2010–2019
సమాధానపరచు పరిచర్య
అక్టోబర్ 2018


సమాధానపరచు పరిచర్య

మనము దీనులుగా ఉండి, దానిని వెదకుటకు తగినంత ధైర్యము కలిగియున్న యెడల, దేవునితో మరియు ఒకరినొకరితో సమాధానపడుట ఆత్మకు శాంతిని తెచ్చునని నేను సాక్ష్యమిస్తున్నాను.

గత ఏప్రిల్‌లో, అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ పరిచర్య భావనను పరిచయము చేసినప్పుడు, అది దేవునిని ప్రేమించుటకు, మరియు ఒకరినొకరు ప్రేమించుకొనుడనే గొప్ప ఆజ్ఞలను పాటించుటకు ఒక విధానము అని ఆయన నొక్కిచెప్పారు.1 సంఘ అధికారులుగా మేము, దానికి సంబంధించి మీరు ప్రారంభించిన అద్భుతమైన స్పందనపై బహిరంగంగా ప్రశంసిస్తున్నాము మరియు అభినందిస్తున్నాము. ఈ అద్భుతమైన ప్రయత్నములో మన ప్రియమైన ప్రవక్తను మీరు అనుసరిస్తున్నందుకు మీకు మా ధన్యవాదములు మరియు ఇంకా అనేక సూచనల కోసం ఎదురుచూడ వద్దని సూచిస్తున్నాము. కార్యాచరణలోకి దూకి అవసరతలలో ఉన్నవారిని చేరుకోండి. మీరు ఏ రకమైన సేవ చేయాలని ఆశ్చర్యపడుతూ, సేవ చేయుట ఆపవద్దు. బోధించబడిన ప్రధాన సూత్రాలను అనుసరిస్తూ, యాజకత్వతాళపు చెవులతో ఏకరీతిగా నిలిచియుండి, మరియు పరిశుద్ధాత్మ మనల్ని నడిపించాలని కోరుకున్నప్పుడు, మనం విఫలం కాలేము.

ఈ ఉదయాకాలాన్న నేను నియమించబడకుండా, నియమిత మౌఖిక సంభాషణ చేర్చబడకుండా, అది సంఘ నాయకులకు నివేదించే తాత్కాలిక నివేదిక కాదు కానీ శాశ్వతంగా ముఖ్యమైనది మరియు మనము దేవునికి జవాబుదారులమైన పరిచర్య యొక్క వ్యక్తిగత వివరణ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఆ రకమైన పరిచర్యను గూర్చి కేవలము ఒక సామన్యమైన మాదిరిని నేను మీతో పంచుకుంటాను.

గ్రేంట్ మోరెల్ బోవెన్ అనేకుల వలే వ్యవసాయంతో వారి జీవనాన్ని సాగించే, కష్టజీవి, సమర్పించబడిన భర్త, మరియు తండ్రి, స్థానిక బంగాళదుంప పంట సరిగా పండినప్పుడు ఆర్ధికంగా కృంగిపోయాడు. అతడు, అతడి భార్య నోర్మా, ఇతర ఉద్యోగాలను చూసుకొని, వేరే నగరానికి వలస వెళ్లి, ఆర్ధికంగా కోలుకోవడం ప్రారంభించారు. అయినప్పటికినీ, దేవాలయ సిఫార్సు మౌఖిక సంభాషణ జరిగినప్పుడు మోరెల్స్ తాను పూర్తి దశమభాగం చెల్లించేవాడినని చెప్పగా వారి బిషప్పు దానిని సందేహించినప్పుడు ఆ భయంకరమైన దురదృష్టకరమైన సంఘటనలో సహోదరుడు బోవెన్ తీవ్రంగా బాధపడ్డాడు.

అయితే ఆరోజు ఈ వ్యక్తులలో ఎవరు ఖచ్చితమైన వాస్తవాలు కలిగియున్నారో నాకు తెలియదు గానీ, సహోదరి బోవెన్ ఆ మౌఖిక సంభాషణ తర్వాత తన దేవాలయ సిఫార్సును క్రొత్తదిగా చేసుకొని వెళ్లగా, సహోదరుడు బోవెన్ 15 సంవత్సారాలు తనను సంఘం నుండి బయటకు తీసుకువెళ్లే కోపంతో బయటకు నడచి వెళ్లాడు.

దశమభాగం గురించి ఎవరు సరైనవారో లక్ష్యపెట్టకుండా, మోరెల్ మరియు బిషప్పు ఇరువురు రక్షకుని ఉత్తరువైన “నీ ప్రతి వాదితో నీవు త్వరగా సమాధానపడుము”2 మరియు పౌలు సలహాయైన “సూర్యుడస్తమించువరకు మీ కోపము నిలిచియుండకూడదను”3 దానిని మరచిపోయారు. వాస్తవమేమిటంటే వారు ఏకీభవించలేదు, మరియు సహోదరుడు బోవెన్ ఈ సంఘటనను గూర్చి చాలా కాలము కోపముగా ఉన్నాడు, అది ఒక ప్రాచీన రోమీయుల జ్ఞాని చెప్పిన దానిని రుజువు చేసింది, “అదుపు చేయబడని యెడల కోపం, తరచుగా అది గాయమును రేపిన దానికంటే ఎక్కువ (నాశనకరమైనది).”4 కానీ సమాధానపడు అద్భుతం మనకు ఎల్లప్పుడు అందుబాటులోనే ఉంది, మరియు తన కుటుంబం కొరకు, తాను సత్యమని ఎరిగిన సంఘం కొరకు తనకు గల ప్రేమను బట్టి, మోరెల్ బోవెన్ పూర్తిగా సంఘంలోనికి తిరిగి వచ్చాడు. అది ఎలా జరిగిందో నేను మీకు క్లుప్తంగా చెప్తాను.

సహోదరుడు బోవెన్ యొక్క కుమారుడు బ్రాడ్ మాకు మంచి స్నేహితుడు, దక్షిణ యూటాలో సమర్పించబడిన ప్రాంతీయ డెబ్బదిగా సేవ చేస్తున్నాడు. ఆ సంఘటన జరిగిన సమయములో బ్రాడ్‌కు 11 సంవత్సరాలు, మరియు 15 సంవత్సరాలుగా తన తండ్రి యొక్క మతపరమైన భక్తి క్షీణించుట అతడు గమనించాడు, కోపం, అపార్ధాలు నాటబడినప్పుడు పండే ఘోరమైన పంటకు ఒక సాక్షి. ఎదైనా చేయబడాల్సిన అవసరమున్నది. 1977లో థాంక్స్ గివింగ్ సెలవులు సమీపించినప్పుడు, బ్రిగమ్ యంగ్ విశ్వవిద్యాలయ విద్యార్థిగా 26 సంవత్సరాల వయస్సు గల బ్రాడ్; తన భార్య, వేలరీ, పసివాడైన కొడుకు మైక్, విద్యార్థులచే ఉపయోగించబడే చవకైన ఒక కారులో, వాతావరణం బాగలేకపోయినప్పటికినీ, బిల్లింగ్స్, మోంటేనాకు కారులో వెళ్లారు. సహోదరుడు బోవెన్ సీనియర్ వద్దకు వారి పరిచర్యా దర్శనార్ధం బయలుదేరిన ఆ ముగ్గురునీ పశ్చిమ యెల్లోస్టోన్ వద్ద మంచులో వారి కారుకి ప్రమాదం జరిగినా కూడా ఆపలేకపోయింది.

వారక్కడికి చేరుకున్నాక, బ్రాడ్ అతని సహోదరి పామ్ వారి తండ్రితో ఏకాంత సమయము కొరకు అడిగారు. “మీరు ఒక అద్భుతమైన తండ్రిగా ఉన్నారు,” అని బ్రాడ్ కొంచెం ఉద్వేగంతో ప్రారంభించాడు, “మరియు మీరు ఎల్లప్పుడూ మమ్మల్ని ఎంతగా ప్రేమించారో మాకు తెలుసు. కానీ చాలాకాలం నుండి ఏదో సరిగ్గా లేదు, మరియు అది జరిగి చాలా కాలమైంది. మీరు ఒక్కసారి బాధపడినందువల్ల, ఈ కుటుంబమంతా అనేక సంవత్సరాలుగా బాధపడుతూనే ఉంది. మనం ముక్కలయ్యాము, మీరొక్కరే మనల్ని సరిచేయగలరు. దయచేసి, దయచేసి ఇప్పటికైనా, మీ హృదయంలో, బిషప్పుతో జరిగిన ఆ దురదృష్టకరమైన సంఘటనను తీసివేసి, మీరు ఒకప్పుడు ఈ కుటుంబాన్ని సువార్తలోనికి నడిపించినట్లుగా తిరిగి నడిపించగలరా?” అని అడిగాడు.

అక్కడ పూర్తి నిశ్శబ్దం నెలకొంది. అప్పుడు సహోదరుడు బోవెన్ అతని మాంసంలోని మాంసం, ఎముకలలో ఎముకలైన తన ఇద్దరు పిల్లల వైపు,5 చూసి చాలా నెమ్మదిగా “అవును, అవును, నేను చేస్తాను” అన్నాడు.

పులకరించబడ్డారు, కానీ ఊహించని సమాధానం వలన నిర్ఘాంతపోయిన, బ్రాడ్ బోవెన్ అతని కుటుంబం వారి తండ్రి, భర్త తన ప్రస్తుత బిషప్పు వద్దకు సమాధానపడు ఆత్మతో వెళ్లి తన జీవితంలోని విషయాలను సరిచేసుకోవడాన్ని గమనించారు. ఈ ధైర్యముగలది కానీ ఊహించని సందర్శనమునకు పరిపూర్ణమైన సమాధానంగా, అనేకసార్లు సహోదరుడు బోవెన్‌ను తిరిగి రమ్మని ఆహ్వానించిన బిషప్పు, తన చేతులను మోరెల్ చుట్టూ వేసి చాలా, చాలా సేపు కౌగలించుకొని అతనిని పట్టుకొనెను.

కేవలము కొన్ని వారాలలోనే, సహోదరుడు బోవెన్ మరలా సంఘ కార్యములలో పూర్తిగా నిమగ్నుడై దేవాలయానికి తిరిగి వెళ్లుటకు తననుతాను యోగ్యునిగా చేసుకొనెను. త్వరలోనే 25 మందితో ప్రయాసపడుతున్న ఒక శాఖపై అధ్యక్షత వహించే పిలుపును అంగీకరించి, దానిని 100 మించి అభివృద్ధి చెందిన సమూహముగా ఎదుగునట్లు చేసెను. ఇదంతా దాదాపు 50 సంవత్సారాల క్రితం జరిగెను, కానీ ఒక కుమారుడు, కుమార్తె వారి స్వంత తండ్రికై చేసిన పరిచర్య మనవి, ఇతరుల లోపాలను క్షమించి ముందుకు సాగేందుకు ఆ తండ్రి యొక్క సమ్మతి వారిపై దీవెనలను తెచ్చింది, బోవెన్ కుటుంబానికి ఇంకా ఆ దీవెనలు వస్తూనే ఉన్నాయి---మరియు ఎప్పటికీ వస్తూనే ఉంటాయి.

సహోదరీ, సహోదరులారా, మనము “ప్రేమయందు కలిసి జీవించాలని” 6 “మన మధ్య ఎలాంటి విభేధాలు ఉండకూడదని” 7 యేసు చెప్పారు. “వివాదము యొక్క ఆత్మను కలిగిన వాడు నా సంబంధి కాడు,” అని ఆయన నీఫైయులకు హెచ్చరించారు.8 వాస్తవానికి, చాలా మట్టుకు, ఒకరినొకరితో మనకున్న అనుబంధాన్ని ద్వారా - క్రీస్తుతో మన అనుబంధం నిర్ణయింపబడుతుంది--- లేదా కొంచెమైనా ప్రభావితం ---చేయబడుతుంది.

ఆయన చెప్పారు, “కాబట్టి మీరు . . . నా యొద్దకు వచ్చుటకు కోరిక కలిగిన యెడల మరియు నీ సహోదరుడు నీకు వ్యతిరేకముగా ఏమైనా కలిగియుండెనని జ్ఞాపకము చేసుకొనిన యెడల —

“నీ మార్గమున నీ సహోదరుని యొద్దకు వెళ్ళుము, మరియు మొదట నీ సహోదరునితో సమాధానపడుము; మరియు అప్పుడు నా యొద్దకు హృదయము యొక్క పూర్ణ ఉద్దేశ్యముతో రమ్ము, మరియు నేను నిన్ను చేర్చుకొందును.9

మనలో ప్రతీఒక్కరము నిశ్చయముగా విస్తారమైన, భిన్నమైన రకాల గత బాధ లేక గాయములు మరియు విచారములను, ప్రస్తుతము ఎవరైన ఒకరి హృదయము లేక కుటుంబము లేక పొరుగుయందు శాంతిని నాశనము చేయు లేక బలహీనపరచు బాధాకరమైన జ్ఞాపకాలను తెలియచేయగలము. మనము ఆ బాధను కలుగ చేసినా, లేక దాని గ్రహీతలమైనప్పటికినీ, ఆ గాయములు స్వస్థపరచబడాలి, ఆవిధంగా జీవితము దేవుడు ఉద్దేశించినంత ప్రతిఫలమిచ్చేదిగా ఉండగలదు. మనుమలు ఎల్లప్పుడూ ఆకలిగా ఉంటారు మరియు మీ ఫ్రిజ్‌లోని ఆహారాన్ని, మీ తరఫున మీ మనవలు జాగ్రత్తగా సరిచూచినట్లు, గడువు ముగిసిన పాత మనోవేదనలు మిమ్మల్ని మరియు ఇతరులను బాధించనియ్యకుండా ఉండటానికి ఇది మీకు గతించిన సమయము. ఇకముందు మీ బలము లేక ఆలోచనలో ప్రశస్తమైన స్థలమును దయచేసి వాటికి ఇవ్వకండి. ద టెంపెస్ట్ నాటకములో విచారిస్తున్న ఆలెంజోతో ప్రోస్పెరో చెప్పినట్లుగా, “ఇకముందు దానిగురించి విచారించుటకు కారణమేది లేదు కనుక గతము గురించి మనము విచారించరాదు.10

క్రొత్త నిబంధన కాలములందు క్రీస్తు ఇలా బోధించెను, “క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు.”11 మరియు మన దినాలలో: “ప్రభువైన నేను, ఎవరిని క్షమించాలనుకంటే వారిని క్షమిస్తాను, కానీ మీరు మనుష్యులందరినీ తప్పక క్షమించాలని”12 బోధించెను. అయినప్పటికీ, నిజమైన మనోవేదనలో జీవించు మీలో కొందరికి ఆయన చెప్పని దానిని గుర్తుంచుకొనుట ముఖ్యమైనది. ఆయన “మరొకరి వ్యక్తి వలన మీకు కలిగిన నాశనకరమైన అనుభవాల వలన కలిగిన బాధ లేదా విచారం అనుభవించడానికి మీరు అనుమతించబడరు” అని చెప్పలేదు.లేదా “పూర్తిగా క్షమించడానికి, మీరు ఆ విషపూరితమైన బంధంలోనికి నీవు మళ్లీ ప్రవేశించాలి లేదా దూషించే, నాశనకరమైన పరిస్థితికి నీవు తిరిగి చేరుకోవాలని” ఆయన చెప్పలేదు. కానీ మనకు మిక్కిలి భయంకరమైన తిరస్కారములు రాబోయినప్పటికీ, మన అడుగులను నిజముగా స్వస్థపరచు మార్గంలో ఉంచినప్పుడు మాత్రమే మనం బాధను అధిగమించగలం. “రండి, నన్ను వెంబడించుము”13 అని మనలో ప్రతిఒక్కరిని పిలుస్తున్న నజరేయుడైన యేసు చేత నడవబడిన క్షమించే మార్గం.

ఆయన శిష్యులుగా ఉండుటకు మరియు ఆయన చేసినట్లుగా చేయుటకు ప్రయత్నించుటకు అటువంటి ఆహ్వానంలో, యేసు మనలను ఆయన కృప యొక్క సాధనములుగా ఉండమని---కొరింథీయులకు పౌలు వివరించినట్లుగా “సమాధానపరచు పరిచర్యలో” “క్రీస్తు కొరకు ప్రతినిధులుగా”14 ఉండమని ఆయన మనల్ని అడుగుచున్నారు. ప్రతీ గాయమును బాగు చేయువాడు, ప్రతీ తప్పును సరిచేయు ఆయన, మరొక విధంగా దానిని కనుగొనలేని లోకంలో సమాధానపరచే కష్టమైన కార్యంలో తనతోపాటు పనిచేయమని మనల్ని అడుగుతున్నారు.

కాబట్టి, ఫిలిప్స్ బ్రూక్స్ వ్రాసినట్లుగా: “దుఃఖపూరితమైన అపార్ధాలను ఏదో ఒక రోజున పరిష్కరిద్దాం అని సంవత్సరాలుగా వదలివేసిన మీరు; మీ మనస్సును మార్చుకొనలేరు కనుక హీనమైన వివాదములను సజీవంగా ఉంచు మీకు, మీ గర్వమును త్యాగము చేయుట మరియు వాటిని (పరిష్కరించుటకు) ఈరోజే సమయము ; ఎదో ఒక అవివేకమైన ద్వేషంతో వారితో మాట్లాడకుండా వీధులలో మనుష్యులను కోపంతో దాటివెళ్ళుచున్న మీరు … ; ఏదో ఒక రోజున మీరు . . . ఇవ్వవచ్చునని అనుకున్న, ఒక ప్రశంస లేదా సానుభూతి కోసం ఎదురుచూస్తున్న ఒకరి హృదయాన్ని బాధపడేలా చేస్తున్నది మీరు, . . . వెంటనే వెళ్లి, చేయటానికి మీకు ఎన్నటికీ మరొక అవకాశము రాని దానిని చేయుము.”15

నా ప్రియమైన సహోదరీ, సహోదరులారా, తిరస్కారములు పాతవి లేదా క్రొత్తవి అయినప్పటికీ వాటిని క్షమించి, మర్చిపోవుట, యేసుక్రీస్తు యొక్క ప్రాయశ్చిత్త వైభవానికి ప్రధానమైనదని నేను సాక్ష్యమిస్తున్నాను. తుదకు అటువంటి ఆత్మీయ స్వస్థత మన దైవిక విమోచకుడు, “తన రెక్కలలో స్వస్థతను కలిగియుండి”16 మన సహాయార్థం త్వరపడి వచ్చే ఆయన నుండే వచ్చునని సాక్ష్యమిస్తున్నాను. ఆయనకు, ఆయనను పంపిన మన పరలోకతండ్రికి, ఆ నవీకరణ, పునర్జన్మ, పాత విచారాలు, గతించిన తప్పులనుండి భవిష్యత్తులో స్వేచ్ఛగా ఉండేందుకు సాధ్యం చేయబడుట మాత్రమే కాదు కానీ అవి ఇదివరకే కొనబడినవి, వాటి కొరకు, దానిని చిందించిన గొఱ్ఱె పిల్ల రక్తము చేత సూచించబడి, అత్యంత బాధాకరమైన ఖరీదుతో చెల్లించబడినందుకు మనము కృతజ్ఞతను చెల్లిద్దాం.

లోక రక్షకుని నుండి నాకు ఇవ్వబడిన అపోస్తలత్వ అధికారంతో, మనము దీనమనస్సు కలిగి, దానిని వెదకుటకు తగినంత ధైర్యము కలిగియున్న యెడల దేవునితో మరియు ఒకరినొకరితో సమాధానపడుట ఆత్మకు తెచ్చే శాంతిని గూర్చి నేను సాక్ష్యమిస్తున్నాను. “ఒకరితోనొకరు కలహించుట మానివేయుడి,”17 అని రక్షకుడు వేడుకున్నాడు. మీకు తెలిసిన పాత గాయమేదైనా ఉంటే, దానిని బాగు చేయుము. ఒకరినొకరు ప్రేమయందు సంరక్షించుకొనుము.

నా ప్రియమైన స్నేహితులారా, మనం కలిసి చేసే సమాధానపరచు పరిచర్యలో నేను మనల్ని సమాధానపరచు వారిగా---శాంతిని ప్రేమించి, శాంతిని వెదకి, శాంతిని సృష్టించి, శాంతిని విలువైనదిగా ఆనందించమని అడుగుతున్నాను. “తన స్నేహితుల ఇంటిలో గాయపరచబడుటను గూర్చి పూర్తిగా యెరిగి, ”18 అయినను క్షమించి, మర్చిపోవుటకు, స్వస్థపరచుటకు---మరియు సంతోషముగా ఉండుటకు ఇంకను శక్తిని కనుగొనిన సమాధానము యొక్క రాకుమారుడైన ఆయన నామములో నేను ఆ మనవి చేస్తున్నాను. దాని కొరకు, మీ కొరకు, నా కొరకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నేను ప్రార్థన చేస్తున్నాను, ఆమేన్.