2020
దేవాలయ సేవ ద్వారా పరిచర్య
మార్చి 2020


పరిచర్య సూత్రములు, మార్చి 2020

దేవాలయ సేవల ద్వారా పరిచర్య చేయుట

ఇతరులు దేవాలయ దీవెనలను ఆనందించుటకు మనము సహాయపడిన యెడల, మనము పరిచర్య చేయుచున్నాము.

చిత్రం
ministering

గెట్టీ చిత్రాల నేపథ్యంలో; తెగుసిగల్ప హాండురస్ దేవాలయ ఛాయాచిత్రము.

దేవాలయానికి హాజరుగట కష్టానికి తగ్గ ఫలితము. అధ్యక్షుడు రస్సెల్ ఎం. నెల్సన్ బోధించినట్లు “దేవాలయం మనకు, మన కుటుంబముల రక్షణకు మరియు మహోన్నతస్థితికి కీలకమైయున్నది. …

“… మనలో ప్రతిఒక్కరికి నిరంతరం ఆత్మీయంగా బలపరచేది, మరియు శిక్షణ అవసరం, అది కేవలం ప్రభువు మందిరంలోనే సాధ్యమవుతుంది.”1

దేవాలయానికి హాజరగుటకు మన సమయాన్ని, బాధ్యతలను, వనరులను, సక్రమంగా నిర్వహించడమే కాకుండా ఆత్మీయంగా సిద్ధపడియుండుట అవసరమగును. మన సహోదరులను, సహోదరీలను దేవాలయాన్ని దూరంచేసే అవాంతరాలను గుర్తించి వాటి పరిష్కారానికి సహాయపడినప్పుడు మనం పరిచర్య చేస్తున్నాము.

ఎవరైనా అనుభవించగలిగిన ఒక దీవెన, దేవాలయం.

ఇటీవల మిషను సేవ ముగించుకొని, తిరిగి వచ్చిన మెగ్ ఒకసారి కోనా హవాయ్ దేవాలయ ద్వారమును సమీపించుచుండగా అక్కడ ఆరుబయట అరుగుమీద ఒక యువతి ఒంటరిగా కూర్చొని ఉండడం గమనించింది. మెగ్ ఆ యవనస్తురాలిని పలకరించాలని అనిపించినా, కానీ ఏమి మాట్లాడాలో ఆమెకు తోచలేదు. కనుక ఆమె ఆ యువతి కాలి చీలమండ పైనున్న పచ్చబొట్టు యొక్క అర్ధం ఏమిటని అడిగింది. ఆ విధంగా వారి మధ్య సంభాషణ ప్రారంభమై, లానీ అనే ఆ యువతి తన కథ పంచుకోడానికి అనుమతించింది.

లానీ తాను సంఘంలో తిరిగి పూర్తిగా పాల్గొనడానికి పడుచున్న ప్రయాస, ఆమెకు సహాయపడుచున్న మంచి సభ్యులనుగూర్చి, మరియు తాను ఎప్పటికైనా తన పసిపాపతో బంధించబడగలననే నిరీక్షణ తనకున్నదని ఆమె మెగ్‌తో చెప్పింది.

దేవాలయములో వేచియుండు గదిలో తనతోపాటు కూర్చోమని లానీని మెగ్ ఆహ్వానించింది. వారు ఇంకా దేవాలయములోనికి వెళ్లలేరు, కానీ వారు ప్రవేశమును దాటి వెళ్లగలరు. లానీ అందుకు సమ్మతించింది, ముఖద్వారము గుండా వారు కలిసి వెళ్ళారు. ఒక దేవాలయ కార్యకర్త వారికి రక్షకుని చిత్రం క్రిందగల ఒక బల్లను చూపించాడు.

వారు కలిసి కూర్చోన్నప్పుడు లానీ, నెమ్మదిగా అంది, “నేను ఈ రోజు నిజంగా దేవాలయంలోనికి రావాలని ఆశించాను, కాని చాలా భయపడ్డాను.” మెగ్ ఆత్మను అనుసరించింది కనుక, ఆమె లానీ యొక్క మౌన ప్రార్ధనకు జవాబు పొందుటకు సహాయపడింది.

ఒక శిఫారసులేని వారికి సహాయం చేయాడానికి ఉపాయాలు

ఇంకా దేవాలయ శిఫారసులేని వారు కూడా దేవాలయము చేత దీవించబడవచ్చును.

  • దేవాలయ కార్యము ద్వారా ప్రభువు మిమ్మును ఏ విధంగా దీవించియున్నాడో మీ భావాలను పంచుకోండి.

  • దేవాలయ ఓపెన్ హౌస్‌కు గాని, సందర్శకుల కేంద్రమునకుగాని ఎవరైనా ఒకరిని ఆహ్వానించండి. రాబోయ “ఓపెన్ హౌస్” లను గుర్తించడానికి వెబ్ సైట్: temples.ChurchofJesusChrist.org లో వెదకండి.

  • temples.ChurchofJesusChrist.org వద్ద చిత్రములను చూడుము మరియు దేవాలయము గురించి ఎక్కువగా తెలుసుకోండి.

దేవాలయాల సందర్శన ఇతరులకు సులభతరం చేయండి.

దేవాలయ శిఫారసు కలిగిన సభ్యులకు కూడా, దేవాలయానికి హాజరగుట ఒక సవాలు కావచ్చును. కొందరికి చాలా దూర ప్రాంతాలకు ప్రయాణం చేయవలసిన అవసరం రావచ్చును. ఇతరులు సంరక్షణ అవసరమైన చిన్నపిల్లలు లేక వృద్ధులైన కుటుంబ సభ్యులను కలిగియుండవచ్చును. ప్రతి ఒక్కరికి దేవాలయ కార్యము సాధ్యం చేయడానికి మనమందరమూ కలిసి పనిచేయగలము.

లియోలా షాండ్లర్ అనారోగ్యంతో బాధపడుతున్న తన భర్త మరియు వారి నలుగురు పిల్లలపై శ్రద్ధ చూపించుటలో ముంచివేయబడినట్లు భావించింది. కనుక ప్రతి మంగళవారం దగ్గరలోని దేవాలయానికి హాజరుకావటానికి సమయం కేటాయించాలని ఆమె నిశ్చయించింది. అది ఆమె జీవితంలో శాంతికి, మరియు శక్తికి ఆధారముగా మారింది.

ఒకరోజు తన వార్డులో కొందరు వృద్ధులైన సహోదరీలు దేవాలయానికి హాజరగుటసు ఆరాటపడుచున్నారు కాని వారికి ప్రయాణ సదుపాయం లేదని ఆమె విన్నది. లియోలా వారిని తీసుకొని వెళ్తానని అడిగింది. ఆ తరువాత 40 సంవత్సరాలపాటు, ఆమె దేవాలయానికి అరుదుగా ఒంటరిగా వెళ్లింది.2

లియోలా ఇతరులను దేవాలయానికి తీసుకొనివెళ్లినప్పుడు ఆమె దీవించబడింది మరియు ఇతరులను తనతోపాటు తీసుకొనివెళ్లినప్పుడు ఆమె వారిని దీవించింది.

దేవాలయమునకు హాజరగుటకు ఇతరులకు సహాయం చేయడానికి ఉపాయాలు

ఇతరులు ఎక్కువ తరచుగా దేవాలయానికి వెళ్ళడానికి మీరు ఎలా సహాయపడగలరు? ఆ ఉపాయాలు మీకు కూడా సహాయపడగలవని మీరు తెలుసుకోగలరు.

  • కలిసి వెళ్లండి. ఎవరికైనా ప్రయాణ సదుపాయం అందించండి లేక ఏర్పాటు చేయండి. అది మరొకరు కూడా దేవాలయాన్ని సందర్శించడానికి ప్రోత్సహించగలదు.

  • మీ పూర్వీకులకు విధులు నిర్వర్తించుటకు, ప్రత్యేకంగా మీరు అనేక కుటుంబ పేర్లను కలిగియున్న యెడల, మీ కుటుంబము లేక వార్డు సభ్యులను మీకు సహాయపడమని అడుగుము.

  • తల్లిదండ్రులు దేవాలయంలో హాజరగునట్లు వారి పిల్లలను చూస్తామని అడుగుము. లేక వంతులవారీగా ఒకరినొకరి పిల్లలను చూచుటకు ఏర్పాటుచేయుము.

దేవాలయము చాలా దూరంగా ఉన్నప్పుడు

శ్రీలంకలోని కొలంబోకు చెందిన చంద్రదాస్ “రోషన్” మరియు షేరన్ ఆంటోనీ దేవాలయంలో బంధించబడాలని నిశ్చయించుకున్నారు. వారి స్నేహితులు ఆన్, మరియు అంటన్ కుమారసామిలు వారి కొరకు చాలా ఉత్సాహపడ్డారు. కాని మనీలా ఫిలిప్ఫీన్స్ దేవాలయమునకు వెళ్ళడం సులభం కాదు లేక చవకైనది కాదని వారికి తెలుసు.

రోషన్ మరియు షేరన్ డబ్బు పొదుపు చేసారు మరియు వారి స్తోమతకు తగిన విమానములో వెళ్లటానికి నెలల ముందుగానే విమాన టిక్కెట్లు కొనుక్కొన్నారు. చివరకు, ఆ రోజు వచ్చింది. అయినప్పటికినీ, వారు మలేషియాలో విమానాలను మారే సమయంలో, ఫిలిప్ఫీన్స్‌కు ప్రయాణం కొనసాగాలంటే, వారు మలేషియా వీసా అయినా కలిగియుండాలి లేదా వేరే విమానంలో ప్రయాణించాలని తెలుసుకున్నారు. ఆ సమయంలో వారికి ఒక వీసా లభించే అవకాశములేదు, మరియు మరో విమానంలో టిక్కెట్లు కొనే స్తోమత కూడ లేదు. కాని వారు బంధించబడకుండా ఇంటికి తిరిగి వెళ్ళే ఆలోచనను భరించలేకపోయారు.

ఏమి చేయాలో తెలియక రోషన్, ఆంటన్‌కు ఫోన్ చేశాడు. ఆంటన్ మరియు ఆన్ వారికి సహాయపడాలని చాలా ఆశించారు. శ్రీలంకలో, దేవాలయములో బంధించబడిన కొద్దిమంది దంపతులలో వారు ఒకరు, మరియు అది ఎంత ఆశీర్వాదకరమో వారికి తెలుసు. కాని వారు ఆ మధ్యనే తాము పొదుపుచేసిన ధనముతో అవసరతలో ఉన్న కుటుంబానికి సహాయపడటానికి ఉపయోగించారు, రోషన్ మరియు షేరన్‌లకు క్రొత్త విమానానికి టిక్కెట్లు కొనటానికి సహాయము చేయడానికి వారిదగ్గర సరిపడినంత డబ్బు లేదు.

శ్రీలంకలో పెళ్ళికొడుకు, పెళ్లి కూతురుకు ఒక బంగారుహారాన్ని కొనటం ఆచారము, ఆవిధంగా తన భర్త చనిపోతే భార్యకు కొంత డబ్బు ఉంటుంది. వారికి క్రొత్త టికెట్లు కొనటానికి సహాయం చేయడానికి ఆన్ తన హారాన్ని అమ్మటానికి నిశ్చయించుకున్నది. ఆమె ఉదారమైన బహుమతి మనీలాలో రోషన్ మరియు షేరన్‌లకు దేవాలయమును దర్శించుట సాధ్యం చేసింది.

“దేవాలయంలో బంధించబడుట యొక్క విలువ నాకు తెలుసు“ ఆన్ అన్నది. “షేరన్ మరియు రోషన్‌లు వారి బ్రాంచికి గొప్ప బలంగా ఉంటారని నాకు తెలుసు. వారు ఈ అవకాశాన్ని కొల్పోవటం నాకు ఇష్టంలేదు.”3

దేవాలయాన్ని దర్శించలేని వారికి సహాయపడుటకు ఉపాయాలు

దూరములు లేక ఖర్చుల వలన దేవాలయానికి తరచూ వెళ్ళలేని వారికి లేక అసలు వెళ్ళలేని వారికి, పరిచర్య చేయుటకు మీరు పిలువబడవచ్చును. కాని వారు దేవాలయ దీవెనలను గ్రహించినట్లు మీరు ఇంకా వారికి సహాయపడుటకు మార్గములను కనుగొనవచ్చును.

  • దేవాలయ సిద్ధపాటు లేదా కుటుంబ చరిత్ర తరగతులలో బోధించండి లేక వారితో కలిసి పాల్గొనండి.

  • వారి గృహములో వేలాడదీయుటకు దేవాలయ చిత్రపటం ఒకటి వారికి ఇవ్వండి.

  • మీరు దేవాలయమునకు హాజరై ఉన్నయెడల దేవాలయ విధులను గూర్చి మీ అనుభవము యొక్క భావనలు మరియు సాక్ష్యమును పంచుకొనుడి.

  • వారు దేవునితో చేసిన నిబంధనలను, మరియు వాటిని ఎలా పాటించాలో నేర్చుకొనుటకు సహాయము చేయుము. “దేవునితో మన యొక్క నిబంధనలను గ్రహించుట: మన అత్యంత ముఖ్యమైన వాగ్దానముల యొక్క పర్యావలోకనము,” జూలై 2012 లియహోనా వ్యాసమును ఉపయోగించుటకు ఆలోచించండి.

వివరణలు

  1. రస్సెల్ ఎమ్. నెల్సన్, “ఆదర్శ మైన కడవరి దిన పరిశుద్ధులుగా అగుట,” లియహోనా, నవ. 2018, 114.

  2. లారీన్ గాంట్, “దేవాలయ సేవలో ఆనందమును కనుగొనుట” ఎన్సైన్, అక్టోబరు, 1994, 8ను చూడండి.

  3. సంఘము యొక్క దేవాలయాన్ని దర్శించువారి సహాయనిధి ద్వారా ఆన్ మరియు అంటన్‌లు వారి డబ్బు తిరిగి ఇవ్వబడిన తరువాత వారి బంగారుహారమును తిరిగి పొందారు, అది దేవాలయానికి హాజరగుటకు మరొకవిధంగా స్తోమతు లేని సంఘ సభ్యులకు ఒకసారి ఆర్ధిక సహాయమును ఇచ్చును.