2020
స్వయం-సమృద్ధి ద్వారా పరిచర్య చేయుట
2020 ఆగష్టు


“స్వయం-సమృద్ధి ద్వారా పరిచర్య చేయుట,”లియహోనా, ఆగష్టు 2020

చిత్రం
పరిచర్య

పరిచర్య సూత్రములు, 2020 ఆగష్టు

స్వయం-సమృద్ధి ద్వారా పరిచర్య చేయుట

ఇతరుల స్వయం-సమృద్ధి కొరకు సహాయము చేయుట, ప్రభువు యొక్క మార్గములో ఇచ్చుట, మరియు పరిచర్య చేయుట.

మన కుటుంబ సభ్యులలో అనేకులు, స్నేహితులు, పొరుగువారు మరింత స్వయం-సమృద్ధి కలిగియుండుటకు ఆసక్తి కలిగియున్నారు. “గొప్ప నిరీక్షణ, ఆదరణ, అభివృద్ధిని“1 తెచ్చు సూత్రములతో ఇతరులను ఆశీర్వదించినప్పుడు, సంఘము యొక్క స్వయం-సమృద్ధి యత్నమును వినియోగిస్తూ సేవ చేయుటకు, ఆదరించుటకు, పరిచర్య చేయుటకు సంఘ సభ్యులు అవకాశములు కనుగొనుచున్నారు.

“నేను నా ఇల్లు చేరుకున్నాను”

క్రిస్సీ కెప్లర్ చేత, ఆరిజోనా, అమెరికా

ఎనిమిది సంవత్సరాలు ఇంట్లోనే ఉన్న తల్లిగా గడిపిన నేను విడాకుల తర్వాత, తిరిగి పనిలో చేరడానికి నా దారిని వెదుకుతూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాను. నేను యవ్వనదశ నుండి ఏ మందిరములోనూ అడుగు పెట్టనప్పటికి సత్యమును, విశ్వాసమును వెదకుచు ఆత్మీయంగా కూడా పోరాడుచునేయుంటిని.

ఒక ఆదివారము సంఘములో ఉత్సాహముగల సభ్యురాలైన మా పెద్దక్క ప్రిస్కిల్ల ఇంటిలో నేను నా బట్టలు ఉతుకుతున్నాను. నేను అక్కడ ఉండగా, 15 ఏళ్ళలో మొట్టమొదటి సారిగా ప్రిస్కిల్ల నన్ను తన కుటుంబముతో కలిసి మందిరమునకు రమ్మని ఆహ్వానించింది.

మొదట్లో నేను ఇష్టపడలేదు, అయితే ఆ ముందు రాత్రి నేను ఆయనకు ఇంకా ఎలా దగ్గర కావాలో నాకు చూపమని దేవునిని వేడుకున్నాను. కొంత సేపు మదనపడిన తరువాత, “పెద్దదానిగా నీ హృదయంతోనూ, నీ కళ్ళతోను స్వయంగా విని చూచుటకు ఎందుకు వెళ్ళకూడదు? అని నేను నిర్ణయించుకున్నాను,

మేము పరిశుద్ధ సంస్కారపు సమావేశంలో ఉన్నప్పుడు, నేను ఆదివారపు ప్రకటనల పత్రములలో వ్యక్తిగత ఆర్ధిక నిర్వహణపై స్వయం-సమృద్ధి శిక్షణ గూర్చి ఒక ప్రకటనను చూసాను. తిరిగి సంఘానికి వెళ్లడానికి నేను సిద్ధంగా లేను, కాని ఆ 12-వారాల శిక్షణ వైపు ఆకర్షింపబడినట్లు భావించాను. మా అక్క, బావల యొక్క ప్రోత్సాహముతో నమోదు చేసుకున్నాను, కేవలం బడ్జెట్ చేయడం, అప్పులు తీర్చడం నేర్చుకోడానికి మాత్రమే అనుకున్నాను. ఐతే, ఆ తరగతులు నన్ను ఆత్మీయంగా మార్చివేసాయి.

మొదటి రెండు వారాల తరగతులలోని ఆత్మీయ సందేశాలు నన్ను ఆశ్చర్యపరచాయి, కాని, మూడవ తరగతి సమయంలో, నేను ఇంటికి చేరానని, పరిచయమైన సత్యాలనే క్రొత్తగా వింటున్నాననే నిశ్చయమైన అనుభూతితో నిమగ్నమయ్యాను. తరగతి విడిచి, నేరుగా ప్రిస్కిల్లను చూడడానికి నేను వెళ్లాను. “ఈ విధమైన అనుభూతిని నా జీవితంలో ఎక్కువగా ఎలా పొందగలను?” అని కన్నీటితో ఆమెను నేను అడిగాను. నాకు బోధించుట ప్రారంభించుటకు ఆమె మిషనరీలను ఏర్పాటు చేసింది.

నా స్వయం-సమృద్ధి తరగతిలోని సభ్యులు నాతోపాటూ మిషనరీ పాఠాలకు కూడా వచ్చి నన్ను బలపరచారు. వారు నా ఆత్మీయతపై శాశ్వతమైన ప్రభావము చూపి నాకు సువార్త విషయంలోను, ఆధునిక ప్రవక్తల విషయంలోను సాక్ష్యమును పెంపొందించుకొనుటకు సహాయపడిరి.

శిక్షణ పూర్తి అయ్యే సమయాన్ని నేను ఇహపరంగాను, ఆత్మీయమైన కొన్ని మార్పులు చేసాను. నేను ఒక మంచి కంపెనీలో క్రొత్త ఉద్యోగమును ప్రారంభించి, కొన్ని అప్పులు తీర్చివేశాను.

ఐతే, ఆ శిక్షణ ద్వారా ఏర్పడిన అందమైన స్నేహాలు, ప్రోత్సహించే బిషప్పుతో సానుకూల అనుబంధం, దశమభాగమును గూర్చి సాక్ష్యం, నా దేవాలయ సిఫార్సును పొందుటతో పాటు, ఎండోమెంట్‌ను పొందుట, నా పెద్ద బిడ్డలిద్దరూ బాప్తీస్మము పొందుటను చూచుట, నాకు కలిగిన లోతైన, మధురమైన దీవెనలు.

స్వయం-సమృద్ధికి నా బాట ఇంకా కొనసాగుతున్నది, కాని మిగిలిన నా ప్రయాణమంతా నేను నేర్చుకున్న పాఠాలు, నేను ఏర్పరచుకున్న స్నేహాలను నేను ఆనందిస్తాను.

“ప్రతి తరగతి ప్రేమించబడుచున్న అనుభూతితో నేను విడిచి వెళ్ళేదాన్ని”

2016 డిసెంబర్‌లో, ఆమె తన 10-సంవత్సరాల కుమారుడు, విన్సెంట్‌తో సాల్ట్‌లేక్ నగరంలోని టెంపుల్ స్క్వేర్‌ను సందర్శించినప్పుడు, క్యాటీ ఫంక్ తనను తాను “హాయిగా దేవుని నమ్మని వ్యక్తిగా” భావించింది. ఆమె 16 సంవత్సరాల వయస్సులో సంఘమును విడిచిపెట్టింది, 17 సంవత్సరాల వయస్సులో ఒంటరి తల్లి అయ్యి, పచ్చబొట్లు వేసుకోవటం ప్రారంభించి, కాఫీ త్రాగడంపై ఆసక్తిని పెంచుకుంది. కాని టెంపుల్ స్క్వేర్ దర్శించిన సమయంలో, విన్సెంట్ పరిశుద్ధాత్మను అనుభవించి, తాను మిషనరీ పాఠాలు తీసుకోవచ్చా అని తన తల్లిని అడిగాడు.

వారానికి 80-గంటల పాటు రెండు ఉద్యోగాలు చేస్తున్నప్పటికి, మిషనరీల సందర్శనల మధ్య కాలంలో అతని ప్రశ్నలకు జవాబులు పరిశోధిస్తూ, విన్సెంట్‌తో కలిసి క్యాటీ సువార్తను అధ్యయనం చేసింది. 2017 వేసవి నాటికి ఆమె సంఘ సమావేశాలకు హాజరగుట ఆరంభించి, అక్కడ సంఘము యొక్క స్వయం-సమృద్ధి శిక్షణను గూర్చి నేర్చుకున్నది.

“అవి నాకు ఎంతో కొంత సహాయం చేయగలవని నేను గ్రహించాను” అని ఆమె చెప్పింది. “నా మిగిలిన జీవితంలో నేను రెండు ఉద్యోగాలు చేయనవసరం లేదు లేక తల్లిదండ్రులపై ఆధారపడనవసరం లేకపోవచ్చు.”

క్యాటీ, కేవలము తాను నేర్చుకున్న దాని గురించి మాత్రమే కాక, తన స్వయం-సమృద్ధి వర్గ విభాగము ఆమెను అంగీకరించి ఆమెకు పరిచర్య చేసిన విధానమును బట్టి, తన శిక్షణ “ఐహికముగాను, ఆత్మీయముగాను చాలా బలోపేతం చేసింది” అని వర్ణించింది.

వివరణ

  1. “ప్రధమ అధ్యక్షత్వ సందేశము,” లో స్వయం-సమృద్ధి కొరకు వ్యక్తిగత ఆర్ధిక నిర్వహణ (2016), i.