“అధ్యాయము 1: సువార్తికునిగా మీ ఉద్దేశ్యమును నెరవేర్చండి,” నా సువార్తను ప్రకటించండి: యేసు క్రీస్తు యొక్క సువార్తను పంచుకొనుటకు మార్గదర్శి (2023)
“అధ్యాయము 1,” నా సువార్తను ప్రకటించండి
ఈ యుగంలోని గొప్ప సువార్తికులలో ఒకరైన డాన్ జోన్స్ వేల్స్‌లో సువార్తను ప్రకటిస్తున్నాడు.
© 1993 క్లార్క్ కెల్లీ ప్రైస్. నకలు చేయరాదు.
అధ్యాయము 1
సువార్తికునిగా మీ ఉద్దేశ్యమును నెరవేర్చండి
మీ ఉద్దేశ్యము: యేసు క్రీస్తునందు మరియు ఆయన ప్రాయశ్చిత్తమునందు విశ్వాసము, పశ్చాత్తాపము, బాప్తిస్మము, పరిశుద్ధాత్మ వరమును పొందుట మరియు అంతము వరకు సహించుట ద్వారా పునఃస్థాపించబడిన సువార్తను పొందడానికి వారికి సహాయపడుట ద్వారా క్రీస్తునొద్దకు వచ్చుటకు ఇతరులను ఆహ్వానించండి.
దీనిని పరిగణించండి
-
ఒక సువార్తికునిగా నా ఉద్దేశ్యం ఏమిటి?
-
నా పిలుపుతో ఏ అధికారం మరియు శక్తి వస్తుంది?
-
నేను ఆత్మపై ఎలా ఆధారపడాలి, గుర్తించాలి మరియు బోధించాలి?
-
యేసు క్రీస్తు యొక్క సువార్త అంటే ఏమిటి?
-
పునఃస్థాపన యొక్క సందేశం ఏమిటి? ఇది ఎందుకు చాలా ముఖ్యమైనది?
-
యేసు క్రీస్తు యొక్క సంఘాన్ని స్థాపించి, నిర్మించడంలో నా బాధ్యత ఏమిటి?
-
నేను విజయవంతమైన సువార్తికుడినో కాదో నాకు ఎలా తెలుస్తుంది?
యేసు క్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన సువార్తను బోధించడానికి మీ నియామకం
మీరు జనులతో చుట్టుముట్టబడ్డారు. వీధిలో మీరు వారిని దాటి వెళ్తారు మరియు వారి మధ్య ప్రయాణిస్తారు. వారి ఇళ్లలో మీరు వారిని సందర్శిస్తారు మరియు ఆన్‌లైన్‌లో వారితో జతచేరుతారు. వారందరూ దేవుని పిల్లలు—మీ సహోదర సహోదరీలు. దేవుడు మిమ్మల్ని ప్రేమించినట్లే వారిని ప్రేమిస్తారు.
వారిలో చాలామంది జీవిత లక్ష్యం కోసం వెదుకుతున్నారు. వారు తమ భవిష్యత్తు గురించి మరియు వారి కుటుంబాల గురించి ఆందోళన చెందుతున్నారు. వారు దేవుని పిల్లలని మరియు ఆయన నిత్య కుటుంబంలో సభ్యులని తెలుసుకోవడం వల్ల కలిగే చెందియున్నామనే భావన వారికి అవసరం. మారుతున్న విలువలు గల ప్రపంచంలో వారు సురక్షితంగా ఉండాలని కోరుతున్నారు. వారు “ఈ లోకంలో శాంతిని మరియు రాబోయే లోకంలో నిత్యజీవమును” కోరుతున్నారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 59:23).
అనేకులు “కేవలము సత్యమును ఎక్కడ కనుగొనవలెనో తెలియకపోవుట వలన దానిని యెరుగకయున్నారు” (సిద్ధాంతము మరియు నిబంధనలు 123:12). ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా పునఃస్థాపించబడిన యేసు క్రీస్తు యొక్క సువార్త నిత్య సత్యాన్ని అందిస్తుంది. ఈ సత్యం జనుల ఆధ్యాత్మిక అవసరాలను తీరుస్తుంది మరియు వారి లోతైన కోరికలను నెరవేర్చడంలో సహాయపడుతుంది.
యేసు క్రీస్తు యొక్క అధికార ప్రతినిధిగా, మీరు “పరిశుద్ధ మెస్సీయ యందు మరియు ఆయన ద్వారానే విమోచన వచ్చును” (2 నీఫై 2:6) అని బోధిస్తారు. మీరు జనులను క్రీస్తు నొద్దకు రమ్మని, ఆయనకు మరియు పునఃస్థాపించబడిన ఆయన సువార్తకు మార్పుచెందమని ఆహ్వానిస్తారు. వారు మీ ఆహ్వానాన్ని అంగీకరించినప్పుడు, వారికి గొప్ప ఆనందం, నిరీక్షణ, శాంతి మరియు ఉద్దేశ్యం కలుగుతాయి.
రక్షకుని వద్దకు రావడానికి, జనులు ఆయనపై విశ్వాసం కలిగి ఉండాలి. ఈ విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి మీరు వారికి ఇలా సహాయం చేయవచ్చు:
-
యేసు క్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన సువార్తను వారికి బోధించండి మరియు దాని సత్యాన్ని గురించి వారికి సాక్ష్యమివ్వండి.
-
దాని బోధనల ప్రకారం జీవించడానికి కట్టుబడి ఉండమని వారిని ఆహ్వానించండి.
-
వారు చేసిన వాగ్దానాల గురించి అడుగుతూ, వాటిని పాటించడంలో వారికి సహాయపడండి.
-
పరిశుద్ధాత్మ ప్రభావాన్ని వారు అనుభవించే అనుభవాలను పొందడంలో వారికి సహాయపడండి (1 నీఫై 10:17–19 చూడండి).
యేసు క్రీస్తునందు విశ్వాసం జనులు పశ్చాత్తాపపడడానికి దారితీస్తుంది. మన పాపాల కొరకు ప్రాయశ్చిత్తం చేయడం ద్వారా యేసు పశ్చాత్తాపాన్ని సాధ్యం చేసారు. జనులు పశ్చాత్తాపపడినప్పుడు, వారు పాపం నుండి శుద్ధి చేయబడి, పరలోక తండ్రికి మరియు యేసు క్రీస్తుకు దగ్గరగా ఎదుగుతారు. క్షమాపణ పొందడం వల్ల కలిగే ఆనందాన్ని మరియు శాంతిని వారు అనుభవిస్తారు.
పశ్చాత్తాపం జనులను బాప్తిస్మపు నిబంధన మరియు పరిశుద్ధాత్మ వరము కొరకు సిద్ధం చేస్తుంది. “అంత్యదినమున మీరు నా యెదుట మచ్చలేక యుండునట్లు, పరిశుద్ధాత్మను పొందుట ద్వారా పరిశుద్ధపరచబడునట్లు, భూదిగంతములలో నున్న మీరందరు పశ్చాత్తాపపడి నా యొద్దకు రండి మరియు నా నామమున బాప్తిస్మము పొందుడి” (3 నీఫై 27:20) అని రక్షకుడు చెప్పారు.
రక్షకుడు మరియు ఆయన ప్రాయశ్చిత్తము గురించి మీ అవగాహన మరియు సాక్ష్యం పెరుగుతున్న కొద్దీ, సువార్తను పంచుకోవాలనే మీ కోరిక పెరుగుతుంది. మీరు కూడా లీహై వలె, “భూనివాసులకు ఈ విషయములను తెలియజేయుట ఎంతో ముఖ్యమైనది” (2 నీఫై 2:8) అని భావిస్తారు.
The Tree of Life [జీవవృక్షము], డమీర్ క్రివెంకో చేత
వ్యక్తిగత లేదా సహచర అధ్యయనము
1 నీఫై 8 మరియు 11 లోని జీవవృక్ష దర్శనాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు దానితో పాటు ఉన్న చిత్రాన్ని పరిశీలించండి.
-
ఈ దర్శనంలో జీవ వృక్షం దేనిని సూచిస్తుంది? (1 నీఫై 11:21–23 చూడండి.)
-
ఫలమును తినిన తర్వాత లీహై ఏమి కోరుకున్నాడు? (1 నీఫై 8:10–18 చూడండి.)
-
దర్శనములో, ఫలమును తినడానికి జనులు ఏమి చేయవలసియున్నది? రక్షకుని ప్రాయశ్చిత్తం యొక్క ఆశీర్వాదాలన్నింటిని పొందడానికి మనం ఏమి చేయాలి? ఈ ఆశీర్వాదాలలో పాలుపంచుకోవడానికి నిబద్ధతలు మరియు నిబంధనలు మనకు ఏ విధాలుగా సహాయపడతాయి?
-
సువార్త ఫలాలలో పాలుపంచుకోవడానికి మీరు ఇతరులకు ఎలా సహాయం చేయగలరు?
మీ పిలుపు యొక్క అధికారం మరియు శక్తి
“మహాసంతోషకరమైన సువర్తమానములను అనగా నిత్యసువార్తను [ప్రకటించడానికి]” (సిద్ధాంతము మరియు నిబంధనలు 79:1) మీరు పిలువబడి, ప్రత్యేకపరచబడ్డారు. మోషైయ కుమారులవలె, మీరు దేవుని యొక్క అధికారం మరియు శక్తితో బోధించగలరు (ఆల్మా 17:2–3 చూడండి).
క్రీస్తు యొక్క మార్గనిర్దేశంలో, ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా సువార్తను ప్రకటించే అధికారం పునఃస్థాపించబడింది. మీరు సువార్తికునిగా ప్రత్యేకపరచబడినప్పుడు, మీరు ఈ అధికారాన్ని పొందారు. దీనితో పాటు ప్రభువుకు ప్రాతినిధ్యం వహించే మరియు ఆయన సువార్తను బోధించే హక్కు, విశేషాధికారం మరియు బాధ్యత కూడా వస్తుంది.
ఈ అధికారంలో మీ పిలుపుకు యోగ్యులుగా జీవించే బాధ్యత కూడా ఉంటుంది. మీరు ప్రత్యేకపరచబడడాన్ని గంభీరంగా తీసుకోండి. పాపానికి మరియు అనాగరికమైన లేదా అసభ్యకరమైన దేనికైనా దూరంగా ఉండండి. ఇహలోక విధానాలు మరియు ఆలోచనలకు దూరంగా ఉండండి. Missionary Standards for Disciples of Jesus Christ లోని ప్రమాణాలను అనుసరించండి. ప్రభువు యొక్క ప్రతినిధిగా, “విశ్వాసులకు మాదిరిగానుండండి” (1 తిమోతి 4:12). మీ చర్యలు మరియు మాటల ద్వారా యేసు క్రీస్తు నామాన్ని గౌరవించండి.
అధికారంతో పాటు, మీ పిలుపును నెరవేర్చడానికి మీకు ఆధ్యాత్మిక శక్తి అవసరం. మీరు ఆయన గురించి, యేసు క్రీస్తు గురించి మరియు మీరు బోధించే సువార్త సత్యాల గురించి మీ సాక్ష్యాన్ని బలోపేతం చేసుకోవడానికి నిరంతరం పని చేస్తున్నప్పుడు దేవుడు ఆధ్యాత్మిక శక్తిని ఇస్తారు. మీరు ప్రార్థించేటప్పుడు, లేఖనాలను అధ్యయనం చేస్తున్నప్పుడు మరియు సువార్తికునిగా మీ ఉద్దేశ్యాన్ని నెరవేర్చడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆయన ఆధ్యాత్మిక శక్తిని అనుగ్రహిస్తారు. మీరు ఆయన ఆజ్ఞలను మరియు రక్షణ విధులను పొందినప్పుడు మీరు చేసిన నిబంధనలను పాటించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆయన ఆధ్యాత్మిక శక్తిని ఇస్తారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 35:24 చూడండి).
మీరు క్రింది విధంగా చేసినప్పుడు ఆధ్యాత్మిక శక్తి ప్రత్యక్షపరచబడగలదు:
-
జనులకు బోధించడానికి, సువార్త సత్యాల గురించి వారి అవగాహనను మరింతగా పెంచడానికి లేఖనాలను ఉపయోగించండి మరియు ఈ సత్యాలు వారి జీవితాలకు ఎలా వర్తిస్తాయో చూడడానికి వారికి సహాయపడండి (1 నీఫై 19:23; ఆల్మా 26:13; 31:5 చూడండి).
-
మీరు ఏమి చెప్పాలని ప్రభువు కోరుకుంటున్నారో దాని గురించి ఆత్మ యొక్క మార్గదర్శకత్వాన్ని పొందండి (సిద్ధాంతము మరియు నిబంధనలు 84:85 చూడండి).
-
ఎక్కడికి వెళ్లాలి మరియు ఏమి చేయాలి అనే దాని గురించి ఆత్మ యొక్క మార్గదర్శకత్వాన్ని పొందండి (సిద్ధాంతము మరియు నిబంధనలు 28:15; 31:11; 75:26–27) చూడండి).
-
ఆత్మ యొక్క సాక్ష్యం ద్వారా మీ బోధన మరియు సాక్ష్యం ధృవీకరించబడేలా చేయండి (2 నీఫై 33:1; సిద్ధాంతము మరియు నిబంధనలు 100:5–8 చూడండి).
-
రక్షణ విధులలో పాలుపొందండి (సిద్ధాంతము మరియు నిబంధనలు 84:19–20 చూడండి).
-
మీరు ఒక ఎల్డర్ అయితే, యాజకత్వ దీవెనలు ఇవ్వండి (యాకోబు 5:14–15 చూడండి).
-
మీరు పనిచేస్తున్న వ్యక్తులతో కలిసి మరియు వారి కొరకు ప్రార్థించండి (ఆల్మా 6:6; 8:18–22; 10:7–11; 31:26–35; సిద్ధాంతము మరియు నిబంధనలు 75:19 చూడండి).
-
ప్రభువు కొరకు, మీ కుటుంబము కొరకు , ఇతర సువార్తికుల కొరకు మరియు మీరు సేవచేసే జనుల కొరకు ప్రేమను, కృతజ్ఞతను వ్యక్తపరచండి (సిద్ధాంతము మరియు నిబంధనలు 59:7; 78:19 చూడండి).
లేఖన అధ్యయనము
మీరు సాక్ష్యాన్ని ఎలా పొందుతారు మరియు బలపరుస్తారు?
మీరు ఆధ్యాత్మిక శక్తిని ఎలా పొందుతారు?
-
1 కొరింథీయులకు 2:4
వ్యక్తిగత అధ్యయనము
మీరు దేవునితో చేసిన ఈ క్రింది నిబంధనలను సమీక్షించి, ధ్యానించండి. ఈ నిబంధనలను పాటించే వారికి దేవుడు వాగ్దానం చేసిన ఆశీర్వాదాలను అధ్యయనం చేయండి. వాటిని పాటించడం ద్వారా మీరు పొందిన ఆశీర్వాదాలపై ప్రతిబింబించండి. మీ మనోభావాలను మీ అధ్యయన పుస్తకంలో నమోదు చేసుకోండి.
బాప్తిస్మము మరియు నిర్ధారణ
-
యేసు క్రీస్తు నామమును మీపై తీసుకోవడానికి సమ్మతించడం.
-
దేవుని ఆజ్ఞలు పాటించడం.
-
దేవునికి మరియు ఇతరులకు సేవ చేయడం.
-
అంతము వరకు సహించడం.
-
(2 నీఫై 31:6–13; మోషైయ 18:8–10, 13; సిద్ధాంతము మరియు నిబంధనలు 20:37 చూడండి.)
యాజకత్వ నియామకము (ఎల్డర్ల కొరకు)
-
విశ్వాసముగా ఉండండి.
-
మీ పిలుపును ఘనపరచండి.
-
నిత్య జీవపు మాటలకు శ్రద్ధతో చెవియొగ్గండి.
-
(సిద్ధాంతము మరియు నిబంధనలు 84:33–44 చూడండి.)
దేవాలయ వరము
-
విధేయత యొక్క చట్టమును జీవించండి.
-
బలి యొక్క చట్టమునకు లోబడియుండండి.
-
యేసు క్రీస్తు సువార్త యొక్క చట్టమునకు లోబడియుండండి.
-
పవిత్రత యొక్క చట్టమును పాటించండి.
-
సమర్పణ యొక్క చట్టమును పాటించండి.
-
(ప్రధాన చేతిపుస్తకము, 27.2 చూడండి.)
వ్యక్తిగత లేదా సహచర అధ్యయనము
యోహాను 15:1–16 చదవండి. క్రీస్తు ఏ విధంగా ద్రాక్షతీగ వంటివారు? మీరు ఆ ద్రాక్షతీగ యొక్క కొమ్మ ఎలా అయ్యున్నారు? మీరు ప్రత్యేకపరచబడడం ఈ బంధంతో ఎలా సంబంధం కలిగి ఉంది?
మీ పరిచర్య ధృవపత్రాన్ని చదవండి. మీరు చదివిన దాని గురించి మీ భావాలను మరియు ఆలోచనలను నమోదు చేయండి. మీరు ఈ అధ్యాయాన్ని అధ్యయనం చేసిన ప్రతిసారీ, ఈ ప్రక్రియను పునరావృతం చేయడాన్ని పరిగణించండి. కాలక్రమేణా మీ భావాలు ఎలా మారతాయో గమనించండి.
వ్యక్తిగత అధ్యయనము
సిద్ధాంతము మరియు నిబంధనలు 109:13–15, 21–30, 38–39, 55–57 అధ్యయనం చేయండి. ఈ వచనాలు కర్ట్‌లాండ్ దేవాలయం కోసం ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ యొక్క ప్రేరేపిత ప్రతిష్ఠాపన ప్రార్థన నుండి తీసుకోబడిన సారాంశాలు.
ప్రభువు యొక్క పరిశుద్ధ మందిరంలో వరము పొందిన విశ్వాసుల కోసం జోసెఫ్ స్మిత్ అభ్యర్థించిన ఆశీర్వాదాల జాబితాను వ్రాయండి. ఈ ఆశీర్వాదాల గురించి మీ భావాలు ఏవి?
పరిశుద్ధాత్మను మీతో కలిగి ఉండడానికి ప్రయత్నించండి
మీరు సంఘ సభ్యుడిగా నిర్ధారించబడినప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందారు. ఒక సువార్తికునిగా—మరియు మీ జీవితాంతం—మీ గొప్ప అవసరాలలో ఒకటి పరిశుద్ధాత్మను మీతో కలిగి ఉండడం (1 నీఫై 10:17; 3 నీఫై 19:9 చూడండి). పరిశుద్ధాత్మ దైవసమూహములో మూడవ సభ్యుడు.
పరిశుద్ధాత్మ మిమ్మల్ని నడిపిస్తారు, బోధిస్తారు మరియు ఓదారుస్తారు. ఆయన మిమ్మల్ని శుద్ధి చేసి పవిత్రపరుస్తారు. ఆయన సత్యాన్ని గురించి సాక్ష్యమిస్తారు మరియు తండ్రి, కుమారుల గురించి సాక్ష్యమిస్తారు. ఆయన మీ పరివర్తనను మరియు మీరు బోధించే వారికి పరివర్తనను తెస్తారు. (3 నీఫై 27:20; 28:11; ఈథర్ 12:41; మొరోనై 8:26; 10:5; యోహాను 15:26 చూడండి.)
పరిశుద్ధాత్మ “మీరు చేయవలసిన కార్యములన్నిటినీ మీకు చూపును” (2 నీఫై 32:5). ఆయన మీ సామర్థ్యాలను మరియు సేవను మీరు మీ స్వంతంగా చేయగలిగే దానికంటే చాలా ఎక్కువగా ఘనపరుస్తారు.
పరిశుద్ధాత్మ మీతో ఉండాలని కోరుకోవడం మీ అత్యంత హృదయపూర్వక కోరికలలో ఒకటిగా ఉండాలి. మీరు ఇలా చేసినప్పుడు ఆయన సహవాసాన్ని మీరు అనుభూతి చెందుతారు:
-
ప్రార్థించినప్పుడు (సిద్ధాంతము మరియు నిబంధనలు 42:14 చూడండి).
-
దేవుని వాక్యాన్ని భద్రపరచుకున్నప్పుడు (సిద్ధాంతము మరియు నిబంధనలు 11:21; 84:85 చూడండి).
-
మీ హృదయాన్ని శుద్ధిచేసుకున్నప్పుడు (సిద్ధాంతము మరియు నిబంధనలు 112:28 చూడండి).
-
ఆజ్ఞలను పాటించినప్పుడు (సిద్ధాంతము మరియు నిబంధనలు 130:20–21 చూడండి).
-
ప్రతీవారము సంస్కారములో పాల్గొన్నప్పుడు (మొరోనై 4–5; సిద్ధాంతము మరియు నిబంధనలు 20:77, 79 చూడండి).
“బయల్పాటును పొందుటకు మీ ఆత్మీయ సామర్థ్యమును హెచ్చించమని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. … పరిశుద్ధాత్మ యొక్క వరమును ఆనందించుటకు మరియు ఆత్మ యొక్క స్వరమును ఎక్కువ తరచుగా, ఎక్కువ స్పష్టముగా వినుటకు అవసరమైన ఆత్మీయమైన కార్యము చేయుటకు ఎంపిక చేయుము” (రస్సెల్ ఎమ్. నెల్సన్, “సంఘము కొరకు బయల్పాటు, మన జీవితాల కొరకు బయల్పాటు,” లియహోనా, మే 2018, 96).
ఆత్మను గుర్తించడాన్ని నేర్చుకోండి
పరిశుద్ధాత్మ మార్గదర్శకత్వాన్ని గుర్తించడాన్ని మరియు అనుసరించడాన్ని నేర్చుకోవడం ద్వారా మీరు సువార్తికునిగా మీ ఉద్దేశ్యాన్ని బాగా నెరవేరుస్తారు. ఆత్మ సాధారణంగా మీ భావాలు మరియు ఆలోచనల ద్వారా నిశ్శబ్దంగా సంభాషిస్తాడు. ఈ సూక్ష్మమైన ప్రేరేపణలను వెదకడానికి, గుర్తించడానికి మరియు అనుసరించడానికి మిమ్మల్ని మీరు అంకితం చేసుకోండి. అవి అనేక విధాలుగా వస్తాయి (4వ అధ్యాయము చూడండి; సిద్ధాంతము మరియు నిబంధనలు 8:2–3; 11:12–14; గలతీయులకు 5:22–23 కూడా చూడండి).
ఆత్మచేత బోధించండి
యేసు క్రీస్తు యొక్క సువార్త “నమ్ము ప్రతివానికి రక్షణ కలుగజేయుటకు దేవుని శక్తియైయున్నది” (రోమీయులకు 1:16). ఆ కారణంగా, సువార్త యొక్క పునఃస్థాపన సందేశాన్ని దైవిక శక్తి ద్వారా—పరిశుద్ధాత్మ శక్తి ద్వారా బోధించాలి.
“విశ్వాస సహితమైన ప్రార్థన ద్వారా ఆత్మ మీకు అనుగ్రహించబడును; మీరు ఆత్మను పొందనియెడల, మీరు బోధించరాదు” (సిద్ధాంతము మరియు నిబంధనలు 42:14; 50:13–14, 17–22 కూడా చూడండి) అని ప్రభువు చెప్పారు. మీరు పరిశుద్ధాత్మ శక్తితో బోధించేటప్పుడు, ఆయన ఇలా చేస్తారు:
-
మీకు సత్యాన్ని బోధించి, మీరు అధ్యయనం చేసిన సిద్ధాంతాన్ని మీకు జ్ఞాపకం చేస్తారు (యోహాను 14:26 చూడండి).
-
మీకు అవసరమైనప్పుడు మాట్లాడడానికి మీకు మాటలు అనుగ్రహిస్తారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 84:85 చూడండి).
-
మీరు బోధించే వ్యక్తుల హృదయాలకు మీ సందేశాన్ని తీసుకువెళ్తారు (2 నీఫై 33:1 చూడండి).
-
మీరు—మరియు ఆత్మ ద్వారా స్వీకరించేవారు—ఒకరినొకరు అర్థం చేసుకొని అభివృద్ధి చెందడానికి మరియు కలిసి ఆనందించడానికి మీకు సహాయం చేస్తారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 50:17–22 చూడండి).
-
మీ సందేశం యొక్క సత్యానికి సాక్ష్యమిస్తారు మరియు మిమ్మల్ని స్వీకరించే వారికి మీ మాటలను ధృవీకరిస్తారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 100:5–8 చూడండి).
మీరు పరిశుద్ధాత్మను వెదికి, ఆయనపై ఆధారపడి, ఆయన ద్వారా బోధించినప్పుడు ప్రభువు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తారు (4 మరియు 10వ అధ్యాయాలు చూడండి).
క్రీస్తు యొక్క సువార్త మరియు క్రీస్తు యొక్క సిద్ధాంతము
యేసు క్రీస్తు సువార్త మీ సందేశాన్ని మరియు మీ ఉద్దేశ్యాన్ని నిర్వచిస్తుంది. ఇది మీ సువార్త సేవ యొక్క “ఏమిటి” మరియు “ఎందుకు” అనే రెండింటినీ అందిస్తుంది. ఆయన సువార్తలో మన రక్షణ మరియు ఉన్నతస్థితికి అవసరమైన అన్ని సిద్ధాంతాలు, సూత్రాలు, చట్టాలు, ఆజ్ఞలు, విధులు మరియు నిబంధనలు ఉన్నాయి.
సువార్త సందేశం ఏమిటంటే, మనం యేసు క్రీస్తు యందు విశ్వాసాన్ని సాధన చేయడం, పశ్చాత్తాపపడడం, బాప్తిస్మం పొందడం, పరిశుద్ధాత్మ వరమును పొందడం మరియు అంతము వరకు సహించడం ద్వారా ఆయన యొక్క రక్షణకరమైన విమోచన శక్తికి ప్రవేశాన్ని పొందగలము (3 నీఫై 27:13–22 చూడండి).
దీనిని క్రీస్తు సిద్ధాంతం అని కూడా అంటారు. ఈ సిద్ధాంతాన్ని జీవించడం ద్వారా మనం క్రీస్తు యొద్దకు వచ్చి రక్షింపబడతాము (1 నీఫై 15:14 చూడండి). ఇది మోర్మన్ గ్రంథములో శక్తివంతముగా బోధించబడింది (2 నీఫై 31; 32:1–6; 3 నీఫై 11:31–40 చూడండి). ఆయన సిద్ధాంతాన్ని జీవించడానికి సహాయపడడం ద్వారా క్రీస్తునొద్దకు వచ్చుటకు జనులకు సహాయపడడమే మీ ఉద్దేశ్యము.
“సువార్త యొక్క మొదటి సూత్రాలను బోధించండి—మళ్ళీ మళ్ళీ బోధించండి: రోజు రోజుకి వాటి గురించి క్రొత్త ఆలోచనలు, అదనపు వెలుగు మీకు బయల్పరచబడడాన్ని మీరు కనుగొంటారు. వాటిని స్పష్టంగా గ్రహించడానికి మీరు వాటి గురించి విస్తారంగా మాట్లాడవచ్చు. అప్పుడు మీరు బోధించే వారికి వాటిని మరింత స్పష్టంగా అర్థమయ్యేలా మీరు చేయగలుగుతారు” (Hyrum Smith, in History, 1838–1856, volume E-1 [1 July 1843–30 April 1844], 1994, josephsmithpapers.org).
లేఖన అధ్యయనము
యేసు క్రీస్తు యొక్క సువార్త మరియు క్రీస్తు యొక్క సిద్ధాంతం గురించి ఈ క్రింది లేఖనాలు మరియు ప్రకటన ఏమి బోధిస్తాయి? మీరు అర్థం చేసుకోవడానికి మరియు గుర్తుంచుకోవడానికి సహాయపడేందుకు మీ అధ్యయన పుస్తకంలో వివరాలు వ్రాసుకోండి.
యేసు క్రీస్తు నందు విశ్వాసము
విశ్వాసం అన్ని ఇతర సువార్త సూత్రాలకు పునాది. అది క్రియ మరియు శక్తి యొక్క సూత్రము.
మన విశ్వాసం మనల్ని రక్షణకు నడిపించాలంటే అది యేసు క్రీస్తుపై కేంద్రీకృతమై ఉండాలి. “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును, నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను” (యోహాను 3:16) అని రక్షకుడు బోధించారు.
యేసు క్రీస్తునందు విశ్వాసం అంటే ఆయన దేవుని అద్వితీయ కుమారుడనే విశ్వాసాన్ని కలిగియుండడం. ఆయనను మన రక్షకునిగా మరియు విమోచకునిగా విశ్వసించడం (మోషైయ 3:17; 4:6–10; ఆల్మా 5:7–15 చూడండి). ఆయనపై, ఆయన మాట, బోధనలు మరియు వాగ్దానాలపై పూర్తి విశ్వాసం కలిగి ఉండడం. మనం ఆయన బోధనలను మరియు మాదిరిని హృదయపూర్వకంగా అనుసరిస్తున్నప్పుడు క్రీస్తుపై మన విశ్వాసం పెరుగుతుంది (2 నీఫై 31:6–13; 3 నీఫై 27:21–22 చూడండి).
ఒక సువార్తికునిగా, యేసు క్రీస్తుపై వారి విశ్వాసాన్ని పెంపొందించే వాగ్దానాలు చేసి, పాటించడానికి జనులకు సహాయపడండి. ఈ వాగ్దానాలు వారిని విధులు స్వీకరించడానికి మరియు దేవునితో పవిత్ర నిబంధనలు చేసి, పాటించడానికి సిద్ధం చేస్తాయి.
పశ్చాత్తాపము
యేసు క్రీస్తునందు విశ్వాసం మనల్ని పశ్చాత్తాపానికి నడిపిస్తుంది (హీలమన్ 14:13 చూడండి). పశ్చాత్తాపం అనేది దేవుని వైపు తిరిగే మరియు పాపం నుండి దూరమయ్యే ప్రక్రియ. మనం పశ్చాత్తాపపడినప్పుడు, మన చర్యలు, కోరికలు మరియు ఆలోచనలు దేవుని చిత్తానికి మరింత అనుగుణంగా మారతాయి.
ఆయన ప్రాయశ్చిత్త త్యాగం ద్వారా, రక్షకుడు మన పాపాలకు పరిహారం చెల్లించారు (మోషైయ 15:9; ఆల్మా 34:15–17 చూడండి). మనం పశ్చాత్తాపపడినప్పుడు, యేసు క్రీస్తు మరియు ఆయన త్యాగం కారణంగా మనం క్షమించబడగలము, ఎందుకంటే ఆయన పశ్చాత్తాపపడేవారి కోసం తన కనికరపు హక్కులను కోరతారు (మొరోనై 7:27–28 చూడండి). లీహై ప్రవక్త మాటలలో, మన “విమోచన … పరిశుద్ధ మెస్సీయా యొక్క మంచితనము, కనికరము మరియు కృప ద్వారా వచ్చును” (2 నీఫై 2:6, 8).
పశ్చాత్తాపం అనేది ప్రవర్తనను మార్చడానికి లేదా బలహీనతను అధిగమించడానికి సంకల్ప శక్తిని ఉపయోగించడం కంటే చాలా ఎక్కువైనది. పశ్చాత్తాపం అంటే మన హృదయాలలో “బలమైన మార్పును” అనుభవించే శక్తిని ఇచ్చే క్రీస్తు వైపుకు హృదయపూర్వకంగా తిరగడం (ఆల్మా 5:12–14 చూడండి). దీనిలో వినయంగా ఆత్మకు లోబడడం మరియు దేవుని చిత్తానికి లోబడడం ఉన్నాయి. మనం పశ్చాత్తాపపడినప్పుడు, దేవుణ్ణి సేవించడానికి మరియు ఆయన ఆజ్ఞలను పాటించడానికి మన నిబద్ధతను పెంచుకుంటాము. మనం క్రీస్తులో ఆధ్యాత్మికంగా తిరిగి జన్మించాము.
పశ్చాత్తాపము ఆనందం మరియు శాంతిని కలిగించే సానుకూల సూత్రం. ఇది మనల్ని “[మన] ఆత్మల రక్షణకై విమోచకుని శక్తి యొద్దకు తెస్తుంది” (హీలమన్ 5:11).
వారు ఎందుకు పశ్చాత్తాపపడాలో అర్థం చేసుకోవడానికి ధైర్యంగా మరియు ప్రేమగా జనులకు సహాయం చేయండి. మీరు బోధించే వ్యక్తులను వాగ్దానాలు చేయమని ఆహ్వానించడం ద్వారా, మీరు వారిని పశ్చాత్తాపపడమని ఆహ్వానిస్తారు మరియు మీరు వారికి నిరీక్షణను అందిస్తారు.
లేఖన అధ్యయనము
పశ్చాత్తాపం ప్రకటించడం గురించి ఈ క్రింది లేఖనాల నుండి మీరు ఏమి నేర్చుకోవచ్చు?
బాప్తిస్మము
యేసు క్రీస్తునందు విశ్వాసం మరియు పశ్చాత్తాపం మనల్ని బాప్తిస్మము యొక్క విధికి సిద్ధం చేస్తాయి. “పశ్చాత్తాపము యొక్క ప్రథమ ఫలమే బాప్తిస్మము” (మొరోనై 8:25). దేవుని నుండి అధికారం పొందిన వ్యక్తి చేత మనం ముంచబడడం ద్వారా బాప్తిస్మం తీసుకున్నప్పుడు మనం నిత్యజీవ ద్వారంలోకి ప్రవేశిస్తాము.
మనం బాప్తిస్మము తీసుకున్నప్పుడు, మనం దేవునితో ఒక నిబంధన చేస్తాము. మనము ఈ నిబంధనను పాటించినప్పుడు, దేవుడు మనకు పరిశుద్ధాత్మ సహవాసాన్ని ఇస్తానని, మన పాపాలను క్షమిస్తానని మరియు యేసు క్రీస్తు సంఘములో సభ్యత్వాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తున్నారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 20:77, 79; మొరోనై 6:4 చూడండి). ఈ ఆనందకరమైన మరియు ఆశాజనకమైన విధి ద్వారా మనం ప్రభువు యొద్దకు సమకూర్చబడ్డాము మరియు ఆధ్యాత్మికంగా తిరిగి జన్మించాము.
మీరు బోధించే వ్యక్తులకు బాప్తిస్మం ఇవ్వడం మరియు వారిని నిర్ధారించడం మీ ఉద్దేశ్యంలో కీలకమైనవి. బాప్తిస్మం కొరకు అర్హత సాధించడానికి, వారు సిద్ధాంతము మరియు నిబంధనలు 20:37 లోని షరతులకు లోబడాలని అర్థం చేసుకోవడానికి వారికి సహాయపడండి.
సహచర అధ్యయనము
క్రింది లేఖనాలను పరిశోధించండి:
పైన పేర్కొన్న లేఖనాలను మీరు అధ్యయనం చేసిన దాని ఆధారంగా, రెండు లిఖిత జాబితాలను తయారు చేయండి:
-
బాప్తిస్మము కొరకు అర్హతలు
-
బాప్తిస్మం సమయంలో చేసిన నిబంధనలు
ఇతరులకు దీన్ని ఎలా బోధించాలో మీ సహచరుడితో చర్చించండి.
నిర్ధారణ మరియు పరిశుద్ధాత్మ వరము
బాప్తిస్మములో రెండు భాగాలు ఉన్నాయి: నీటి ద్వారా బాప్తిస్మము మరియు ఆత్మ ద్వారా బాప్తిస్మము. మనం నీటి ద్వారా బాప్తిస్మం తీసుకున్న తర్వాత, దేవుని నుండి అధికారం పొందిన వ్యక్తి చేత హస్తనిక్షేపణం ద్వారా మనం నిర్ధారించబడినప్పుడు బాప్తిస్మం పూర్తవుతుంది. నిర్ధారణ ద్వారా మనం పరిశుద్ధాత్మ వరమును మరియు మన పాప క్షమాపణను పొందవచ్చు.
ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ఇలా బోధించారు, “నీటి ద్వారా బాప్తిస్మము సగం మాత్రమే మరియు మిగిలిన సగం—అంటే, పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మము లేకుండా అది ఎందుకూ పనికిరాదు” (Teachings of Presidents of the Church: Joseph Smith [2007], 95).
“సమస్త మానవజాతి … మరలా జన్మించవలెను; దేవుని మూలముగా జన్మించుట అనగా వారి శరీరసంబంధమైన, పతనమైన స్థితి నుండి పరిశుద్ధమైన స్థితికి మారి దేవునిచే విమోచింపబడి ఆయన కుమారులు మరియు కుమార్తెలు కావలెను; ఆ విధముగా వారు నూతన సృష్టి అగుదురు” (మోషైయ 27:25–26) అని ఆల్మా బోధించాడు.
పశ్చాత్తాపపడేవారికి, నీటి ద్వారా మరియు ఆత్మ ద్వారా బాప్తిస్మము ఆధ్యాత్మిక పునర్జన్మ వంటిది.
లేఖన అధ్యయనము
పరిశుద్ధాత్మ వరమును పొందుట వలన వచ్చే కొన్ని దీవెనలేవి?
-
యోహాను 14:26
-
గలతీయులకు 5:22–25
-
Topical Guide, “Holy Ghost, Gift of”
పరిశుద్ధాత్మ వరమును మనం ఎందుకు కోరుకోవాలి?
-
అపొస్తలుల కార్యములు 19:1–6
అంతము వరకు సహించుట
యేసు క్రీస్తును అనుసరించడం జీవితకాలపు నిబద్ధత. క్రీస్తునందు విశ్వాసముంచడం, ప్రతిరోజూ పశ్చాత్తాపపడడం, సువార్త యొక్క అన్ని విధులను మరియు నిబంధనలను పొందడం, ఆ నిబంధనలను పాటించడం మరియు పరిశుద్ధాత్మ సహవాసమును కలిగియుండడాన్ని మనం జీవితాంతం కొనసాగించినప్పుడు మనం అంతము వరకు సహిస్తాము. సంస్కారములో పాలుపొందడం ద్వారా మనం చేసిన నిబంధనలను నవీకరించడం ఇందులో ఉంది.
The Lord Is My Shepherd [యెహోవా నా కాపరి], యాంగ్‌సుంగ్ కిమ్ చేత. Havenlight వారి చిత్ర సౌజన్యం
సువార్త—ఆయన వద్దకు తిరిగి వెళ్ళడానికి మన పరలోక తండ్రి యొక్క మార్గం
మనం ఎలా జీవిస్తున్నామో మరియు మనం ఏమి అవుతామో అనేదానిని యేసు క్రీస్తు సువార్త మార్చగలదు. దాని సూత్రాలు మన జీవితాల్లో ఒకసారి అనుభవించే దశలు మాత్రమే కాదు. మనం వాటిని జీవితాంతం పునరావృతం చేసినప్పుడు, అవి మనల్ని దేవునికి దగ్గర చేస్తాయి మరియు మరింత ప్రతిఫలదాయకమైన జీవన విధానంగా మారతాయి. అవి శాంతి, స్వస్థత మరియు క్షమాపణను తెస్తాయి. ఆయనతో నిత్యజీవం పొందేందుకు మన పరలోక తండ్రి మనకు ఇచ్చిన మార్గాన్ని కూడా అవి నిర్వచిస్తాయి.
మీరు సువార్తికునిగా పని చేయడానికి యేసు క్రీస్తు సువార్త మార్గనిర్దేశం చేస్తుంది. ఇది మీ ప్రయత్నాలపై కూడా కేంద్రీకరిస్తుంది. పశ్చాత్తాపము నిమిత్తము జనులు యేసు క్రీస్తుపై విశ్వాసం పొందడానికి సహాయం చేయండి (ఆల్మా 34:15–17 చూడండి). యేసు క్రీస్తు సువార్త యొక్క సంపూర్ణత మరియు యాజకత్వ అధికారం పునఃస్థాపించబడ్డాయని బోధించండి మరియు సాక్ష్యమివ్వండి. బాప్తిస్మం పొంది రక్షకుని బోధనల ప్రకారం జీవించమని జనులను ఆహ్వానించండి.
యేసు క్రీస్తు యొక్క సువార్త దేవుని పిల్లలందరినీ దీవిస్తుంది
యేసు క్రీస్తు యొక్క సువార్త దేవుని పిల్లలందరి కొరకైనది. దేవునికి “అందరూ ఒకే రీతిగా ఉన్నారని” లేఖనాలు బోధిస్తాయి. “అందరిని తన వద్దకు రమ్మని, తన మంచితనము నందు పాలుపొందమని ఆయన ఆహ్వానించుచున్నాడు మరియు తన యొద్దకు వచ్చువానిని ఎవ్వరిని ఆయన నిరాకరించడు” (2 నీఫై 26:33).
సువార్త మన మర్త్య జీవితాలంతటా మరియు నిత్యత్వం అంతటా మనల్ని దీవిస్తుంది. మనం యేసు క్రీస్తు బోధనల ప్రకారం జీవించినప్పుడు—వ్యక్తులుగా మరియు కుటుంబాలుగా—మనం సంతోషంగా ఉండే అవకాశం ఉంది (మోషైయ 2:41; “కుటుంబము: ప్రపంచమునకు ఒక ప్రకటన,” ChurchofJesusChrist.org చూడండి). సువార్తను జీవించడం మన ఆనందాలను మరింతగా పెంచుతుంది, మన చర్యలను ప్రేరేపిస్తుంది మరియు మన సంబంధాలను సుసంపన్నం చేస్తుంది.
పునఃస్థాపించబడిన సువార్త యొక్క గొప్ప సందేశాలలో ఒకటి మనమందరం దేవుని కుటుంబంలో భాగం. మనము ఆయన ప్రియమైన కుమారులు మరియు కుమార్తెలం. భూమిపై మన కుటుంబ పరిస్థితితో సంబంధం లేకుండా, మనలో ప్రతీ ఒక్కరం దేవుని కుటుంబంలో సభ్యులమే.
మన సందేశంలోని మరొక గొప్ప భాగం ఏమిటంటే కుటుంబాలు నిత్యత్వం కొరకు ఐక్యంగా ఉండగలవు. కుటుంబం దేవునిచే నియమించబడింది. కడవరి-దిన ప్రవక్తలు ఇలా బోధించారు:
“[పరలోక తండ్రి యొక్క] సంతోషము కొరకైన ఈ దైవిక ప్రణాళిక కుటుంబ బాంధవ్యములను మరణము తరువాత కూడా శాశ్వతముగా ఉండునట్లు చేస్తుంది. పరిశుద్ధ దేవాలయములలో లభ్యమగు పవిత్రమైన విధులు మరియు నిబంధనలు వ్యక్తులు దేవుని యొక్క సన్నిధికి తిరిగి వెళ్ళుటను మరియు కుటుంబాలు నిత్యము కలిసి ఉండుటను సుసాధ్యం చేస్తాయి” (“కుటుంబము: ప్రపంచమునకు ఒక ప్రకటన”).
చాలామంది వివాహానికి లేదా ప్రియమైన కుటుంబ సంబంధాలకు పరిమిత అవకాశాలు కలిగియున్నారు. చాలామంది విడాకులు మరియు ఇతర క్లిష్టమైన కుటుంబ పరిస్థితులను అనుభవించారు. అయితే, సువార్త మన కుటుంబ పరిస్థితులతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా మనల్ని దీవిస్తుంది. మనం విశ్వాసంగా ఉన్నప్పుడు, ఈ జీవితంలో లేదా రాబోయే జీవితంలో ప్రేమగల కుటుంబాల దీవెనలను కలిగియుండడానికి దేవుడు మనకు ఒక మార్గాన్ని అందిస్తారు (మోషైయ 2:41).
పునఃస్థాపన సందేశము: విశ్వాసము యొక్క పునాది
మీరు ఎక్కడ సేవ చేసినా లేదా ఎవరికి బోధించినా, మీ బోధనను యేసు క్రీస్తు మరియు ఆయన సువార్త పునఃస్థాపనపై కేంద్రీకరించండి. సువార్తికుల పాఠాలలో మీరు సిద్ధాంతాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు, మనకు ఒకే సందేశం ఉందని మీరు చూస్తారు: యేసే క్రీస్తు, మన రక్షకుడు మరియు విమోచకుడు. ఒక ఆధునిక ప్రవక్త ద్వారా, పరలోక తండ్రి మన రక్షణ కోసం ఆయన ప్రణాళికను గురించి జ్ఞానాన్ని పునఃస్థాపించారు. ఈ ప్రణాళిక యేసు క్రీస్తుపై కేంద్రీకృతమై ఉంది. ఆయన ప్రాయశ్చిత్త త్యాగం ద్వారా, మనమందరం పాపం మరియు మరణం నుండి రక్షించబడి పరలోక తండ్రి వద్దకు తిరిగి రావడాన్ని రక్షకుడు సాధ్యం చేస్తారు.
మీరు బోధించే వ్యక్తులు ఈ క్రింది వాటిని అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి:
-
దేవుడు పరలోకమందున్న మన తండ్రి. ఆయన మనల్ని పరిపూర్ణంగా ప్రేమిస్తారు. భూమిపై ఉన్న ప్రతి వ్యక్తి దేవుని బిడ్డ మరియు ఆయన కుటుంబ సభ్యుడు.
-
అమర్త్యత్వము మరియు నిత్యజీవము పొందడానికి పరలోక తండ్రి మనకు ఒక ప్రణాళికను అందించారు, అవి ఆయన గొప్ప ఆశీర్వాదాలు (మోషే 1:39 చూడండి). మనం నేర్చుకోవడానికి, ఎదగడానికి మరియు ఆయన ఆశీర్వాదాల సంపూర్ణతకు సిద్ధం కావడానికి భూమి మీదకు వచ్చాము.
-
ఆయన ప్రణాళికలో భాగంగా, పరలోక తండ్రి ఈ జీవితంలో మనల్ని నడిపించడానికి మరియు ఆయన వద్దకు తిరిగి రావడానికి మనకు సహాయం చేయడానికి ఆజ్ఞలను ఇచ్చారు (ఉదాహరణకు, నిర్గమకాండము 20:3–17 చూడండి).
-
ఈ జీవితంలో మనమందరం పాపం చేస్తాము మరియు మనమందరం మరణిస్తాము. మనపట్ల పరలోక తండ్రి యొక్క ప్రేమ కారణంగా, పాపము మరియు మరణం నుండి మనల్ని విమోచించడానికి ఆయన తన కుమారుడైన యేసు క్రీస్తును పంపారు.
-
యేసు యొక్క ప్రాయశ్చిత్త త్యాగము వలన, మనము పశ్చాత్తాపపడినప్పుడు మరియు బాప్తిస్మం పొంది నిర్ధారించబడినప్పుడు మన పాపముల నుండి మనం శుద్ధిచేయబడగలము. ఇది మనకు శాంతిని తెస్తుంది మరియు దేవుని సన్నిధికి తిరిగి వెళ్ళడాన్ని, సంపూర్ణ ఆనందాన్ని పొందడాన్ని సాధ్యం చేస్తుంది.
-
యేసు యొక్క పునరుత్థానము వలన, మనమందరము మరణించిన తరువాత పునరుత్థానము చెందుతాము. దీని అర్థం ప్రతీ వ్యక్తి యొక్క ఆత్మ మరియు శరీరం తిరిగి ఏకమై, శాశ్వతంగా జీవిస్తారు.
-
బైబిలు చరిత్ర అంతటా, ప్రభువు తన సువార్తను బయల్పరిచారు మరియు ప్రవక్తల ద్వారా తన సంఘాన్ని ఏర్పాటు చేసారు. చాలా మంది దీనిని పదేపదే తిరస్కరించారు. సువార్త నుండి తొలగిపోవడం మరియు దానిని పునఃస్థాపించాల్సిన అవసరం పాత నిబంధన కాలంలో ప్రారంభమైంది.
-
రక్షకుని మరణం మరియు పునరుత్థానం తర్వాత, ఆయన అపొస్తలులు కొంతకాలం సంఘాన్ని నడిపించారు. చివరికి, వారు మరణించారు, యాజకత్వ అధికారం కోల్పోబడింది మరియు రక్షకుని బోధనల నుండి మరొక పతనం జరిగింది. జనులు సిద్ధాంతాన్ని మరియు విధులను మార్చారు.
-
యేసు క్రీస్తు యొక్క సువార్త పరలోక తండ్రి చేత ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా పునఃస్థాపించబడింది. పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు 1820 యొక్క వసంతకాలంలో జోసెఫ్‌కు కనిపించారు. తరువాత జోసెఫ్ స్మిత్ యాజకత్వ అధికారాన్ని పొందాడు మరియు భూమిపై మళ్ళీ యేసు క్రీస్తు సంఘాన్ని ఏర్పాటు చేయడానికి నిర్దేశించబడ్డాడు.
యేసు క్రీస్తు యొక్క సంఘము కేవలం మరొక మతం కాదని బోధించండి. ఇది అమెరికన్ సంఘము కూడా కాదు. బదులుగా, ఇది యేసు క్రీస్తు యొక్క “[]సువార్త సంపూర్ణత” (సిద్ధాంతము మరియు నిబంధనలు 1:23) యొక్క పునఃస్థాపన. ఇది మళ్ళీ భూమిపై నుండి తీసివేయబడదు.
మోర్మన్ గ్రంథము: యేసు క్రీస్తు యొక్క మరియొక నిబంధన యేసు క్రీస్తు గురించి మరియు లోక రక్షకుడిగా ఆయన దైవిక నియమితకార్యము గురించి సాక్ష్యమిస్తుంది. ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా యేసు క్రీస్తు తన సువార్తను మరియు సంఘాన్ని పునఃస్థాపించారు అనడానికి ఇది శక్తివంతమైన సాక్ష్యం కూడా. మోర్మన్ గ్రంథాన్ని చదవమని మరియు దాని సందేశం గురించి ప్రార్థించమని జనులను ఆహ్వానించండి మరియు సహాయం చేయండి.
మొరోనై 10:3–5 లోని అద్భుతమైన వాగ్దానాన్ని నమ్మండి. మోర్మన్ గ్రంథం దేవుని వాక్యమా అని హృదయపూర్వకంగా మరియు నిజమైన ఉద్దేశ్యంతో దేవుడిని అడగమని జనులను ప్రోత్సహించండి. నిజమైన ఉద్దేశ్యంతో ప్రార్థించడం అంటే పరిశుద్ధాత్మ సాక్ష్యం నుండి వచ్చే సమాధానంపై చర్య తీసుకోవడానికి సమ్మతించడం. క్రీస్తు తన సంఘాన్ని పునఃస్థాపించారనే ఒక వ్యక్తి విశ్వాసానికి ఆ సాక్ష్యం పునాది అవుతుంది. మీరు బోధించే వారు ఆ ఆధ్యాత్మిక నిర్ధారణను వెదికేలా సహాయం చేయండి.
లేఖన అధ్యయనము
సువార్త పరిచర్యలో మోర్మన్ గ్రంథాన్ని మీరేవిధంగా ఉపయోగించాలి?
-
మోర్మన్ గ్రంథ పీఠిక, చివరి రెండు పేరాలు
-
నా సువార్తను ప్రకటించండి, 5వ అధ్యాయం కూడా చూడండి.
వ్యక్తిగత అధ్యయనము
సోషల్ మీడియాలో లేదా స్థానిక వార్తా సంస్థ కోసం పునఃస్థాపన సందేశం గురించి మీరు ఒక పేరా వ్రాయబోతున్నారని ఊహించుకోండి. మీ అధ్యయన పుస్తకంలో, ముఖ్య సందేశాన్ని వివరించే శీర్షిక రాయండి. తరువాత ఈ సందేశం గురించి మీ ఆలోచనలను మరియు భావాలను నమోదు చేయండి. దానిని బాగా అర్థం చేసుకోవడం మీరు జీవించే విధానాన్ని మరియు మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మీరు చూసే విధానాన్ని ఎలా మార్చిందో చేర్చండి.
సంఘాన్ని స్థాపించండి మరియు నిర్మించండి
యేసు క్రీస్తు తన సంఘాన్ని పునఃస్థాపించినప్పుడు, దానిని “స్థాపించమని” మరియు “[దానిని] కట్టమని” (సిద్ధాంతము మరియు నిబంధనలు 31:7; 39:13) ఆయన ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్‌ను మరియు ఇతరులను ఆదేశించారు. సాక్ష్యాలు ఉన్న వ్యక్తులు బాప్తిస్మం తీసుకొని నిర్ధారించబడినప్పుడు, వారి నిబంధనలను పాటించినప్పుడు, దేవాలయానికి వెళ్లడానికి సిద్ధమైనప్పుడు మరియు వారి వార్డు లేదా శాఖను బలోపేతం చేయడంలో సహాయపడినప్పుడు సంఘము స్థాపించబడుతుంది మరియు కట్టబడుతుంది.
ఒక సువార్తికునిగా, మీరు రక్షకుని సంఘాన్ని స్థాపించడానికి మరియు కట్టడానికి సహాయం చేస్తారు. మీరు దీన్ని చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ప్రేమించడం, పంచుకోవడం మరియు ఆహ్వానించడం అనే సూత్రాల ద్వారా సభ్యులు సువార్తను పంచుకునేటప్పుడు మీరు వారికి మద్దతు ఇవ్వవచ్చు (ప్రధాన చేతిపుస్తకము, 23.1 చూడండి). జనులు బాప్తిస్మం పొంది, వారి విశ్వాసంలో ఎదగడానికి మీరు సహాయం చేయవచ్చు. కొత్త సభ్యులు వారి కొత్త జీవితానికి సర్దుబాటు చేసుకోవడానికి మరియు ఆధ్యాత్మికంగా ఎదగడానికి మీరు సహాయం చేయవచ్చు. తిరిగి వచ్చే సభ్యులు యేసు క్రీస్తుపై వారి విశ్వాసాన్ని బలోపేతం చేసుకోవడానికి కూడా మీరు సహాయం చేయవచ్చు.
కొత్త మరియు తిరిగి వచ్చే సభ్యులు తమ జీవితాల్లో సువార్త పనిచేయడాన్ని అనుభవించినప్పుడు సాక్ష్యంలో మరియు విశ్వాసంలో ఎదుగుతారు. దీనిని సాధించడంలో సహాయపడడానికి, వారు ఇలా చేయడం ముఖ్యం:
-
సంఘ సభ్యులైన స్నేహితులను కలిగి ఉండాలి.
-
సంఘంలో బాధ్యత ఇవ్వబడాలి.
-
దేవుని వాక్యం ద్వారా పోషించబడాలి.
(See Gordon B. Hinckley, “Converts and Young Men,” Ensign, May 1997, 47.)
సువార్తికులు, స్థానిక నాయకులు మరియు ఇతర సంఘ సభ్యులు కొత్త మరియు తిరిగి వచ్చే సభ్యులను పోషించడానికి మరియు బలోపేతం చేయడానికి గల అవకాశాన్ని సంతోషంగా అంగీకరించాలి. ఈ సేవ వారిని “సరైన మార్గంలో ఉంచడానికి” సహాయపడుతుంది (మొరోనై 6:4).
మంచి చేయడాన్ని కొనసాగించండి
తన మర్త్య పరిచర్యలో, రక్షకుడు ఇతరులకు సేవ చేశారు. ఆయన “మంచి చేయడం” మరియు “సువార్త ప్రకటించడం” చేస్తూ వెళ్ళారు (అపొస్తలుల కార్యములు 10:38; మత్తయి 4:23). మీరు ఆయన మాదిరిని అనుసరిస్తున్నప్పుడు, మీరు సేవ చేయగల వ్యక్తులను మరియు మిమ్మల్ని స్వీకరించే వారిని కనుగొంటారు.
సేవ ద్వారా, మీరు దేవుణ్ణి ప్రేమించాలి మరియు మీ పొరుగువారిని ప్రేమించాలి అనే రెండు గొప్ప ఆజ్ఞలను నెరవేరుస్తారు (మత్తయి 22:36–40; 25:40; మోషైయ 2:17 చూడండి). సేవ ద్వారా, మీరు మరియు ఇతరులు శక్తివంతమైన, స్ఫూర్తిదాయకమైన రీతిలో కలిసి రావచ్చు.
ఒక సువార్తికునిగా, మీరు ప్రతీ వారం ప్రణాళికాబద్ధమైన సేవను అందిస్తారు (సమాచారం మరియు మార్గదర్శకాల కోసం Missionary Standards, 2.7 మరియు 7.2 చూడండి). మీ మిషను అధ్యక్షుడి మార్గదర్శకత్వంలో, జస్ట్‌సర్వ్ (ఇది ఆమోదించబడిన చోట) మరియు సంఘము యొక్క మానవతా మరియు విపత్తు ప్రతిస్పందన ప్రయత్నాల ద్వారా మీరు సమాజంలో సేవ చేయడానికి అవకాశాలను కనుగొనవచ్చు.
ప్రతి రోజంతా, ప్రార్థన చేయండి మరియు మంచి చేయడానికి ప్రణాళిక చేయని అవకాశాల కోసం చూడండి. మీరు అందించగల చిన్న దయగల చర్యలకు సందర్భాలను గుర్తించడానికి ఆత్మను వినండి.
“మీరు సంతోషంగా ఉండాలని కోరుతున్నారా? మిమ్మల్ని మీరు మర్చిపోయి ఈ గొప్ప లక్ష్యంలో మునిగిపోండి. జనులకు సహాయం చేయడానికి మీ ప్రయత్నాలను అందించండి. … ఎత్తులో నిలబడండి, బలహీనమైన మోకాళ్లు గలవారిని పైకెత్తండి, వేలాడుతున్న వారి చేతులను పట్టుకోండి. యేసు క్రీస్తు యొక్క సువార్తను జీవించండి” (Gordon B. Hinckley, Teachings of Presidents of the Church: Gordon B. Hinckley [2016], 209).
లేఖన అధ్యయనము
రక్షకుని జీవితంలో సేవ యొక్క పాత్ర ఏమిటి?
-
మత్తయి 8:1–4; 9:1–8
-
మార్కు 1:21–28
-
యోహాను 4:46–54
అమ్మోన్ మరియు అహరోనుల సువార్తసేవలో సేవ యొక్క పాత్ర ఏమిటి?
ఏమి చేయమని ప్రభువు మిమ్మల్ని అడుగుతారు?
విజయవంతమైన సువార్తికుడు
సువార్తికునిగా మీ విజయం ప్రధానంగా పరివర్తన చెందేవారిని కనుగొనడం, బోధించడం, బాప్తిస్మం ఇవ్వడం, నిర్ధారించడం మరియు వారు క్రీస్తు యొక్క విశ్వాసులైన శిష్యులుగా, ఆయన సంఘ సభ్యులుగా మారడానికి సహాయం చేయాలనే మీ కోరిక మరియు నిబద్ధత ద్వారా నిర్ణయించబడుతుంది (ఆల్మా 41:3 చూడండి).
మీరు ఎంత మందికి బోధిస్తారో లేదా బాప్తిస్మానికి తీసుకురావడానికి సహాయం చేస్తారో అనే దాని ద్వారా మీ విజయం నిర్ణయించబడదు. నాయకత్వ పదవులను నిర్వహించడం ద్వారా కూడా అది నిర్ణయించబడదు.
ఇతరులు మీ పట్ల, మీ ఆహ్వానాలు లేదా మీ హృదయపూర్వక దయగల చర్యలపట్ల ఎలా ప్రతిస్పందించాలని ఎంచుకుంటారనే దానిపై మీ విజయం ఆధారపడి ఉండదు. సువార్త సందేశాన్ని అంగీకరించాలా వద్దా అని ఎంచుకోవడానికి జనులకు స్వేచ్ఛ ఉంది. వారు తమను ఆశీర్వదించే సమాచారంతో కూడిన ఎంపిక చేసుకోగలిగేలా స్పష్టంగా మరియు శక్తివంతంగా బోధించడం మీ బాధ్యత.
మత్తయి 25:14–28లో తలాంతుల గురించి రక్షకుని ఉపమానాన్ని ఆలోచించండి. ప్రభువుకు ప్రాతినిధ్యం వహించే యజమాని, తన నమ్మకమైన సేవకులిద్దరి కానుకల పరిమాణం భిన్నంగా ఉన్నప్పటికీ వారిని ప్రశంసించాడు (మత్తయి 25:21, 23 చూడండి). వారికి ఇవ్వబడిన వాటిని వారు గొప్పగా చేసినందున “నీ యజమానుని సంతోషములో” పాలుపొందమని వారిని ఆహ్వానించి, ఆయన వారిద్దరికీ ఒకే ప్రతిఫలాన్ని కూడా ఇచ్చాడు.
దేవుడు మీకు తన సేవలో ఉపయోగించడానికి తలాంతులను మరియు బహుమానాలను ఇచ్చారు. మీ తలాంతులు మరియు బహుమానాలు ఇతరుల వాటి నుండి భిన్నంగా ఉంటాయి. తక్కువగా కనిపించే వాటితోసహా, ఇవన్నీ ముఖ్యమైనవని గుర్తించండి. మీరు మీ తలాంతులను మరియు బహుమానాలను ఆయనకు అంకితం చేసినప్పుడు, ఆయన వాటిని గొప్పగా చేసి, మీరు అందించే వాటితో అద్భుతాలు చేస్తారు.
మిమ్మల్ని మీరు ఇతర సువార్తికులతో పోల్చుకోవడం మరియు మీ ప్రయత్నాల బాహ్య ఫలితాలను వారి వాటితో కొలవడం మానుకోండి. పోల్చడం సాధారణంగా నిరుత్సాహం లేదా గర్వం వంటి ప్రతికూల ఫలితాలకు దారితీస్తుంది. పోల్చడం తరచుగా తప్పుదారి కూడా పట్టిస్తుంది. ప్రభువు కోరుకునేది మీ స్వంత ఉత్తమ ప్రయత్నమే—మీరు “మీ పూర్ణ హృదయము, శక్తి, మనస్సు మరియు బలముతో ఆయనను సేవించాలి” (సిద్ధాంతము మరియు నిబంధనలు 4:2; వివరణ చేర్చబడినది).
జనులు ఇంకా సువార్తను అంగీకరించకపోతే మీరు బాధపడవచ్చు. కొన్నిసార్లు మీరు నిరుత్సాహపడవచ్చు. లేఖనాలలోని గొప్ప సువార్తికులు మరియు ప్రవక్తలు కూడా కొన్నిసార్లు నిరుత్సాహాన్ని అనుభవించారు (2 నీఫై 4:17–19; ఆల్మా 26:27 చూడండి). అటువంటి సమయాల్లో, ప్రభువు వైపు తిరగడం, ఆయనపై మీ నమ్మకాన్ని ఉంచడం, బలం కోసం ప్రార్థించడం మరియు ఆయన మీ కోసం చేసిన మంచి విషయాలను గుర్తుంచుకోవడం ద్వారా నీఫై మాదిరిని అనుసరించండి (2 నీఫై 4:16–35 చూడండి).
కష్ట సమయాల్లో మీరు ప్రభువు వైపు తిరిగినప్పుడు, ఆయనిలా వాగ్దానం చేశారు, “నేను నిన్ను బలపరతును; నీకు సహాయము చేయువాడను నేనే; నిన్ను ఆదుకొందును” (యెషయా 41:10). క్రీస్తుపై విశ్వాసాన్ని సాధన చేయడం ద్వారా, మీరు మీ ప్రయత్నాల గురించి శాంతిని మరియు భరోసాను పొందవచ్చు. విశ్వాసం మీరు ముందుకు సాగడానికి మరియు నీతివంతమైన కోరికలలో కొనసాగడానికి సహాయపడుతుంది.
బాహ్య ఫలితాలపై కాదు—క్రీస్తు పట్ల మీ నిబద్ధతపై మరియు సువార్తికునిగా మీ ఉద్దేశ్యంపై దృష్టి పెట్టండి. ఈ ఫలితాలు తరచుగా వెంటనే స్పష్టంగా కనిపించవు. అదే సమయంలో, మీరు ఎదుర్కొంటున్న సవాళ్లతో సంబంధం లేకుండా మీ అంచనాలను ఎక్కువగా ఉంచుకోండి. అధిక అంచనాలు మీ ప్రభావాన్ని, మీ కోరికను మరియు ఆత్మను అనుసరించే మీ సామర్థ్యాన్ని పెంచుతాయి.
ప్రభువు పట్ల మీ నిబద్ధతను మరియు విజయవంతమైన సువార్తికునిగా ఉండడానికి మీ ప్రయత్నాన్ని మీరు అంచనా వేయగల కొన్ని మార్గాలు క్రింద వివరించబడ్డాయి.
-
యేసు క్రీస్తు గురించి నేర్చుకుంటూ మరియు క్రమంగా మెరుగుపడుతూ ఆయన శిష్యునిగా ఉండడానికి హృదయపూర్వకంగా వెదకండి (యోహాను 8:31; 2 నీఫై 28:30 చూడండి).
-
క్రీస్తువంటి లక్షణాలను వెదకండి (2 పేతురు 1:2–9; సిద్ధాంతము మరియు నిబంధనలు 4:5–6 చూడండి).
-
జనులను హృదయపూర్వకంగా ప్రేమించండి మరియు ఆత్మలను క్రీస్తు వద్దకు తీసుకురావడానికి ప్రతిరోజూ మీ వంతు కృషి చేయండి (1 కొరింథీయులకు 13; మొరోనై 7:45–48 చూడండి).
-
రక్షకునిపై వారి విశ్వాసాన్ని పెంపొందించే వాగ్దానాలను చేసి, పాటించడానికి జనులను ఆహ్వానించండి మరియు సహాయం చేయండి.
-
లేఖనాలను అధ్యయనం చేయండి, కృతజ్ఞతలు తెలియజేయడానికి హృదయపూర్వకంగా ప్రార్థించండి మరియు దైవిక సహాయం కోసం అడగండి (యోహాను 5:39; 2 నీఫై 32:3; ఈనస్ 1:4; ఆల్మా 37:37; సిద్ధాంతము మరియు నిబంధనలు 26:1 చూడండి).
-
దేవుని ఆజ్ఞలను పాటించండి మరియు సువార్తికుల ప్రమాణాలను పాటించండి (సిద్ధాంతము మరియు నిబంధనలు 35:24 చూడండి).
-
ఎక్కడికి వెళ్లాలి, ఏమి చేయాలి మరియు ఏమి చెప్పాలి అనే దానిలో ఆత్మ మిమ్మల్ని నడిపించే విధంగా జీవించండి (సిద్ధాంతము మరియు నిబంధనలు 18:18; 42:14 చూడండి).
-
ప్రార్థనాపూర్వకంగా లక్ష్యాలను నిర్దేశించుకోండి, ప్రణాళికలు వేయండి మరియు వాటిని నెరవేర్చడానికి పని చేయండి (లూకా 14:28; సిద్ధాంతము మరియు నిబంధనలు 88:119 చూడండి).
-
మీరు నియమించబడిన వార్డు లేదా శాఖను నిర్మించండి మరియు బలోపేతం చేయండి (సిద్ధాంతము మరియు నిబంధనలు 18:5 చూడండి).
-
జనులు మీ సందేశాన్ని అంగీకరించినా అంగీకరించకపోయినా, ప్రతి అవకాశంలోనూ మంచి చేస్తూ మరియు వారికి సేవ చేస్తూ ఉండండి (అపొస్తలుల కార్యములు 10:38 చూడండి).
మీరు మీ శక్తి మేరకు పనిచేసిన తర్వాత కూడా మీకు నిరాశలు ఎదురవుతాయి, కానీ మీ పట్ల మీరు నిరాశ చెందరు. ఆత్మ మీ ద్వారా పనిచేస్తున్నట్లు మీరు భావించినప్పుడు ప్రభువు సంతోషంగా ఉన్నారని మీరు నిశ్చయించుకోవచ్చు.
లేఖన అధ్యయనము
ప్రభువు సేవకులు పని గురించి ఎలా భావిస్తారు? ప్రభువు సేవకులు తాము సేవ చేసే వారిని ఎలా ప్రభావితం చేస్తారు? పని గురించి మీరు ఎలా భావిస్తారు?
వ్యక్తిగత అధ్యయనము
-
హీలమన్ 10:1–5 మరియు 3 నీఫై 7:17–18 చదవండి. ఈ సువార్తికుల గురించి మరియు వారి సేవ గురించి ప్రభువు ఎలా భావించారు?
-
అబినడై మరియు అమ్మోన్ యొక్క సువార్తసేవా ప్రయత్నాల గురించి ఆలోచించండి (మోషైయ 11–18; ఆల్మా 17–20; 23–24 చూడండి). వారి ప్రయత్నాల తక్షణ ఫలితాలు భిన్నంగా ఉన్నప్పటికీ, ఇద్దరు సువార్తికులను ప్రభువు ఎందుకు అంగీకరించారు?
-
మీరు నేర్చుకున్న వాటిని మీ అధ్యయన పుస్తకంలో నమోదు చేయండి.
అధ్యయనము మరియు అన్వయము కొరకు ఉపాయములు
వ్యక్తిగత అధ్యయనము
-
హెచ్చరిక స్వరాన్ని పెంచడం అంటే ఏమిటో పరిగణించండి (జేకబ్ 3:12; సిద్ధాంతము మరియు నిబంధనలు 1:4; 38:41; 63:57–58; 88:81; 112:5; యెహెజ్కేలు 3:17–21; 33:1–12 చూడండి). దాని అర్థం ఏమిటో మరియు మీరు దానిని ఎలా చేయగలరో మీ స్వంత మాటల్లో వ్రాయండి.
-
జోసెఫ్ స్మిత్ మరియు పునఃస్థాపన గురించి మీ సాక్ష్యాన్ని బలపరిచిన మీ జీవితంలోని సంఘటనలను పరిగణించండి. మీ మనోభావాలను నమోదు చేయండి.
సహచర అధ్యయనము మరియు సహచర మార్పిడి
-
ఈ క్రింది గొప్ప సువార్తికులలో ఒకరిని ఎంచుకుని, జాబితా చేయబడిన లేఖనాలను చదవండి. మీరు చదువుతున్నప్పుడు, ఈ సువార్తికుడు (1) తన పిలుపును ఎలా అర్థం చేసుకున్నాడో మరియు దానికి తనను తాను ఎలా అంకితం చేసుకున్నాడో, (2) పని పట్ల తన వైఖరిని మరియు కోరికను ఎలా ప్రదర్శించాడో మరియు (3) ఇతరులు సువార్తను అంగీకరించడానికి ఎలా సహాయం చేశాడో చర్చించండి.
-
ఆల్మా (మోషైయ 18)
-
అమ్మోన్, అహరోను మరియు మోషైయ యొక్క ఇతర కుమారులు (ఆల్మా 17–22; 23:1–6; 26)
-
నీఫై మరియు లీహై (హీలమన్ 5)
-
పేతురు (అపొస్తలుల కార్యములు 2)
-
పౌలు (అపొస్తలుల కార్యములు 16)
-
-
సువార్త యొక్క పునఃస్థాపన గురించి రెండు కీర్తనలను ఎంచుకోండి. కీర్తనలను చదవండి లేదా పాడండి. పదాల అర్థాన్ని చర్చించండి.
జిల్లా సలహాసభ, జోన్ సభ్యసమావేశాలు మరియు మిషను నాయకత్వ సలహాసభ
-
ఇటీవల పరివర్తన చెందిన ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులను వారి పరివర్తన అనుభవాలను పంచుకోవడానికి ఆహ్వానించండి. సువార్తికుల గురించి వారు ఎలా భావించారు? సువార్తికులు బోధించిన దాని గురించి వారు ఎలా భావించారు? వాగ్దానాలను పాటించడానికి ఏది వారికి సహాయపడింది? వారి పరివర్తనను ఏది బాగా ప్రభావితం చేసింది?
-
సమావేశానికి చాలా రోజుల ముందు, అధ్యాయం ప్రారంభంలో ఉన్న “దీనిని పరిగణించండి” నుండి ఎంపిక చేసిన ప్రశ్నలను ఆలోచించడానికి అనేక మంది సువార్తికులను నియమించండి. కేటాయించిన ప్రశ్నపై రెండు నుండి మూడు నిమిషాల ప్రసంగాన్ని సిద్ధం చేయమని ప్రతి సువార్తికుడిని అడగండి. జిల్లా సలహాసభ లేదా జోన్ సభ్యసమావేశంలో, సువార్తికులను వారి ప్రసంగాలు ఇవ్వడానికి ఆహ్వానించండి. ప్రసంగాల తర్వాత, నేర్చుకున్న వాటి గురించి మరియు సువార్త పరిచర్యలో వాటిని ఎలా ఉపయోగించవచ్చనే దాని గురించి చర్చించండి.
-
సువార్తికులను నాలుగు సమూహాలుగా విభజించండి. ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా పునఃస్థాపించబడిన మరియు బయల్పరచబడిన వీలైనన్ని సత్యాలు, నిబంధనలు మరియు విధులను జాబితా చేయమని ప్రతి సమూహాన్ని అడగండి. ప్రతి సమూహం వారి జాబితాలను పంచుకోనివ్వండి. పునఃస్థాపన ద్వారా బయల్పరచబడిన ఏవైనా సత్యాలు వారి జీవితాలను ఎలా ప్రభావితం చేసాయో పంచుకోవడానికి సువార్తికులను ఆహ్వానించండి.
-
విజయవంతమైన సువార్తికునిగా ఉండడం అంటే ఏమిటో చర్చించండి. నిర్దిష్ట ఉదాహరణలు ఇవ్వమని సువార్తికులను ఆహ్వానించండి.
మిషను నాయకులు మరియు మిషను సలహాదారులు
-
ఇంటర్వ్యూల సమయంలో లేదా సువార్తికులతో సంభాషణలో, మీతో వీటిని పంచుకోమని కాలానుగుణంగా వారిని అడగండి:
-
యేసు క్రీస్తు గురించి వారి సాక్ష్యం.
-
పునఃస్థాపించబడిన సువార్త మరియు జోసెఫ్ స్మిత్ యొక్క నియమితకార్యం గురించి వారి సాక్ష్యం.
-
మోర్మన్ గ్రంథము గురించి వారి సాక్ష్యం.
-
సువార్తికునిగా వారి ఉద్దేశ్యం గురించి వారి ఆలోచనలు.
-
-
వారి సువార్తసేవ యొక్క కొన్ని ఉద్దేశ్యాల గురించి వారి అధ్యయన పుస్తకంలో నమోదు చేయమని సువార్తికులను ఆహ్వానించండి. ఒక ఇంటర్వ్యూలో లేదా సంభాషణలో, వారు వ్రాసిన వాటిని పంచుకోమని వారిని అడగండి.
-
కొత్త సభ్యులకు అభినందన లేఖ పంపండి.