2020
పిల్లలు మరియు యువత కార్యక్రమము ద్వారా పరిచర్య చేయుట
2020 అక్టోబరు


“పిల్లలు మరియు యువత కార్యక్రమము ద్వారా పరిచర్య చేయుట,” లియహోనా, 2020 అక్టోబరు

చిత్రం
పరిచర్య సూత్రములు

టామ్ గార్నర్, ఐజాక్ డార్కో-అచెయాంపాంగ్, అలెగ్జాండర్ కె. బోటెంగ్ మరియు జోనాస్ రెబికీ చేత ఛాయాచిత్రాలు

పరిచర్య సూత్రములు, 2020 అక్టోబరు

పిల్లలు మరియు యువత కార్యక్రమము ద్వారా పరిచర్య చేయుట

ఇతరులు ఎదుగుటకు ఆహ్వానించుట మరియు మార్గము వెంబడి వారికి సహాయపడుట పరిచర్య చేయుట యొక్క సారాంశము.

పిల్లలు మరియు యువత కార్యక్రమము ద్వారా పరిచర్య చేయుటకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇంటిలో మీ స్వంత పిల్లలు లేక యువతను మీరు కలిగియుండవచ్చు. కార్యక్రమములో మీరు ఒక నాయకుడు కావచ్చు లేక పిల్లలు మరియు యువత గల కుటుంబాలకు మీరు పరిచర్య చేయవచ్చు. లేక మీరు కొందరు పిల్లలు మరియు యువతను ఎరిగియుండవచ్చు (అది మనందరిని కలిపియుండవచ్చు). మీ పరిస్థితి ఏదైనప్పటికినీ, ఇతరుల జీవితాలను దీవించడానికి దాని సూత్రములను లేక కార్యక్రమాన్ని ఉపయోగించడానికి అనేక విధానములు ఉన్నాయి.

మనకైమనం కలిసి వృద్ధి చేయుట

పిల్లలు మరియు యువతకు ప్రధానమైనది, పరిపూర్ణముగా పరిచర్య చేసిన రక్షకుని వలె ఎక్కువగా మారటానికి ప్రతీరోజు ప్రయత్నించుటపై దృష్టిసారించుట. కార్యక్రమములో పాల్గొనిన వారిలో అనేకులు మీ జీవితంలో వేర్వేరు ప్రాంతాలలో మీరు ఎక్కువగా అభివృద్ధి చెందినప్పుడు, ఇతరులకు పరిచర్య చేయడానికి లేక సహాయపడటానికి మీరు బాగా సన్నద్ధులై యుంటారని నేర్చుకున్నారు.

కానీ పిల్లలు మరియు యువత కార్యక్రమంతో, ఇతరులను దీవించుటకు మీరు ఏదైనా నేర్చుకొనేంత వరకు వేచియుండనవసరం లేదు. నేర్చుకొనే చర్య దానికదే పరిచర్య చేయడానికి అవకాశాలను అందించును.

ఘనాలో నివసిస్తున్న ప్రాఫిట్ అనే పేరుగల యువకునికి, పిల్లలు మరియు యువత కార్యక్రమంలో పియానో ఎలా వాయించాలో నేర్చుకొనుటకు లక్ష్యముంచుట కేవలము ఆరంభము. “నేను నేర్చుకొన్న దానిని ఇతరులు తెలుసుకొనుటకు సహాయపడుట కూడ నా లక్ష్యము,” ప్రాఫిట్ చెప్పును.

అతడు ఇంకా బోధకుడు కానప్పటికినీ, అతడి లక్ష్యము అప్పటికే అతడు ఎప్పటికీ ఊహించని దానికంటే చాలా పెద్దగా ఎదిగింది. ప్రాఫిట్ కలిసి సమావేశ గృహము వద్ద పియానో తరగతులు తీసుకొన్న వారిలో ఇప్పుడు 50 మంది విద్యార్ధులున్నారు. ప్రోఫిట్ మరియు మిగిలిన 50 మంది విద్యార్ధులకు ఎవరు బోధిస్తున్నారు? అలెగ్జాండర్ ఎమ్. మరియు కెల్విన్ ఎమ్., ఇద్దరి వయస్సు 13. “మనము ఇతరులకు దయగల చర్యలను చూపాలని కోరతాము,” కెవిన్ చెప్పాడు.

ఈ ఇద్దరు యువత నేర్చుకోవడానికి వచ్చిన వారందరికి వారానికి మూడు రోజులు ఉచితంగా ముఖ్యమైన పియానో పాఠాలను బోధిస్తారు. పియానో పాఠాలకు చేర్చబడిన ప్రయోజనము అక్కడున్నది. పియానో పాఠాల ద్వారా సంఘానికి పరిచయం చేయబడిన విద్యార్ధులలో కొందరు సువార్తను తరువాత అధ్యయనం చేసారు మరియు బాప్తీస్మము పొందటానికి నిర్ణయించారు.

మనల్ని మనం మెరుగుపరచుకోవడానికి ప్రయత్నాలను చేసినప్పుడు, మనతో చేరుటకు వారిని ఆహ్వానించుట ద్వారా ఇతరులకు మనం పరిచర్య చేయగలము.

పరిచర్య చేయుటకు గెలిచే విధానము

స్టేకు ప్రాధమిక అధ్యక్షురాలిగా, బ్రెజిల్, కురిటిబాకు చెందిన సబ్రినా సిమెస్ డ్యూస్ అగస్టో, కార్యక్రమము యొక్క వ్యక్తిగత అభివృద్ధి అంశాలు తన స్టేకులోని పిల్లలు మరియు యువతను ఎలా దీవించాయో చూసింది. కానీ ఆమె ఒక పరిచర్య సహోదరిగా తన నియామకంలో వ్యక్తిగత అభివృద్ధి గురించి తాను నేర్చుకొన్న దానిని ఉపయోగించుటకు అనేక విధానాలను కూడ ఆమె చూసింది.

“ఒక ప్రతిభను నేను వృద్ధి చేసినప్పుడు,” “నేను పరిచర్య చేసే ఒకరికి ఆ ప్రతిభను ఉపయోగించగలను,” సహోదరి అగస్టో చెప్పింది.

తనకు నియమించబడిన సహోదరీలలో ఒకరికి చాక్లెట్ ట్రుఫల్స్ ఎలా తయారు చేయాలో సహోదరి అగస్టో నేర్పించింది. ఇప్పుడు ఆ సహోదరి తన కుటుంబ ఆదాయాన్ని భర్తీ చేయడానికి సహాయపడటానికి ట్రుఫల్స్ తయారు చేసి విక్రయిస్తున్నది. “నెలల తరువాత, నేను అమ్మగలుగునట్లు తేనె రొట్టెను ఎలా తయారు చేయాలో మరొక సహోదరి నాకు నేర్పినప్పుడు నేను దీవించబడ్డాను” అని సహోదరి అగస్టో చెప్పింది. “మన ప్రతిభలను వృద్ధి చేయుట మరియు పంచుకొనుట ఒకరినొకరి జీవితాలను దీవించగలదు మరియు పరిచర్య చేయు సహోదరీలుగా మన అనుబంధాలను లోతుగా చేయగలదు.”