2026 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము శనివారం ఉదయకాల సభ శనివారం ఉదయకాల సభ2026, ఏప్రిల్ 4–5 తేదీలలో నిర్వహించబడిన యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క 196వ వార్షిక సర్వసభ్య సమావేశపు శనివారం ఉదయకాల సభ. డాలిన్ హెచ్. ఓక్స్పరిచయముఒక వ్రతదినములో, సంఘ సభ్యులు, ప్రథమ అధ్యక్షత్వం మరియు పన్నెండు మంది అపోస్తలుల సమూహ సభ్యులను ఆమోదించడానికి ఓటు వేస్తారని అధ్యక్షులు ఓక్స్ వివరిస్తున్నారు. D. Todd Christoffersonవ్రతదినమువ్రతదినములో, ఆమోదపు ఓట్ల కోసం ప్రథమ అధ్యక్షత్వము మరియు పన్నెండుమంది అపొస్తలుల సమూహం యొక్క పేర్లను అధ్యక్షులు క్రిస్టాఫర్సన్ సమర్పిస్తారు. ప్యాట్రిక్ Kearonఆయన పని మీదప్రభువు నుండి వచ్చే పిలుపులు మన ఎదుగుదలకు అనుగుణంగా రూపొందించబడతాయని మరియు మనం ఒక పిలుపుకు స్పందించినప్పుడు, కేవలం ఒక పనిని పూర్తి చేయడమే కాకుండా, రక్షకుని విమోచన కార్యంలో ఆయనతో పాలుపంచుకుంటామని ఎల్డర్ కీరన్ బోధిస్తున్నారు. క్రిస్టిన్ ఎమ్. Yeeపరిచర్య—“నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను”యేసు క్రీస్తు ఏ విధంగా పరిచర్య చేశారో వివరిస్తూ, ఆయన మార్గంలో పరిచర్య చేయడం వల్ల కలిగే ఆశీర్వాదాల గురించి సహోదరి యీ సాక్ష్యమిస్తున్నారు. క్లార్క్ జి. గిల్బర్ట్ఇంటికి రండియేసు క్రీస్తు సువార్త వైపుకు తిరిగి వచ్చిన వారి ఉదాహరణలను పంచుకుంటూ, అందరూ “ఇంటికి రావడానికి” క్రీస్తు సహాయం చేస్తారని ఎల్డర్ గిల్బర్ట్ బోధిస్తున్నారు. డేవిడ్ ఎ. బెడ్నార్పరాక్రమముతో సహించిన వారందరూఅంతం వరకు ధైర్యంగా సహించడం అంటే, మన జీవితాంతం దాతృత్వాన్ని సాధన చేస్తూ క్రీస్తువలె మారడమే అని ఎల్డర్ బెడ్నార్ బోధిస్తున్నారు. మైఖేల్ జాన్ యు. టెహ్ప్రవక్తను అనుసరించండి; ఆయనకు మార్గం తెలుసుప్రవక్తలు, దీర్ఘదర్శులు మరియు బయల్పాటుదారుల బోధనలను, మాదిరిని అనుసరించడం, మనం యేసు క్రీస్తుకు మరింత దగ్గర కావడానికి సహాయపడగలదని ఎల్డర్ టెహ్ బోధిస్తున్నారు. హోర్హె టి. బెసెర్రాదశమభాగం—దేవునికి ప్రథమ స్థానం ఇవ్వడందశమభాగం ఇచ్చే నియమాన్ని పాటించడం ద్వారా మనం దేవునికి ప్రథమ స్థానం ఇవ్వగలమని ఎల్డర్ బెసెర్రా బోధిస్తున్నారు. హెన్రీ బి. Eyringశాంతి కోసం ప్రార్థనలుప్రగాఢమైన ప్రార్థనలో పరలోక తండ్రి వైపు తిరగడం శాంతిని మరియు శాశ్వతమైన మద్దతును అందిస్తుందని అధ్యక్షులు ఐరింగ్ బోధిస్తున్నారు. శనివారం మధ్యాహ్నకాల సభ శనివారం మధ్యాహ్నకాల సభ2026, ఏప్రిల్ 4–5 తేదీలలో నిర్వహించబడిన యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క 196వ వార్షిక సర్వసభ్య సమావేశపు శనివారం మధ్యాహ్నకాల సభ. D. Todd Christoffersonసంఘము యొక్క ప్రధాన అధికారులు, ప్రాంతీయ డెబ్బదులు మరియు ప్రధాన అధిపతులను ఆమోదించుటఅధ్యక్షులు క్రిస్టాఫర్సన్ ఆమోదపు ఓటు కొరకు, యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క ప్రధాన అధికారులు, ప్రాంతీయ డెబ్బదులు మరియు ఇతర ప్రధాన అధిపతులను సమర్పిస్తున్నారు. Jared B. Larsonసంఘ లెక్కల తనిఖీ విభాగ నివేదిక, 2025జెరెడ్ బి. లార్సన్ 2025వ సంవత్సరానికి సంబంధించిన సంఘ లెక్కల తనిఖీ విభాగ నివేదికను సమర్పిస్తారు. గ్యారీ ఈ. Stevensonపోగొట్టుకున్న సామాను, విమోచించబడిన ఆత్మలుపరిచర్య నియామకాలలో సేవ చేస్తూ, భావితరాన్ని పోషిస్తున్నప్పుడు, సురక్షితంగా దేవుని వద్దకు తిరిగి వెళ్ళడానికి మనం ఒకరికొకరం సహాయపడగలమని ఎల్డర్ స్టీవెన్సన్ బోధిస్తున్నారు. ఎడ్వర్డో ఎఫ్. Ortegaక్రీస్తు—మన విశ్వాసమునకు కర్తయు మరియు దానిని కొనసాగించువారుక్రీస్తు యొక్క జీవితకాల శిష్యుడిగా మారడం అనేది ఒక ప్రక్రియ, అది ప్రతిరోజూ జరిగే అనేక చిన్న వ్యక్తిగత మరియు ఆధ్యాత్మిక సంఘటనల సమాహారం అని ఎల్డర్ ఓర్టెగా బోధిస్తున్నారు. వాన్-లియాంగ్ Wu“నిన్ను తెలుసుకొనుటకు నా పాపములన్నిటినీ నేను వదిలివేసెదను”క్రీస్తు నొద్దకు రావడం అంటే కేవలం క్రీస్తు గురించి తెలుసుకోవడం కంటే చాలా ఎక్కువ అని ఎల్డర్ వూ బోధిస్తున్నారు. ఇందులో విశ్వాసం, పశ్చాత్తాపం మరియు పరివర్తన ఉంటాయి. డేవిడ్ జె. Wunderliయేసు క్రీస్తు మన భారం కాదు; ఆయనే మన ఉపశమనంయేసు క్రీస్తు ఉపశమనాన్ని కలిగిస్తారని మరియు మన భారాలను తేలిక చేస్తారని సహోదరుడు వండర్లీ బోధిస్తున్నారు. జెరాల్డ్ Causséఅందరినీ ప్రేమించండి; ప్రతి ఒక్కరినీ ప్రేమించండియేసు క్రీస్తు శిష్యులుగా, మన చుట్టూ ఉన్నఅందరితో మనం ఆయన ప్రేమను పంచుకున్నప్పుడల్లా ఆయన గురించి సాక్ష్యమిస్తాము—మరియు మనం కలిసే ప్రతి వ్యక్తి ఆయన ప్రేమను అనుభూతి చెందడానికి సహాయపడతాము అని ఎల్డర్ కాస్సే బోధిస్తున్నారు. బ్రాయన్ జె. Holmesయేసే మార్గముయేసు క్రీస్తుపై విశ్వాసం ఉంచి, నిబంధన మార్గంలో ఆయనను మరియు ఆయన సేవకులను అనుసరించడమే నిత్యజీవానికి ఉన్న ఏకైక మార్గం అని ఎల్డర్ హోమ్స్ బోధిస్తున్నారు. క్లెమెంట్ ఎం. మత్స్వాగోథాటఆయన నిన్ను పేరుతో ఎరుగునురక్షకుడు మనల్ని పేరుతో ఎరుగునని మరియు జీవితంలోని ప్రతి దశలో మనల్ని నడిపిస్తారని ఎల్డర్ మత్స్వాగోథాట బోధిస్తున్నారు. యులిసెస్ సోవారెస్యేసు క్రీస్తు—నిజమైన ద్రాక్షావల్లిమనం ఆయనలో నిలిచియుండాలని ఎంచుకున్నప్పుడు, యేసు క్రీస్తు మనకు ఆధ్యాత్మిక పోషణను అందించే ద్రాక్షావల్లి వంటివారని ఎల్డర్ సోవారెస్ వివరిస్తున్నారు. ఆదివారం ఉదయకాల సభ ఆదివారం ఉదయకాల సభ2026, ఏప్రిల్ 4–5 తేదీలలో నిర్వహించబడిన యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క 196వ వార్షిక సర్వసభ్య సమావేశపు ఆదివారం ఉదయకాల సభ. డీటర్ ఎఫ్. ఉఖ్డార్ఫ్ఖాళీ సమాధి వద్ద జరిగిన సమావేశంమొదట ఖాళీ సమాధిని చూసి క్రీస్తు పునరుత్థానానికి సాక్ష్యమిచ్చిన స్త్రీల గురించి బోధిస్తూ, అధ్యక్షులు ఉఖ్డార్ఫ్, మనమందరం కూడా అటువంటి ఆధ్యాత్మిక అనుభవాన్ని మరియు సాక్ష్యాన్ని పొందాలని ఆహ్వానిస్తున్నారు. ఎమిలి బెల్ ఫ్రీమాన్అత్యుత్తమమైన రోజులు మరియు అత్యంత కష్టమైన రోజులుమన మంచి రోజులలోనూ, చెడ్డ రోజులలోనూ, మనం క్రీస్తుతో నడుస్తూ, ఆయన నిత్య సత్యాలను గట్టిగా పట్టుకున్నప్పుడు బలాన్ని పొందగలమని అధ్యక్షురాలు ఫ్రీమన్ సాక్ష్యమిస్తున్నారు. పెడ్రో ఎక్స్. Larrealనా రక్షకుని ప్రేమను నేను అనుభవిస్తున్నానుక్రీస్తు మన పట్ల కలిగియున్న గొప్ప ప్రేమకు సంస్కారం ఒక జ్ఞాపిక అని ఎల్డర్ లార్రియల్ బోధిస్తున్నారు. ఎడ్వర్డ్ బి. రోవ్యేసు క్రీస్తును మీ మార్గదర్శిగా ఎంచుకోండిమనం ఆయన ఆత్మ మాట విన్నప్పుడు, యేసు క్రీస్తు మన జీవిత ప్రయాణంలో మనకు మార్గనిర్దేశం చేయగలరని ఎల్డర్ రోవ్ బోధిస్తున్నారు. రోనాల్డ్ ఎ. రాస్బాండ్ ఆయన లేచియున్నారుఎల్డర్ రాస్బాండ్, ఒక అపొస్తలుడిగా తన స్వంత సాక్ష్యంతో పాటు, బైబిలు మరియు మోర్మన్ గ్రంథంలోని యేసు క్రీస్తు యొక్క పునరుత్థాన వృత్తాంతాలను పంచుకుంటారు. డేల్ జి. రెన్లండ్యేసు క్రీస్తు మూలముగాయేసు క్రీస్తు మరియు ఆయన ప్రాయశ్చిత్తంపై దృష్టి కేంద్రీకరించడం మన జీవితాలకు ఆనందాన్ని మరియు స్పష్టతను తెస్తుందని ఎల్డర్ రెన్లండ్ బోధిస్తున్నారు. థియరీ కె. ముటోంబోదేవునితో నిబంధన సంబంధము యొక్క ఆనందముయేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తం ద్వారా మరియు ఆయనతో మనకున్న నిబంధనల ద్వారా పరలోక తండ్రి తన ప్రేమను మనకు ఎలా అందిస్తారో ఎల్డర్ ముటొంబో వివరిస్తున్నారు. అలెన్ ఆర్.వాకర్ప్రత్యేకమైన నిధిమనం ఆయన స్వరానికి లోబడి, ఆయన నిబంధనను పాటిస్తే, ప్రభువుకు ప్రత్యేకమైన నిధిగా ఉండగలమని ఎల్డర్ వాకర్ బోధిస్తున్నారు. డాలిన్ హెచ్. ఓక్స్క్రీస్తునందు జీవము కలిగియుండుటవివాదాలను నివారించాలని, సమాధానపరచువారిగా ఉండాలని మరియు పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నించాలని అధ్యక్షులు ఓక్స్ మనకు బోధిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నకాల సభ ఆదివారం మధ్యాహ్నకాల సభ2026, ఏప్రిల్ 4–5 తేదీలలో నిర్వహించబడిన యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క 196వ వార్షిక సర్వసభ్య సమావేశపు ఆదివారం మధ్యాహ్నకాల సభ. డి. టాడ్ Christoffersonక్రీస్తు యొక్క స్వభావముక్రీస్తు యొక్క స్వభావాన్ని అనుకరించడమనేది, మనం ఎలా ఉండాలో అలా మారడానికి సహాయపడుతుందని అధ్యక్షులు క్రిస్టాఫర్సన్ బోధిస్తున్నారు. చి హాంగ్ (సామ్) వాంగ్జ్ఞాపకముంచుకొనుడి, జ్ఞాపకముంచుకొనుడిమోర్మన్ గ్రంథంలోని ఐదు లేఖనాలను ఉపయోగించి, మనం ఏమి గుర్తుంచుకోవాలని దేవుడు కోరుకుంటున్నారో ఎల్డర్ వాంగ్ వివరిస్తున్నారు. ఏరన్ టి. Hallనేను నా యేసు నందు అతిశయించుచున్నానుయేసు క్రీస్తు యొక్క కనికరము, ప్రేమ మరియు రక్షించే శక్తి గురించి ఎల్డర్ హాల్ బోధిస్తున్నారు. సూసన్ హెచ్. Porter“నేనున్నాను, నన్ను పంపుము“తన రొట్టెలను, చేపలను పంచుకున్న బాలుడివలే, పిల్లలు కూడా మార్పు తీసుకురాగలరని అధ్యక్షురాలు పోర్టర్ బోధిస్తున్నారు. నీల్ ఎల్. Andersenనిత్య వివాహం అనేది ఒక నిత్య ప్రయాణంఎల్డర్ ఆండర్సెన్ వివాహ నిబంధన యొక్క బాధ్యతలు మరియు ఆశీర్వాదాల గురించి బోధిస్తున్నారు. క్వింటిన్ ఎల్. Cookతాళపుచెవులు, నిబంధనలు మరియు ఈస్టర్ప్రవక్త జోసెఫ్ స్మిత్ మరియు ఆలివర్ కౌడరీలకు రక్షకుని ప్రత్యక్షత మరియు మోషే, ఏలీయా మరియు ఏలీయా అప్పగించిన తాళపుచెవులు కడవరి దినాలలో యేసు క్రీస్తు సువార్త యొక్క పునఃస్థాపనకు కేంద్రబిందువులుగా ఉన్నాయని ఎల్డర్ కుక్ బోధిస్తున్నారు. తానియెలా బి. వకొలొక్రీస్తు యొద్దకు రండి—కలిసి రండిమన శిష్యరికంలో మనం విశ్వాసంగా, సహనంతో ఉన్నప్పుడు, ప్రభువు తన వాగ్దానాలను నెరవేరుస్తారని ఎల్డర్ వకొలొ బోధిస్తున్నారు. గెరిట్ డబ్ల్యు. గాంగ్ఈస్టర్ పండుగ కాలం: ఎవరూ ఒంటరిగా నడవరుమనం మన నిబంధనలను విశ్వాసంగా పాటిస్తున్నప్పుడు, మనం యేసు క్రీస్తును తెలుసుకుంటామని మరియు ఆయన మనతో నివసిస్తారని ఎల్డర్ గాంగ్ బోధిస్తున్నారు. డాలిన్ హెచ్. ఓక్స్ముగింపు వ్యాఖ్యలుయేసు క్రీస్తుపై దృష్టి కేంద్రీకరించి, సభ్యసమావేశంలోని బోధనలను అధ్యయనం చేసినప్పుడు, మనం వ్యక్తిగత బయల్పాటును మరియు నడిపింపును పొందుతామని అధ్యక్షులు ఓక్స్ బోధిస్తున్నారు.