యేసు క్రీస్తు
రొట్టెపైన దీవెన


రొట్టెపైన దీవెన

ఓ దేవా, నిత్యుడవైన తండ్రీ, మీ కుమారుడైన యేసు క్రీస్తు యొక్క
నామమున, ఈ రొట్టెను, దానిలో పాలు పొందుచున్నవారందరి యొక్క
ఆత్మల కొరకు, ఆశీర్వదించి మరియు పరిశుద్ధపరచమని; అది వారు మీ
కుమారుని యొక్క శరీరము యొక్క జ్ఞాపకమున తినునట్లు, మరియు
మీకు సాక్ష్యమిచ్చునట్లును, ఓ దేవా, నిత్యుడవైన తండ్రీ, వారు మీ కుమారుని
యొక్క నామమును తమ పైన తీసుకొనుటకు, ఇష్టపడుచూ మరియు
ఎల్లప్పుడు ఆయనను జ్ఞాపకము చేసుకొని మరియు ఆయన వారికి ఇచ్చిన,
ఆయన యొక్క ఆజ్ఞలను పాటించునట్లు, వారు ఎల్లప్పుడు, ఆయన
ఆత్మను వారితో కలిగియుండునట్లు, మిమ్ము అడుగుచున్నాము. ఆమేన్.