“నా సువార్తను ప్రకటించండి పరిచయము,” నా సువార్తను ప్రకటించండి: యేసు క్రీస్తు యొక్క సువార్తను పంచుకొనుటకు మార్గదర్శి (2023)
“పరిచయము,” నా సువార్తను ప్రకటించండి
నా సువార్తను ప్రకటించండి పరిచయము
“ఆత్మచేత అనగా సత్యమును బోధించుటకు పంపబడిన ఆదరణకర్త చేత నా సువార్తను ప్రకటించండి” (సిద్ధాంతము మరియు నిబంధనలు 50:14) అని ప్రభువు తన సేవకులకు నిర్దేశిస్తున్నారు.
నా సువార్తను ప్రకటించండి అనేది ఒక సువార్తికునిగా మీ ఉద్దేశాన్ని నెరవేర్చడంలో మీకు సహాయపడేందుకు రూపొందించబడింది. ఇది సువార్త పరిచర్య యొక్క ఆవశ్యకాలపై దృష్టి కేంద్రీకరిస్తుంది. ఇది ప్రతీ ప్రశ్నకు జవాబివ్వదు లేదా మీరు ఎదుర్కొనే ప్రతీ పరిస్థితికి నిర్దేశాన్ని ఇవ్వదు. అయితే, మీరు ఆధ్యాత్మిక శక్తి మరియు సామర్థ్యంలో ఎదగడానికి ఇదొక ముఖ్యమైన వనరు. లేఖనాలలో మరియు ఈ పుస్తకంలో కనుగొనబడే సువార్త సిద్ధాంతాలను మరియు సూత్రాలను అధ్యయనం చేసి, అన్వయించుకోండి.
నా సువార్తను ప్రకటించండి అనేది క్రింది విధాలుగా మీకు సహాయపడేందుకు ఏర్పాటు చేయబడింది:
-
ఒక సువార్తికునిగా మీ ఉద్దేశాన్ని అర్థం చేసుకోండి
-
సిద్ధాంతాన్ని నేర్చుకోండి మరియు బోధించండి
-
మీ ఆధ్యాత్మిక వృద్ధిలో మరియు వ్యక్తిగత పరివర్తనలో ఎదగండి
-
పునఃస్థాపించబడిన సువార్తను స్వీకరించడానికి జనులను ఆహ్వానించే మరియు సహాయపడే మీ సామర్థ్యాన్ని వృద్ధిచేసుకోండి
-
అధ్యాయము 8: లక్ష్యాలు మరియు ప్రణాళికల ద్వారా కార్యాన్ని సాధించండి
-
అధ్యాయము 10: యేసు క్రీస్తు నందు విశ్వాసము పెంపొందించడానికి బోధించండి
-
అధ్యాయము 11: జనులకు వాగ్దానాలు చేయడానికి మరియు పాటించడానికి సహాయపడండి
-
అధ్యాయము 12: జనులకు బాప్తిస్మము మరియు నిర్ధారణ కొరకు సిద్ధపడేందుకు సహాయపడండి
-
అధ్యాయము 13: సంఘమును స్థాపించడానికి నాయకులతో మరియు సభ్యులతో ఏకమవ్వండి
మీ సువార్తసేవ అంతటా అధ్యాయాలను పదే పదే అధ్యయనం చేయండి. మీ పనిని అంచనా వేయండి. లక్ష్యాలను నిర్దేశించుకోండి మరియు వాటిని సాధించడానికి ప్రణాళికలు రూపొందించండి. ప్రతిరోజూ తమనుతాము సిద్ధం చేసుకుని, క్రమం తప్పకుండా మెరుగుపరచుకునే సువార్తికులు వారు బోధించే మరియు సేవ చేసే వారి జీవితాలను ఆశీర్వదిస్తారు. వారు తమ స్వంత జీవితాల్లో కూడా ఆశీర్వాదాలను పొందుతారు.
అధ్యయనానికి మరియు అభ్యాసానికి అవకాశాలు
మీ సువార్తసేవ సమయంలో ప్రభావవంతమైన అధ్యయనం, సువార్త గురించి మీ సాక్ష్యాన్ని బలపరచడానికి మరియు యేసు క్రీస్తు యొక్క మరింత నమ్మకమైన శిష్యుడిగా మారడానికి మీకు సహాయపడుతుంది.
లేఖనాలు మరియు నా సువార్తను ప్రకటించండి అధ్యయనం చేయడం ఆధ్యాత్మిక శక్తితో బోధించడానికి మీకు సహాయపడుతుంది. ఇది మీ బోధనను వ్యక్తుల అవసరాలకు అనుగుణంగా మార్చడంలో కూడా మీకు సహాయపడుతుంది.
ముఖ్యమైన అధ్యయనం మరియు అభ్యాస అవకాశాలలో ఇవి ఉన్నాయి:
-
వ్యక్తిగత అధ్యయనము.
-
సహచర అధ్యయనము.
-
సహచర మార్పిడి.
-
జిల్లా సలహాసభ సమావేశాలు.
-
జోన్ సభ్యసమావేశాలు.
-
మిషను నాయకత్వ సలహాసభ (యువ సువార్తికుల నాయకుల కొరకు)
చాలా రోజులలో, మీ సువార్తికుల షెడ్యూల్‌లో వ్యక్తిగత మరియు సహచర అధ్యయనానికి సమయం ఉంటుంది. మీ రోజువారీ షెడ్యూల్ గురించి సమాచారం కొరకు Missionary Standards for Disciples of Jesus Christ, 2.4 చూడండి.
వ్యక్తిగత అధ్యయనములో మీరు నేర్చుకొనేది సహచర అధ్యయనములో మరియు పైన పేర్కొన్న ఇతర అభ్యాస అవకాశాలలో మీకు సహాయపడుతుంది. ఈ సందర్భాలలో “పరలోక రాజ్యపు సిద్ధాంతమును మీరు ఒకరికొకరు బోధిస్తారు” (సిద్ధాంతము మరియు నిబంధనలు 88:77).
నా సువార్తను ప్రకటించండి యొక్క మీ అధ్యయనమును మెరుగుపరచుటకు ఉపాయములు
రక్షకుడిని మరియు ఆయన సువార్తను తెలుసుకోవడానికి మీకు సహాయపడడానికి, నా సువార్తను ప్రకటించండి లేఖనాలను మరియు సువార్త సూత్రాలను కలిపి అల్లుతుంది. ఇది మిమ్మల్ని లేఖనాల వైపు ఆకర్షించడానికి మరియు వాటి అధ్యయనాన్ని మెరుగుపరచడానికి ఉద్దేశించబడింది. మీ సువార్తసేవ అంతటా ప్రతి అధ్యాయంలోని లేఖన సూచికలను అధ్యయనం చేయండి.
నా సువార్తను ప్రకటించండి లోని ప్రతి అధ్యాయంలో మీరు నేర్చుకుంటున్న వాటిని అధ్యయనం చేయడానికి మరియు అన్వయించుకోవడానికి మీకు సహాయపడే ఆలోచనలు మరియు కార్యకలాపాలు ఉంటాయి. మీ వ్యక్తిగత మరియు సహచర అధ్యయనంలో వీటిని ఉపయోగించండి (సువార్తికుల ప్రమాణాలు, 2.4 చూడండి). మీ జిల్లా సలహాసభ సమావేశాలలో మరియు జోన్ సభ్యసమావేశాలలో కూడా మీరు వాటిని ఉపయోగించవచ్చు. మీరు నేర్చుకొనే దానిని అన్వయించుకోవడానికి మీరు మార్గాలను కనుగొన్నప్పుడు మీ అధ్యయనం మరింత ప్రభావవంతంగా ఉంటుంది.
మీ వ్యక్తిగత అధ్యయనము కోసం ఒక ప్రణాళికను వేసుకోవడం సహాయకరంగా ఉంటుంది. మీరు బాగా అర్థం చేసుకోవాలనుకునే సువార్త సూత్రాలకు ప్రాధాన్యతనిచ్చే మీ స్వంత ప్రణాళికను మీరు రూపొందించుకోవచ్చు. నా సువార్తను ప్రకటించండి లోని అధ్యాయాల చుట్టూ కూడా మీ అధ్యయనాన్ని మీరు రూపొందించవచ్చు. ఉదాహరణకు, మీరు బోధించే సిద్ధాంతం మరియు సూత్రాల అధ్యయనానికి మార్గనిర్దేశం చేయడానికి మీరు 3వ అధ్యాయంలోని పాఠాలను ఉపయోగించవచ్చు. మీరు మీ స్వంత మాటలలో ఆత్మ ద్వారా బోధించగలిగేలా ఈ పాఠాలను బాగా తెలుసుకోవాలి.
మీరు అధ్యయనం చేస్తున్నప్పుడు వివరాలు వ్రాసుకోండి. మీరు నేర్చుకుంటున్న వాటిని అర్థం చేసుకోవడానికి, వివరించడానికి మరియు గుర్తుంచుకోవడానికి సహాయపడేలా ఒక కాగితం లేదా ఎలక్ట్రానిక్ అధ్యయన పుస్తకాన్ని (సువార్త గ్రంథాలయం వంటివి) ఉపయోగించండి.
మీరు నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ సహాయం కోసం ప్రార్థించడం ద్వారా మీ అధ్యయనాన్ని ప్రారంభించండి. ఆయన మీ జీవితాన్ని ఆశీర్వదించే మరియు ఇతరులను ఆశీర్వదించడానికి మిమ్మల్ని అనుమతించే జ్ఞానం, అవగాహన మరియు దృఢ నిశ్చయాన్ని తెస్తారు. ఆయన నుండి మీరు పొందే మనోభావాలు మరియు అంతర్దృష్టులకు మీ మనస్సును, హృదయాన్ని తెరవండి. ఈ అంతర్దృష్టులను మీ వివరాలలో చేర్చండి.
ఆధ్యాత్మిక అనుభవాలను గుర్తుకు తెచ్చుకోవడానికి, కొత్త అంతర్దృష్టులను చూడడానికి మరియు మీ ఎదుగుదలను గుర్తించడానికి మీ అధ్యయన పుస్తకాన్ని క్రమం తప్పకుండా సమీక్షించండి.
నా సువార్తను ప్రకటించండి వినియోగము
మీరు నేర్చుకుంటున్న సూత్రాలను అన్వయించుకోవడానికి మీకు సహాయపడేలా నా సువార్తను ప్రకటించండి యాప్‌ను ఉపయోగించండి. ఈ యాప్ మీ మొబైల్ పరికరంలో అందుబాటులో ఉంది. సువార్తికునిగా మీ ఉద్దేశ్యాన్ని బాగా నెరవేర్చడంలో మీకు సహాయపడే లక్షణాలను ఇది కలిగి ఉంది. ఈ లక్షణాలలో ఇవి కలవు:
-
మీరు బోధిస్తున్న వ్యక్తుల అవసరాలు మరియు పురోగతిని గురించి సమాచారం.
-
కీలక సూచిక లక్ష్యాల వైపు మీ పురోగతిని నమోదు చేయడానికి ఒక స్థలం.
-
మీ ప్రణాళికలను నమోదు చేయడానికి మరియు కార్యకలాపాలను షెడ్యూల్ చేయడానికి ఒక క్యాలెండరు.
-
మీ లక్ష్యాలను సాధించడంలో మీకు సహాయపడడానికి మీ ప్రాంతం యొక్క భౌగోళిక పటము మరియు ఇతర ముఖ్యమైన సమాచారం.
నా సువార్తను ప్రకటించండి అనేది జనులను కనుగొనడానికి, బోధించడానికి మరియు బాప్తిస్మమివ్వడానికి మీకు సహాయపడేందుకు యాప్‌ను ఉపయోగించడం కోసం అనేక ఆలోచనలను కలిగియుంది.
సంఘ సభ్యులచేత నా సువార్తను ప్రకటించండి యొక్క ఉపయోగము
నా సువార్తను ప్రకటించండి అనేది సువార్తికులకు మాత్రమే కాకుండా సంఘ సభ్యులందరికీ విలువైన వనరు. ఉదాహరణకు, దీనిని అధ్యయనం చేయడం సభ్యులకు ఇలా సహాయపడుతుంది:
-
యేసు క్రీస్తు యొక్క సువార్తను నేర్చుకోవడానికి మరియు బోధించడానికి (అధ్యాయాలు 1, 2, 3 మరియు 10 చదవండి).
-
సువార్త గురించి ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి (అధ్యాయాలు 3 మరియు 5 చదవండి).
-
పరిశుద్ధాత్మను వెదకడం మరియు దానిపై ఆధారపడడం గురించి మరింత అర్థం చేసుకోవడానికి (అధ్యాయము 4 చదవండి).
-
మోర్మన్ గ్రంథము యొక్క శక్తిని అర్థం చేసుకోవడానికి (అధ్యాయము 5 చదవండి).
-
క్రీస్తువంటి లక్షణాలను వెదకడానికి (అధ్యాయము 6 చదవండి).
-
ప్రేమించు, పంచుకొను మరియు ఆహ్వానించు అనే సూత్రాలను పాటించడం ద్వారా సువార్తను పంచుకోవాలనే వారి నిబంధన బాధ్యతను నెరవేర్చడానికి (అధ్యాయాలు 9 మరియు 13 చదవండి).
-
పూర్తి-కాల సువార్తికులతో ఐక్యతను పెంచుకోవడానికి (అధ్యాయము 13 చదవండి).
నా సువార్తను ప్రకటించండి—ముఖ్యంగా అధ్యాయము 3—అధ్యయనం చేయడం సువార్త సేవకు సిద్ధమవుతున్న యౌవనులు మరియు వృద్ధులు ఇద్దరికీ ప్రత్యేకంగా సహాయపడుతుంది.