సర్వసభ్య సమావేశము
నిబంధన బాట: నిత్య జీవమునకు మార్గము
2022 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


నిబంధన బాట: నిత్య జీవమునకు మార్గము

పరిపూర్ణతకు మార్గము నిబంధన బాట, అన్ని విధులు మరియు నిబంధనలకు కేంద్రము క్రీస్తే.

ఒక శక్తివంతుడైన రాజు తన రాజ్యాలలో ఒక దానిని తన కొడుకు పరిపాలించాలని కోరాడు. సింహాసనముపై కూర్చోవడానికి యువరాజు నేర్చుకొని జ్ఞానమునందు ఎదగాలి. ఒకరోజు, రాజు యువరాజును కలిసి, తన ప్రణాళికను పంచుకున్నాడు. యువరాజు వేరే నగరానికి వెళ్ళి, అనుభవాలను సంపాదించడానికి వారు అంగీకరించారు. అతడు సవాళ్ళను ఎదుర్కొంటాడు అదేవిధంగా అక్కడ అనేక మంచి విషయాలను ఆనందిస్తాడు. తరువాత రాజు అతడిని నగరానికి పంపాడు, అక్కడ యువరాజు రాజుకు తన విశ్వాసాన్ని రుజువు చేయడానికి మరియు రాజు అతడి కోసం ఉంచిన అధికారాలను మరియు బాధ్యతలను స్వీకరించడానికి అతడు సరిపోతాడని నిరూపించాలి. అతడి కోరికలు మరియు విశ్వాసముపై ఆధారపడి, అతడు ఈ అధికారాలు మరియు బాధ్యతలు స్వీకరించడానికి లేదా లేకపోవడానికి ఎంపిక చేయడానికి యువరాజు స్వేచ్ఛ ఇవ్వబడ్డాడు. యువరాజుకు ఏమి జరిగిందో తెలుసుకోవాలని మీరు కోరుతున్నారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. రాజ్యమును స్వతంత్రించుకోవడానికి అతడు తిరిగి వెళ్ళాడా?

ప్రియమైన సహోదర సహోదరీలారా, మనలో ప్రతిఒక్కరం ఒక యువరాజు లేక యువరాణి. యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము మరియు పునరుత్థానము ద్వారా అమర్త్యత్వాన్ని పొందే శరీరము యొక్క దీవెనను ఆనందించడానికి ప్రియమైన పరలోక తండ్రి చేత మర్త్యత్వముకు మనము పంపబడ్డాము. దేవుని ప్రణాళికలో ఈ మర్త్య అనుభవము యొక్క ఒక ఉద్దేశ్యమేదనగా “[మన] దేవుడైన ప్రభువు [మనకు] ఆజ్ఞాపించిన వాటన్నిటిని చేస్తామని” (అబ్రాహాము 3:25) నిరూపించుట ద్వారా దేవుని సన్నిధికి తిరిగి వెళ్ళడానికి సిద్ధపడటానికి మనము ఆశించబడుతున్నాము.

మనకు సహాయపడటానికి, రక్షకుడు మనల్ని విడిపించడానికి, దేవుని వద్దకు తిరిగి వెళ్ళుటకు మార్గమును చూపడానికి వచ్చాడు. రక్షకుని వద్దకు రావడానికి మరియు ఆయనయందు పరిపూర్ణులు కావడానికి దేవుని పిల్లలు ఆహ్వానించబడ్డారు. లేఖనాలలో, ప్రభువు వద్దకు మనల్ని రమ్మనే ఆహ్వానము, 90 సార్లకు పైగా పలుమార్గు చెప్పబడింది, మరియు వీటిలో సగం కంటే ఎక్కువగా ప్రభువునుండి స్వయంగా వచ్చిన వ్యక్తిగత ఆహ్వానాలు. రక్షకుని ఆహ్వానమును అంగీకరించుట అనగా ఆయన విధులలలో పాలుపంచుకొని, ఆయనతో మన నిబంధనలను పాటించుట. యేసు క్రీస్తే “మార్గమును, సత్యమును, జీవమును”యోహాను 14:6), మరియు ఆయన మనల్ని “తన వద్దకు రమ్మని మరియు తన మంచితనము నుండి పాలుపొందుమని ఆహ్వానించుచున్నాడు, మరియు తన యొద్దకు వచ్చువానిని ఎవ్వరిని ఆయన కాదనడు” (2 నీఫై 26:33).

పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తుకు మన పరివర్తనను లోతుగా చేయుట మరియు వారి వలె ఎక్కువగా కావడానికి మనకు సహాయపడడమే సమస్త సువార్త అభ్యాసము మరియు బోధన యొక్క లక్ష్యము. “ఉన్నత స్థితి యొక్క దీవెనలు అనుగ్రహించబడే విధానము” మరియు ఖచ్చితమైన సమయము గురించి అన్ని విషయాలు బయల్పరచబడనప్పటికీ, మనము వాటిగురించి హామీ ఇవ్వబడ్డాము.(M. Russell Ballard, “Hope in Christ,” Liahona, May 2021, 55).

ప్రధాన యాజకుడైన ఆల్మా, జరహెమ్లా దేశంలో బోధిస్తూ, యేసు క్రీస్తు ఇచ్చిన లోతైన ఆహ్వానాన్ని ఇలా వివరించాడు:

“ఇదిగో మనుష్యులందరిని ఆయన ఆహ్వానించుచున్నాడు, ఏలయనగా, కరుణాబాహువులు వారి వైపు చాపబడియుననవి మరియు పశ్చాతాపము పొందుడి మరియు నేను మిమ్ములను చేర్చుకొందునని ఆయన చెప్పుచున్నాడు.”

అవును, ఆయన చెప్పుచున్నాడు, నా యొద్దకు రండి మరియు మీరు జీవవృక్షము యొక్క ఫలమును పాలు పొందుదురు”(ఆల్మా 5:33–34).

ఈ గందరగోళ ప్రపంచంలో మనము విశ్రాంతి కలిగియుండునట్లు ఆయన వద్దకు వచ్చి, ఆయన కాడిని మనపై మోయమని రక్షకుడు స్వయంగా మనల్ని ఆహ్వానిస్తున్నాడు.(మత్తయి 11:28–29 చూడండి). మనము “[ఆయన]యందు విశ్వాసముంచుట ద్వారా, ప్రతిదినము పశ్చాత్తాపపడుట, రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క విధులను పొందినప్పుడు దేవునితో నిబంధనలు చేసుకొనుట ద్వారా మరియు ఆ నిబంధనలను గైకొనుట ద్వారా అంతము వరకు సహించుట” ద్వారా క్రీస్తు యొద్దకు వస్తాము.(General Handbook: Serving in The Church of Jesus Christ of Latter-day Saints, 1.2.1, ChurchofJesusChrist.org). పరిపూర్ణతకు మార్గము నిబంధన బాట, అన్ని విధులు మరియు నిబంధనలకు కేంద్రము క్రీస్తే.

మనము చేసిన నిబంధనల కారణముగా, మనము క్రీస్తు యొక్క కుమారులు మరియు కుమార్తెలమని పిలవబడతాము, ఆయన మనల్ని ఆత్మీయముగా కనియున్నాడు, మరియు ఆయన నామము క్రింద మనము స్వతంత్రులుగా చేయబడియున్నాము, ఏలయనగా “దాని ద్వారా రక్షణ వచ్చుటకు ఇవ్వబడిన మరే ఇతర నామము లేదు” (మోషైయ 5:7–8) అని రాజైన బెంజమెన్ బోధించాడు. “దేవుని కుమారుని యొక్క మాదిరిని అనుసరించుటలో” (2 నీఫై 31:16 ) మనము అంతము వరకు స్థిరముగా ఉన్నప్పుడు మనము రక్షించబడతాము. ఇరుకైన మరియు సంకుచితమైన మార్గమున ప్రవేశించిన తరువాత సమస్తము చేయబడలేదని నీఫై సలహా ఇచ్చాడు; మనము “ఒక నిలకడతో పరిపూర్ణమైన ప్రకాశవంతమైన నిరీక్షణ కలిగియుండి మరియు దేవుని యొక్క మరియు మనుష్యులందరి యొక్క ప్రేమను కలిగి ముందుకు త్రోసుకు వెళ్ళవలెను” (2 నీఫై 31:19–20 చూడండి).

నిబంధన మార్గాన్ని కనుగొని, దానిలో ఉండేందుకు క్రీస్తు యొక్క సిద్ధాంతము మనకు సహాయపడుతుంది మరియు ప్రభువు వాగ్దానం చేసిన ఆశీర్వాదాలు పరిశుద్ధ విధులు మరియు నిబంధనల ద్వారా పొందబడునట్లు సువార్త ఏర్పాటు చేయబడింది. దేవుని యొక్క ప్రవక్త అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ 2018, జనవరి 16న తన ప్రసారములో మనకిలా బోధించారు, “నిబంధన బాటపై నిలిచియుండుము. రక్షకునితో నిబంధనలు చేసి, ఆ నిబంధనలు పాటించడం ద్వారా ఆయనను అనుసరించాలనే మీ నిబద్ధత ప్రతిచోటా ఉన్న పురుషులు, స్త్రీలు మరియు పిల్లలకు లభించే ప్రతి ఆత్మీయ దీవెన మరియు విశేషాధికారానికి ద్వారాన్ని తెరుస్తుంది. … మనలో ప్రతీఒక్కరు ప్రయాసపడే లక్ష్యము ప్రభువు యొక్క మందిరములో శక్తితో దీవించబడి, కుటుంబాలుగా బంధింపబడి, దేవుని యొక్క మిక్కిలి గొప్ప వరమైన—నిత్యజీవము కొరకు మనల్ని అర్హులుగా చేయునట్లు దేవాలయములో చేయబడిన నిబంధనలకు విశ్వాసముగా ఉండుట” (“As We Go Forward Together,” Liahona, Apr. 2018, 7).

దేవుడు నమ్మకముగా నిబంధనను పాటించేవారితో తనకున్న సంబంధాన్ని విడిచిపెట్టడు లేదా నిత్య జీవమునకు సంబంధించిన వాగ్దానం చేసిన ఆశీర్వాదాలను నిలిపివేయడు. మరియు మనము పవిత్రమైన నిబంధనలను గౌరవించినప్పుడు, మనము రక్షకుని దగ్గరకు ఆకర్షితులవుతాము. సువార్త నిబంధనలు మరియు విధులు మన జీవితాల్లో ఒక దిక్సూచి వలె పనిచేస్తాయి, ఇవి క్రీస్తు వద్దకు రావడానికి మరియు ఆయనలా మరింతగా మారడానికి మనకు సరైన దిశానిర్దేశం చేస్తాయి అని ఎల్డర్ డేవిడ్ ఎ. బెడ్నార్ నిన్న మనకు బోధించారు.

నిబంధనలు దేవునికి తిరిగి వెళ్ళే మార్గాన్ని సూచిస్తాయి. బాప్తిస్మము యొక్క విధులు, పరిశుద్ధాత్మను పొందుట, యాజకత్వపు నియామకము, మరియు సంస్కారము, ఆయన రక్షణ విధులలో పాలుపంచుకోవడానికి ప్రభువు యొక్క దేవాలయానికి మనల్ని నడిపిస్తాయి.

విశ్వాసంగా నిబంధనలు పాటించడానికి మనకు సహాయపడటానికి మన రక్షకుడు నొక్కి చెప్పిన రెండు విషయాలను తెలియజేయాలని నేను కోరుతున్నాను.

  1. పరిశుద్ధాత్మ మనకు బోధించగలదు, రక్షకుని యొక్క బోధనలు జ్ఞాపకం చేయగలదు, మరియు మనతో శాశ్వతంగా నివసించగలదు (యోహాను 14:16, 26 చూడండి, 26). నిబంధన మార్గముపై మనల్ని నడిపించడానికి ఆయన మన స్థిరమైన సహవాసిగా ఉండగలడు. అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా బోధించారు, “రాబోయే దినాలలో, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు, మార్గదర్శకత, ఓదార్పు మరియు నిరంతర ప్రభావము లేకుండా ఆత్మీయంగా బ్రతుకుట సాధ్యము కాదు” (“Revelation for the Church, Revelation for Our Lives,” Liahona, May 2018, 96).

  2. రక్షకుడు సంస్కార విధిని స్థాపించాడు, ఆవిధంగా మనము ఆయనను ఎల్లప్పుడు జ్ఞాపకముంచుకొని, ఆయన ఆత్మను ఎల్లప్పుడు మనతో కలిగియుంటాము. బాప్తిస్మము నిత్యజీవానికి ద్వారమును తెరుస్తుంది మరియు నిబంధన బాట వెంబడి స్థిరముగా ముందుకు త్రోసుకొని వెళ్ళుటకు సంస్కారము మనకు సహాయపడుతుంది. మనము సంస్కారము తీసుకొన్నప్పుడు మనము ఎల్లప్పుడు ఆయన కుమారుని జ్ఞాపకముంచుకుంటున్నామని తండ్రికి ఒక సాక్ష్యముగా అది ఉంటుంది. మనము ఆయనను ఎల్లప్పుడు జ్ఞాపకముంచుకొని, ఆయన ఆజ్ఞలు పాటించినప్పుడు, ఆయన ఆత్మను ఎల్లప్పుడు మనతో కలిగియుంటాము. ఈ వాగ్దానానికి చేర్చబడి, మన పాపాల గురించి మనము వినయముగా పశ్చాత్తాపపడినప్పుడు, ప్రభువు వాగ్దానము చేసిన పాప క్షమాపణను క్రొత్తదిగా చేస్తాడు.

మన నిబంధనలకు విశ్వాసంగా నిలిచియుండుటలో, మనము సంస్కారమును యోగ్యతగా తీసుకొనడానికి మనల్ని సిద్ధపరచడానికి ఆత్మను ఎల్లప్పుడు కలిగియుండటానికి మనము ప్రయత్నించాలి మరియు అదేవిధంగా, మనము ఆత్మను ఎల్లప్పుడు కలిగియుండటానికి సంస్కారములో యోగ్యతగా పాల్గొనాలి.

మా కూతురుకు ఐదు సంవత్సరాలప్పుడు, ఆమెకు బ్యాటరీతో పనిచేసే కారును కలిగియున్నది మరియు ఇల్లంతా దానిని నడపటానికి ఇష్టపడేది. ఒక సాయంత్రము, ఆమె నావద్దకు వచ్చి, “నాన్నా, నా కారు పని చేయడంలేదు.” మీ కారులో నుండి కాస్త గాస్ తీసి నా కారులో వేస్తారా, ఆలా నా కారు మరలా పని చేస్తుంది? బహుశా మీ కారు నడపడానికి అవసరమైనట్లుగా దానికి గాస్ అవసరము.”

తరువాత ఆ కారు బ్యాటరీ తక్కువగా ఉందని నేను గమనించాను, కనుక ఒక గంటలో అది పనిచేసేలా మనం చేయగలమని నేను చెప్పాను. చాలా ఉత్సాహంతో ఆమె “అవును! అని చెప్పింది. మనము దానిని గాస్ స్టేషను వద్దకు తీసుకెళదాము.” నేను ఛార్జ్ చేయడానికి బ్యాటరీని చార్జ్‌కి కనెక్ట్ చేసాను, ఒక గంట తర్వాత ఆమె ఛార్జ్ చేయబడిన బ్యాటరీతో కారును నడపగలిగింది. కరెంటు ఆధారంతో దాని బ్యాటరీని ఎల్లప్పుడు చార్జి చేయడం ముఖ్యమైనదని ఆమె నేర్చుకున్నది.

మా కుమార్తె తన బొమ్మ కారును నడపడానికి బ్యాటరీ మరియు శక్తి మధ్య సంబంధాన్ని తెలుసుకున్నట్లుగా, మనం కూడా యేసు క్రీస్తు, సంస్కారము మరియు ఆత్మ గురించి నేర్చుకుంటాము. మర్త్యత్వము ద్వారా దాటడానికి మనకు సహాయం చేయడానికి ఆత్మ మరియు మన ఆత్మీయ జీవమును శక్తివంతం చేయడానికి సంస్కారము అవసరం. మన బాప్తిస్మపు నిబంధనను క్రొత్తదిగా చేసుకొని, సంస్కారములో పాలుపంచుకొనుట మిగిలిన ఇతర విధులన్నిటికి విశ్వసనీయతను కలిగిస్తుంది. మనము రక్షకుని ఆహ్వానాన్ని అధ్యయనం చేసి గౌరవించి మరియు ఆయన వాగ్దాన దీవెనలను ఆనందించినప్పుడు సంతోషకరమైన ముగింపు అభయమివ్వబడుతుంది. “లోకము నుండి మనల్ని మచ్చలేని వారిగా కాపాడుకొనుటకు, మనము ప్రార్థనా మందిరముల వెళ్లి, ఆయన పరిశుద్ధ దినమున మన సంస్కారములు అర్పించవలెను.” (సిద్ధాంతము మరియు నిబంధనలు 59:9)

నిబంధనలు పాటించేవారికి “ఈ లోకంలో శాంతి మరియు రాబోయే లోకంలో నిత్యజీవం” లభిస్తాయని నేను సాక్ష్యమిస్తున్నాను.(సిద్ధాంతము మరియు నిబంధనలు 59:23). సంస్కారము ద్వారా రక్షకుని చిహ్నమును మీరు క్రమంగా పాలుపంచుకొన్నప్పుడు, నిబంధన బాటపై మిమ్మల్ని నడిపించడానికి, మీ నిబంధనలకు విశ్వాసంగా నిలిచియుండటానికి ఆయన ఆత్మను మీతో కలిగియుంటారని నేను సాక్ష్యమిస్తున్నాను. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.