:3; రోమా 8:16–17; 1 కొరింథీయులకు 15:29; యాకోబు 1:5; 1 పేతురు 3:19–20; ఆమోసు 3:7.
మీరు ఎలా చేస్తారో నిర్ణయించుకోండి:
-
గద్యభాగాన్ని పరిచయం చేయండి.
-
నేపథ్యం మరియు సందర్భాన్ని అందించండి.
-
గద్యభాగాన్ని చదివి దాని అర్థాన్ని వివరించండి.
-
కష్టమైన పదాలను వివరించండి.
-
మీరు బోధించే వారు దీనిని వారి జీవితాల్లో అన్వయించడానికి సహాయం చేయండి.
లేఖన అధ్యయనము
లేఖనాల నుండి బోధించడం ఎందుకు ముఖ్యము?
-
2 తిమోతి 3:15–17
మీ సాక్ష్యాన్ని పంచుకోండి
సాక్ష్యం అంటే పరిశుద్ధాత్మ ఇచ్చే ఆధ్యాత్మిక రుజువు. మీ సాక్ష్యాన్ని పంచుకోవడం అంటే సువార్త సత్యం గురించి జ్ఞానం లేదా నమ్మకం యొక్క సరళమైన, ప్రత్యక్ష ప్రకటన ఇవ్వడం. మీ సాక్ష్యాన్ని పంచుకోవడం అనేది మీరు లేఖనాల నుండి బోధించిన సత్యాలకు మీ వ్యక్తిగత సాక్ష్యాన్ని జోడిస్తుంది.
మీ సాక్ష్యాన్ని పంచుకోవడం అనేది ఆత్మను ఆహ్వానించడానికి మరియు ఇతరులు ఆయన ప్రభావాన్ని అనుభూతి చెందడానికి సహాయపడేందుకు ఒక శక్తివంతమైన మార్గం. పరిశుద్ధాత్మ యొక్క లక్ష్యాలలో ఒకటి పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు గురించి సాక్ష్యం చెప్పడం. మీరు సాక్ష్యం ఇస్తున్నప్పుడు ఆయన తరచుగా మీతో సహవాసంలో దీనిని నెరవేరుస్తారు.
శక్తివంతమైన సాక్ష్యం వాగ్ధాటిపై లేదా మీ స్వర పరిమాణంపై ఆధారపడి ఉండదు—కానీ మీ హృదయం యొక్క దృఢ నిశ్చయం మరియు నిజాయితీపై ఆధారపడి ఉంటుంది. మీ సాక్ష్యాన్ని తొందరపాటుతో లేదా నాటకీయంగా చూపించకుండా జాగ్రత్త వహించండి. మీరు బోధించినది నిజమని పరిశుద్ధాత్మ వారికి సాక్ష్యమివ్వడాన్ని జనులు అనుభవించే అవకాశం ఇవ్వండి.
మీ సాక్ష్యం, “యేసు క్రీస్తు మన రక్షకుడు మరియు విమోచకుడు” లేదా “మోర్మన్ గ్రంథం సత్యమని నేను స్వయంగా నేర్చుకున్నాను” లాగా సరళంగా ఉండవచ్చు. మీరు ఈ సాక్ష్యాన్ని ఎలా పొందారనే దాని గురించి సంక్షిప్త అనుభవాన్ని కూడా మీరు పంచుకోవచ్చు.
మీరు బోధించేటప్పుడు, చివరిలో మాత్రమే కాకుండా, మీరు ప్రేరేపించబడినట్లుగా మీ సాక్ష్యాన్ని పంచుకోండి. మీ సహచరుడు బోధించేటప్పుడు, అతను లేదా ఆమె బోధించిన దానికి రెండవ సాక్ష్యాన్ని అందించడానికి మీ సాక్ష్యాన్ని పంచుకోండి.
మీరు బోధిస్తున్న సూత్రాన్ని అతను లేదా ఆమె పాటిస్తే అది వారి జీవితాన్ని ఆశీర్వదిస్తుందని మీ సాక్ష్యాన్ని పంచుకోండి. ఆ సూత్రాన్ని జీవించడం మీ జీవితాన్ని ఎలా ఆశీర్వదించిందో చెప్పండి. మీ నిజాయితీగల సాక్ష్యం పరిశుద్ధాత్మ సత్యాన్ని ధృవీకరిస్తారని జనులు భావించే వాతావరణాన్ని సృష్టించడానికి సహాయపడుతుంది.
వ్యక్తిగత అధ్యయనము
ఈ క్రింది లేఖన భాగాలు సాక్ష్యమిచ్చేందుకు ఉదాహరణలు. మీరు ప్రతీ లేఖనాన్ని చదువుతున్నప్పుడు ప్రశ్నలను పరిగణించండి. మీ జవాబులను మీ అధ్యయన పుస్తకంలో రాయండి.
-
ఈ వచనాలలో, యేసు మరియు ఆయన అపొస్తలులు, ప్రవక్తలు దేనికి సాక్ష్యమిస్తున్నారు?
-
వారు చెప్పేది సత్యమని వారు ఒప్పించబడ్డారని మీరు ఎలా చెప్పగలరు?
-
“అది నిజమని నాకు తెలుసు” అని మీరు చెప్పినప్పుడు, మీ ఉద్దేశ్యం ఏమిటి? మీ నమ్మకాలను వ్యక్తపరచడానికి మీరు ఏ ఇతర పదాలను ఉపయోగించవచ్చు?
-
యోహాను 3:3–11
-
అపొస్తలుల కార్యములు 2:14–38; 10:34–44
లేఖన అధ్యయనము
సాక్ష్యం చెప్పడం యొక్క సూత్రాలు మరియు వాగ్దానాల గురించి ఈ క్రింది లేఖనాలు ఏమి బోధిస్తాయి?
-
యోహాను 15:26
అవసరాలను తీర్చడానికి మీ బోధనను ప్రణాళిక చేసి సర్దుబాటు చేసుకోండి
మీరు బోధించే ప్రతీ వ్యక్తి ప్రత్యేకమైనవాడు. అతని లేదా ఆమె ఆధ్యాత్మిక ఆసక్తులు, అవసరాలు మరియు ఆందోళనలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ప్రశ్నలు అడగండి మరియు జాగ్రత్తగా వినండి. మీరు ఆ వ్యక్తి అవసరాలను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయినా, పరలోక తండ్రి అర్థం చేసుకుంటారని గుర్తుంచుకోండి. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మిమ్మల్ని నడిపిస్తారు.
పాఠాల క్రమాన్ని ఆత్మ మార్గనిర్దేశం చేయనివ్వండి
మీరు పాఠాలు బోధించే క్రమాన్ని ఆత్మ మార్గనిర్దేశం చేయనివ్వండి. మీరు బోధించే వారి అవసరాలు, ప్రశ్నలు మరియు పరిస్థితులకు ఉత్తమంగా సరిపోయే క్రమంలో పాఠాలను బోధించడానికి మీకు అనుమతి ఉంది.
అప్పుడప్పుడు మీరు ఒక వ్యక్తి అవసరాలు మరియు ఆసక్తులకు తగినట్లుగా వివిధ పాఠాల నుండి సూత్రాలను మిళితం చేయవచ్చు. క్రింది మూడు ఉదాహరణలను చూడండి.
యుకీ మిమ్మల్ని ఆన్‌లైన్‌లో కనుగొంది మరియు సంఘంలోని తన స్నేహితులు ఎందుకు ధూమపానం చేయరు లేదా మద్యం సేవించరని అడుగుతోంది. 3వ అధ్యాయంలోని క్రింది విభాగాలను ఉపయోగించడం ద్వారా మీరు ఆమెకు ఆజ్ఞల యొక్క ఆశీర్వాదాల గురించి బోధించవచ్చు:
శామ్యుయెల్ తాను ఎక్కడికీ చెందినవాడిని కాదని భావిస్తున్నాడు. 3వ అధ్యాయంలోని ఈ క్రింది విభాగాలను ఉపయోగించడం ద్వారా మీరు అతని గుర్తింపు మరియు దేవుని కుటుంబంలో అతని స్థానం గురించి అతనికి బోధించవచ్చు:
తత్యానా అనేక మతాలను అధ్యయనం చేసింది మరియు సంఘాన్ని విభిన్నంగా చేసేది ఏమిటో తెలుసుకోవాలనుకుంటోంది. 3వ అధ్యాయంలోని ఈ క్రింది విభాగాలను ఉపయోగించి మీరు ఆమెకు యేసు క్రీస్తు సువార్త యొక్క పునఃస్థాపన గురించి బోధించవచ్చు:
పరలోక తండ్రి తన పిల్లలను ఎరుగుదురు, కాబట్టి మీరు బోధించడానికి సిద్ధమవుతున్నప్పుడు ఈ నిర్ణయాలు తీసుకోవడానికి ప్రేరణ పొందండి. మీరు ఏమి బోధించాలని నిర్ణయించుకునేటప్పుడు వివేచన అనే బహుమతి కోసం ప్రార్థించండి. మీకు కలిగే ఆలోచనలు మరియు భావాలపట్ల శ్రద్ధ వహించండి.
జనులు తాము నేర్చుకుంటున్న వాటిని అన్వయించుకోవడానికి సమయం ఇవ్వండి
మీరు బోధించేటప్పుడు, జనులు తాము నేర్చుకుంటున్న వాటిని అన్వయించుకోవడానికి సమయం ఇవ్వండి (3 నీఫై 17:2–3 చూడండి). వారి వాగ్దానాలను నిలబెట్టుకోవడంలో వారికి మద్దతు ఇవ్వడానికి తగిన మార్గాల కోసం చూడండి. ప్రార్థించడం, చదవడం మరియు సంఘానికి హాజరు కావడం వంటి విశ్వాసపు పునాదిని నిర్మించే చర్యలలో వారికి సహాయం చేయడంపై దృష్టి పెట్టండి. ఇది వారు అదనపు వాగ్దానాలను నిలబెట్టుకోవడానికి వీలు కల్పిస్తుంది.
మీరు ప్రణాళిక వేసుకుని బోధించేటప్పుడు, మీరు ఎంతవరకు కొత్త సమాచారాన్ని పంచుకుంటారనే దానిపట్ల సున్నితంగా ఉండండి. మీ బోధన యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటంటే, పశ్చాత్తాపానికి దారితీసేలా ఒక వ్యక్తి యేసు క్రీస్తుపై విశ్వాసాన్ని పెంచుకోవడంలో సహాయపడడం. మీరు ఎంత సమాచారాన్ని అందించగలరో చూడడం మీ లక్ష్యం కాదు.
వ్యక్తికి తగిన వేగంతో బోధించండి. ప్రశ్నలు అడగండి మరియు జాగ్రత్తగా వినండి, తద్వారా అతను లేదా ఆమె మీరు బోధిస్తున్న వాటిని ఎంత బాగా నేర్చుకుంటున్నారో మరియు అన్వయిస్తున్నారో మీరు అర్థం చేసుకుంటారు.
మీరు బోధించే సత్యాలు, పరిశుద్ధాత్మ శక్తితో కలిసి, జనులు క్రీస్తుపై వారి విశ్వాసాన్ని పెంపొందించే విధంగా వారి కర్తృత్వాన్ని ఉపయోగించుకునేలా ప్రభావితం చేస్తాయి. జనులు తాము నేర్చుకున్న వాటిని అన్వయించడం ద్వారా ప్రభువుపై విశ్వాసం ఉంచినప్పుడు, వారు ఆత్మ ద్వారా సువార్త సత్యమని తెలుసుకుంటారు.
వివిధ రకాల బోధనా అవకాశాలను ఉపయోగించండి
బోధనా అవకాశాలు అనేక రూపాలను తీసుకుంటాయి, ఉదాహరణకు వ్యక్తిగత సందర్శనలు, వీడియో చాట్‌లు, ఫోన్ కాల్‌లు, టెక్స్ట్ సందేశాలు మరియు సామాజిక మాధ్యమం.
జనుల సమయాన్ని గౌరవించండి
మీ బోధనను సరళంగా మరియు క్లుప్తంగా ఉంచండి. మీరు వారి సమయాన్ని మరియు అభ్యర్థనలను గౌరవించినప్పుడు జనులు మిమ్మల్ని కలిసే అవకాశం ఉంది. సందర్శన కొరకు వారికి ఎంత సమయం ఉందో అడగండి. ఏ సంభాషణనైనా అంగీకరించిన సమయంలో ప్రారంభించండి మరియు ముగించండి, అది స్వయంగా బోధించినా లేదా ఆన్‌లైన్‌లో బోధించినా సరే. కొన్ని ప్రదేశాలలో, ఫోన్ కాల్స్ లేదా వీడియో చాట్‌లు ఖరీదైనవి కావచ్చని గుర్తుంచుకోండి.
ఒక పాఠంలోని సూత్రాలను బోధించడానికి మీకు సాధారణంగా అనేక సమావేశాలు అవసరం. సాధారణంగా, బోధనా సందర్శన 30 నిమిషాల కంటే ఎక్కువ ఉండకూడదు మరియు తక్కువలో తక్కువ మీరు ఒక వ్యక్తికి 5 నిమిషాల వ్యవధిలో బోధించవచ్చు. జనుల సమయానికి అనుగుణంగా మీ బోధనను సర్దుబాటు చేసుకోండి.
సాంకేతికతను తెలివిగా ఉపయోగించండి
సాంకేతికతను ఉపయోగించి జనులకు బోధించడానికి మీకు అనేక అవకాశాలు ఉన్నాయి. కొంతమంది ఎలక్ట్రానిక్ మార్గాల ద్వారా సంభాషించడంలో సౌలభ్యాన్ని లేదా గోప్యతను ఇష్టపడతారు. మీరు వ్యక్తిగతంగా సందర్శించే వ్యక్తులు కూడా సాంకేతికత ద్వారా అదనపు మద్దతు నుండి ప్రయోజనం పొందవచ్చు. సంభాషించడానికి అందుబాటులో ఉన్న వనరుల గురించి చర్చించండి. తర్వాత తదుపరి చర్య తీసుకోండి మరియు జతచేరి ఉండండి. ప్రతీ వ్యక్తి యొక్క ప్రాధాన్యతలు మీ సంభాషణలకు మార్గనిర్దేశం చేయనివ్వండి.
తీరికలేని వారికి లేదా దూరంగా నివసించే వ్యక్తులకు బోధించడానికి వీడియో కాల్స్ వంటి సాంకేతికత ప్రత్యేకంగా సహాయపడుతుంది. కొన్నిసార్లు సభ్యులు సాంకేతికత ద్వారా పాఠంలో పాల్గొనడం సులభం అవుతుంది.
చిన్నవయస్సున్న అభ్యాసకులకు సహాయం చేయండి
రక్షకుని పరిచర్య సమయంలో, ఆయన తన శిష్యులతో ఇలా అన్నారు, “చిన్న పిల్లలను నా యొద్దకు రానియ్యుడి, వారిని ఆటంకపరచవద్దు; దేవుని రాజ్యము ఈలాంటి వారిదే” (మార్కు 10:14). మీరు పిల్లలకు బోధించేటప్పుడు, వారి అవసరాలకు తగినట్లుగా మీ విధానాన్ని మరియు సందేశాన్ని సర్దుబాటు చేసుకోండి. వారికి తెలిసిన విషయాలను చర్చించడం ద్వారా వారు సువార్తను నేర్చుకోవడంలో సహాయపడండి. మీరు బోధించేదానిని వారు అర్థం చేసుకున్నారని నిర్ధారించుకోండి.
లేఖన అధ్యయనము
సిద్ధాంతము మరియు నిబంధనలు 84:85 చదవండి. “ప్రతి మనుష్యునికి సరిపడే ఆ భాగము” ఇవ్వబడడం అంటే ఏమిటి? మీ బోధనలో దీనిని మీరు ఎలా అన్వయించగలరు?
ఏమి చెప్పాలో తెలుసుకోవడం గురించి విశ్వాసులైన సువార్తికులకు ప్రభువు ఏమి వాగ్దానం చేశారు?
-
మత్తయి 10:19–20
మీ సహచరుడితో ఐక్యతతో బోధించండి
“ఇద్దరిద్దరు చొప్పున నా సువార్తను ప్రకటించుచూ నా ఆత్మ శక్తితో మీరు ముందుకు సాగవలెను” (సిద్ధాంతము మరియు నిబంధనలు 42:6) అని ప్రభువు చెప్పారు. ఆయన మిమ్మల్ని మరియు మీ సహచరుడిని “ఒకటిగానుండుడి” అని కూడా ఆజ్ఞాపించారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 38:27). మీరు మరియు మీ సహచరుడు ఐక్యతతో పనిచేస్తే మీ బోధన మరింత శక్తివంతంగా మరియు ఆసక్తికరంగా ఉంటుంది. పాఠాల సంక్షిప్త భాగాలను ప్రత్యామ్నాయంగా ఇవ్వడం.
సహచర అధ్యయన సమయంలో, మీరు ఐక్యంగా ఉండడానికి మీరు ఎలా బోధిస్తారో చర్చించి సాధన చేయండి. ఆన్‌లైన్‌లో జనులకు బోధించేటప్పుడు మీరు కలిసి ఎలా పని చేస్తారో సిద్ధం చేసుకోండి. 2వ అధ్యాయంలో వివరించిన సాంకేతికతను ఉపయోగించడం కొరకు భద్రతా చర్యలు అనుసరించండి.
మీ సహచరుడు బోధించేటప్పుడు, అతని లేదా ఆమె కోసం ప్రార్థించండి, వినండి మరియు వారి వైపు చూడండి. అతను లేదా ఆమె బోధించిన సత్యాలకు రెండవ సాక్ష్యాన్ని అందించడం ద్వారా మీ సహచరుడికి మద్దతు ఇవ్వండి (ఆల్మా 12:1 చూడండి). ఆత్మ మిమ్మల్ని ఏదైనా చెప్పమని ప్రేరేపించినప్పుడు మీ మనోభావాలను అనుసరించండి.
హృదయపూర్వకంగా మీరు బోధించే వ్యక్తులపై ఆసక్తి చూపండి. వారు చెప్పేది వినండి. వారు లేదా మీరు మాట్లాడుతున్నప్పుడు వారి వైపు చూడడాన్ని కొనసాగించండి. వారి ప్రతిస్పందనలను జాగ్రత్తగా గమనించండి మరియు ఆధ్యాత్మిక ప్రేరేపణల కోసం వినండి.
పాల్గొనడానికి సభ్యులను ఆహ్వానించండి
మీరు పని చేస్తున్న వ్యక్తులకు బోధించడానికి మరియు మద్దతు ఇవ్వడానికి మీకు సహాయం చేయమని సభ్యులను ఆహ్వానించండి. ఇది స్వయంగా లేదా వర్చువల్‌గా జరగవచ్చు. వారపు సమన్వయ సమావేశంలో, ఎవరు సహాయం చేయగలరనే దాని గురించి వార్డు నాయకులతో చర్చించండి.
సభ్యులు బోధన మరియు సహవాసంలో పాల్గొన్నప్పుడు, వారు అంతర్దృష్టులను జోడించవచ్చు మరియు స్నేహితులుగా సంబంధాలను ఏర్పరచుకోవచ్చు. వారు సువార్త పరిచర్య యొక్క ఆనందాన్ని అనుభవిస్తారు.
బోధించడంలో మీకు సహాయం చేయడానికి సభ్యులను ఆహ్వానించండి
పాఠాలకు ముందు, సభ్యులతో కలిసి ఎలా పని చేయాలో ప్రణాళిక చేయండి. మీరు ఏమి బోధిస్తారు, ఎవరు ప్రార్థిస్తారు, సంభాషణను ఎవరు నడిపిస్తారు మరియు ఇతర వివరాలను నిర్ధారించడానికి మీరు టెక్స్ట్ సందేశం లేదా క్లుప్త ఫోన్ కాల్‌ను ఉపయోగించవచ్చు.
పాఠాలలో సభ్యుల ప్రాథమిక పాత్ర నిజాయితీగల సాక్ష్యాన్ని అందించడం, సంక్షిప్త వ్యక్తిగత అనుభవాలను పంచుకోవడం మరియు బోధించబడుతున్న వారితో సంబంధాన్ని అభివృద్ధి చేయడం. పాఠంలో ఒక నిర్దిష్ట సూత్రాన్ని వారు ఎలా నేర్చుకోగలిగారు, అంగీకరించగలిగారు మరియు జీవించగలిగారు అని పంచుకోమని మీరు సభ్యులను అడగవచ్చు. వారు పరివర్తన చెందినవారైతే, వారు సంఘంలో చేరాలని ఎలా నిర్ణయించుకున్నారో పంచుకోమని వారిని ఆహ్వానించండి.
సభ్యులు ఎవరినైనా సూచించినప్పుడు, బోధనలో పాల్గొనమని వారిని అడగండి. ఈ పరిస్థితుల్లో సభ్యులు ఎక్కువగా పాల్గొనవచ్చు. వారు ఎలా పాల్గొనాలనుకుంటున్నారనే దాని గురించి వారితో చర్చించండి.
సభ్యులతో పాటు బోధించడానికి సాంకేతికతను ఉపయోగించడం ఏవిధంగా సముచితమో పరిగణించండి. సాంకేతికత వ్యక్తిగత సందర్శనకు అవసరమైన సమయ నిబద్ధత లేకుండానే సభ్యులు మీతో చేరడానికి అనుమతిస్తుంది.
వారపు సమన్వయ సమావేశంలో, వీలైనన్ని ఎక్కువ పాఠాలలో ఒక సభ్యుడు పాల్గొనేలా వార్డు నాయకులతో ప్రణాళిక చేయండి (13వ అధ్యాయం చూడండి). బోధించడంలో మీకు సహాయం చేయమని కొత్త సభ్యులను అడగడాన్ని పరిగణించండి.
వ్యక్తిగత లేదా సహచర అధ్యయనము
ఒక సభ్యుని ఇంట్లో ఒక కుటుంబానికి పాఠం నేర్పించడానికి మీకు సమయం ఇవ్వబడిందని ఊహించుకోండి. బోధించడంలో మీకు సహాయం చేయడానికి ఈ క్రింది సభ్యులలో ప్రతి ఒక్కరినీ మీరు ఎలా చేర్చుకుంటారో చర్చించండి:
-
ఇటీవల పూర్తి-కాల సువార్తసేవ నుండి తిరిగి వచ్చిన వార్డు సువార్తికుడు
-
ఒక యాజకుడు
-
ఒక కొత్త సభ్యుడు
-
పెద్దల సమూహ అధ్యక్షుడు లేదా ఉపశమన సమాజ అధ్యక్షురాలు
మద్దతు ఇవ్వడానికి సభ్యులను ఆహ్వానించండి
బోధనా సందర్శనల మధ్య సభ్యులు జనులకు విలువైన మద్దతును కూడా ఇవ్వవచ్చు. వారు టెక్స్ట్ చేయవచ్చు, కలిసి లేఖనాలను చదవవచ్చు, జనులను వారి ఇళ్లకు లేదా కార్యకలాపాలకు ఆహ్వానించవచ్చు లేదా సంఘంలో కలిసి కూర్చోమని ఆహ్వానించవచ్చు. వారు ప్రశ్నలకు సమాధానం ఇవ్వవచ్చు మరియు సంఘ సభ్యులుగా వారి జీవితాలు ఎలా ఉన్నాయో చూపించవచ్చు. వారి జీవితానుభవం మరియు దృక్పథం కొన్నిసార్లు సువార్తికులు చెప్పేదానికి చాలా భిన్నంగా ఉండే విధంగా జనులతో పోల్చుకోవడానికి వారికి సహాయపడుతుంది.
బోధనా సందర్శనలలో కాకుండా జనులకు మద్దతు ఇవ్వడానికి మీరు కలిసి పనిచేయగల మార్గాల గురించి సభ్యులతో చర్చించండి.
అవగాహన కోసం బోధించండి
జనులు అర్థం చేసుకునేలా యేసు క్రీస్తు సువార్తను బోధించండి. వాటి నుండి మీరు స్పష్టంగా బోధించగలిగేలా లేఖనాలను మరియు పాఠాలను అధ్యయనం చేయండి. మీరు ఎంత స్పష్టంగా బోధిస్తే, పరిశుద్ధాత్మ సత్యాన్ని సాక్ష్యమిచ్చే అవకాశం అంత మెరుగ్గా ఉంటుంది.
మీరు బోధించిన దాని గురించి జనులు ఆలోచించడంలో సహాయపడడానికి ప్రశ్నలు అడగండి. తర్వాత వారు అర్థం చేసుకుని అంగీకరిస్తారో లేదో చూడడానికి వినండి.
అవగాహన కోసం బోధించడంలో భాగంగా పదాలు, వాక్యభాగాలు మరియు ఆలోచనలను వివరించడం జరుగుతుంది. మీరు ఈ క్రింది వాటి ద్వారా సువార్తను బోధించే మీ సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు:
-
మీరు ఉపయోగించే పదాలను అర్థం చేసుకోవడం.
-
ఇతరులు అర్థం చేసుకోలేని పదాలను నిర్వచించడం.
-
“మేము ఇప్పుడు వివరించిన దాని గురించి మీ అవగాహనను మాతో పంచుకుంటారా?” లేదా “మేము మాట్లాడిన దాని గురించి సంగ్రహంగా చెప్పడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?” వంటి ప్రశ్నలు అడగడం.
3వ అధ్యాయంలోని సిద్ధాంతాన్ని మీరు బోధిస్తున్నప్పుడు, జనులు అర్థం చేసుకోలేని పదాలు, వాక్యభాగాలు మరియు ఆలోచనలను గమనించండి. సువార్త గ్రంథాలయములోని వనరులను ఉపయోగించి వాటిని నిర్వచించండి.
మీ బోధనను సరళంగా మరియు క్లుప్తంగా ఉంచండి. యేసు క్రీస్తు సువార్తపై దృష్టి పెట్టండి, ప్రాథమిక సిద్ధాంతం మరియు సూత్రాలపై అవగాహనను పెంపొందించడంపై దృష్టి పెట్టండి. పరిశుద్ధాత్మ నుండి వచ్చే అవగాహనను వెదకడంలో జనులకు సహాయం చేయండి. వారు ఈ అవగాహనను పొందినప్పుడు, వారు సువార్త సందేశాన్ని విశ్వసిస్తారు.
లేఖన అధ్యయనము
మనం సిద్ధాంతాన్ని జాగ్రత్తగా ఎందుకు వివరించాలి?
మనం ఎలా నేర్చుకుంటాము? సమాచారాన్ని క్రమంగా బోధించడం ఎందుకు ముఖ్యము?
స్పష్టత ఎందుకు ముఖ్యమైనది?
దేవుడు తన పిల్లలతో ఎలా సంభాషిస్తారనే దాని గురించి ఈ క్రింది వచనాల నుండి మీరు ఏమి నేర్చుకోవచ్చు?
ప్రశ్నలు అడగండి
రక్షకుడు తాను బోధించిన సత్యాల గురించి లోతుగా ఆలోచించడానికి మరియు అనుభూతి చెందడానికి జనులను ఆహ్వానించే ప్రశ్నలు అడిగారు. ఆయన ప్రశ్నలు ఆత్మ శోధనను మరియు నిబద్ధతను ప్రేరేపించాయి.
మంచి ప్రశ్నలు కూడా మీ బోధనలో ముఖ్యమైనవి. అవి జనుల ఆసక్తులు, ఆందోళనలు మరియు ప్రశ్నలను అర్థం చేసుకోవడానికి మీకు సహాయపడతాయి. మంచి ప్రశ్నలు ఆత్మను ఆహ్వానించగలవు మరియు జనులు నేర్చుకోవడానికి సహాయపడగలవు.
ప్రేరేపిత ప్రశ్నలు అడగండి
మంచి ప్రశ్నలు అడగడంలో ఆత్మ మార్గదర్శకత్వాన్ని కోరండి. సరైన సమయాల్లో సరైన ప్రశ్నలు జనులు సువార్తను నేర్చుకోవడానికి మరియు ఆత్మను అనుభూతి చెందడానికి సహాయపడతాయి.
ప్రేరేపిత ప్రశ్నలు మరియు హృదయపూర్వకంగా వినడం అనేది జనులు బహిరంగంగా మాట్లాడడానికి మరియు వారి భావాలను పంచుకోవడానికి మరింత సౌకర్యంగా భావించడంలో సహాయపడుతుంది. ఇది పెరుగుతున్న సాక్ష్యాన్ని కనుగొనడంలో వారికి సహాయపడగలదు. వారు ఏదైనా అర్థం చేసుకోనప్పుడు లేదా ఆందోళన చెందుతున్నప్పుడు వారు మిమ్మల్ని ప్రశ్నలు అడగడానికి కూడా మరింత సౌకర్యంగా భావిస్తారు.
క్రింది పట్టిక కొన్ని ఉదాహరణలతో పాటు ప్రేరేపిత ప్రశ్నలను అడగడానికి కొన్ని సూత్రాలను చూపిస్తుంది.
ప్రేరేపిత ప్రశ్నల యొక్క సూత్రాలు మరియు ఉదాహరణలు
|
సూత్రాలు |
ఉదాహరణలు |
|
జనులు ఆత్మను అనుభూతి చెందడానికి సహాయపడే ప్రశ్నలు అడగండి. |
|
|
సరళంగా మరియు సులభంగా అర్థం చేసుకోగల ప్రశ్నలు అడగండి. |
|
|
మీరు బోధిస్తున్న దాని గురించి జనులు ఆలోచించడానికి సహాయపడే ప్రశ్నలు అడగండి. |
|
|
మీరు బోధిస్తున్న విషయాలను జనులు ఎంత బాగా అర్థం చేసుకుంటున్నారో తెలుసుకోవడానికి మీకు సహాయపడే ప్రశ్నలు అడగండి. |
|
|
జనులు తమ భావాలను పంచుకోవడానికి సహాయపడే ప్రశ్నలు అడగండి. |
|
|
ప్రేమ మరియు శ్రద్ధను చూపించే ప్రశ్నలు అడగండి. |
|
|
జనులు నేర్చుకున్న వాటిని అన్వయించుకోవడానికి సహాయపడే ప్రశ్నలు అడగండి. |
|
సహచర అధ్యయనము
మీరు ఇటీవల బోధించిన పాఠం నుండి మీ పాఠ్య ప్రణాళికను సమీక్షించండి. మీ ప్రణాళికలో వివరించిన ప్రధాన సూత్రాలలో ప్రతీదానికి ఒక్కొక్క ప్రశ్న రాయండి.
ఈ విభాగంలోని సూత్రాలకు అవి అనుగుణంగా ఉన్నాయో లేదో చూడడానికి మీ ప్రశ్నలను సమీక్షించండి.
తర్వాత, మీరు బోధించబడుతున్నట్లుగా ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వండి.
మీ ప్రశ్నలను మీ సహచరుడితో పంచుకోండి. కలిసి, మీ ప్రశ్నలను మూల్యాంకనం చేయండి మరియు మెరుగుపరచండి.
వ్యక్తిగత లేదా సహచర అధ్యయనము
మీరు బోధిస్తున్న వ్యక్తులు ఈ క్రింది అనుభవాలను ఎదుర్కోవచ్చు:
-
మోర్మన్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు వారికి ఆధ్యాత్మిక అనుభవం కలిగింది.
-
సహోద్యోగులు క్రమం తప్పకుండా ఆధ్యాత్మిక విషయాలను ఎగతాళి చేస్తారు.
-
కుటుంబ సభ్యులు మరొక సంఘంలో బలమైన సభ్యులు.
-
“మోర్మన్లు” క్రైస్తవులు కాదని స్నేహితులు నమ్ముతారు.
ఈ పరిస్థితుల గురించి మరింత తెలుసుకోవడానికి మీరు అడిగే ప్రశ్న గురించి ఆలోచించండి. ఈ ప్రశ్నలను మీ అధ్యయన పుస్తకంలో రాయండి. మీరు రాసిన ప్రశ్నలను ఎలా మెరుగుపరచవచ్చు అని మీ సహచరుడితో చర్చించండి.
అసమర్థమైన లేదా అతిగా ఉండే ప్రశ్నలను నివారించండి
ఇటువంటి ప్రశ్నలు అడగడానికి ప్రయత్నించకండి:
-
స్పష్టమైన సమాధానాలు ఉండేవి.
-
సమాధానం తెలియకపోతే అతను లేదా ఆమె ఇబ్బంది పడేవి.
-
ఒకటి కంటే ఎక్కువ ఆలోచనలను కలిగియుండేవి.
-
మీరు ఇంకా బోధించని సిద్ధాంతానికి సంబంధించినవి.
-
స్పష్టమైన ఉద్దేశ్యం లేనివి.
-
అతిగా ఉండేవి.
-
అనవసరమైనవి లేదా జనులను చికాకు పెట్టేవి మరియు బాధపెట్టేవి.
తక్కువ ప్రభావవంతమైన ప్రశ్నలకు ఉదాహరణలు క్రింద ఇవ్వబడ్డాయి:
-
మొదటి ప్రవక్త ఎవరు? (ఆ వ్యక్తికి సమాధానం తెలియకపోవచ్చు.)
-
మన శరీరాలను పవిత్రంగా ఉంచుకోవడం మనం ఆత్మను కలిగి ఉండడానికి ఎలా సహాయపడుతుంది మరియు దేవుని ప్రవక్తను అనుసరించడానికి సిద్ధంగా ఉన్నామని ఎలా చూపిస్తుంది? (ఒకటి కంటే ఎక్కువ ఆలోచనలు ఉన్నాయి.)
-
దేవుని ఆజ్ఞల గురించి తెలుసుకోవడం ముఖ్యమా? (ఇది అవును-కాదు ప్రశ్న మరియు సమాధానం స్పష్టంగా ఉంది.)
-
దేవునికి దగ్గరగా భావించడానికి సహాయపడేలా మనం ప్రతిరోజూ చేయగలిగే పని ఏమిటి? (ఇది నిర్దిష్ట సమాధానం కోసం చూస్తున్న అస్పష్టమైన ప్రశ్న: ప్రార్థన.)
-
నోవహు తర్వాత తదుపరి ప్రవక్త ఎవరు? (ఆ వ్యక్తికి సమాధానం తెలియకపోవచ్చు మరియు మీ సందేశానికి ఈ ప్రశ్న ముఖ్యమైనది కాదు.)
-
నేను చెప్పేది మీకు అర్థమైందా? (ఆ వ్యక్తికి మీరు అతనిని లేదా ఆమెను తక్కువ చేసి మాట్లాడుతున్నట్లు అనిపించవచ్చు.)
వ్యక్తిగత లేదా సహచర అధ్యయనము
మీరు బోధిస్తున్న వ్యక్తి యొక్క అవసరాలను పరిగణించండి. అతను లేదా ఆమె మీ ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్పవచ్చో చర్చించండి. ఈ విభాగంలోని మార్గదర్శకాలను అనుసరించి అడగడానికి కొన్ని ప్రశ్నలను ప్రణాళిక చేయండి. ఈ ప్రశ్నలు ఆత్మను ఎలా ఆహ్వానించగలవో మరియు ఆ వ్యక్తి సువార్తను నేర్చుకోవడంలో ఎలా సహాయపడగలవో చర్చించండి.
వినండి
ఇతరులు చెప్పేది జాగ్రత్తగా విన్నప్పుడు, మీరు వారిని బాగా అర్థం చేసుకుంటారు. వారి ఆలోచనలు మరియు భావాలు మీకు ముఖ్యమైనవని వారు తెలుసుకున్నప్పుడు, వారు మీ బోధనలను స్వీకరించడానికి, వ్యక్తిగత అనుభవాలను పంచుకోవడానికి మరియు నిబద్ధతలు చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.
మీరు వింటున్నప్పుడు, మీ బోధనను వారి అవసరాలకు మరియు ఆసక్తులకు అనుగుణంగా ఎలా మార్చుకోవాలనే అంతర్దృష్టి మీకు లభిస్తుంది. ఏ సువార్త సత్యాలు వారికి అత్యంత ప్రయోజనకరంగా ఉంటాయో మీకు బాగా అర్థం అవుతుంది.
ముఖ్యంగా ఆత్మ యొక్క గుసగుసలను వినండి. ఇతరులు తమ భావాలను పంచుకున్నప్పుడు, పరిశుద్ధాత్మ మిమ్మల్ని ఆలోచనలు లేదా ఉపాయాలతో ప్రేరేపించవచ్చు. ఇతరులు ఏమి వ్యక్తపరచడానికి ప్రయత్నిస్తున్నారో అర్థం చేసుకోవడానికి కూడా ఆత్మ మీకు సహాయం చేయగలడు.
నిజమైన శ్రద్ధతో వినండి
వినడానికి కృషి మరియు నిజమైన శ్రద్ధ అవసరం. ఇతరులు మాట్లాడేటప్పుడు, వారు చెబుతున్న దానిపై మీరు దృష్టి కేంద్రీకరించారని నిర్ధారించుకోండి. మీరు ఏమి చెప్పాలో ప్రణాళిక చేసుకునే ధోరణిని నివారించండి.
ఎల్డర్ జెఫ్రీ ఆర్. హాలండ్ ఇలా బోధించారు: “మాట్లాడడం కంటే వినడం చాలా ముఖ్యం. ఈ వ్యక్తులు బాప్తిస్మపు గణాంకాల ముసుగులో ఉన్న నిర్జీవ వస్తువులు కాదు. … ఈ స్నేహితులను వారికి ఏది అత్యంత ముఖ్యమైనదో అడగండి. వారు దేనిని ఆదరిస్తారు మరియు వారు దేనిని ప్రియమైనదిగా భావిస్తారు? ఆ తర్వాత, వినండి. సందర్భం సరిగ్గా ఉంటే, వారి భయాలు ఏమిటి, వారు దేని కోసం ఆరాటపడుతున్నారు లేదా వారి జీవితాల్లో ఏమి కోల్పోతున్నారని వారు భావిస్తున్నారో మీరు అడగవచ్చు. వారు చెప్పేదానిలో ఏదో ఒకటి ఎల్లప్పుడూ ఒక సువార్త సత్యాన్ని ఎత్తిచూపుతుందని నేను మీకు హామీ ఇస్తున్నాను, దాని గురించి మీరు సాక్ష్యమివ్వవచ్చు మరియు దాని గురించి మీరు మరింత చెప్పవచ్చు. … మనం ప్రేమతో వింటే, ఏమి చెప్పాలో అని మనం ఆలోచించాల్సిన అవసరం ఉండదు. అది మనకు ఇవ్వబడుతుంది—ఆత్మ ద్వారా మరియు మన స్నేహితుల ద్వారా” (“Witnesses unto Me,” Ensign, May 2001, 15).
చెప్పని సందేశాలను గమనించండి
జనులు వారి శరీర భాష ద్వారా కూడా సంభాషిస్తారు. వారు కూర్చునే విధానం, వారి ముఖ కవళికలు, వారు తమ చేతులతో ఏమి చేస్తున్నారు, వారి స్వరం యొక్క స్థాయి మరియు వారు ఎక్కడ చూస్తున్నారో గమనించండి. ఈ చెప్పని సందేశాలను గమనించడం మీరు బోధించే వారి భావాలను అర్థం చేసుకోవడానికి సహాయపడగలదు.
మీ స్వంత శరీర భాష గురించి కూడా తెలుసుకోండి. నిజాయితీగా వినడం ద్వారా ఆసక్తి మరియు ఉత్సాహంతో కూడిన సందేశాన్ని పంపండి.
జనులు ఆలోచించడానికి మరియు ప్రతిస్పందించడానికి సమయం ఇవ్వండి
రక్షకుడు తరచుగా ఒక వ్యక్తికి ప్రతిస్పందించడానికి సమయం అవసరమయ్యే ప్రశ్నలను అడిగారు. మీరు ఒక ప్రశ్న అడిగినప్పుడు, ఆ వ్యక్తికి ఆలోచించి ప్రతిస్పందించడానికి అవకాశం ఇవ్వడానికి విరామం ఇవ్వండి. నిశ్శబ్దాన్ని చూసి భయపడకండి. ఆలోచించడానికి మరియు ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి లేదా వారు ఏమి భావిస్తున్నారో వ్యక్తపరచడానికి జనులకు తరచుగా సమయం అవసరం.
ఒక ప్రశ్న అడిగిన తర్వాత, ఆధ్యాత్మిక అనుభవాన్ని పంచుకున్న తర్వాత లేదా జనులు తమను తాము వ్యక్తపరచడంలో ఇబ్బంది పడుతున్నప్పుడు మీరు విరామం తీసుకోవచ్చు. మీరు ప్రతిస్పందించే ముందు వారి ఆలోచనలను పూర్తి చేయడానికి వారికి సమయం ఇవ్వాలని నిర్ధారించుకోండి. వారు మాట్లాడుతున్నప్పుడు అంతరాయం కలిగించవద్దు.
సానుభూతితో స్పందించండి
ఒక వ్యక్తి ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చినప్పుడు, సముచితమైతే సానుభూతిని వ్యక్తం చేయడం ద్వారా మీ ప్రతిస్పందనను ప్రారంభించండి. సానుభూతి మీరు నిజంగా శ్రద్ధ వహిస్తున్నారని చూపిస్తుంది. తొందరపడి తీర్మానాలు చేయడం, వెంటనే పరిష్కారాలను అందించడం లేదా అన్ని సమాధానాలు తెలుసన్నట్లు కనిపించడం మానుకోండి.
జనులు చెప్పేది మీరు అర్థం చేసుకున్నారని నిర్ధారించుకోండి
ఒక వ్యక్తి ఏమి చెబుతున్నారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, మీరు అర్థం చేసుకున్నారని నిర్ధారించుకోవడానికి అడగండి. ఉదాహరణకు, మీరు ఇలా అడగవచ్చు, “కాబట్టి మీరు చెప్పేది . అది సరైనదేనా?” లేదా “నేను సరిగ్గా అర్థం చేసుకుంటే, మీరు భావించేది .” మీరు అర్థం చేసుకున్నారో లేదో మీకు ఖచ్చితంగా తెలియనప్పుడు, ఆ వ్యక్తిని వివరణ కోసం అడగండి.
సవాలు చేసే సంభాషణలను గుర్తించండి
యేసు క్రీస్తు యొక్క సువార్తను వారికి బోధించడం ద్వారా మీరు జనులకు చాలా సహాయం చేస్తారు. కొంతమంది ఎక్కువగా మాట్లాడాలని అనుకోవచ్చు. కొన్నిసార్లు జనులకు తమ కష్టాలను మరియు భావాలను కరుణతో వినడానికి ఎవరైనా అవసరం. ఇతరులు ఆధిపత్యం చెలాయించడానికి లేదా వాదించడానికి ప్రయత్నించవచ్చు.
అటువంటి పరిస్థితులను వ్యూహాత్మకంగా మరియు ప్రేమతో నిర్వహించడం నేర్చుకోండి. ఒక వ్యక్తి పంచుకున్న దానికి అనుగుణంగా మీరు మీ బోధనను మార్చుకోగలరు. లేదా మీరు మరొక సమయంలో వారి ఆందోళనను చర్చించాలనుకుంటున్నారని మర్యాదగా చెప్పాల్సి రావచ్చు. సవాలుతో కూడిన పరిస్థితులలో ఎలా స్పందించాలో తెలుసుకోవడానికి ఆత్మ మీకు సహాయం చేయగలరు.
నిజమైన భావాలను పంచుకోవడంలో జనులు సౌకర్యంగా భావించడానికి సహాయం చేయండి
ఇబ్బందిని నివారించడానికి, కొంతమంది తమ నిజమైన భావాలను పంచుకోవడానికి బదులుగా మీరు కోరుకుంటున్నారని వారు భావిస్తున్న విధంగా ప్రశ్నలకు సమాధానం ఇస్తారు. వారి నిజమైన భావాలను మీతో పంచుకోవడంలో వారికి సౌకర్యంగా ఉండే సంబంధాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నించండి.
జనులను అర్థం చేసుకోవడం మరియు వారితో జతచేరడం మీరు వారికి సహాయం చేయడానికి, వారి ఆసక్తులను, అవసరాలను తీర్చడానికి మరియు రక్షకుని ప్రేమను వారికి వ్యక్తపరచడానికి వీలు కల్పిస్తుంది. వారితో నిజాయితీగా ఉండడం, సముచితమైన సువార్తికుని సంబంధాన్ని కొనసాగించడం మరియు గౌరవం చూపడం ద్వారా నమ్మకమైన బంధాన్ని ఏర్పరచుకోండి.
వ్యక్తిగత లేదా సహచర అధ్యయనము
ఇతరులు చెప్పేది మీరు ఎంత బాగా వింటున్నారో ఆలోచించండి. క్రింది ప్రశ్నలకు మీ అధ్యయన పుస్తకంలో సమాధానాలు రాయండి. లేదా మీ సహచరుడితో వాటిని చర్చించండి.
A = నా గురించి ఎప్పుడూ నిజం కాదు, B = కొన్నిసార్లు నా గురించి నిజం, C = సాధారణంగా నా గురించి నిజం, D = నా గురించి ఎల్లప్పుడూ నిజం
-
ఇతరులు నాతో మాట్లాడినప్పుడు, జాగ్రత్తగా వినడానికి బదులుగా నేను పంచుకోగల అలాంటి అనుభవాల గురించి ఆలోచిస్తాను.
-
ఇతరులు తమ భావాల గురించి నాకు చెప్పినప్పుడు, నేను ఎలా భావిస్తానో చూడడానికి వారి స్థానంలో నన్ను నేను ఉంచుకోవడానికి ప్రయత్నిస్తాను.
-
నేను జనులకు బోధించేటప్పుడు, నేను తదుపరి ఏమి చెప్పబోతున్నానో లేదా ఏమి బోధించబోతున్నానో ఆలోచిస్తాను.
-
జనులు ఎక్కువగా మాట్లాడినప్పుడు నేను విసుగు చెందుతాను.
-
ఇతరులు నాకు చెప్పడానికి ప్రయత్నిస్తున్న దానిని అనుసరించడానికి లేదా అర్థం చేసుకోవడానికి నేను ఇబ్బంది పడుతున్నాను.
-
నా సహచరుడు బోధిస్తున్నప్పుడు నా మనస్సు తరచుగా సంచరిస్తుంది.
-
ఎవరైనా నాతో మాట్లాడుతున్నప్పుడు, ఇతరులు జోక్యం చేసుకుంటే లేదా నా దృష్టిని మరల్చితే నేను బాధపడతాను.
-
నేను ఏదైనా చెప్పడానికి లేదా చేయడానికి ఆధ్యాత్మిక ప్రేరేపణలను అందుకుంటాను, కానీ నేను వాటిని విస్మరిస్తాను.
జనులు వారి ప్రశ్నలకు మరియు ఆందోళనలకు సమాధానాలు కనుగొనడంలో సహాయపడండి
జనుల ప్రశ్నలకు జవాబివ్వడానికి మరియు వారి సమస్యలను పరిష్కరించడంలో వారికి సహాయపడడానికి హృదయపూర్వక ప్రయత్నం చేయండి. అయితే, ప్రతీ ప్రశ్నకు సమాధానం ఇవ్వడం మీ బాధ్యత కాదు. అంతిమంగా, జనులు తమ ప్రశ్నలను మరియు ఆందోళనలను స్వయంగా పరిష్కరించుకోవాలి.
అన్ని ప్రశ్నలు మరియు ఆందోళనలకు పూర్తిగా సమాధానం చెప్పలేమని గ్రహించండి. కొన్ని సమాధానాలు కాలక్రమేణా స్పష్టంగా మారతాయి. మరికొన్ని ఇంకా బయల్పరచబడలేదు. సువార్త యొక్క ప్రాథమిక, ముఖ్యమైన సత్యాల యొక్క దృఢమైన పునాదిని నిర్మించడంపై దృష్టి పెట్టండి. ఈ పునాది మీకు మరియు మీరు బోధించే వారికి జవాబు లేని లేదా కష్టమైన ప్రశ్నలు ఉన్నప్పుడు సహనంతో మరియు విశ్వాసంతో ముందుకు సాగడానికి సహాయపడుతుంది.
ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి కొన్ని సూత్రాలు ఈ విభాగంలో వివరించబడ్డాయి.
ఆందోళనను అర్థం చేసుకోండి
మీరు జనులకు బోధించే వాటిలో కొన్ని వారికి కష్టంగా లేదా తెలియనివిగా అనిపించవచ్చు. జనులకు ప్రశ్నలు లేదా ఆందోళనలు ఉంటే, మొదట వాటిని స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. కొన్నిసార్లు జనుల ఆందోళనలు మంచుకొండలా ఉంటాయి. ఉపరితలం పైన ఒక చిన్న భాగం మాత్రమే కనిపిస్తుంది. ఈ ఆందోళనలు సంక్లిష్టంగా ఉండవచ్చు. వివేచన బహుమతి కోసం ప్రార్థించండి మరియు మీరు ఎలా స్పందిస్తారనే దానిలో ఆత్మను అనుసరించండి. పరలోక తండ్రికి అందరి హృదయాలు మరియు అనుభవాలు తెలుసు (పూర్తి మంచుకొండ). ప్రతి వ్యక్తికి ఏది ఉత్తమమో తెలుసుకోవడానికి ఆయన మీకు సహాయం చేస్తారు.
తరచుగా ఆందోళనలు సిద్ధాంతపరమైన వాటి కంటే ఎక్కువగా సామాజికంగా ఉంటాయి. ఉదాహరణకు, కొంతమంది సంఘంలో చేరితే కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకత వస్తుందని భయపడవచ్చు. లేదా వారు పనిలో తమ స్నేహితుల నుండి తిరస్కరణకు భయపడవచ్చు.
ప్రశ్నలు అడగడం మరియు వినడం ద్వారా ఆందోళన యొక్క మూలాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆ వ్యక్తికి పునఃస్థాపన యొక్క సత్యం గురించి ఆధ్యాత్మిక నిర్ధారణ లేనందున ఆందోళన తలెత్తిందా? ఆ వ్యక్తి ఒక సువార్త సూత్రాన్ని జీవించడానికి కట్టుబడి ఉండడానికి ఇష్టపడకపోవడం వల్ల అది తలెత్తిందా? వారి ఆందోళనకు మూలాన్ని తెలుసుకోవడం, సాక్ష్యంపై దృష్టి పెట్టాలా లేదా నిబద్ధతపై దృష్టి పెట్టాలా అని మీరు తెలుసుకోవడానికి సహాయపడుతుంది.
ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి లేఖనాలను, ముఖ్యంగా మోర్మన్ గ్రంథాన్ని ఉపయోగించండి
లేఖనాలలోని సత్యాలు వారి ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి మరియు వారి ఆందోళనలను పరిష్కరించడానికి ఎలా సహాయపడతాయో జనులకు చూపించండి. (5వ అధ్యాయములో “మోర్మన్ గ్రంథము ఆత్మ యొక్క ప్రశ్నలకు జవాబిస్తుంది” చూడండి.) జనులు లేఖనాలను అధ్యయనం చేయడం మరియు అన్వయించడం ద్వారా ప్రేరణను వెదకినప్పుడు, వారు ప్రభువును వినడానికి మరియు అనుసరించడానికి వారి సామర్థ్యాన్ని పెంచుకుంటారు. ఆయనపై వారి విశ్వాసం పెరుగుతుంది. పెరిగిన విశ్వాసంతో సాక్ష్యం, పశ్చాత్తాపం మరియు బాప్తిస్మం యొక్క విధి వస్తాయి.
“కొన్నిసార్లు నేను సిద్ధాంతం కోసం లేఖనాలు చూస్తాను. కొన్నిసార్లు నేను ఉపదేశం కోసం లేఖనాలు చూస్తాను. నేను ఒక ప్రశ్నతో వెళ్తాను మరియు ప్రశ్న సాధారణంగా ‘దేవుడు నన్ను ఏమి చేయమని కోరుకుంటారు?’ లేదా ‘ఆయన నన్ను ఏమి అనుభూతి చెందమని కోరుకుంటారు?’ అనేదైయుంటుంది. నేను ఎప్పుడూ కొత్త ఉపాయాలను, ఆలోచనలను కనుగొంటాను మరియు నా ప్రశ్నలకు ప్రేరణ, సూచన మరియు సమాధానాలను పొందుతాను” (Henry B. Eyring, in “A Discussion on Scripture Study,” Ensign, July 2005, 22).
యేసు క్రీస్తు సువార్త గురించి మనకున్న అవగాహనలో ఎక్కువ భాగం ప్రవక్త జోసెఫ్ స్మిత్ మరియు ఆయన తర్వాత వచ్చిన వారికి బయల్పరచబడిన దాని నుండి వచ్చిందని వివరించడం సహాయకరంగా ఉండవచ్చు. జోసెఫ్ స్మిత్ దేవుని ప్రవక్త అని సాక్ష్యం పొందడం ద్వారా సువార్త యొక్క యథార్థత గురించిన ప్రశ్నలను పరిష్కరించవచ్చు. మోర్మన్ గ్రంథం గురించి చదవడం మరియు ప్రార్థించడం ఈ సాక్ష్యాన్ని పొందడానికి ఒక ముఖ్యమైన మార్గం.
యేసు క్రీస్తుపై వారి విశ్వాసాన్ని బలోపేతం చేయడంపై జనులు దృష్టి పెట్టడానికి సహాయం చేయండి. మోర్మన్ గ్రంథం గురించి చదవడం మరియు ప్రార్థించడం వారి విశ్వాసాన్ని బలోపేతం చేయడానికి ఒక ముఖ్యమైన మార్గం.
జనులను విశ్వాసంతో వ్యవహరించమని ఆహ్వానించండి
పునఃస్థాపించబడిన సువార్త గురించి జనులు తమ సాక్ష్యాన్ని అభివృద్ధి చేసుకుని బలోపేతం చేసుకున్నప్పుడు, వారు తమ ప్రశ్నలను మరియు ఆందోళనలను విశ్వాసం యొక్క పునాది నుండి పరిష్కరించుకోగలుగుతారు. వారు నమ్మే సత్యాలపై విశ్వాసంతో వ్యవహరించినప్పుడు, వారు ఇతర సువార్త సత్యాల గురించి సాక్ష్యాలు పొందగలుగుతారు.
విశ్వాసంతో వ్యవహరించడానికి కొన్ని మార్గాలు:
-
ప్రేరణ మరియు మార్గదర్శకత్వం కోసం తరచుగా మరియు నిజమైన ఉద్దేశ్యంతో ప్రార్థించడం.
-
లేఖనాలను, ముఖ్యంగా మోర్మన్ గ్రంథమును అధ్యయనం చేయడం.
-
సంఘానికి హాజరు కావడం.
సహచర అధ్యయనము
మీరు పాఠం బోధించేటప్పుడు అందించడానికి ఒక ఆహ్వానాన్ని ఎంచుకోండి. తర్వాత ఎవరైనా ఆహ్వానాన్ని అంగీకరించకుండా లేదా నిబద్ధతను నిలబెట్టుకోకుండా నిరోధించే ఆందోళనలను గుర్తించండి. జనులు తమ సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తున్నప్పుడు మీరు ఎలా సహాయం చేయగలరో చర్చించి సాధన చేయండి.
వ్యక్తిగత లేదా సహచర అధ్యయనము
మీ అధ్యయన పుస్తకంలో, క్రింది ఆందోళనలకు ప్రతిస్పందించడానికి మీరు జోసెఫ్ స్మిత్ మరియు మోర్మన్ గ్రంథాన్ని ఎలా ఉపయోగిస్తారో వ్రాయండి:
-
“దేవుడు ఇకపై జనులతో మాట్లాడతారని నేను నమ్మను.”
-
“వ్యవస్థీకృత మతం ద్వారా కాకుండా నా స్వంత మార్గంలో నేను దేవుణ్ణి ఆరాధించగలనని నమ్ముతున్నాను.”
-
“నేను మీ సంఘంలో చేరితే నా భోజనంతో పాటు వైన్ తాగడం ఎందుకు మానేయాలి?”
-
“మతము నాకు ఎందుకు అవసరము?”
అధ్యయనం చేయడానికి మరియు ప్రార్థించడానికి ఏదైనా వదిలివేయండి
ప్రతి బోధనా సందర్శన ముగింపులో, తదుపరి సమావేశానికి సిద్ధం కావడానికి జనులకు అధ్యయనం చేయడానికి, ఆలోచించడానికి మరియు ప్రార్థించడానికి ఏదైనా ఇవ్వండి. బోధనా సందర్శనల మధ్య చదవడం, ప్రార్థించడం మరియు ఆలోచించడం వారి జీవితాల్లోకి పరిశుద్ధాత్మ ప్రభావాన్ని ఆహ్వానిస్తుంది.
మీరు మోర్మన్ గ్రంథములోని నిర్దిష్ట అధ్యాయాలను చదవమని జనులను ఆహ్వానించవచ్చు. లేదా ప్రశ్నలకు సమాధానాలు కనుగొనడానికి, ఒక అంశం గురించి తెలుసుకోవడానికి లేదా వీడియో చూడడానికి సువార్త గ్రంథాలయము వంటి సంఘ వనరులను ఉపయోగించమని మీరు వారిని ప్రోత్సహించవచ్చు. మీరు తదుపరిసారి కలిసినప్పుడు ఇది చర్చకు ప్రారంభ అంశంగా మారవచ్చు.
ప్రత్యేకించి మీరు వారితో తరచుగా చిన్న బోధనా సంభాషణలు కలిగి ఉంటే, జనులకు ఎక్కువ పని ఇవ్వకుండా ఉండండి.
వ్యక్తిగత లేదా సహచర అధ్యయనము
ఈ వారం మీరు బోధించబోయే ప్రతి వ్యక్తిని పరిగణించండి. మోర్మన్ గ్రంథంలోని ఏ అధ్యాయాలు వారికి అత్యంత సహాయకరంగా ఉంటాయి? ఏ ఇతర వనరులు వారికి ప్రయోజనం చేకూరుస్తాయి? ప్రతి వ్యక్తికి మీరు ఏమి అందించాలనుకుంటున్నారో నమోదు చేయండి. మీ తదుపరి సందర్శనలో మీరు ఏమి చేస్తారో కూడా నమోదు చేయండి.
వ్యసనాలతో బాధపడుతున్న వ్యక్తులకు సహాయం చేయడం
వ్యసనాన్ని అధిగమించడానికి కష్టపడుతున్న వ్యక్తులతో వారి శ్రమల గురించి ప్రేమగా చర్చించడం, వారికి మద్దతు ఇవ్వడం మరియు వనరులతో వారిని జతచేయడం ద్వారా మీరు వారికి సహాయం చేయవచ్చు. సంఘము యొక్క వ్యసన పునరుద్ధరణ మద్దతు సమూహాలలో ఒకదానికి హాజరుకమ్మని మీరు వారిని ప్రోత్సహించవచ్చు. ఈ సమూహాలు వ్యక్తిగతంగా లేదా ఆన్‌లైన్‌లో కలవవచ్చు. (AddictionRecovery.ChurchofJesusChrist.org చూడండి.) సువార్త గ్రంథాలయములో జీవిత సహాయంలోని “వ్యసనం” విభాగంలోని వనరులను ఉపయోగించమని వారిని ప్రోత్సహించండి.
స్థానిక సంఘ నాయకులు మరియు సభ్యులు కూడా మద్దతు ఇవ్వగలరు. వ్యసనాలతో బాధపడుతున్న కొంతమందికి వైద్య మరియు మానసిక ఆరోగ్య నిపుణుల చికిత్స అవసరం కావచ్చు.
వ్యసనాన్ని అధిగమించడానికి కష్టపడుతున్న వ్యక్తులకు మీరు ఎలా మద్దతు ఇవ్వవచ్చు అనే దానికి ఇక్కడ కొన్ని సూచనలు ఉన్నాయి:
-
క్రీస్తు వద్దకు రావడానికి వారి ప్రయత్నాలను బలోపేతం చేయండి. కోలుకోవడానికి మరియు స్వస్థపరచబడడానికి వారు చేసే ప్రయత్నాలు పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తుచే గుర్తించబడ్డాయని, విలువైనవిగా భావించబడ్డాయని గ్రహించడంలో వారికి సహాయపడండి. రక్షకుడు మరియు ఆయన ప్రాయశ్చిత్తం ద్వారా వారు బలపరచబడగలరని వారికి బోధించండి. మంచి చేయాలనే వారి హృదయ ఉద్దేశ్యాన్ని ఆయన పూర్తిగా గుర్తిస్తారు.
-
మీ వ్యక్తిగత ప్రార్థనలలో వారి కోసం ప్రార్థించండి మరియు వారితో కలిసి ప్రార్థించండి. తగిన విధంగా, స్థానిక యాజకత్వ నాయకుల నుండి యాజకత్వ దీవెన పొందమని వారిని ప్రోత్సహించండి.
-
యేసు క్రీస్తు యొక్క సువార్తను వారికి బోధించడం కొనసాగించండి. పరలోక తండ్రి, రక్షకుడు మరియు పరిశుద్ధాత్మ వారిని ప్రేమిస్తున్నారని మరియు వారి విజయాన్ని కోరుకుంటున్నారని వారికి బోధించండి.
-
క్రమం తప్పకుండా సంఘానికి హాజరుకమ్మని మరియు సభ్యులతో స్నేహాలు పెంచుకోమని వారిని ప్రోత్సహించండి.
-
ముఖ్యంగా వారు తిరిగి వస్తే సానుకూలంగా మరియు మద్దతుగా ఉండండి.
వ్యసనాన్ని అధిగమించడం కష్టం మరియు అది తిరిగి వచ్చే అవకాశం ఉంది. సంఘ నాయకులు మరియు సభ్యులు దీనితో దిగ్భ్రాంతికి గురికాకూడదు. వారు తీర్పును కాదు, ప్రేమను చూపించాలి.
సంఘానికి హాజరు కావడం మానేసిన కొత్త సభ్యుడు పాత వ్యసనానికి తిరిగి వెళ్ళి అనర్హుడిగా మరియు నిరుత్సాహంగా భావించవచ్చు. ప్రోత్సాహం మరియు మద్దతు ఇవ్వడానికి తక్షణమే సందర్శించడం సహాయపడగలదు. సంఘము క్రీస్తు యొక్క ప్రేమను కనుగొనగల ప్రదేశం అని సభ్యులు మాటలో మరియు చర్యలో చూపించాలి (3 నీఫై 18:32 చూడండి).
వ్యక్తిగత లేదా సహచర అధ్యయనము
మీరు బోధిస్తున్న వ్యక్తి గురించి లేదా వ్యసనాన్ని అధిగమించడానికి ప్రయత్నిస్తున్న కొత్త లేదా తిరిగి వచ్చే సభ్యుడి గురించి ఆలోచించండి. 3వ అధ్యాయంలో “యేసు క్రీస్తు యొక్క సువార్త” పాఠం నుండి “యేసు క్రీస్తు నందు విశ్వాసము” మరియు “పశ్చాత్తాపము”లను సమీక్షించండి.
-
ఆ పాఠం నుండి మరియు ఈ అధ్యాయం నుండి అతనికి లేదా ఆమెకు సహాయపడేలా మీరు ఈ వ్యక్తికి ఏమి నేర్పించగలరు?
-
ఈ వ్యక్తికి సహాయం చేయడానికి ఒక పాఠ్య ప్రణాళికను రూపొందించండి.
క్రైస్తవ నేపథ్యం లేని వ్యక్తులకు బోధించుట
మీరు బోధించేవారిలో కొందరికి క్రైస్తవ నేపథ్యం లేకపోవచ్చు లేదా పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తుపై విశ్వాసం లేకపోవచ్చు. అయితే, ఈ వ్యక్తులలో చాలామందికి వారు పవిత్రంగా భావించే నమ్మకాలు, అలవాట్లు మరియు ప్రదేశాలు ఉంటాయి. మీరు వారి మతపరమైన నమ్మకాలు మరియు సంప్రదాయాల పట్ల గౌరవం చూపించడం చాలా అవసరం.
దేవుడు ఎవరో అర్థం చేసుకోవడానికి వారికి సహాయం చేయండి
క్రైస్తవ నేపథ్యం లేని వ్యక్తుల కోసం మీ బోధనను ఎలా సర్దుబాటు చేయాలని మీరు ఆశ్చర్యపోవచ్చు. విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి ఒక వ్యక్తికి సహాయపడే సూత్రాలు అన్ని సంస్కృతులలో ఒకేలా ఉంటాయి. దేవుడు మరియు యేసు క్రీస్తు యొక్క దైవిక నియమితకార్యము గురించి సరైన అవగాహన పొందడానికి జనులకు సహాయపడండి. ఈ సత్యాలను నేర్చుకోవడానికి వారికి గల ఉత్తమ మార్గం వ్యక్తిగత ఆధ్యాత్మిక అనుభవాలను కలిగి ఉండడం. ఈ అనుభవాలను పొందడానికి మీరు వారికి సహాయపడగల కొన్ని మార్గాలు క్రింద వివరించబడ్డాయి:
-
దేవుడు మన పరలోక తండ్రి అని మరియు ఆయన మనల్ని ప్రేమిస్తున్నారని బోధించండి. మనం ఆయన పిల్లలము. తమకైతాము ఆ సాక్ష్యాన్ని వెదకమని వారిని ఆహ్వానించండి.
-
రక్షణ ప్రణాళిక గురించి బోధించండి.
-
తండ్రియైన దేవుడు మరియు యేసు క్రీస్తు ప్రవక్త జోసెఫ్ స్మిత్‌కు కనిపించారని బోధించండి.
-
పరలోక తండ్రి ప్రేమను మీరు ఎలా అనుభవిస్తున్నారో మరియు మీరు యేసు క్రీస్తును అనుసరించాలని ఎందుకు ఎంచుకున్నారో అనేదానితో సహా సువార్త గురించి నిజాయితీగల సాక్ష్యాన్ని ఇవ్వండి.
-
మీతోపాటు మరియు వారి స్వంతంగా సరళమైన, హృదయపూర్వక ప్రార్థనలు చేయమని వారిని ఆహ్వానించండి.
-
మీతోపాటు మరియు వారి స్వంతంగా ప్రతిరోజూ మోర్మన్ గ్రంథాన్ని చదవమని వారిని ఆహ్వానించండి.
-
సంఘానికి హాజరుకమ్మని వారిని ఆహ్వానించండి.
-
పరలోక తండ్రిని మరియు యేసు క్రీస్తును వారు ఎలా విశ్వసించారో వివరించగల సంఘ సభ్యులకు వారిని పరిచయం చేయండి.
-
ఆజ్ఞలను పాటించమని వారిని ఆహ్వానించండి.
చాలా మంది దేవునితో గొప్ప సంబంధాన్ని కలిగి ఉండాలని మరియు జీవితంలో ఉద్దేశ్యం మరియు అర్థాన్ని కనుగొనాలని కోరుకుంటారు. ఎలా వారు పరలోకంలో ఉన్న ప్రేమగల తండ్రి యొక్క పిల్లలో మరియు ఆయన వారి కోసం ఎలా ప్రణాళికను కలిగి ఉన్నారో చూడడానికి వారికి సహాయం చేయండి. ఉదాహరణకు, మీరు ఈ క్రింది విధంగా చెప్పడం ద్వారా ప్రారంభించవచ్చు:
దేవుడు పరలోకమందున్న మన తండ్రి మరియు ఆయన మనల్ని ప్రేమిస్తారు. మనం ఆయన పిల్లలము. మనం జన్మించకముందు మనం ఆయనతో నివసించాము. మనమందరం ఆయన పిల్లలం కాబట్టి, మనమందరం సహోదర, సహోదరీలము. ఆయన వద్దకు తిరిగి రావాలని ఆయన మనల్ని కోరుతున్నారు. మనపై ఆయనకున్న ప్రేమ కారణంగా, ఆయన తన కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా మనం ఆయన వద్దకు తిరిగి రావడానికి ఒక మార్గాన్ని అందించారు.
మీ బోధనను అవసరమైన విధంగా మార్చుకోండి
క్రైస్తవేతర నేపథ్యాల నుండి వచ్చిన చాలా మంది పరివర్తన చెందినవారు సువార్తికులు బోధించే వాటిలో ఎక్కువ భాగం తమకు అర్థం కాలేదని చెప్తున్నారు. అయితే, వారు ఆత్మను అనుభవించారు మరియు సువార్తికులు అడిగినది చేయాలని కోరుకున్నారు. జనులు సువార్త సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడానికి మీకు వీలైనదంతా చేయండి. ఓపికగా మరియు మద్దతుగా ఉండండి. జనులు తమ భావాలను గుర్తించి వ్యక్తపరచడం నేర్చుకోవడానికి సమయం పట్టవచ్చు. వారికి సహాయం చేయడానికి మీ బోధనా వేగాన్ని మరియు గంభీరతను మీరు సర్దుబాటు చేసుకోవలసి రావచ్చు.
క్రైస్తవ నేపథ్యం లేని వ్యక్తులకు బోధించడానికి మీరు సిద్ధమవుతున్నప్పుడు ఈ క్రింది సూచనలు సహాయపడవచ్చు:
-
మిమ్మల్ని కలవడానికి వారిని ప్రేరేపించే ఆధ్యాత్మిక అవసరం లేదా ఆసక్తిని అర్థం చేసుకోండి.
-
ప్రతి పాఠం కోసం సరళమైన అవలోకనాలు మరియు సమీక్షలను అందించండి.
-
వారు ఏమి అర్థం చేసుకున్నారో మరియు వారు ఏమి అనుభవించారో మీకు చెప్పమని వారిని అడగండి.
-
అవసరమైన పదాలు మరియు సూత్రాలను నిర్వచించండి. మీరు బోధించేటప్పుడు మీరు ఉపయోగించే అనేక పదాలతో జనులు సుపరిచితులు కాకపోవచ్చు.
-
సిద్ధాంతాన్ని మరింత స్పష్టంగా బోధించడానికి గతంలో బోధించిన పాఠానికి తిరిగి వెళ్లండి. బోధనా ప్రక్రియలో ఎప్పుడైనా ఇది అవసరం కావచ్చు.
-
జనులు సువార్త ఆశీర్వాదాలను అనుభవించడంలో సహాయపడడానికి మీరు అందించగల ఆహ్వానాలను గుర్తించండి.
వ్యక్తిగత లేదా సహచర అధ్యయనము
వీలైతే, సువార్తికులను కలవడానికి ముందు క్రైస్తవ నేపథ్యం లేకుండా పరివర్తన చెందిన ఒకరిని గుర్తించండి. వారిని కలిసి అతని లేదా ఆమె పరివర్తన అనుభవం గురించి అడగడానికి ఏర్పాటు చేసుకోండి. ఉదాహరణకు, మీరు ఆ వ్యక్తిని ఈ క్రింది వాటి గురించి అడగవచ్చు:
-
అతను లేదా ఆమె పరలోక తండ్రిని మరియు యేసు క్రీస్తును విశ్వసించడానికి దారితీసింది ఏమిటి?
-
మొదటిసారి ప్రార్థించిన అనుభవం ఎలా ఉంది?
-
అతను లేదా ఆమె మొదటిసారి చేసిన ప్రార్థనకు సమాధానం వచ్చినప్పుడు ఎలా ఉంది.
-
అతని లేదా ఆమె పరివర్తనలో లేఖనాల పాత్ర.
-
సంఘానికి హాజరు కావడం ఎలా ఉండేది.
మీరు నేర్చుకున్న వాటిని మీ అధ్యయన పుస్తకంలో వ్రాయండి.
క్రైస్తవ నేపథ్యం లేని వ్యక్తికి బోధించడానికి మీకు సహాయం చేయమని ఆ వ్యక్తిని ఆహ్వానించడాన్ని పరిగణించండి.
అధ్యయనము మరియు అన్వయము కొరకు ఉపాయములు
వ్యక్తిగత అధ్యయనము
-
మీరు ఈ క్రింది పరిస్థితుల్లో ఉన్నారని ఊహించుకోండి. ఈ వ్యక్తులు అభివృద్ధి చెందడానికి సహాయపడేందుకు ఈ అధ్యాయంలోని సూత్రాలు మరియు నైపుణ్యాలను మీరెలా ఉపయోగించవచ్చు? ప్రతి పరిస్థితిలో మీరు వాటిని ఎలా అన్వయిస్తారో ప్రణాళిక చేసుకోండి.
-
బాప్తిస్మము కోసం సిద్ధమవుతున్న ఎవరైనా మిమ్మల్ని ఇకపై కలవాలనుకోవడం లేదని చెబుతారు.
-
రెండు సంవత్సరాల కాలంలో అనేకమంది సువార్తికులచే బోధించబడిన వ్యక్తిని మీరు ఏడవసారి కలుస్తున్నారు. పురోగతికి ఏవైనా సంకేతాలు ఉంటే చాలా తక్కువ.
-
-
సువార్తికుల పాఠాలలో ఒకదాన్ని ఎంచుకోండి. ప్రతీ ప్రధాన సూత్రం నుండి ఒకటి లేదా రెండు లేఖన గద్యభాగాలను గుర్తించండి. ఈ అధ్యాయంలోని “లేఖనాలను ఉపయోగించండి” విభాగంలో వివరించిన విధంగా ఆ గద్యభాగాల నుండి బోధించడాన్ని సాధన చేయండి.
సహచర అధ్యయనము మరియు సహచర మార్పిడి
-
ఆల్మా 18–19లో అమ్మోన్ మరియు రాజైన లమోనై వృత్తాంతాన్ని మరియు ఆల్మా 22:4–18లో అహరోను వృత్తాంతాన్ని చదవండి. మీరు చదువుతున్నప్పుడు, అమ్మోన్ మరియు అహరోను ఎలా ఉన్నారో గుర్తించి వివరించండి:
-
ఆత్మను అనుసరించి ప్రేమతో బోధించారు.
-
బోధించడం ప్రారంభించారు.
-
అవసరాలను తీర్చడానికి వారి బోధనను సర్దుబాటు చేసారు.
-
సాక్ష్యము చెప్పారు.
-
లేఖనాలను ఉపయోగించారు.
-
ప్రశ్నలు అడిగారు, విన్నారు మరియు వారు బోధించిన వారు తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి సహాయం చేశారు.
-
వారు బోధించిన వారు నిబద్ధతలు చేసుకోవాలని ప్రోత్సహించారు.
వారి సేవ మరియు బోధన రాజైన లమోనై, అతని తండ్రి మరియు ఏబిష్‌ను ఎలా ప్రభావితం చేసాయో చర్చించండి.
-
జిల్లా సలహాసభ, జోన్ సభ్యసమావేశాలు మరియు మిషను నాయకత్వ సలహాసభ
-
సభ్యులను లేదా ప్రస్తుతం బోధించబడుతున్న వారిని మీ సమావేశానికి ఆహ్వానించండి. సువార్తికులు తమ ముఖ్యమైన సందేశాన్ని పంచుకునే సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవాలని మీరు కోరుకుంటున్నారని సమూహానికి వివరించండి. ఒక పాఠం మరియు నైపుణ్యాన్ని ఎంచుకోండి. మీరు గుర్తించిన నైపుణ్యంపై దృష్టి సారించి, మీరు ఎంచుకున్న పాఠాన్ని 20 నిమిషాల పాటు ఆ వ్యక్తికి లేదా జనులకు సువార్తికులు బోధించనివ్వండి. 20 నిమిషాల తర్వాత వారు బోధించే వ్యక్తిని మార్చనివ్వండి. సువార్తికులు బోధించిన తర్వాత, సమూహాన్ని ఒకచోట చేర్చండి. అత్యంత ప్రభావవంతంగా ఉన్నదానిని మరియు వారు మెరుగుపరచగల ఒక మార్గాన్ని ఆ వ్యక్తి లేదా వ్యక్తులు సువార్తికులకు చెప్పనివ్వండి.
-
సువార్తికులు జనులకు బోధించే లేదా సంప్రదించే వీడియో ఉదాహరణలను చూపించండి. ఒక నైపుణ్యాన్ని ఎంచుకుని, ఆ నైపుణ్యానికి సంబంధించిన సూత్రాలను సువార్తికులు ఎంత బాగా అన్వయించారో చర్చించండి.
-
ఒక నైపుణ్యాన్ని ఎంచుకుని, దానికి మద్దతు ఇచ్చే సిద్ధాంతం లేదా లేఖన గద్యభాగాలను గుర్తించండి. సువార్తికులకు ఈ నైపుణ్యం యొక్క సిద్ధాంతపరమైన పునాదిని బోధించండి.
మిషను నాయకులు మరియు మిషను సలహాదారులు
-
అప్పుడప్పుడు సువార్తికులు బోధించేటప్పుడు వారితో పాటు వెళ్లండి. బోధనలో మీరు ఎలా పాల్గొనవచ్చో ప్రణాళిక చేయండి.
-
సువార్తికులతో వారి బోధనా సందర్శనలలో పాల్గొనమని స్థానిక నాయకులను ప్రోత్సహించండి.
-
ఈ అధ్యాయంలో వివరించిన బోధనా నైపుణ్యాలలో ఒకదాన్ని ప్రదర్శించండి మరియు దానిని అభ్యసించడానికి సువార్తికులకు సహాయం చేయండి, అంటే మంచి ప్రశ్నలు అడగడం మరియు వినడం వంటివి.
-
జోన్ సమావేశాలు, మిషను నాయకత్వ సలహాసభ మరియు ఇంటర్వ్యూలలో సువార్తికులకు బోధించేటప్పుడు లేఖనాల ప్రభావవంతమైన ఉపయోగాన్ని ప్రదర్శించండి. మీరు వారితో బోధించేటప్పుడు కూడా అదే చేయండి.
-
సువార్తికులు లేఖనాలను అర్థం చేసుకోవడానికి మరియు వాటి పట్ల ప్రేమను పెంపొందించుకోవడానికి సహాయం చేయండి. ఎల్డర్ జెఫ్రీ ఆర్. హాలండ్ మిషను నాయకులకు ఇలా సలహా ఇచ్చారు:
“మీ మిషను సంస్కృతికి దేవుని వాక్యం పట్ల ప్రేమను పూర్తిగా కేంద్రంగా చేసుకోండి. … బయల్పాటులతో పరిచయాన్ని మరియు ప్రామాణిక గ్రంథాలను క్రమం తప్పకుండా ఉపయోగించడాన్ని వారి జీవితాంతం మీ సువార్తికుల ముఖ్య లక్షణాలలో ఒకటిగా చేయండి.
“మీరు మీ సువార్తికులకు బోధించేటప్పుడు—మరియు అది ఎల్లప్పుడూ జరుగుతుంది—వారికి లేఖనాల నుండి బోధించండి. మీరు మీ బలాన్ని మరియు ప్రేరణను ఎక్కడి నుండి పొందుతారో వారు చూడనివ్వండి. పోగుచేయబడిన ఆ బయల్పాటులను ప్రేమించడాన్ని మరియు వాటిపై ఆధారపడడాన్ని వారికి బోధించండి.
“[నా] మిషను అధ్యక్షుడు మేము ఆయన సమక్షంలో ఉన్న ప్రతిసారీ మోర్మన్ గ్రంథం మరియు [ఇతర] లేఖనాల నుండి బోధించారు లేదా అలా అనిపించింది. వ్యక్తిగత ఇంటర్వ్యూలు లేఖనాలతో నిండి ఉన్నాయి. … సమావేశాల కోసం రూపురేఖలు ప్రామాణిక గ్రంథాల నుండి తీసుకోబడ్డాయి. …
“ఆ సమయంలో మాకు తెలియదు, కానీ మా అధ్యక్షుడు మమ్మల్ని కుడి వైపున మరియు ఎడమ వైపున సాయుధులను చేస్తూ, మేము ఎన్నటికీ నశించకుండా ఉండేలా ఇనుప దండాన్ని గట్టిగా పట్టుకోమని తన ఆత్మ యొక్క పూర్ణ శక్తితో మరియు తనకున్న అన్ని సామర్థ్యాలతో మాకు ఉద్బోధిస్తున్నారు [1 నీఫై 15:23–25 చూడండి]” (“The Power of the Scriptures” seminar for new mission leaders, June 25, 2022).