చేతి పుస్తకములు మరియు పిలుపులు
26. దేవాలయ సిఫారసులు


“26. దేవాలయ సిఫారసులు,” ప్రధాన చేతిపుస్తకము నుండి ఎంపికలు (2023).

“26. దేవాలయ సిఫారసులు,” ప్రధాన చేతిపుస్తకము నుండి ఎంపికలు

చిత్రం
వ్యక్తిని మౌఖికము చేస్తున్న బిషప్పు

26.

దేవాలయ సిఫారసులు

26.0

పరిచయము

దేవాలయంలోకి ప్రవేశించడం ఒక పవిత్రమైన విశేషాధికారము. సభ్యులందరూ అర్హులుగా ఉండాలని మరియు వారు దేవాలయానికి సమీపంలో నివసించకపోయినా ప్రస్తుత దేవాలయ సిఫారసును కలిగియుండాలని వార్డు మరియు స్టేకు నాయకులు ప్రోత్సహిస్తారు.

దేవాలయంలోకి ప్రవేశించే వారందరూ అలా చేయడానికి అర్హులని చూడటానికి సంఘ నాయకులు అన్ని ప్రయత్నాలు చేస్తారు (కీర్తనలు 24:3–5 చూడండి).

దేవాలయంలోకి ప్రవేశించడానికి సభ్యులు తప్పనిసరిగా ప్రస్తుత దేవాలయ సిఫారసును కలిగి ఉండాలి.

దేవాలయ సిఫారసుల గురించి ఈ అధ్యాయంలో సమాధానం ఇవ్వబడని ప్రశ్నలు ఏవైనా ఉంటే బిషప్పు తన స్టేకు అధ్యక్షుడిని సంప్రదిస్తారు. స్టేకు అధ్యక్షుడు ప్రశ్నలతో ప్రథమ అధ్యక్షత్వ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.

26.1

దేవాలయ సిఫారసులలోని రకాలు

మూడు రకాల సిఫారసులు ఉన్నాయి:

  1. వరము పొందని సభ్యుల కొరకు దేవాలయ సిఫారసు. ఈ సిఫారసులు వారి తల్లిదండ్రులతో ముద్ర వేయబడుతున్న లేదా ప్రాతినిధ్య బాప్తిస్మములు మరియు నిర్ధారణలను నిర్వహిస్తున్న వరము పొందని సభ్యుల కొరకైనవి. అవి Leader and Clerk Resources (LCR) ద్వారా జారీ చేయబడతాయి. మరింత సమాచారం కోసం, 26.4 చూడండి.

  2. సజీవుల విధుల కొరకు దేవాలయ సిఫారసు. ఈ సిఫారసులు తమ స్వంత వరము‌ను పొందుతున్న లేదా జీవిత భాగస్వామితో ముద్ర వేయబడుతున్న సభ్యుల కోసం ఉద్దేశించబడినవి. సజీవుల విధుల కొరకు సిఫారసు అనేది వరము పొందిన సభ్యుల కోసం సాధారణ దేవాలయ సిఫారసుకు జోడించబడింది (క్రింద వివరించబడింది).

  3. వరము పొందిన సభ్యుల కొరకు దేవాలయ సిఫారసు ఈ సిఫారసులు గతంలో వరము పొందిన సభ్యుల కొరకైనవి. అవి కూడా LCR ద్వారా జారీ చేయబడతాయి. అవి మరణించిన వారి కోసం అన్ని దేవాలయ విధులలో పాల్గొనడానికి ఒక సభ్యునికి అధికారం ఇస్తాయి. వరము పొందిన సభ్యుడు జీవించి ఉన్న లేదా మరణించిన తల్లిదండ్రులు లేదా పిల్లలతో ముద్ర వేయబడినప్పుడు కూడా అవి ఉపయోగించబడతాయి. మరింత సమాచారం కోసం, 26.3 చూడండి.

26.2

దేవాలయ సిఫారసులను కాపాడడం

26.2.1

యాజకత్వ నాయకులు దేవాలయ సిఫారసులను కాపాడడం

దేవాలయ సిఫారసు పుస్తకాలను కలిగి ఉండటానికి అధికారం ఉన్న యాజకత్వ నాయకులు వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి.

అనధికారిక వ్యక్తులకు LCR లో దేవాలయ సిఫారసు సమాచారానికి ప్రవేశము లేదని కూడా యాజకత్వ నాయకులు నిర్ధారించుకోవాలి.

26.2.3

కోల్పోయిన లేదా దొంగిలించబడిన సిఫారసులు

వారి సిఫారసు కోల్పోబడినా లేదా దొంగిలించబడినా వీలైనంత త్వరగా తనకు తెలియజేయమని బిషప్పు సభ్యులను అడుగుతారు. అతను లేదా నియమించబడిన సలహాదారుడు లేదా గుమాస్తా వీలైనంత త్వరగా సిఫారసును రద్దు చేయడానికి LCR ని ఉపయోగిస్తారు. ఈ వ్యవస్థ అందుబాటులో లేకుంటే, సిఫారసును రద్దు చేయడానికి బిషప్పు దేవాలయ కార్యాలయాన్ని సంప్రదిస్తారు.

26.2.4

సిఫారసును కలిగియుండి యోగ్యతా ప్రమాణాలను పాటించనివారు

ప్రస్తుత సిఫారసును కలిగి ఉన్న ఒక సభ్యుడు యోగ్యతా ప్రమాణాలను పాటించడం లేదని బిషప్పు నిర్ధారిస్తే, అతను సభ్యుని నుండి సిఫారసును వెనక్కి తీసుకుంటాడు (26.3 చూడండి). అతను సిఫారసును రద్దు చేయడానికి LCR ని ఉపయోగిస్తాడు. ఈ వ్యవస్థ అందుబాటులో లేకుంటే, సిఫారసును రద్దు చేయడానికి బిషప్పు దేవాలయ కార్యాలయాన్ని సంప్రదిస్తారు.

26.3

దేవాలయ సిఫారసులను జారీ చేయడానికి సాధారణ మార్గదర్శకాలు

సభ్యుడు దేవాలయ సిఫారసు ప్రశ్నలకు సముచితంగా సమాధానం ఇస్తే మాత్రమే యాజకత్వ నాయకులు సిఫారసు జారీ చేయాలి.

దేవాలయ సిఫారసు మౌఖికాలు హడావిడిగా జరుగకూడదు. అవి ఏకాంతముగా జరగాలి. అయితే, మౌఖికము చేయబడే వ్యక్తి మరొక పెద్దవయస్కుని హాజరు కావడానికి ఆహ్వానించవచ్చు.

యాజకత్వ నాయకులు దేవాలయ సిఫారసు పుస్తకంలో వివరించిన వాటికి ఎటువంటి ఆవశ్యకాలను జోడించకూడదు. అలాగే వారు ఎటువంటి ఆవశ్యకాలను తీసివేయకూడదు.

దేవాలయ సిఫారసును జారీ చేసిన తర్వాత స్టేకులలో స్టేకు అధ్యక్షత్వ సభ్యుడు లేదా స్టేకు గుమాస్తా LCR లో దానిని క్రియాత్మకం చేస్తారు. జిల్లాల్లో, మిషను అధ్యక్షత్వ సభ్యుడు లేదా మిషను గుమాస్తా సిఫారసును క్రియాత్మకం చేస్తారు. ప్రాతినిధ్య బాప్తిస్మములు మరియు నిర్ధారణల కోసం సిఫారసులు బిషప్రిక్కు సభ్యుడు లేదా శాఖాధ్యక్షుని చేత అవి ముద్రించబడినప్పుడు క్రియాత్మకం చేయబడతాయి.

26.3.1

వార్డులు మరియు శాఖలలోని సభ్యులకు దేవాలయ సిఫారసు మౌఖికాలు

ఒక వార్డులో, బిషప్పు లేదా నియమించబడిన సలహాదారుడు దేవాలయ సిఫారసు మౌఖికాలను నిర్వహిస్తారు మరియు అర్హులైన వారికి సిఫారసులను జారీ చేస్తారు. ఒక శాఖలో, శాఖాధ్యక్షుడు మాత్రమే దేవాలయ సిఫారసు మౌఖికాలను నిర్వహిస్తారు మరియు సిఫారసులను జారీ చేస్తారు.

ఒక వార్డులో, బిషప్పు వ్యక్తిగతంగా ఈ సభ్యులను మౌఖికం చేస్తారు:

  • వారి స్వంత వరమును పొందుతున్నవారిని (27.1 మరియు 27.2 చూడండి).

  • జీవిత భాగస్వామితో ముద్ర వేయబడుతున్నవారిని (27.3 చూడండి).

అత్యవసర సందర్భాలలో బిషప్పు అందుబాటులో లేనప్పుడు, ఈ మౌఖికాలను నిర్వహించడానికి అతను తన సలహాదారుల్లో ఒకరికి అధికారం ఇవ్వవచ్చు.

పైన జాబితా చేయబడిన ఏవైనా సందర్భాలలో సిఫారసును జారీ చేసే ముందు, బిషప్పు సభ్యుని రికార్డును సమీక్షించి, సంఘ సభ్యత్వ పరిమితుల గురించిన సంకేతాన్ని కలిగి లేరని ధృవీకరించాలి. తమ స్వంత వరము‌ను పొందుతున్న లేదా జీవిత భాగస్వామితో ముద్రవేయబడుతున్న సభ్యుల కోసం, అతను వీటిని కూడా నిర్ధారిస్తాడు:

  • వ్యక్తి యొక్క బాప్తిస్మము మరియు నిర్ధారణ సభ్యత్వ రికార్డులో నమోదు చేయబడ్డాయి.

  • సహోదరులు మెల్కీసెదెకు యాజకత్వాన్ని పొందారు.

బిషప్రిక్కు సభ్యుడు లేదా శాఖాధ్యక్షుడు మౌఖికము చేసిన తర్వాత, స్టేకులో నివసించే సభ్యులను స్టేకు అధ్యక్షత్వ సభ్యుడు మౌఖికము చేస్తారు. జిల్లాలో నివసించే సభ్యుల కోసం మిషను అధ్యక్షత్వ సభ్యుడు రెండవ మౌఖికమును నిర్వహిస్తారు. ప్రథమ అధ్యక్షత్వము చేత అధికారం ఇవ్వబడితే తప్ప, జిల్లా అధ్యక్షుడు దేవాలయ సిఫారసు మౌఖికాలను నిర్వహించరు.

26.3.2

ఏకాంతమైన ప్రాంతాల్లోని సభ్యుల కోసం దేవాలయ సిఫారసు మౌఖికాలు

కొంతమంది సభ్యులు ఖరీదైన ప్రయాణం అవసరమైన లేదా స్టేకు లేదా మిషను అధ్యక్షత్వ సభ్యుడిని కలవడానికి చాలా కష్టాలు పడాల్సిన ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో, దేవాలయ అధ్యక్షుడు వ్యక్తిని మౌఖికము చేసి, సిఫారసుపై సంతకం చేయవచ్చు. మౌఖికము నిర్వహించడానికి ముందు, అతను స్టేకు లేదా మిషను అధ్యక్షుడితో సంప్రదింపులు జరుపుతాడు. బిషప్పు, అధికారమివ్వబడిన సలహాదారుడు లేదా శాఖాధ్యక్షుడు అప్పటికే సభ్యుడిని మౌఖికము చేసి, సిఫారసుపై సంతకం చేసి ఉండాలి.

26.4

వరము పొందని సభ్యులకు దేవాలయ సిఫారసులు జారీ చేయుట

26.4.1

ప్రధాన మార్గదర్శకాలు

వరము పొందని సభ్యులకు దేవాలయ సిఫారసులు ఈ క్రింది విధంగా జారీ చేయబడతాయి:

  • 11 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు మరణించిన వారి కోసం బాప్తిస్మము మరియు నిర్ధారణ చేయబడుటకు. (వారికి 12 ఏళ్లు వచ్చిన ఏడాది జనవరిలో ప్రారంభించి, యువతులు మరియు నియమిత యువకులు దేవాలయ సిఫారసుకు అర్హులు.)

  • 8 నుండి 20 సంవత్సరాల వయస్సు గల సభ్యులు వారి తల్లిదండ్రులతో ముద్ర వేయబడడానికి. 8 కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు వారి తల్లిదండ్రులతో ముద్ర వేయబడడానికి సిఫారసు అవసరం లేదు (26.4.4 చూడండి).

  • 8 నుండి 20 సంవత్సరాల వయస్సు గల సభ్యులు తమ సజీవ తోబుట్టువులు, సవతి తోబుట్టువులు లేదా వారి తల్లిదండ్రుల తోబుట్టువులు ముద్ర వేయబడుటను గమనించడానికి.

మునుపు వరము పొందిన సభ్యులకు ఈ విభాగంలో వివరించిన సిఫారసులు ఏవీ జారీ చేయబడవు.

యాజకత్వం కలిగియుండగల వయస్సు ఉన్న పురుష సంఘ సభ్యుడు దేవాలయ సిఫారసును పొందడానికి ముందు తప్పనిసరిగా యాజకత్వ స్థానానికి నియమించబడాలి.

26.4.2

క్రొత్తగా బాప్తిస్మము పొందిన సభ్యుల కోసం దేవాలయ సిఫారసు

దేవాలయ సిఫారసు పొందడానికి తగిన వయస్సు ఉన్న క్రొత్త సభ్యులను బిషప్పు మౌఖికము చేస్తారు, అది ప్రాతినిధ్య బాప్తిస్మములు మరియు నిర్ధారణల కోసం మాత్రమే. సభ్యుని నిర్ధారణ తర్వాత సాధారణంగా ఒక వారంలోపు అతను ఈ మౌఖికాన్ని నిర్వహిస్తాడు (26.4.1 చూడండి). సహోదరుల కోసం, అహరోను యాజకత్వము పొందడానికి చేసే మౌఖికములో భాగంగా ఈ మౌఖికము నిర్వహించబడవచ్చు.

26.4.3

ప్రాతినిధ్య బాప్తిస్మములు మరియు నిర్ధారణల కోసం మాత్రమే దేవాలయ సిఫారసులు

ప్రాతినిధ్య బాప్తిస్మములు మరియు నిర్ధారణల కోసం మాత్రమే జారీ చేయబడిన దేవాలయ సిఫారసులను ఆ ప్రయోజనం కోసం మాత్రమే ఉపయోగించాలి.

26.4.4

జీవించి ఉన్న పిల్లలను తల్లిదండ్రులతో ముద్రవేయడానికి దేవాలయ సిఫారసు

21 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సభ్యులు వారి తల్లిదండ్రులతో ముద్రవేయబడవచ్చు లేదా వారు (1) వరము పొందియుంటే మరియు (2) ప్రస్తుత దేవాలయ సిఫారసు కలిగియుంటే మాత్రమే ముద్ర‌ను గమనించవచ్చు.

26.5

ప్రత్యేక పరిస్థితుల్లో దేవాలయ సిఫారసులను జారీ చేయడం

26.5.1

తమ స్వంత వరమును పొందుతున్న సభ్యులు

వారి స్వంత వరము‌ను పొందాలనుకునే యోగ్యమైన సభ్యులు క్రింది షరతులన్నింటికీ అనుగుణంగా ఉన్నప్పుడు అలా చేయవచ్చు:

  • వారి వయస్సు కనీసం 18 సంవత్సరాలు వుండాలి.

  • వారు ఉన్నత విద్య, మాధ్యమిక విద్య లేదా తత్సమానాన్ని పూర్తి చేసివుండాలి లేదా ఇకపై చదవడం ఆపివేసివుండాలి.

  • వారు నిర్ధారించబడినప్పటి నుండి ఒక పూర్తి సంవత్సరం గడిచివుండాలి.

  • వారు తమ జీవితమంతా దేవాలయ నిబంధనలను పొందాలని మరియు గౌరవించాలని భావించాలి.

అదనంగా, ఒక పురుషుడు తన వరమును పొందే ముందు మెల్కీసెదెకు యాజకత్వాన్ని తప్పక కలిగి ఉండాలి. తమ స్వంత వరము‌ను పొందడానికి సిద్ధమవుతున్న సభ్యుల గురించి సమాచారం కోసం, 25.2.8 చూడండి. వరము‌ను ఎవరు పొందవచ్చనే సమాచారం కోసం, 27.2.1 చూడండి.

26.5.3

ఇంటి నుండి దూరంగా సేవచేసి తిరిగి వస్తున్న యువ సువార్తికులు

సువార్తికుడు ఇంటికి తిరిగి వచ్చిన తేదీ నుండి మూడు నెలలలో గడువు ముగిసేటట్లు మిషను అధ్యక్షుడు సిఫారసు తేదీని నిర్ధారిస్తారు మరియు క్రియాత్మకం చేస్తారు.

తిరిగి వచ్చిన సువార్తికులను బిషప్పు మౌఖికము చేసి, మూడు నెలల గడువు ముగిసే సమయానికి దేవాలయ సిఫారసును జారీ చేస్తారు.

26.5.4

కనీసం ఒక సంవత్సరం పాటు ఒకే వార్డులో నివసించని సభ్యులు

బిషప్పు లేదా నియమించబడిన సలహాదారుడు దేవాలయ సిఫారసు మౌఖికమును నిర్వహించడానికి ముందు మునుపటి బిషప్పును సంప్రదిస్తారు.

26.5.7

ట్రాన్స్‌జెండర్‌గా గుర్తించబడిన సభ్యులు

వ్యక్తిగత పరిస్థితులను సున్నితత్వంతో మరియు క్రీస్తువంటి ప్రేమతో పరిష్కరించడానికి స్టేకు అధ్యక్షుడు ప్రాంతీయ అధ్యక్షత్వముతో చర్చించాలి (38.6.23 చూడండి).

26.5.8

తీవ్రమైన పాపం చేసిన సభ్యులు

తీవ్రమైన పాపం చేసిన సభ్యుడు అతను లేదా ఆమె పశ్చాత్తాపం చెందే వరకు దేవాలయ సిఫారసును పొందలేరు (32.6 చూడండి).

26.5.9

సంఘ సభ్యత్వ ఉపసంహరణ లేదా పరిత్యాగం తర్వాత తిరిగి చేర్చబడిన సభ్యులు

26.5.9.1

గతంలో వరము పొందని సభ్యులు

బాప్తిస్మము మరియు నిర్ధారణ ద్వారా సంఘానికి తిరిగి చేరిన తేదీ నుండి ఒక సంవత్సరం వరకు వారి స్వంత వరమును పొందడానికి ఈ సభ్యులకు సిఫారసులను జారీ చేయలేరు.

26.5.9.2

గతంలో వరము పొందిన సభ్యులు

దీవెనల పునరుద్ధరణ విధి ద్వారా వారి దేవాలయ దీవెనలు పునరుద్ధరించబడే వరకు మునుపు వరము పొందిన సభ్యులు ఎలాంటి దేవాలయ సిఫారసును పొందలేరు.