“అధ్యాయము 5: మోర్మన్ గ్రంథము యొక్క శక్తిని ఉపయోగించండి,” నా సువార్తను ప్రకటించండి: యేసు క్రీస్తు యొక్క సువార్తను పంచుకొనుటకు మార్గదర్శి (2023)
“అధ్యాయము 5,” నా సువార్తను ప్రకటించండి
అధ్యాయము 5
మోర్మన్ గ్రంథము యొక్క శక్తిని ఉపయోగించండి
దీనిని పరిగణించండి
-
మోర్మన్ గ్రంథము ఏవిధంగా మన మతము యొక్క ప్రధానరాయి?
-
పరివర్తన ప్రక్రియలో మోర్మన్ గ్రంథము ఎందుకంత శక్తివంతమైనది?
-
మోర్మన్ గ్రంథము యేసు క్రీస్తు గురించి ఏమి బోధిస్తుంది?
-
దేవునికి దగ్గరవ్వడానికి నాకు మరియు ఇతరులకు సహాయపడేందుకు నేను మోర్మన్ గ్రంథాన్ని ఎలా ఉపయోగించగలను?
-
ఆత్మ యొక్క ప్రశ్నలకు మోర్మన్ గ్రంథము ఎలా జవాబిస్తుంది?
-
జనులు మోర్మన్ గ్రంథాన్ని చదివి దాని సాక్ష్యాన్ని పొందేందుకు నేను ఎలా సహాయపడగలను?
ఆత్మతో కలిపి, మోర్మన్ గ్రంథము పరివర్తనలో మీ అత్యంత శక్తివంతమైన వనరు. ఈ గ్రంథము యేసే క్రీస్తు అని అందరినీ ఒప్పించడానికి వ్రాయబడిన పురాతన, పవిత్రమైన గ్రంథము (మోర్మన్ గ్రంథము యొక్క శీర్షిక పేజీ చూడండి). దాని ఉపశీర్షిక చెప్పినట్లుగా, మోర్మన్ గ్రంథము “యేసు క్రీస్తు యొక్క మరియొక నిబంధన.” దేవుడు జోసెఫ్ స్మిత్‌ను ప్రవక్తగా పిలిచారు మరియు ఆయన ద్వారా యేసు క్రీస్తు యొక్క సువార్తను పునఃస్థాపించారు అనడానికి కూడా ఇది బలమైన రుజువు.
మోర్మన్ గ్రంథము మన మతము యొక్క ప్రధానరాయి
మోర్మన్ గ్రంథము “మన మతానికి ప్రధానరాయి” అని ప్రవక్త జోసెఫ్ స్మిత్ బోధించారు (మోర్మన్ గ్రంథ పీఠిక). మరొక సందర్భంలో ఆయన ఇలా అన్నారు: “మోర్మన్ గ్రంథాన్ని మరియు బయల్పాటులను తీసివేస్తే, మన మతం ఎక్కడ ఉంది? మనకు ఏదీ లేదు” Teachings of Presidents of the Church: Joseph Smith(2007),196.
ఒక వంపు అనేది ఒకదానికొకటి ఆనుకుని ఉండే చీలిక ఆకారపు ముక్కలతో తయారు చేయబడిన బలమైన నిర్మాణం. మధ్య భాగం లేదా ప్రధానరాయి సాధారణంగా ఇతర చీలికల కంటే పెద్దదిగా ఉంటుంది మరియు వాటిని సరైన స్థానంలో ఉంచుతుంది.
మోర్మన్ గ్రంథము కనీసం మూడు విధాలుగా మన మతానికి ప్రధానరాయి అని అధ్యక్షులు ఎజ్రా టాఫ్ట్ బెన్సన్ అన్నారు:
క్రీస్తు యొక్క సాక్షి “మనం చేసే ప్రతిదానికీ మూలరాయిగా ఉన్న యేసు క్రీస్తు గురించి మన సాక్ష్యంలో మోర్మన్ గ్రంథము ప్రధానరాయి. ఇది శక్తి మరియు స్పష్టతతో ఆయన వాస్తవికతకు సాక్ష్యమిస్తుంది.”
సిద్ధాంతము యొక్క సంపూర్ణత. మోర్మన్ గ్రంథములో ‘యేసు క్రీస్తు సువార్త యొక్క సంపూర్ణత’ [సిద్ధాంతము మరియు నిబంధనలు 20:9; 27:5] ఉందని ప్రభువు స్వయంగా పేర్కొన్నారు. … మోర్మన్ గ్రంథములో మన రక్షణకు అవసరమైన [సిద్ధాంతం] యొక్క సంపూర్ణతను మనం కనుగొంటాము. మరియు [ఇది] పిల్లలు కూడా రక్షణ మరియు ఉన్నతస్థితి మార్గాలను నేర్చుకోగలిగేలా స్పష్టంగా మరియు సరళంగా బోధించబడింది.”
సాక్ష్యం యొక్క పునాది. “ప్రధానరాయిని తొలగిస్తే వంపు విరిగిపోయినట్లే, సంఘము అంతా మోర్మన్ గ్రంథం యొక్క సత్యంతో నిలుస్తుంది లేదా పడిపోతుంది. … మోర్మన్ గ్రంథము నిజమైతే … పునఃస్థాపన వాదనలను అంగీకరించాలి.” (Teachings of Presidents of the Church: Ezra Taft Benson [2014], 129, 131, 128.)
మోర్మన్ గ్రంథము దేవుని వాక్యమని సాక్ష్యం పొందడం ద్వారా, జోసెఫ్ స్మిత్ ఒక ప్రవక్త అని మనం తెలుసుకోవచ్చు. ఆయన ద్వారా, దేవుని యాజకత్వ అధికారం పరలోక దూతల ద్వారా పునఃస్థాపించబడింది. యేసు క్రీస్తు యొక్క సంఘమును ఏర్పాటు చేయడానికి కూడా దేవుడు జోసెఫ్‌కు అధికారం ఇచ్చారు. నేడు సజీవ ప్రవక్తల ద్వారా బయల్పాటు కొనసాగుతోంది.
వ్యక్తిగత పరివర్తనకు మోర్మన్ గ్రంథము ఆవశ్యకమైనది
పరివర్తనలో ఒక ముఖ్యమైన భాగం ఏమిటంటే, మోర్మన్ గ్రంథము సత్యమని పరిశుద్ధాత్మ శక్తి చేత సాక్ష్యం పొందడం. మీరు దానిని నిజాయితీగా చదివి అధ్యయనం చేస్తున్నప్పుడు, దాని మాటలు మీ ఆత్మను విస్తరింపజేస్తున్నట్లు మీరు భావిస్తారు. దాని మాటలు జీవితం, దేవుని ప్రణాళిక మరియు యేసు క్రీస్తు గురించి మీ అవగాహనను వృద్ధి చేస్తాయి (ఆల్మా 32:28 చూడండి). నిజమైన ఉద్దేశ్యంతో మరియు క్రీస్తుపై విశ్వాసంతో గ్రంథం గురించి ప్రార్థించండి. మీరు అలా చేస్తున్నప్పుడు, అది దేవుని వాక్యమని పరిశుద్ధాత్మ ద్వారా మీరు సాక్ష్యం పొందుతారు (మొరోనై 10:4–5 చూడండి).
మోర్మన్ గ్రంథం గురించి మీ స్వంత సాక్ష్యం ఇతరులు పరివర్తన చెందడానికి సహాయపడే దాని శక్తిపై లోతైన మరియు స్థిరమైన విశ్వాసానికి దారితీస్తుంది. మీరు బోధించే వ్యక్తులు దానిని నిజాయితీగా చదివేటప్పుడు వారు అనుభవించే జ్ఞానోదయాన్ని గుర్తించడంలో సహాయపడండి. యేసు క్రీస్తు గురించి దాని శక్తివంతమైన సాక్ష్యాన్ని నొక్కి చెప్పండి. ఆ గ్రంథము సత్యమని వారి స్వంత సాక్ష్యాన్ని పొందడానికి వారిని ప్రార్థించమని ప్రోత్సహించండి.
మోర్మన్ గ్రంథము గురించి పరిశుద్ధాత్మ నుండి సాక్ష్యం పొందమని జనులను ప్రోత్సహించడం మీ బోధన యొక్క ముఖ్య ఉద్దేశ్యంగా ఉండాలి. మోర్మన్ గ్రంథము వారి జీవితాలను శాశ్వతంగా మార్చగలదు.
యేసు క్రీస్తు యొక్క సువార్తను బోధించడానికి మోర్మన్ గ్రంథాన్ని ఉపయోగించండి
“మోర్మన్ గ్రంథము భూమిపైనున్న గ్రంథములన్నింటిలోకెల్లా మిక్కిలి ఖచ్చితమైనది” (మోర్మన్ గ్రంథ పీఠిక) అని ప్రవక్త జోసెఫ్ స్మిత్ చెప్పారు. ఇది క్రీస్తు గురించి సాక్ష్యమిస్తుంది మరియు ఆయన సిద్ధాంతాన్ని స్పష్టంగా బోధిస్తుంది (2 నీఫై 31; 32:1–6; 3 నీఫై 11:31–39; 27:13–22 చూడండి). ఇది ఆయన సువార్త యొక్క సంపూర్ణతను బోధిస్తుంది. మోర్మన్ గ్రంథంలో బోధించబడిన సువార్త యొక్క మొదటి సూత్రాలు మరియు విధులు సమృద్ధిగా జీవించడానికి మార్గం.
పునఃస్థాపించబడిన సువార్తను బోధించడానికి మీ ప్రధాన వనరుగా మోర్మన్ గ్రంథాన్ని ఉపయోగించండి. ఈ క్రింది పటము మీరు బోధించే మోర్మన్ గ్రంథంలోని కొన్ని సత్యాలను జాబితా చేస్తుంది.
|
3వ అధ్యాయములో సువార్తికుల పాఠము |
సిద్ధాంతము |
సూచికలు |
|---|---|---|
3వ అధ్యాయములో సువార్తికుల పాఠము యేసు క్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన సువార్త యొక్క సందేశము | సిద్ధాంతము దేవుని స్వభావం, రక్షకుని పరిచర్య మరియు ప్రాయశ్చిత్తం, పతనమైపోవడం, పునఃస్థాపన, జోసెఫ్ స్మిత్, యాజకత్వ అధికారం | సూచికలు |
3వ అధ్యాయములో సువార్తికుల పాఠము పరలోక తండ్రి యొక్క రక్షణ ప్రణాళిక | సిద్ధాంతము ఆదాము హవ్వల పతనము, యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము, పునరుత్థానము మరియు తీర్పుతో సహా “నిత్య దేవుని గొప్ప ప్రణాళిక” | సూచికలు |
3వ అధ్యాయములో సువార్తికుల పాఠము యేసు క్రీస్తు యొక్క సువార్త | సిద్ధాంతము క్రీస్తునందు విశ్వాసము, పశ్చాత్తాపము, బాప్తిస్మము, పరిశుద్ధాత్మ వరము మరియు అంతము వరకు సహించుట | సూచికలు |
3వ అధ్యాయములో సువార్తికుల పాఠము యేసు క్రీస్తు యొక్క జీవితకాలపు శిష్యులగుట | సిద్ధాంతము బాప్తిస్మము, యాజకత్వ నియామకము మరియు సంస్కారము వంటి విధులు | సూచికలు |
లేఖన అధ్యయనము
మోర్మన్ గ్రంథము గురించి రక్షకుడు ఏమి చెప్తారు?
మోర్మన్ గ్రంథము క్రీస్తు గురించి సాక్ష్యమిస్తుంది
యేసు క్రీస్తును గూర్చి సాక్ష్యమివ్వడమే మోర్మన్ గ్రంథము యొక్క ముఖ్య ఉద్దేశ్యము. ఇది ఆయన జీవితం, నియమితకార్యం, పునరుత్థానం మరియు శక్తి యొక్క వాస్తవికతను ధృవీకరిస్తుంది. ఇది క్రీస్తు మరియు ఆయన ప్రాయశ్చిత్తం గురించి నిజమైన సిద్ధాంతాన్ని బోధిస్తుంది.
అనేకమంది ప్రవక్తలు క్రీస్తును వ్యక్తిగతంగా చూశారు, వారి రచనలు మోర్మన్ గ్రంథంలో భద్రపరచబడ్డాయి. జెరెడ్ యొక్క సహోదరుడు, నీఫై మరియు జేకబ్ పూర్వమర్త్య క్రీస్తును చూశారు. నీఫైయుల మధ్య రక్షకుని పరిచర్య సమయంలో అనేకమంది ఉన్నారు (3 నీఫై 11–28 చూడండి). తరువాత, మోర్మన్ మరియు మొరోనై పునరుత్థానుడైన క్రీస్తును చూశారు (మోర్మన్ 1:15; ఈథర్ 12:39 చూడండి).
జనులు మోర్మన్ గ్రంథాన్ని చదివి ప్రార్థించినప్పుడు, వారు రక్షకుని గురించి బాగా తెలుసుకుంటారు మరియు ఆయన ప్రేమను అనుభవిస్తారు. వారు ఆయనను గూర్చి వారి సాక్ష్యంలో ఎదుగుతారు. ఆయన వద్దకు ఎలా రావాలో మరియు రక్షింపబడాలో వారికి తెలుస్తుంది. (1 నీఫై 15:14–15 చూడండి.)
“యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము గురించి ఎక్కడా కనుగొనబడని సంపూర్ణమైన, అత్యంత స్థిరమైన గ్రహింపును మోర్మన్ గ్రంథము అందిస్తుంది. మరలా జన్మించడానికి అసలైన అర్థాన్ని ఇది బోధిస్తుంది. … మనము ఈ భుమిపైన ఎందుకున్నామో మనకు తెలుసు. ఇవి మరియు ఇతర సత్యాలు మరేయితర గ్రంథములో లేనంత శక్తివంతముగా, నమ్మశక్యంగా మోర్మన్ గ్రంథములో బోధించబడ్డాయి. యేసు క్రీస్తు సువార్త యొక్క పూర్తి శక్తిని మోర్మన్ గ్రంథము కలిగియుంది” (రస్సెల్ ఎమ్. నెల్సన్, “మోర్మన్ గ్రంథము: ఇది లేకపోతే మీ జీవితం ఎలా ఉండేది?” లియహోనా, నవ. 2017, 62).
వ్యక్తిగత అధ్యయనము
మీ సువార్తసేవ అంతటా, మీ అధ్యయన పుస్తకంలో ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి:
-
మోర్మన్ గ్రంథాన్ని అధ్యయనం చేయడం ద్వారా మీరు యేసు క్రీస్తు గురించి ఏమి నేర్చుకున్నారు?
-
మోర్మన్ గ్రంథాన్ని అధ్యయనం చేయడం వల్ల యేసు క్రీస్తు గురించి మీ సాక్ష్యం ఎలా ప్రభావితమైంది?
-
జనులు తమ సాక్ష్యాలను బలోపేతం చేసుకోవడంలో సహాయపడడానికి మీరు మోర్మన్ గ్రంథాన్ని ఎలా ఉపయోగించగలరు?
లేఖన అధ్యయనము
మోర్మన్ గ్రంథ ప్రవక్తలు తమ గ్రంథాలను వ్రాయడానికి ఏ కారణాలను ఇచ్చారు?
వ్యక్తిగత లేదా సహచర అధ్యయనము
మోర్మన్ గ్రంథము “యేసే క్రీస్తు అని [జనులందరినీ] ఒప్పించడానికి” వ్రాయబడింది (మోర్మన్ గ్రంథము యొక్క శీర్షిక పేజీ). యేసు క్రీస్తు జీవితం, బోధనలు మరియు పరిచర్య గురించి సాక్ష్యమిచ్చే మోర్మన్ గ్రంథంలోని కొన్ని అధ్యాయాలను ఈ క్రింది పట్టిక జాబితా చేస్తుంది. మీ సువార్తసేవ అంతటా అధ్యయనం చేయడానికి గద్యభాగాలను ఎంచుకోండి.
అదనంగా, మీరు బోధిస్తున్న జనుల అవసరాల గురించి ఆలోచించండి. రక్షకుని గురించి వారి జ్ఞానాన్ని మరియు సాక్ష్యాన్ని బలోపేతం చేయడానికి ఈ గద్యభాగాలలో కొన్నింటిని వారితో చదవడానికి ప్రణాళికలు వేసుకోండి.
|
శీర్షిక పేజీ మరియు పీఠిక |
గ్రంథము యొక్క ఉద్దేశ్యాన్ని స్పష్టం చేయండి. |
|
లీహై మరియు నీఫై రక్షకుని గురించి సాక్ష్యమిస్తారు. | |
|
లీహై మరియు జేకబ్ యేసు క్రీస్తు మరియు ఆయన ప్రాయశ్చిత్తం గురించి సాక్ష్యమిస్తారు. | |
|
నీఫై క్రీస్తు యొక్క సిద్ధాంతాన్ని బోధిస్తాడు. | |
|
రాజైన బెంజమిన్ క్రీస్తు గురించి సాక్ష్యమిస్తాడు. | |
|
ఆల్మా రక్షకుని గురించి సాక్ష్యమిస్తాడు. | |
|
ఆల్మా క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్త శక్తిని అనుభవిస్తాడు. | |
|
రక్షకుడు జనులను ఆయన వద్దకు రమ్మని ఆహ్వానిస్తారు. | |
|
తండ్రిని గూర్చి మరియు ఆయన సిద్ధాంతము గూర్చి రక్షకుడు నీఫైయులకు బోధిస్తారు. | |
|
రక్షకుడు తన సువార్తను బోధిస్తారు. | |
|
యేసు క్రీస్తు నందు విశ్వాసం అనేది చర్య మరియు శక్తి యొక్క సూత్రం అని ఈథర్ మరియు మొరోనై బోధిస్తారు. | |
|
క్రీస్తు యొక్క శుద్ధమైన ప్రేమ మరియు ఆయన ప్రాయశ్చిత్తం గురించి మోర్మన్ బోధిస్తాడు. | |
|
క్రీస్తు నొద్దకు రండి, ఆయనలో పరిపూర్ణులు కండి అని మొరోనై అందరిని ఆహ్వానిస్తాడు. |
దేవునికి దగ్గరవ్వడానికి మోర్మన్ గ్రంథము మనకు సహాయపడుతుంది
“ఒక పురుషుడు [లేదా స్త్రీ] ఏ ఇతర గ్రంథము కన్నను దీని యొక్క సూక్తులననుసరించిన యెడల దేవునికి చేరువగునని” (మోర్మన్ గ్రంథ పీఠిక ) మోర్మన్ గ్రంథమును గూర్చి ప్రవక్త జోసెఫ్ స్మిత్ చెప్పారు. మోర్మన్ గ్రంథంలోని సూత్రాలను నిరంతరం బోధించడం ద్వారా మరియు వాటిని అనుసరించమని జనులను ఆహ్వానించడం ద్వారా, యేసు క్రీస్తుపై విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి మరియు దేవునికి దగ్గరగా రావడానికి మీరు వారికి సహాయం చేస్తారు.
మోర్మన్ గ్రంథం సాక్ష్యాన్ని నిర్మిస్తుంది మరియు వ్యక్తిగత బయల్పాటును ఆహ్వానిస్తుంది. జనులు ఆధ్యాత్మిక అనుభవాలను పొందడానికి, ముఖ్యంగా ఆ గ్రంథం దేవుని వాక్యమని పరిశుద్ధాత్మ నుండి సాక్ష్యం పొందడానికి సహాయపడేందుకు మోర్మన్ గ్రంథాన్ని ఉపయోగించండి.
మీరు బోధించేటప్పుడు మోర్మన్ గ్రంథ గద్యభాగాలకు ప్రాధాన్యత ఇవ్వండి. అవి పరిశుద్ధాత్మ ద్వారా మార్చే శక్తిని కలిగి ఉంటాయి. మీరు మోర్మన్ గ్రంథాన్ని ఉపయోగించి సువార్తను బోధించినప్పుడు, మీ బోధన హృదయంలో మరియు మనస్సులో శక్తి మరియు స్పష్టతతో ప్రతిధ్వనిస్తుంది.
“[మోర్మన్ గ్రంథాన్ని] ప్రార్థనాపూర్వకంగా చదివిన వారు, వారు ధనవంతులైనా, పేదవారైనా, నేర్చుకున్నవారైనా, నేర్చుకోనివారైనా, దాని శక్తి క్రింద ఎదిగారు” అని అధ్యక్షులు గార్డన్ బి. హింక్లి బోధించారు. ఆయన ఇంకా ఇలా బోధించారు:
“ఇంతకుముందు ఎన్నిసార్లు చదివినాసరే, మీరు ప్రార్థనాపూర్వకంగా మోర్మన్ గ్రంథాన్ని చదివితే, మీ మనస్సులోకి దేవుని ఆత్మ మరింత ఎక్కువగా వస్తుందని, ఎటువంటి సందేహం లేకుండా నేను వాగ్దానం చేస్తున్నాను. ఆయన ఆజ్ఞలకు విధేయతతో నడిచే బలమైన తీర్మానం వస్తుంది మరియు దేవుని కుమారుడు జీవించియున్నాడనే బలమైన సాక్ష్యం వస్తుంది” (“The Power of the Book of Mormon,” Ensign, June 1988, 6).
మోర్మన్ గ్రంథము ఆత్మ యొక్క ప్రశ్నలకు జవాబిస్తుంది
ఆత్మ యొక్క నడిపింపుతో మోర్మన్ గ్రంథాన్ని చదవడం జనులు తమ వ్యక్తిగత ప్రశ్నలకు—లేదా ఆత్మ యొక్క ప్రశ్నలకు సమాధానాలు లేదా అంతర్దృష్టులను కనుగొనడంలో సహాయపడగలదు. మోర్మన్ గ్రంథములోని బోధనలు జీవితపు ప్రశ్నలకు ఎలా జవాబిస్తాయో చూడడానికి జనులకు సహాయపడండి.
ఈ ప్రశ్నలలో కొన్ని, వాటికి జవాబిచ్చే మోర్మన్ గ్రంథ సూచనలతో పాటు క్రింద ఇవ్వబడ్డాయి.
-
దేవుడు ఉన్నాడా? దేవుడు ఎవరు? (మోషైయ 4:9; ఆల్మా 18:24–40; 22:4–23; 30:44)
-
దేవునికి నా గురించి తెలుసా మరియు నా పట్ల శ్రద్ధ చూపుతారా? నేను ఆయన ప్రేమను ఎలా అనుభవించగలను? నేను ఆయనకు దగ్గరగా ఎలా భావించగలను? (2 నీఫై 26:24; మోషైయ 4:9–12; ఈనస్ 1:1–12; ఆల్మా 18:32; మొరోనై 10:32–33)
-
జీవితం యొక్క ఉద్దేశం ఏమిటి? (2 నీఫై 2:25; ఆల్మా 34:32)
-
ఎందుకు జీవితం కొన్నిసార్లు చాలా కష్టంగా ఉంటుంది? కష్ట సమయాల్లో నేను బలాన్ని ఎలా కనుగొనగలను? (1 నీఫై 17:3; 2 నీఫై 4:20–21; ఆల్మా 36:3; ఈథర్ 12:27)
-
అల్లకల్లోల సమయాల్లో నేను శాంతిని ఎలా పొందగలను? (మోషైయ 24:13–15; హీలమన్ 5:47)
-
నేను సంతోషంగా ఎలా ఉండగలను? (మోషైయ 2:41; ఆల్మా 22:15–16)
-
నేను మంచి వ్యక్తిగా ఎలా మారగలను? (మోషైయ 26:30–31; ఆల్మా 5:12–13; 7:23–24; ఈథర్ 12:27)
-
నేను దేవుని క్షమాపణను ఎలా అనుభవించగలను? (ఈనస్ 1:2–8; ఆల్మా 36:17–21)
-
నేను మరణించిన తర్వాత ఏమి జరుగుతుంది? (2 నీఫై 9:3–6, 11–13; ఆల్మా 11:42–44; 40:11)
మోర్మన్ గ్రంథము ఇతర ముఖ్యమైన ప్రశ్నల గురించి కూడా నడిపింపును అందిస్తుంది, అవి:
-
నా కుటుంబం యొక్క ఆధ్యాత్మిక శ్రేయస్సుకు నేను ఎలా దోహదపడగలను? (1 నీఫై 1:1; 8:36–38; మోషైయ 2:5–6; 4:14–15; 3 నీఫై 18:21)
-
నా పిల్లలు శోధనను ఎదిరించడానికి బలాన్ని పెంచుకోవడానికి నేను ఎలా సహాయం చేయగలను? (1 నీఫై 15:23–25; హీలమన్ 5:12; 3 నీఫై 18:15, 18–21, 24–25)
-
దేవుని ఆజ్ఞలకు విధేయత చూపడం సంతోషకరమైన, సమృద్ధిగల జీవితాన్ని కలిగియుండడానికి నాకు ఎలా సహాయపడగలదు? (2 నీఫై 2:25–28; 4:35; మోషైయ 2:41; 4 నీఫై 1:15–18)
“సువార్తికులు తమ స్వంత ప్రశ్నలకు సమాధానమివ్వడానికి మోర్మన్ గ్రంథాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవాలి, తద్వారా వారు దానిని సమర్థవంతంగా ఉపయోగించి ఇతరులు కూడా అదే విధంగా నేర్చుకోవడంలో సహాయపడగలరు.… పునఃస్థాపించబడిన సువార్తను బోధించడంలో వారు మోర్మన్ గ్రంథం యొక్క శక్తిని అంతర్గతీకరించుకోవాలి, మొదట దానిని వారి స్వంత జీవితాల్లో అన్వయించుకోవడం ద్వారా మరియు తరువాత వారు బోధించే వారితో పంచుకోవడం ద్వారా” (Dallin H. Oaks, “Counsel for Mission Leaders,” seminar for new mission leaders, June 25, 2022).
వ్యక్తిగత లేదా సహచర అధ్యయనము
మీరు కలిగి ఉన్న లేదా ఇతరుల నుండి మీరు విన్న ఆత్మ యొక్క ప్రశ్నలను జాబితా చేయండి. మోర్మన్ గ్రంథంలో ఈ ప్రశ్నలకు జవాబివ్వడానికి సహాయపడే వచనాలను కనుగొనండి. మీ అధ్యయన పుస్తకంలో అంతర్దృష్టులు మరియు మోర్మన్ గ్రంథ సూచికలను వ్రాయండి. మీరు బోధించేటప్పుడు వాటిని ఉపయోగించండి.
మోర్మన్ గ్రంథం మరియు బైబిలు ఒకదానికొకటి మద్దతు ఇస్తాయి
“ బైబిలు మరియు మోర్మన్ గ్రంథములోనున్న నా సువార్త సూత్రములను బోధించండి, వాటియందు నా సంపూర్ణ సువార్త ఉన్నది” (సిద్ధాంతము మరియు నిబంధనలు 42:12) అని ప్రభువు చెప్పారు. కడవరి-దిన పరిశుద్ధులు, “తప్పులులేకుండా అనువదించబడినంత వరకు బైబిలు దేవుని వాక్యమని నమ్ముతారు” (విశ్వాస ప్రమాణాలు 1:8; 1 నీఫై 13:29 కూడా చూడండి). బైబిలు ఒక పవిత్ర గ్రంథం. మోర్మన్ గ్రంథం అనేది యేసు క్రీస్తు సువార్త యొక్క సంపూర్ణతను కలిగి ఉన్న సహచర పవిత్ర గ్రంథం.
బైబిలు మరియు మోర్మన్ గ్రంథం ఒకదానినొకటి పూర్తి చేస్తాయి మరియు సుసంపన్నం చేస్తాయి (యెహెజ్కేలు 37:16–17; 1 నీఫై 13:40; మోర్మన్ 7:8–9 చూడండి). లేఖనం యొక్క రెండు సంపుటాలు పురాతన ప్రవక్తలు నమోదు చేసిన బోధనల సంకలనాలు. బైబిలు వేల సంవత్సరాలుగా తూర్పు అర్థగోళంలోని జనులతో దేవుని పరస్పర చర్యల గురించి చెబుతుంది. మోర్మన్ గ్రంథం వెయ్యి సంవత్సరాలకు పైగా పురాతన అమెరికాలోని జనులతో దేవుని పరస్పర చర్యల గురించి చెబుతుంది.
ముఖ్యంగా, బైబిలు మరియు మోర్మన్ గ్రంథం యేసు క్రీస్తును గూర్చి సాక్ష్యమివ్వడంలో ఒకదానినొకటి పూర్తి చేస్తాయి. బైబిలు రక్షకుని జననం, మర్త్య పరిచర్య మరియు ప్రాయశ్చిత్తం యొక్క వృత్తాంతాన్ని అందిస్తుంది—ఆయన మరణం మరియు పునరుత్థానంతో సహా. మోర్మన్ గ్రంథంలో రక్షకుని జననం మరియు నియమితకార్యం యొక్క ప్రవచనాలు, ఆయన ప్రాయశ్చిత్తం గురించి బోధనలు మరియు అమెరికాలలో ఆయన పరిచర్య యొక్క వృత్తాంతం ఉన్నాయి. యేసు దేవుని అద్వితీయ కుమారుడు మరియు లోక రక్షకుడు అనే బైబిలు యొక్క సాక్ష్యాన్ని మోర్మన్ గ్రంథం ధృవీకరిస్తుంది మరియు విస్తరిస్తుంది.
బైబిలు మరియు మోర్మన్ గ్రంథం రెండూ సాక్షుల చట్టాన్ని బోధిస్తాయి: “ఇద్దరు లేదా ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాటయు స్థిరపరచబడును” (2 కొరింథీయులకు 13:1; 2 నీఫై 11:2–3 కూడా చూడండి). ఈ చట్టానికి అనుగుణంగా, రెండు లేఖన గ్రంథాలు యేసు క్రీస్తు గురించి సాక్ష్యమిస్తున్నాయి (2 నీఫై 29:8 చూడండి).
వ్యక్తిగత లేదా సహచర అధ్యయనము
మోర్మన్ గ్రంథము మరియు బైబిలులో ఈ క్రింది అంశాలపై పరస్పర నిర్దేశాలను కనుగొనండి. ప్రతి అంశం తర్వాత కుండలీకరణాల్లో ఉదాహరణలు ఇవ్వబడ్డాయి. మీ స్వంత అంశాలు మరియు గద్యభాగాలను జోడించండి.
-
ప్రవక్తలు (జేకబ్ 4:4–6; ఆమోసు 3:7)
-
విశ్వాసభ్రష్టత్వము (2 నీఫై 28; 2 తిమోతి 4:3–4)
-
పునఃస్థాపన (1 నీఫై 13:34–42; అపొస్తలుల కార్యములు 3:19–21)
-
మనమందరము దేవుని పిల్లలము (1 నీఫై 17:36; అపొస్తలుల కార్యములు 17:29)
మోర్మన్ గ్రంథాన్ని చదివి అర్థం చేసుకోవడానికి జనులకు సహాయం చేయండి
మోర్మన్ గ్రంథాన్ని చదవని లేదా అర్థం చేసుకోని వారికి అది నిజమని సాక్ష్యం లభించడం కష్టంగా ఉంటుంది. వారితో కలిసి గ్రంథాన్ని చదవడం ద్వారా దానిని అర్థం చేసుకోవడానికి మీరు వారికి సహాయం చేయవచ్చు. బోధనా నియామకం సమయంలో, తదుపరి సందర్శన సమయంలో లేదా సాంకేతికత ద్వారా చదవండి. సభ్యులు వారితో కలిసి చదవడానికి కూడా మీరు ఏర్పాటు చేయవచ్చు. మోర్మన్ గ్రంథ వీడియోను చూడడం మరియు సంబంధిత అధ్యాయాలను చదవడం చాలా సహాయకారిగా ఉంటుంది.
జనుల ఆందోళనలు మరియు అవసరాలను తీర్చే గద్యభాగాలను మీరు ఎంచుకునేటప్పుడు సహాయం కోసం ప్రార్థించండి. 1 నీఫై 3:7 లేదా మోషైయ 2:17 వంటి చిన్న గద్యభాగాలను చదివి చర్చించండి. 2 నీఫై 31, ఆల్మా 7 లేదా 3 నీఫై 18 వంటి పొడవైన గద్యభాగాలను లేదా పూర్తి అధ్యాయాలను కూడా చదివి చర్చించండి. ముగ్గురు మరియు ఎనిమిదిమంది సాక్షులు మరియు ప్రవక్త జోసెఫ్ స్మిత్ సాక్ష్యంతో సహా మోర్మన్ గ్రంథాన్ని ప్రారంభం నుండి చదవమని జనులను ప్రోత్సహించండి.
మీరు జనులతో మోర్మన్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఈ క్రింది సూచనలను పరిగణించండి:
-
చదవడానికి ముందు ప్రార్థించండి. అర్థం చేసుకోవడంలో సహాయం కోసం అడగండి. అది నిజమని పరిశుద్ధాత్మ వారికి సాక్ష్యమివ్వాలని ప్రార్థించండి.
-
వంతులవారీగా చదవండి. వారికి సౌకర్యంగా ఉన్న వేగంతో వెళ్ళండి. అపరిచితమైన పదాలు మరియు వాక్యభాగాలను వివరించండి.
-
మీరు చదివిన వాటిని చర్చించడానికి అప్పుడప్పుడు ఆగండి.
-
ఎవరు మాట్లాడుతున్నారు, ఆ వ్యక్తి ఎలా ఉన్నారు మరియు పరిస్థితి ఏమిటి వంటి గద్యభాగం యొక్క నేపథ్యం మరియు సందర్భాన్ని వివరించండి. సంబంధిత మోర్మన్ గ్రంథ వీడియో ఉంటే, దానిని చూపించడాన్ని పరిగణించండి.
-
చూడవలసిన ముఖ్య సందేశాలు లేదా సిద్ధాంతాన్ని సూచించండి.
-
మీ సాక్ష్యం మరియు తగిన అంతర్దృష్టులు, భావాలు మరియు వ్యక్తిగత అనుభవాలను పంచుకోండి.
-
మోర్మన్ గ్రంథ ప్రవక్తల మాటల నుండి నేరుగా సిద్ధాంతాన్ని బోధించండి. జనులు ఈ గ్రంథం యొక్క ఆధ్యాత్మిక శక్తిని అనుభూతి చెందడానికి అది సహాయపడుతుంది.
-
జనులు తాము చదివే వాటిని తమ జీవితాలతో “పోల్చుకోవడానికి” సహాయపడండి (1 నీఫై 19:23). లేఖనాలు వారితో వ్యక్తిగతంగా ఎలా సంబంధం కలిగియున్నాయో చూడడానికి వారికి సహాయపడండి.
మీరు ఈ సూత్రాలను వర్తింపజేసినప్పుడు, మోర్మన్ గ్రంథాన్ని స్వయంగా చదవగల సామర్థ్యం మరియు కోరికను జనులు పెంపొందించుకోవడానికి మీరు సహాయం చేస్తారు. బాప్తిస్మం మరియు జీవితకాల పరివర్తన వైపు పురోగమించడానికి ప్రతిరోజూ ఈ గ్రంథాన్ని చదవడం కీలకమని నొక్కి చెప్పండి.
మొరోనై 10:3–5లోని వాగ్దానంపై ఆధారపడండి. మోర్మన్ గ్రంథాన్ని హృదయపూర్వకంగా చదవమని మరియు అది నిజమని తెలుసుకోవడానికి నిజమైన ఉద్దేశ్యంతో ప్రార్థించమని జనులను ప్రోత్సహించండి. నిజమైన ఉద్దేశ్యం అంటే పరిశుద్ధాత్మ ద్వారా వారు పొందే సమాధానంపై చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉండడం అని వివరించండి. మోర్మన్ గ్రంథాన్ని హృదయపూర్వకంగా చదివి నిజమైన ఉద్దేశ్యంతో ప్రార్థించే ప్రతీ వ్యక్తి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దాని సత్యాన్ని తెలుసుకోగలరు.
మోర్మన్ గ్రంథం గురించి మీ స్వంత సాక్ష్యాన్ని బలోపేతం చేయడానికి మీరు కూడా ఈ వాగ్దానాన్ని క్రమం తప్పకుండా వర్తింపజేయాలి. ఈ వాగ్దానాన్ని అన్వయించుకునే వారు ఈ గ్రంథం దేవుని వాక్యమనే సాక్ష్యం పొందుతారని మీ సాక్ష్యం మీకు నమ్మకాన్ని ఇస్తుంది.
అధ్యయనము మరియు అన్వయము కొరకు ఉపాయములు
వ్యక్తిగత అధ్యయనము
-
2 నీఫై 2; 9; 30; 31; 32 చదవండి. యేసు క్రీస్తు గురించిన ప్రతి సూచికను ఎత్తిచూపండి. ఈ అధ్యాయాలలో క్రీస్తుకు ఉన్న వివిధ పేర్లు మరియు బిరుదుల జాబితాను రూపొందించండి. ఆయన మాట్లాడిన మాటలను గుర్తించండి. ఆయన గుణాలు మరియు చర్యలను ఎత్తిచూపండి.
-
మీరు మోర్మన్ గ్రంథం నుండి ప్రతిరోజూ చదువుతున్నప్పుడు, మీకు ప్రత్యేక అర్థాన్నిచ్చే గద్యభాగాలను మీ అధ్యయన పుస్తకంలో నమోదు చేయండి. మీరు వాటిని మీ జీవితంలో ఎలా అన్వయించుకుంటారో వ్రాయండి.
-
మోర్మన్ గ్రంథం సత్యమని మీరు మొదటిసారి ఆధ్యాత్మిక సాక్ష్యాన్ని పొందినప్పుడు మీరు ఎలా భావించారో మీ అధ్యయన పుస్తకంలో వ్రాయండి.
-
మీ అధ్యయన పుస్తకంలో ఈ క్రింది మూడు ప్రశ్నలను వ్రాయండి. మీ సువార్తసేవ అంతటా, ఈ ప్రశ్నలకు సమాధానాలను జోడించండి.
-
మోర్మన్ గ్రంథం లేకుండా నా జీవితం ఎలా ఉండేది?
-
మోర్మన్ గ్రంథం లేకుండా నాకు ఏమి తెలిసేది కాదు?
-
మోర్మన్ గ్రంథం లేకుండా నేను ఏమి కలిగియుండను?
-
-
మత్తయి 5–7లో కొండమీది ప్రసంగం మరియు 3 నీఫై 12–14లో దేవాలయం వద్ద క్రీస్తు ప్రసంగం చదవండి. వీటిని కలిపి చదవడం రక్షకుని బోధనలను బాగా అర్థం చేసుకోవడానికి మీకు ఎలా సహాయపడుతుంది?
-
మోర్మన్ గ్రంథంలో ఎవరైనా ప్రార్థించడాన్ని ప్రస్తావించే ప్రతి సందర్భాన్ని అధ్యయనం చేయండి. మీ అధ్యయన పుస్తకంలో, ప్రార్థన గురించి మోర్మన్ గ్రంథం నుండి మీరు నేర్చుకున్న వాటిని వ్రాయండి.
-
మోషైయ 11–16 అధ్యాయాల శీర్షికల నుండి, అబినడై బోధించిన దాని సారాంశాన్ని వ్రాయండి. తరువాత ఈ అధ్యాయాలను చదివి మీ సారాంశాన్ని విస్తరించండి.
-
మోషైయ 2–5 అధ్యాయాల శీర్షికల నుండి, రాజైన బెంజమిన్ బోధించిన దాని సారాంశాన్ని వ్రాయండి. తరువాత ఈ అధ్యాయాలను చదివి మీ సారాంశాన్ని విస్తరించండి.
సహచర అధ్యయనము మరియు సహచర మార్పిడి
-
మోర్మన్ గ్రంథములోని గద్యభాగాలను కలిసి చదవండి. మీరు నేర్చుకున్న వాటిని మరియు భావించిన వాటిని పంచుకోండి. మీరు వాటిని మీ జీవితంలో ఎలా అన్వయించుకుంటారో చర్చించండి.
-
ఆల్మా 26 మరియు 29లను కలిపి చదవండి. మీ సువార్తసేవ గురించి మీరు ఎలా భావిస్తున్నారో పంచుకోండి. మీ భావాలను మీ అధ్యయన పుస్తకంలో రాయండి.
-
ఆల్మా 37:9 చదివి, అమ్మోన్ మరియు అతని తోటి సువార్తికులకు లేఖనాలు ఎంత కీలకమైనవో చర్చించండి. వారు లేఖనాలను ఎలా ఉపయోగించారో వివరించే సూచికలను కనుగొనండి.
-
మీలో ఒకరు ఆల్మా లేదా అమ్యులెక్ పాత్రను మరియు మరొకరు విమర్శకుల పాత్రను తీసుకుంటూ, ఆల్మా 11–14 చదవండి. ఈ సువార్తికులు కష్టమైన ప్రశ్నలకు ఎలా స్పందించారో చర్చించండి.
జిల్లా సలహాసభ, జోన్ సభ్యసమావేశాలు మరియు మిషను నాయకత్వ సలహాసభ
-
ఈ అధ్యాయంలోని ప్రధాన శీర్షికలలో పేర్కొన్న ప్రతీ విధానంలో మోర్మన్ గ్రంథాన్ని ఉపయోగించడాన్ని సాధన చేయండి.
-
మీరు బోధిస్తున్న వారు లేవనెత్తిన ప్రశ్నలను జాబితా చేయండి. మోర్మన్ గ్రంథాన్ని ఉపయోగించి మీరు ఈ ప్రశ్నలకు ఎలా స్పందిస్తారో ఒకరికొకరు వివరించండి.
-
మోర్మన్ గ్రంథములోని గద్యభాగాలను కలిసి చదవండి. జ్ఞానం, భావాలు మరియు సాక్ష్యాలను పంచుకోండి.
-
పునఃస్థాపన సందేశాన్ని ధృవీకరించడానికి మోర్మన్ గ్రంథాన్ని ఉపయోగించడం సాధన చేయండి.
-
మోర్మన్ గ్రంథం వారికి మరియు వారు బోధించిన వారికి పరివర్తన ప్రక్రియలో సహాయపడిన అనుభవాలను పంచుకోవడానికి సువార్తికులను ఆహ్వానించండి.
-
ఆత్మ యొక్క ప్రశ్నకు జవాబివ్వడానికి సహాయపడే ఇష్టమైన మోర్మన్ గ్రంథ లేఖనాన్ని సువార్తికులను పంచుకోనివ్వండి.
-
పరివర్తన చెందిన సభ్యుడిని అతని లేదా ఆమె పరివర్తనలో మోర్మన్ గ్రంథం యొక్క పాత్రను పంచుకోవడానికి ఆహ్వానించండి.
మిషను నాయకులు మరియు మిషను సలహాదారులు
-
పునఃస్థాపన సందేశం యొక్క సత్యాన్ని నిర్ధారించడానికి మోర్మన్ గ్రంథాన్ని ఎలా ఉపయోగించాలో సువార్తికులకు నేర్పండి.
-
1 నీఫై 1ని సువార్తికులతో కలిసి చదివి, జోసెఫ్ స్మిత్ అనుభవంతో దానిని పోల్చండి.
-
మోర్మన్ గ్రంథం యొక్క శుభ్రమైన కాగితపు ప్రతిని సువార్తికులకు అందించండి. తదుపరి రెండు లేదా మూడు బదిలీ సమయాల్లో గ్రంథాన్ని రెండుసార్లు చదివి గుర్తు పెట్టమని వారిని ఆహ్వానించండి.
-
మొదటి పఠనంలో, యేసు క్రీస్తును సూచించే లేదా సాక్ష్యమిచ్చే ప్రతిదాన్ని గుర్తు పెట్టమని వారిని అడగండి.
-
రెండవ పఠనంలో, సువార్త సిద్ధాంతం మరియు సూత్రాలను గుర్తు పెట్టమని వారిని అడగండి.
సువార్తికులు వారు నేర్చుకున్న మరియు భావించిన వాటిని పంచుకోనివ్వండి. మోర్మన్ గ్రంథాన్ని ఈ విధంగా చదవడం ఆయనను ఒక సువార్తికునిగా ఎలా ప్రభావితం చేసిందో ఎల్డర్ రోనాల్డ్ ఎ. రాస్‌బాండ్ వివరించారు:
-
“నా పఠనంలో లేఖనాలను గుర్తించడం కంటే చాలా ఎక్కువే ఉంది. మొదలు నుండి చివరి వరకు, మోర్మన్ గ్రంథాన్ని చదివిన ప్రతీసారి నేను ప్రభువు కొరకు గాఢమైన ప్రేమతో నింపబడ్డాను. ఆయన బోధనల యొక్క సత్యము గురించి మరియు అవి ‘ఈ దినము’నకు ఎలా అన్వయిస్తాయనే దాని గురించి ఆవశ్యకమైన, లోతైన సాక్ష్యాన్ని నేను భావించాను. ‘యేసు క్రీస్తు యొక్క మరియొక నిబంధన’ అనే పేరు ఈ గ్రంథానికి సరిగ్గా సరిపోతుంది. ఆ అధ్యయనముతో మరియు పొందిన ఆత్మీయ సాక్ష్యముతో, నేను మోర్మన్ గ్రంథాన్ని ప్రేమించే సువార్తికునిగా మరియు యేసు క్రీస్తు యొక్క శిష్యునిగా మారాను” (“ఈ దినము,” లియహోనా, నవ. 2022, 25).
-
సువార్తికుల జీవితాల్లో ముఖ్యమైనవిగా ఉన్న మోర్మన్ గ్రంథ లేఖనాలను మీతో పంచుకోవడానికి వారిని ఆహ్వానించండి.
-
మీ మిషనులోని వ్యక్తుల ఆత్మ యొక్క ప్రశ్నలను గుర్తించండి. మోర్మన్ గ్రంథంలో ఈ ప్రశ్నలకు జవాబివ్వడానికి సహాయపడే వచనాలను కనుగొనమని సువార్తికులను ఆహ్వానించండి.