2010–2019
చివరకు---మీరును పరిపూర్ణులుగా ఉండుము
అక్టోబర్ 2017


చివరకు—మీరును పరిపూర్ణులుగా ఉండుము

మనము పట్టుదలతో ఉంటే, మన నిత్యత్వములో ఎక్కడో మన శుద్ధీకరణ నెరవేర్చబడును మరియు పూర్తి చేయబడును.

లేఖనాలు మనల్ని దీవించి మరియు ప్రోత్సహించుటకు వ్రాయబడినవి, మరియు నిశ్చయముగా అవి చేస్తాయి. మనము ఎప్పటికీ ఇవ్వబడిన ప్రతీ అధ్యాయము మరియు వచనము కొరకు మనము పరలోకమునకు ధన్యవాదములు తెలుపుతున్నాము. కానీ అప్పుడప్పుడు, ఒక వాక్యభాగము కనబడి మనము కాస్త పడిపోతున్నట్లుగా మనకు జ్ఞాపకము చేస్తున్నట్లుగా కనబడుట మీరు గమనించారా? ఉదాహారణకు, కొండమీద ప్రసంగము ఓదార్పునిచ్చి, మృదువైన పరమానందములతో ప్రారంభమగును, కాని దాని తరువాత వచనాలలో, మిగిలిన వాటిమధ్య---మనము హత్య చేయరాదని మాత్రమే కాదు కోపపడరాదని కూడా చెప్పబడ్డాము. మనము వ్యభిచారము చేయవద్దని చెప్పబడటమే కాదు కానీ చెడు ఆలోచనలు కలిగియుండరాదని కూడా చెప్పబడ్డాము. దానిని అడుగువారికి, మనము మన కోటును ఇవ్వాలి మరియు మన పైవస్త్రము కూడా ఇవ్వాలి. మనము మన శత్రువులను ప్రేమించాలి, మనల్ని శపించు వారిని దీవించాలి, మరియు మనల్ని ద్వేషించు వారికి మేలు చేయాలి. .1

అది మీ ఉదయకాల లేఖన అధ్యయనము, మరియు కాస్త చదివిన తరువాత మీ సువార్త రిపోర్ట్ కార్డులో మీకు మంచి మార్కులు రావటం లేదని మీకు నిశ్చయమైన యెడల, అప్పుడు గొలుసులో ఉన్న చివరి ఆజ్ఞ నిశ్చయముగా పనిని పూర్తి చేయుట: “మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు.”2 ఆ అత్యవసర ముగింపుతో, మనము మంచము వద్దకు తిరిగివెళ్ళి మరియు దుప్పటి కప్పుకోవాలని మనము కోరతాము. అటువంచి సిలెస్టియల్ లక్ష్యములు మనము చేరుకోవాటాన్ని మించి కనబడును. అయినప్పటికినీ, నిశ్చయముగా మనము పాటించలేమని ప్రభువు ఎరిగిన దానిని ఆయన ఎన్నడూ ఇవ్వడు. ఈ క్లిష్టస్థితి మనల్ని ఎక్కడికి తీసుకెళతాయో మనము చూద్దాము.

మన సంఘము చుట్టూ అనేకులు ఈ సమస్యతో ప్రయాసపడుతున్నారు: “నేను అంతగా సరిపోను. .” “నేను చాలా పడిపోయాను. .” “నేను ఎప్పటికీ కొలవబడను.” నేను దీనిని యౌవనులనుండి వింటాను. నేను దానిని మిషనరీలనుండి వింటాను. నేను దానిని క్రొత్తగా మారిన వారినుండి వింటాను. నేను దానిని దీర్ఘకాల సభ్యులనుండి వింటాను. నిబంధనలు మరియు ఆజ్ఞలను ఎదోవిధంగా శాపములు మరియు దూషణల వలె కనబడునట్లు సాతాను చేయునని స్మూక్షదృష్టిగల ఒక కడవరి దిన పరిశుద్ధురాలు సహోదరి డార్లా ఐస్సాక్స్‌సన్, గమనించారు. కొందరికి, అతడు సువార్త యొక్క ఆదర్శములు మరియు ప్రేరేపణను స్వీయ-దూషణ మరియు దురవస్థకు మార్చును. 3

నేనిప్పుడు చెప్పేది దేవుడు మనకు ఎప్పటికీ ఇచ్చిన ఏ ఆజ్ఞను ఏవిధంగా నిరాకరించదు లేక క్షీణింపచేయదు. నేను ఆయన పరిపూర్ణతయందు నమ్ముచున్నాను, మరియు మనము ఆయన వలె అగుటకు దైవిక సాధ్యతతో మనము ఆయన ఆత్మీయ కుమారులు మరియు కుమార్తెలమని నేనెరుగుదును. మనల్ని మనం కొట్టుకొనుట ఎదోవిధంగా దేవుడు మనము కావాలని కోరే వ్యక్తిగా మనల్ని చేయబోవునని దేవుని యొక్క బిడ్డలుగా మనల్ని మనం అప్రతిష్టపాలు చేసుకొనరాదు లేక దూషించుకొనరాదని కూడా నేనెరుగుదును. లేదు! భావావేశ పర్యవసానములు వచ్చుట, నిరాశ చెందుట లేక మన స్వ-గౌరవమును తగ్గించుకొనుట వంటి వాటిని చేర్చని విధానములో మన హృదయాలలో ఎల్లప్పుడు పశ్చాత్తాపపడుటకు సమ్మతి మరియు నీతి కొరకు హెచ్చించబడిన కోరికతో, మనము వ్యక్తిగత అభివృద్ధిని వెదకుతామని నేనాశిస్తున్నాను. “నేను యేసు వలే కావాలని ప్రయత్నిస్తున్నాను,”4 అని నిజాయితీగా పాడు ప్రాథమిక పిల్లలు లేక వేరేవరికైనా సరే దానిని ప్రభువు కోరటం లేదు.

ఈ సమస్యను సందర్భములో ఉంచుటకు, మనము పడిపోయిన లోకములో జీవిస్తున్నాము మరియు ఇప్పుడు మనము పడిపోయిన జనులమని నేను మనందరికి గుర్తు చేయనా. మనము టిలేస్టియల్ రాజ్యములో ఉన్నాము, అది సి తో కాదు టి, తో చెప్పబడును. అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ బోధించినట్లుగా, ఇక్కడ మర్త్యత్వములో పరిపూర్ణత “నిలిచియున్నది.”5

కనుక ఈ విషయముపై ఆయన ప్రసంగము మన తప్పిదములను గూర్చి మనల్ని పదజాల సుత్తితో కొట్టాలని యేసు ఉద్దేశించలేదని నేను నమ్ముచున్నాను. లేదు, అది నిత్య తండ్రియైన దేవుడు ఎవరు మరియు ఏమిటి మరియు నిత్యత్వమునందు ఆయనతో మనము సాధించగల నివాళిగా ఉండుటకు ఆయన ఉద్దేశించారని నేను నమ్ముచున్నాను. ఏ సందర్భములోనైనా, నా లోపములను లక్ష్యపెట్టకుండా, కనీసము దేవుడు పరిపూర్ణుడని---కనీసము, ఆయన ఉదాహరణకు, తన శత్రువులను ప్రేమించగలిగాడని, ఎందుకనగా, చాలా తరచుగా, మనలోని “ప్రకృతి సంబంధియైన పురుషుడు”6, మరియు స్త్రీ వలన, మీరు, నేను కొన్నిసార్లు ఆ శత్రువుగా ఉన్నాము. ఆయనను క్రూరముగా ఉపయోగించు వారిని కూడా దేవుడు దీవిస్తున్నాడని తెలుసుకొనుటకు నేనెంత కృతజ్ఞత కలిగియున్నాను, ఎందుకనగా, ఆవిధంగా చేయాలని కోరకుండా, లేక ఉద్దేశించకుండా, మనమందరం కొన్నిసార్లు ఆయనను క్రూరముగా ఉపయోగిస్తున్నాము. నాకు కనికరము అవసరము మరియు లోకమునకు కనికరము అవసరము కనుక దేవుడు కనికరము కలిగియున్నందుకు నేను కృతజ్ఞత కలిగియున్నాను. అవును, మనము చెప్పుచున్న తండ్రి యొక్క సుగుణములన్నీ ఆయన అద్వితీయ కుమారుని గూర్చి కూడ మనము చెబుతాము, ఆయన జీవించాడు మరియు అదే పరిపూర్ణతకు మరణించాడని తెలుసుకొనుటకు నేను కృతజ్ఞుడను.

మన వైఫల్యము కంటే తండ్రి యొక్కయు, కుమారుని యొక్క నెరవేర్పులపై దృష్టిసారించుట క్రమశిక్షణలేని జీవితాలు లేక మన ప్రమాణముల కొరకు క్రమశిక్షణలేని లేని తొట్రిల్లిన జీవితాల కొరకు కాస్త కూడా న్యాయమని ఒప్పించదని చెప్పుటకు నేను త్వరపడుచున్నాను. లేదు, ఆది నుండి, సువార్త, “క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు, . . . .పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును”7 ఉన్నది. ఒక లేఖనము లేక ఆజ్ఞ యొక్క ఒక కనీస ఉద్దేశము, “పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు,”8 ఎంత అద్భుతమైనది, నిజముగా ఎలా ఉండును, మనలో ఆయన కొరకు గొప్ప ప్రేమ మరియు ప్రశంసను మరియు ఆయన వలే అగుటకు గొప్ప కోరికను మనలో ప్రేరేపించునో మాత్రమే నేను సూచిస్తున్నాను.

“అవును క్రీస్తు నొద్దకు రమ్ము, ఆయనలో పరిపూర్ణుడవు కమ్ము . . … ,” మొరోనై వేడుకున్నాడు. “మీ సమస్త బలము, మనస్సు, మరియు శక్తితో, దేవునిని ప్రేమించిన యెడల . . . మీరు క్రీస్తునందు పరిపూర్ణులగుదురు.9  నిజమైన పరిపూర్ణతకు మన ఏకైక నిరీక్షణ, పరలోకము నుండి వరముగా దానిని పొందుట----దానిని మనము “సంపాదించలేము.” కాబట్టి, రక్షకుడు విచారము, పాపము మరియు మరణము నుండి రక్షణ ఇచ్చుట మాత్రమే కాదు కానీ మన స్వంత నిరంతర స్వీయ విమర్శనుండి కూడా రక్షించును.

దీనిని కాస్త ప్రత్యేక విధానములో చెప్పుటకు రక్షకుని యొక్క ఉపమానములలో ఒకటి నన్ను ఉపయోగించనియ్యుము. ఒక సేవకుడు తన రాజుకు 10,000 తలాంతుల మొత్తము ఋణపడియున్నాడు. సహనము మరియు కనికరము కోసం దాసుడు వేడుకొనుట విని “ఆ దాసుని ప్రభువు కనికరపడి, దానిని విడిచిపెట్టి, వాని, . . . అప్పు   . . . క్షమించెను  . . . .” కాని తరువాత అదే సేవకుడు తనకు 100 పెన్నీలు ఋణపడియున్న సహ సేవకుని క్షమించలేకపోయాడు. దీనిని విన్న తరువాత, రాజు తాను క్షమించిన వాని బట్టి దుఖించాడు, “నేను నిన్ను క్షమించిన ప్రకారము నీవును నీ తోడిదాసుని కరుణింపవలసియుండెను గదా?”10

ఇక్కడు ప్రస్తావించబడిన ద్రవ్యవిలువల గురించి పండితుల మధ్య వేర్వేరు అభిప్రాయమున్నది---మరియు అమెరికా ద్రవ్య సూచనను క్షమించుము---కానీ లెక్కలు సులభంగా చేసుకొనుటకు, స్వల్ప మొత్తము 100 పెన్నీలు, ప్రస్తుతము కాలములలో $100 అనుకుంటే, అప్పుడు, చాలా ఉచితంగా క్షమించబడిన 10,000 తలాంతుల ఋణము $1  బిలియన్---లేక ఎక్కువ చేరుకొనియుండవచ్చు!

వ్యక్తిగత ఋణముగా, ఖగోళ సంఖ్య---పూర్తిగా మనము గ్రహించలేనిది. (దానికి పోలికైనది ఎవరూ కనుగొనలేరు) అవును, ఈ ఉపమానము యొక్క ఉద్దేశ్యముల కొరకు, అది గ్రహింపశక్యము కానిది; అది మనము గ్రహించుటకు, తిరిగి చెల్లించుటకు మన సామర్ధ్యమును మించిన దానిగురించి చెప్పకుండుటకు మన సామర్ధ్యమును మించి యుండాలి. అది ఎందుకనగా ఇది క్రొత్త నిబంధనలో వాదించుకుంటున్న ఇద్దరు సేవకులను గూర్చినది కాదు. అది మన గూర్చిన వృత్తాంతము, పడిపోయిన మానవ కుటుంబము---మర్త్య ఋణగ్రస్తులు, అపరాధులు, మరియు అందరూ ఖైదీలు. మనలో ప్రతీఒక్కరము ఋణగ్రస్తులము మరియు మనలో ప్రతీఒక్కరికి కారాగార శిక్ష. మరియు మనల్ని స్వతంత్రులనుగా చేసే రాజు యొక్క కృప లేకపోతే మనము అక్కడే ఉండేవారము, ఎందుకనగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు మరియు “మన పట్ల కనికరముతో కదిలించబడ్డాడు..”11

ఆయన ప్రాయశ్చిత్తఃము అగోచరమైన ఖరీదుతో ఇవ్వబడిన గ్రహింపశక్యముకాని వరముగా ఇవ్వబడినది కనుక యేసు అగోచరమైన పరిమాణమును ఉపయోగించాడు. అది, పరిపూర్ణముగా ఉండమన్న యేసు యొక్క ఆజ్ఞ వెనుక ఉన్న అర్ధములో కనీస భాగము అని నాకు కనిపిస్తుంది. తండ్రి మరియు కుమారుడు సాధించిన 10,000-తలాంతుల ప్రతిభ పరిపూర్ణతను మనమింకను రుజువు చేయలేక పోవచ్చు, కానీ చిన్న విషయాలందు కాస్త ఎక్కువగా దేవుని వలే ఉండుటకు, ప్రేమ కలిగి మాట్లాడి మరియు ప్రవర్తించి మరియు క్షమించుట, పశ్చాత్తాపపడుట మరియు పరిపూర్ణత యొక్క 100-పెన్నీల స్థాయికి మెరుగుపరచుకొను, మనము అడగబడుట వారికి చాలా ఎక్కువైనదికాదు స్పష్టముగా అది చేయుటకు మన సామర్ధ్యములో ఉన్నది.

నా సహోదర, సహోదరిలారా, యేసు కోసం తప్ప, మనము వెదకుచున్న ఈ భూలోక ప్రయాణముపై దోషరహితమైన ప్రదర్శనలు లేవు, కనుక మర్త్యత్వములో ఉండగా మనము ప్రవర్తనా శాస్త్రవేత్తలు పిలిచిన పరిపూర్ణముగా ఉండాలనే--హానికరమైన కోరికపై నిమగ్నమై ఉండకుండా, స్థిరమైన మెరుగుదల కొరకు మనము ప్రయాసపడదాము.”12 తరువాత మన గురించి మనకు, ఇతరుల గురించి, మరియు నేను చేరుస్తున్నవి, సంఘములో సేవ చేయుటకు పిలవబడిన వారిని గూర్చి---కడవరి దిన పరిశుద్ధులకు ప్రతీ ఒక్కరని అర్థము అత్యధికమైన ఆకాంక్షను కలిగియుండరాదు, ఏలయనగా మనమందరం ఎక్కడైనా సేవ చేయుటకు పిలవబడ్డాము.

ఆ సందర్భములో, లియో టాల్ట్‌స్టాయ్ ఒకసారి ఒక యాజకుని గురించి వ్రాసాడు, అతడు తాను ఉండాల్సినంత దృఢ సంకల్పముతో జీవించనందుకు తన సమూహము చేత విమర్శించబడ్డాడు, తప్పు చేసిన యాజకుడు బోధించిన సూత్రములు కూడ తప్పని విమర్శకుడు ముగించాడు.

ఆ విమర్శకు స్పందిస్తూ, యాజకుడు ఇలా అన్నాడు: “ఇప్పుడు నా జీవితమును చూడుము మరియు పూర్వపు జీవితముతో దానిని పోల్చుము. నేను ప్రకటించిన సత్యమును జీవించుటకు నేను ప్రయత్నించానని మీరు చూసారు.” అతడు బోధించిన ఉన్నత ఆదర్శములకు పైగా జీవించలేక, తాను విఫలమయ్యానని యాజకుడు అంగీకరించాడు. కానీ అతడు వేడుకున్నాడు:

“నాపై దాడి చేయుము, (మీరు కోరిన యెడల,) నాకై నేను దానిని చేస్తాను, కానీ నేను వెంబడించు బాటను ముట్టడి (చేయవద్దు) . . . ఇంటికి మార్గమును నేను ఎరిగి, (కానీ) దాని వెంబడి, త్రాగుతూ నడుస్తున్న యెడల, నేను ప్రక్కకు అస్థిరముగా నడవటం వలన కేవలము అది తక్కువ సరైన దారి కాకపోతుందా?

“ . . . ‘అతడి వైపు చూడుము!. . . అక్కడ అతడు బురద నేలలోనికి వెళుతున్నాడు!’ అని ఆనందముతో అరవకుము. లేదు, ఈర్ష్యతో చూడకుము, కానీ, . . (దేవుని వద్దకు తిరిగి వెళ్ళు దారిలో నడుచుటకు ప్రయత్నించు ఎవరికైనా) మీ సహాయమునిమ్ము.”13

సహోదర సహోదరిలారా, మనలో ప్రతీఒక్కరు తరచుగా జీవించుటలో సఫలమయ్యే దానికంటే ఎక్కువగా క్రీస్తువలే జీవించుటకు కోరతారు. మనము దానిని నిజాయితీగా అంగీకరించి మరియు మెరుగుపరచుకొనుటకు ప్రయత్నించిన యెడల, మనము వేషధారులము కాదు; మనము మానవులము. మన స్వంత మర్త్య లోపములు, మన చుట్టూ ఉన్న శ్రేష్టమైన పురుషులు మరియు స్త్రీలలో కూడా అనివార్యమైన తప్పిదములు, సువార్త యొక్క సత్యములను గూర్చి, మన భవిష్యత్తు కొరకు మన నిరీక్షణ, లేక దైవత్వము యొక్క సాధ్యతను ద్వేషించునట్లు చేయును. మనము పట్టుదల కలిగియున్న యెడల, నిత్యత్వములో ఎక్కడైన మన శుద్ధీకరణ నెరవేర్చబడును మరియు పూర్తి చేయబడును---అదే క్రొత్త నిబంధన యొక్క పరిపూర్ణతకు అర్ధము.14

ఆయన అమర్త్యత్వములో16 సిలేస్టియల్ మహిమ17 యొక్క పరిపూర్ణతను పొందువరకు “కృప వెంబడి కృపను ”15 తనకు తానే పొందిన ఆయన, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తఃము చేత మనకు లభ్యముగా చేసిన , ఆ మహాగొప్ప గమ్యమును గూర్చి నేను సాక్ష్యమిస్తున్నాను. ఇప్పుడు మరియు ప్రతీ గడియలో, మేకుల గురుతులతో, మనకు అదే కృపను ఇచ్చుచూ, మనల్ని పట్టుకొనుచూ, మనల్ని ప్రోత్సహిస్తూ, పరలోక తల్లిదండ్రుల ఆలింగనలో క్షేమంగా ఇంటికి మనము వెళ్ళు వరకు, ఆయన మనల్ని విడిచిపెట్టుటకు తిరస్కరించునని నేను సాక్ష్యమిస్తున్నాను. అటువంటి పరిపూర్ణమైన క్షణము కొరకు, ఎంత అస్తవ్యస్తముగా ఉన్నప్పటికినీ, నేను ప్రయాసపడుట కొనసాగిస్తాను. అటువంటి పరిపూర్ణమైన వరము కొరకు, అయినప్పటికినీ చాలకుండా నేను ధన్యవాదములు తెలుపుతాను. ఆ విధంగా ఎన్నడూ అస్తవ్యస్తముగా ఉండని లేక తక్కువగా లేని, కానీ ఆవిధంగా ఉన్న మనందరిని ప్రేమించిన ఆయన, పరిపూర్ణతకు మారుపేరైన, ప్రభువైన యేసు క్రీస్తు నామములో నేను చెప్పుచున్నాను, ఆమేన్.