2023
మనము ఇప్పుడు పరిపూర్ణంగా ఉండాలా?
2023 ఫిబ్రవరి


“మనము ఇప్పుడు పరిపూర్ణంగా ఉండాలా?” యౌవనుల బలము కొరకు, 2023 ఫిబ్రవరి.

యౌవనుల బలము కొరకు నెలవారీ సందేశము, 2023 ఫిబ్రవరి

మనము ఇప్పుడు పరిపూర్ణంగా ఉండాలా?

చిత్రం
లేఖనములను చదువుతున్న యువకుడు

ఎమిలి ఈ. జోన్స్ చేత వివరణలు

మనల్ని ఆశీర్వదించడానికి, ప్రోత్సహించడానికి లేఖనాలు వ్రాయబడ్డాయి మరియు ఖచ్చితంగా అవి అలా చేస్తాయి. కానీ మనము కొంచెం వెనుకబడియున్నామని గుర్తుచేసే ఒక గద్యభాగం ప్రతిసారీ కనిపిస్తుందని మీరు గమనించారా? ఉదాహరణకు: “మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు” (మత్తయి 5:48). ఆ ఆజ్ఞతో, మనము తిరిగి పడుకోవాలని మరియు దుప్పటి ముసుగు వేసుకోవాలని అనుకుంటున్నాము. అటువంటి సిలెస్టియల్ లక్ష్యం మనము చేరుకోలేనిదిగా కనిపిస్తుంది. అయినప్పటికీ మనము పాటించలేమని తెలిసిన ఆజ్ఞను ప్రభువు మనకు ఎన్నడూ ఇవ్వరు.

చిత్రం
వర్షంలో గొడుగు పట్టుకున్న యువతి

”క్రీస్తు నొద్దకు రండి మరియు ఆయనలో పరిపూర్ణులు కండి” అని మొరోనై వేడుకున్నాడు. “మీ పూర్ణ శక్తి, మనస్సు మరియు బలముతో దేవుడిని ప్రేమించిన యెడల, అప్పుడు … ఆయన కృప ద్వారా మీరు క్రీస్తు నందు పరిపూర్ణులగుదురు” (మొరోనై 10:33; వివరణ చేర్చబడింది). నిజమైన పరిపూర్ణత కోసం మన ఏకైక ఆశ దానిని పరలోకము నుండి ఒక బహుమతిగా స్వీకరించడమే—మనం దానిని ”సంపాదించలేము”.

చిత్రం
కుక్కతో కొండపైకి ఎక్కుతున్న యువతి

మనము అనుసరిస్తున్న ఈ భూసంబంధమైన ప్రయాణంలో యేసు తప్ప, ఎటువంటి దోషరహిత ప్రదర్శనలు లేవు, కాబట్టి ఈ మర్త్యత్వములో స్థిరమైన అభివృద్ధి కోసం కృషి చేద్దాం, మన గురించి మరియు ఇతరుల గురించి అధిక అంచనాలను నివారిద్దాం.

చిత్రం
తుఫాను చెలరేగిన సముద్రంపై ఓడ

మనము పట్టుదలతో ఉంటే, నిత్యత్వంలో ఎక్కడో ఒక చోట మన శుద్ధీకరణ పూర్తవుతుంది మరియు సంపూర్ణమవుతుంది—అది పరిపూర్ణతకు క్రొత్త నిబంధనలోని అర్థం.