2010–2019
మంచి కాపరి, దేవుని గొఱ్ఱెపిల్ల
2019 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము.


మంచి కాపరి, దేవుని గొఱ్ఱెపిల్ల

యేసు క్రీస్తు తన స్వరము మరియు పేరుతో తన గొఱ్ఱెలను పిలుచును. ఆయన మనల్ని వెదకును మరియు సమవేశపరచును. ప్రేమయందు ఎలా పరిచర్య చేయాలో ఆయన బోధించును.

ప్రియమైన సహోదర, సహోదరిలారా, మీకు ఎప్పుడైనా నిద్రపోవటం కష్టమై, ఊహాత్మకమైన గొఱ్ఱెలను లెక్కపెట్టటానికి ప్రయత్నించారా? మెత్తని గొఱ్ఱెలు ఒక కంచెపైగా గెంతినప్పుడు, మీరు లెక్కిస్తారు: 1, 2, 3, … 245, 246, … 657, 658 …1

నాకైతే, గొఱ్ఱెలను లెక్కించుట నన్ను నిద్రపోయేలా చేయదు. నేను ఒకటి కొల్పోతానని లేక నష్టపోతానని చింతిస్తాను మరియు అది నన్ను మేల్కోని ఉండేలా చేస్తుంది.

ఒక రాజుగా మారిన గొఱ్ఱెల కాపరితో, మనము ప్రకటిద్దాము:

“యెహోవా నా కాపరి; నాకు లేమి కలుగదు.

“పచ్చికగల చోట్లను ఆయన నన్ను పరుండ జేయుచున్నాడు: శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించును.

“నా ప్రాణమును సేదదీర్చుచున్నాడు.”2

చిత్రం
మంచి గొఱ్ఱెల కాపరి అద్దకము వేసిన గాజు

ఈ ఈస్టరు సమయందు, మనము మంచి కాపరి, దేవుని యొక్క గొఱ్ఱెపిల్ల కూడ అయిన ఆయనను వేడుక చేసుకుంటాము. ఆయన దైవత్వ శీర్షికలు అన్నిటిలో, మిగిలినవి ఏవీ ఎక్కువ సున్నితమైనవి లేక ప్రాముఖ్యమైనవి కాదు.. మన రక్షకుడు మంచి కాపరిగా తనను తాను అన్వయించెను మరియు దేవుని గొఱ్ఱెపిల్లగా ఆయనను గూర్చి ప్రవచనాత్మక సాక్ష్యముల నుండి మనము నేర్చుకున్నాము. ఈ పాత్రలు మరియు చిహ్నములు శక్తివంతముగా పరిపూరకమైనవి---కాపరి కంటే ప్రతీ ప్రశస్తమైన గొఱ్ఱెపిల్లకు ఉత్తమంగా సహాయపడేవారు ఎవరు, మరియు మన మంచి కాపరిగా దేవుని గొఱ్ఱెపిల్ల కంటే ఉత్తమంగా ఎవరు ఉండగలరు?

“దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిని ఇచ్చెను,” మరియు దేవుని యొక్క అద్వితీయ కుమారుడు తన తండ్రికి సమ్మతిగల విధేయతయందు తన ప్రాణమును పెట్టెను.3 యేసు సాక్ష్యమిచ్చెను, “నేను గొఱ్ఱెలకు మంచికాపరిని: మంచికాపరి తన గొఱ్ఱెల కొరకు తన ప్రాణము పెట్టును.”4 యేసు తన ప్రాణమును పెట్టుటకు మరియు దానిని మరలా తీసుకొనుటకు శక్తిని కలిగియున్నారు.5 ఆయన తండ్రితో, ఏకము చేయబడి, మన మంచి కాపరిగా మరియు దేవుని యొక్క గొఱ్ఱెపిల్లగా రెండు విధాలుగా మన రక్షకుడు మనల్ని ప్రత్యేకంగా దీవించును.

మన మంచి కాపరిగా, యేసు క్రీస్తు తన స్వరము మరియు పేరుతో పిలుచును. ఆయన మనల్ని వెదకును మరియు మనల్ని సమావేశపరచును. ప్రేమయందు ఎలా పరిచర్య చేయాలో ఆయన బోధించును. ఆయన స్వరము మరియు పేరుతో మనల్ని ఆయన పిలుచుట ప్రారంభించి, ఈ మూడు విషయాలను మనము పరిశీలిద్దాము.

మొదట, మన మంచి కాపరి “తన సొంత గొఱ్ఱెలను పేరు పెట్టి పిలుచును. … అవి ఆయన స్వరమును ఎరుగును.”6 మరియు “తన స్వనామమందు ఆయన మిమ్మల్ని పిలుచుచున్నాడు, అది క్రీస్తు యొక్క నామము.”7 యేసు క్రీస్తును వెెంబడించుటకు నిజమైన ఉద్దేశముతో మనము కోరినప్పుడు, మేలు చేయుటకు, దేవునిని ప్రేమించుటకు, మరియు ఆయనను సేవించుటకు ప్రేరేపణ వచ్చును.8 మనము అధ్యయనము చేసి, ధ్యానించి మరియు ప్రార్థించినప్పుడు; మనము సంస్కారము మరియు దేవాలయ నిబంధలను క్రమముగా క్రొత్తవిగా చేసుకొన్నప్పుడు; మరియు ఆయన సువార్తకు వచ్చుటకు అందరిని మనము ఆహ్వానించినప్పుడు, మనము ఆయన స్వరమును వినుచున్నాము.

మన దినములో, అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ పునఃస్థాపించబడిన సంఘమును యేసు క్రీస్తు చేత బయల్పరచబడిన పేరు: యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము అని పిలవమని మనకు సలహా ఇచ్చారు.9 “మీరు దేనిని చేసినను, మీరు దానిని నా నామమున చేయవలెను. కాబట్టి మీ సంఘమును నా నామమున పిలువవలెను మరియు ఆయన నా నిమిత్తము సంఘమును దీవించునట్లు, మీరు తండ్రికి నా నామమున ప్రార్థన చేయుదురు.”10 ప్రపంచమంతా మన హృదయాలలో, మన గృహాలలో యేసు క్రీస్తు నామములో తండ్రికి ప్రార్థిస్తాము. మన గృహ కేెంద్రిత, సంఘ ఆధారిత ఆరాధన, సువార్త అధ్యయనము మరియు ఆరోగ్యకరమైన కుటుంబ ప్రోత్సాహకార్యక్రమముల వంటి దారాళమైన దీవెనల కొరకు మేము కృతజ్ఞత కలిగియున్నాము.

రెండవది, మన మంచికాపరి మనల్ని వెదకి ఒకే మందలోనికి మనల్ని ఆయన చేర్చును. “మీలో ఏ మనుష్యునికైనను నూరు గొఱ్ఱెలు కలిగియుండగా వాటిలో ఒకటి తప్పిపోయిన యెడల అతడి తొంబది తొమ్మిదిని విడిచిపెట్టి తప్పిపోయినది దొరకు వరకు దానిని వెదక వెళ్ళడా?”11 అని ఆయన అడుగుచున్నారు.

మన రక్షకుడు తొంబది తొమ్మిదిని, ఒకరిని, తరచుగా ఒకే సమయములో సమీపించును. మనము పరిచర్య చేసినప్పుడు, తప్పిపోయిన వారిని మనము ఆపేక్షించినప్పటికినీ, స్థిరముగా, కదలని వారిని కూడా మనము అంగీకరిస్తున్నాము. మన ప్రభువు “అన్ని స్థలముల నుండి,”12 “ప్రపంచము మొత్తము నుండి మనల్ని వెదకును మరియు విడిపించును.”13 ఆయన మనల్ని పరిశుద్ధ నిబంధన మరియు ఆయన ప్రాయశ్ఛిత్తః రక్తము ద్వారా సమకూర్చును.14

మన రక్షకుడు తన క్రొత్త నిబంధన శిష్యులతో చెప్పాడు, “ఈ దొడ్డివి కాని వేరే గొఱ్ఱెలును నాకు కలవు, వాటిని కూడ నేను తోడుకొని రావలెను.”15 అమెరికాలో, పునరుత్థానుడైన ప్రభువు లీహై యొక్క నిబంధన బిడ్డలకు సాక్ష్యమిచ్చెను, “మీరు నా గొఱ్ఱెలైయున్నారు.” 16 ఇతర గొఱ్ఱెలు తన స్వరమును ఇంకను వింటాయని యేసు చెప్పెను.17 యేసు క్రీస్తు యొక్క స్వరమునకు మరొక సాక్ష్యముగా మోర్మన్ గ్రంధము ఎంత గొప్ప దీవెనగా ఉన్నది!

ఆయన స్వరమును విని 18 మరియు ఆయన ఆజ్ఞలను పాటించు వారందరిని స్వీకరించమని యేసు క్రీస్తు సంఘమును ఆహ్వానిస్తున్నారు. క్రీస్తు యొక్క సిద్ధాంతము నీటి చేత, అగ్ని చేత బాప్తీస్మమును మరియు పరిశుద్ధాత్మను కలిగియున్నది.19 “దేవుని యొక్క గొఱ్ఱెపిల్ల పరిశుద్ధుడై యుండి సమస్త నీతిని నెరవేర్చుటకు నీటి ద్వారా బాప్తీస్మము పొందవలసిన అవసరము కలిగియుండగా, ఓ అప్పుడు, అపవిత్రులమైయున్న మనము కూడా మరి ఎంత ఎక్కువగా మరిముఖ్యముగా నీటి ద్వారా బాప్తీస్మము పొందవలసిన అవసరము కలిగియున్నాము!”20

చిత్రం
యోహాను యేసుకు బాప్తీస్మమిచ్చుట

ఈ రోజు, మనము చేసేది మరియు మనము ఎవరివలే మారుతున్నామో ఆయనను వెంబడించుటకు ఇతరులను ఆహ్వానించాలని మన రక్షకుడు కోరుచున్నాడు. తెరకు ఇరువైపుల ఇశ్రాయేలును సమకూర్చునట్లు, సమస్త కుటుంబ తరములను దీవించగల రక్షణ యొక్క పరిశుద్ధ విధులుగల దేవుని యొక్క పరిశుద్ధ దేవాలయమును కలిపి, ఆయనయందు ప్రేమను, స్వస్థతను, సంబంధమును, మరియు నిబంధనను వచ్చి కనుగొనుము.21

మూడవది, “ఇశ్రాయేలు యొక్క కాపరి,”22 గా యేసు క్రీస్తు ఇశ్రాయేలులో కాపరులు ప్రేమతో ఎలా పరిచర్య చేస్తారో మాదిరిగా చూపించెను. సీమోను పేతురును ఆయన అడిగినట్లుగా, మనము ఆయనను ప్రేమిస్తున్నామా అని మన ప్రభువు అడిగినప్పుడు, మన రక్షకుడు అర్ధిస్తున్నాడు: “నా గొఱ్ఱెలను మేపుము. … నా గొఱ్ఱెలను మేపుము. … నా గొఱ్ఱెలను మేపుము.”23 ఆయన కాపరులు ఆయన గొఱ్ఱెపిల్లలను మరియు గొఱ్ఱెలను మేపినప్పుడు, ఆయన మందలోనివి, “ఇకమీదట భయపడకుండను బెదరిపోకుండను వాటిలో ఒకటైనను తప్పిపోవని, ”24 అని ప్రభువు వాగ్దానమిచ్చారు.

మన మంచి కాపరి ఇశ్రాయేలులో కాపరులు నిద్రపోరాదని,25 గొఱ్ఱెలు చెదిరిపోనివ్వరాదని, లేక గొఱ్ఱెలు తప్పిపోయినట్లు చేయరాదని,26 లేక మన స్వలాభము కొరకు మన స్వంత మార్గమును వెదకరాదని హెచ్చరించుచున్నాడు. 27 దేవుని యొక్క కాపరులు బలపరచాలి, విరిగిన దానిని కట్టాలి, తరిమివేయబడిన దానిని తిరిగి తీసుకొనిరావాలి, తప్పిపోయిన దానిని వెదకాలి.28

జీతగాడు “గొఱ్ఱెలను గూర్చి లెక్కచేయకపోవును”29 మరియు “అబద్ధపు ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి, కానీ లోపలవారు క్రూరమైన తోడేళ్లు,”30 అని కూడా ప్రభువు హెచ్చరించారు.

ఉద్దేశము మరియు విశ్వాసముతో వ్యక్తిగత నైతిక కర్తృత్వమును మనము సాధన చేసినప్పుడు, మన మంచి కాపరి ఆనందించును. ఆయన మందలో ఉన్నవారు ఆయన ప్రాయశ్చిత్త త్యాగము కొరకు మన రక్షకుని వైపు కృతజ్ఞతతో చూస్తారు. వ్యతిరేకత లేకుండా, గ్రుడ్డిగా, లేక ఇబ్బందిపడకుండా కానీ బదులుగా పూర్ణ హృదయాలు, మనస్సులన్నిటితో, దేవునిని మరియు పొరుగువానిని ప్రేమించుటకు, ఒకరి భారమును భరించుటకు, మరియు ఒకరినొకరి ఆనందములందు పంచుకొనుటకు మనము ఆయనను వెంబడించుటకు నిబంధన చేస్తాము. తండ్రి యొక్క చిత్తమునకు క్రీస్తు తన చిత్తమును స్వచ్ఛంధంగా సమర్పించినట్లుగా, అదేవిధంగా మనము ఆయన నామమును భక్తిగల గౌరవముతో మనపై తీసుకొనుచున్నాము. దేవుని యొక్క పిల్లలందరిని సమకూర్చు మరియు పరిచర్య చేయు ఆయన కార్యములో చేరుటకు మనము ఆనందముగా కోరుతున్నాము.

సహోదర, సహోదరిలారా, యేసు క్రీస్తు మన పరిపూర్ణుడైన కాపరి. ఆయన తన గొఱ్ఱెల కొరకు తన ప్రాణమును పెట్టెను మరియు మహిమకరంగా పునరుత్థానము చెందాడు కనుక, యేసు క్రీస్తు దేవుని యొక్క పరిపూర్ణుడైన గొఱ్ఱెపిల్ల కూడా.31

దేవుని యొక్క బలి ఇచ్చు గొఱ్ఱెపిల్ల ఆరంభము నుండి ముందుగా సూచించబడ్డాడు. దేవదూత ఆదాముతో, అతడు ఇచ్చిన బలి, “తండ్రి యొక్క అద్వితీయుని త్యాగమునకు పోలికగా ఉన్నదని,” అది ”పశ్చాత్తాపపడమని, ఎప్పటికంటే ఎక్కువగా కుమారుని నామములో దేవునిని పిలవమని” 32 మనల్ని ఆహ్వానిస్తున్నది.

భూమి యొక్క సమస్త రాజ్యముల కొరకు నిబంధన దీవెనలు స్థాపించిన తండ్రియైన అబ్రాహాము, తాను కనిన కుమారుని బలిగా ఇచ్చుట అనగా అర్థమేమిటో అనుభవించాడు.

“ఇస్సాకు తన తండ్రియైన అబ్రాహాముతో, నా తండ్రీ అని పిలిచెను, అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడతడు నిప్పును కట్టెలును ఉన్నవిగాని దహనబలికి గొఱ్ఱెపిల్ల ఏది …? అని అడిగెను.

“అబ్రాహాము నా కుమారుడా దేవుడే దహనబలికి గొఱ్ఱెపిల్లను చూచుకొనును.33

అపొస్తులులు మరియు ప్రవక్తలు ముందుగా చూసారు మరియు దేవుని గొఱ్ఱెపిల్ల యొక్క ముందుగా నియమించబడిన నియమిత కార్యము యందు ఆనందించారు. పాత కాలములో యోహాను మరియు క్రొత్త లోకములో నీఫై “దేవుని యొక్క గొఱ్ఱెపిల్ల “ గూర్చి సాక్ష్యమిచ్చారు, 34“ “అవును, నిత్యుడైన తండ్రి యొక్క కుమారుడు, … లోకము యొక్క విమోచకుడు.“35

యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్త త్యాగమును గూర్చి అబినడై సాక్ష్యమిచ్చెను: “మనమందరము, గొఱ్ఱెల వలే త్రోవ తప్పిపోయి ఉన్నాము. మనలో ప్రతివాడు తన స్వంత త్రోవను తొలిగెను మరియు ప్రభువు మన అందరి దోషములు అతనిపై మోపెను.“36 దేవుని కుమారుని యొక్క గొప్ప, శాశ్వతమైన త్యాగమును, ఆల్మా ఇలా పిలిచెను, “వాటన్నిటి కంటే అధిక ప్రాముఖ్యత కలిగినది ఒకటున్నది.“ “దేవుని యొక్క గొఱ్ఱెపిల్ల యందు విశ్వాసము కలిగియుండుము“; “రండి, మరియు భయపడకుడి,“37 అని ఆల్మా ప్రోత్సహిస్తున్నాడు.

ఒక ప్రియమైన స్నేహితురాలు యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తమును గూర్చి తన ప్రశస్తమైన సాక్ష్యమిచ్చింది. పాపము ఎల్లప్పుడు గొప్ప శిక్షను తెచ్చునని మన చేత మాత్రమే పాపము మోయబడవలెననే నమ్ముతూ ఆమె పెరిగి పెద్దదయ్యింది. దైవిక క్షమాపణ యొక్క సాధ్యతను గ్రహించుటకు ఆమె దేవునిని వేడుకున్నది. పశ్చాత్తాపపడిన వారిని యేసు క్రీస్తు ఎలా క్షమించగలరు, కనికరము న్యాయమును ఎలా ఒప్పించగలదో తెలుసుకొనుటకు ఆమె ప్రార్థించింది.

ఒకరోజు, ఆత్మీయంగా మార్చే అనుభవములో ఆమె ప్రార్థన జవాబివ్వబడింది. నిరాశకు గురైన ఒక యువకుడు దొంగిలించిన రెండు సంచుల ఆహారమును మోస్తూ, కిరాణా దుకాణం బయటకు పరుగెత్తుతూ వచ్చాడు. అతడు ఒక తీరికలేని వీధిలోనికి పరుగెత్తాడు, కిరాణా దుకాణం మేనేజరు చేత తరమబడ్డాడు, మరియు ఇతడు అతడిని పట్టుకొని అరుస్తూ, పోట్లాడటం ప్రారంభించాడు. భయపడుతున్న యువకుడిని ఒక దొంగగా విమర్శించుటకు బదులుగా, నా స్నేహితురాలు ఊహించనిరీతిలో అతడి కొరకు గొప్ప కనికరముతో నింపబడింది. భయపడకుండా లేక తన స్వంత క్షేమము కొరకు చింతించకుండా, ఆమె గొడవపడుతున్న ఇద్దరు మగవారి వద్దకు నేరుగా నడిచి వెళ్ళింది. ఆమె తనకై తాను ఇలా చెప్పుట కనుగొన్నది, “ఆహారము కొరకు నేను చెల్లిస్తాను. దయచేసి అతడిని వెళ్లనివ్వండి. దయచేసి ఆహారము కొరకు నన్ను చెల్లించనియ్యుము.”

పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి, ఇంతకుముందు ఎప్పుడూ అనుభూతి చెందని ప్రేమతో నింపబడి, నా స్నేహితురాలు చెప్పింది, “ఈ యువకునికి సహాయపడి మరియు రక్షించాలని మాత్రము నేను కోరుకున్నాను.“ యేసు క్రీస్తు మరియు ఆయన ప్రాయశ్చిత్తమును—తన రక్షకుడు మరియు విమోచకునిగా ఉండుటకు స్వచ్ఛమైన మరియు పరిపూర్ణమైన ప్రేమతో ఇష్టపూర్వకంగా ఎందుకు ఏవిధంగా, త్యాగము చేసాడు, మరియు ఆమె ఎందుకు ఆయనను ఉండాలని కోరుతున్నదో తాను గ్రహించసాగానని నా స్నేహితురాలు చెప్పింది.38

మనమిలా పాడుటలో ఆశ్చర్యములేదు:

చూడండి, మంచి కాపరి వెదకుచున్నాడు.

తప్పిపోయిన గొఱ్ఱెలను వెదకుచున్నాడు.

సంతోషిస్తూ వాటిని తీసుకొని వస్తున్నాడు,

అటువంటి అంతులేని ఖరీదుతో రక్షించాడు.39

మనము ఒంటరిగా భావించి, క్షీణించి, అనిశ్చయముగా లేక భయపడినట్లు భావించినప్పుడు దేవుని యొక్క గొఱ్ఱెపిల్లగా, మన రక్షకుడు ఎరుగును. దర్శనములో, నీఫై దేవుని యొక్క గొఱ్ఱెపిల్ల శక్తి, “సంఘము యొక్క పరిశుద్ధులపైన, మరియు ప్రభువు యొక్క నిబంధన జనులపైన (దిగివచ్చుట)” చూసాడు. “భూతలమంతా చెదిరియున్నప్పటికినీ, … వారు నీతితో మరియు గొప్ప మహిమలో పరిశుద్ధతను మరియు దేవుని యొక్క శక్తిని ఆయుధములుగ ధరించుకొని యుండిరి”40

నిరీక్షణ మరియు ఆదరణ యొక్క ఈ వాగ్దానములో మన కాలము కూడా చేర్చబడినది.

మీ కుటుంబము, పాఠశాల, పని స్థలము, లేక సమాజములో మీరు ఒక్కరే సంఘ సభ్యులా? కొన్నిసార్లు మీ బ్రాంచి చిన్నదిగా లేక ఒంటరిగా భావిస్తుందా? బహుశా పరిచయములేని భాష లేక ఆచారములు గల ఒక క్రొత్త ప్రదేశమునకు మీరు మారారా? బహుశా మీ జీవితపు పరిస్థితులు మారియుండవచ్చు, మరియు మీరు ఎప్పటికీ సాధ్యము కాదనుకొన్న విషయాలు ఇప్పుడు మీకు ఎదురుపడినవా? మనము ఎవరము, మన పరిస్థితులు ఏమైనప్పటికినీ యెషయా మాటలలో మన రక్షకుడు మనకు అభయమిస్తున్నాడు: “తన బాహువులతో గొఱ్ఱెపిల్లలను కూర్చి రొమ్మును ఆనించుకొని మోయును, పాలిచ్చువాటిని ఆయన మెల్లగా నడిపించును.”41

చిత్రం
మంచి గొఱ్ఱెల కాపరి తన గొఱ్ఱెలను పోగుచేయును

సహోదర, సహోదరిలారా, మన మంచి కాపరి ఆయన స్వరము మరియు ఆయన పేరుతో మనల్ని పిలుచును. ఆయన తన జనులను వెదకును, సమకూర్చును, మరియు వారి యొద్దకు వచ్చును. ఆయన సజీవుడైన ప్రవక్త ద్వారా మరియు మనలో ప్రతీఒక్కరి ద్వారా శాంతిని, ఉద్దేశమును, స్వస్థతను, ఆయన నిబంధన బాటపై మరియు పునఃస్థాపించబడిన సువార్త యొక్క సంపూర్ణతయందు సంతోషమును కనుగొనుటకు అందరినీ ఆహ్వానిస్తున్నారు. ప్రేమయందు పరిచర్య చేయుటకు ఇశ్రాయేలు యొక్క కాపరులకు మాదిరి ద్వారా, ఆయన బోధిస్తున్నారు.

దేవుని గొఱ్ఱెపిల్లగా, ఆయన దైవిక మిషను ముందుగా నియమించబడింది మరియు అపొస్తులులు, ప్రవక్తల చేత ఆనందించబడింది. ఆయన ప్రాయశ్చిత్తము, అంతములేనిది మరియు శాశ్వతమైనది, సంతోషము యొక్క ప్రణాళికకు కేంద్రమైనది. మన పరిస్థితులు ఏవైనప్పటికినీ, ఆయన తన హృదయము ప్రక్కన మనల్ని మోసెదనని మనకు అభయమిస్తున్నారు.

సహోదర, సహోదరిలారా, బహుశా ఏదోఒకరోజు గొఱ్ఱెపిల్ల యొక్క జీవగ్రంథములో మన పేర్లు వ్రాయబడుటకు,43 గొఱ్ఱెపిల్ల యొక్క పాటను పాడుటకు,44 గొఱ్ఱెపిల్ల యొక్క విందుకు ఆహ్వానించబడుటకు45 మనము “దేవుని మరియు గొఱ్ఱెపిల్ల యొక్క వినయముగల శిష్యులుగా,” 42 ఉండుటకు కోరుదామా.

కాపరిగా మరియు గొఱ్ఱెపిల్లగా, ఆయన పిలుచును: “సత్యమైన జ్ఞానమునకు … (మీ) విమోచకుని, … (మీ) గొప్ప మరియు నిజమైన కాపరి వద్దకు,” 46 తిరిగి రండి. “ఆయన కృప ద్వారా (మనము) క్రీస్తునందు పరిపూర్ణులగునట్లు,” ఆయన వాగ్దానము చేసెను.47

ఈ ఈస్టరు కాలములో ఆయనను మనం స్తుతిద్దాము:

“గొఱ్ఱెపిల్ల యోగ్యమైనది!”48

“దేవుడు మరియు గొఱ్ఱెపిల్లకు హోసన్నా!”49

మన పరిపూర్ణుడైన మంచి కాపరి, దేవుని పరిపూర్ణమైన గొఱ్ఱెపిల్లయైన ఆయన గురించి నేను సాక్ష్యమిస్తున్నాను. ఆయన మన పేరుతో మనల్ని పిలుస్తున్నారు, ఆయన నామములో-అనగా యేసు క్రీీస్తు యొక్క పవిత్రమైన, పరిశుద్ధమైన నామములో-ఆమేన్.