2020
పరిచర్య చెయ్యడం ద్వారా ఇశ్రాయేలీయులను పోగుచేయుట
జనవరి 2020


చిత్రం
ministering

పరిచర్య సూత్రములు, జనవరి 2020

పరిచర్య చెయ్యడం ద్వారా ఇశ్రాయేలీయులను పోగుచేయుట

ఇశ్రాయేలీయులను పోగుచెయ్యాలని ప్రవక్త ఇచ్చిన సలహాను అనుసరించడానికి పరిచర్య చెయ్యడం ఒక అవకాశం.

అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్—“ఈ రోజు భూమిపై జరుగుతున్న అత్యంత ముఖ్యమైన విషయమైన” ఇశ్రాయేలీయులను పోగుచేయుటలో సహాయపడటానికి మనల్ని ఆహ్వానించారు1

ఇశ్రాయేలీయులను పోగుచేసే ఈ పనిలో భాగం కావాలనుకునే వారికి, పరిచర్య చెయ్యడం ఒక అద్భుతమైన అవకాశం కాగలదు. ఇది ప్రజల జీవితాలను మార్చగలిగే స్ఫూర్తిదాయకమైన మార్గం. మనం తక్కువ చురుకైన సభ్యులకు సేవ చేస్తున్నా లేదా మన విశ్వాసానికి వెలుపల ఉన్నవారికి సేవ చేయుటకు మనకు సహాయం చేయాల్సిందిగా వారిని ఆహ్వానించినా, ఇశ్రాయేలీయులను పోగుచెయ్యగల అవకాశాలను మనకు పరిచర్య ఇస్తుంది.

తిరిగి వచ్చే సభ్యులను రక్షించడం

“ప్రేమను స్ఫూర్తిగా తీసుకుంటే, అద్భుతాలు జరుగుతాయి. ‘తప్పిపోయిన’ మన సహోదర, సహోదరిలు అందరూ యేసు క్తీస్తు సువార్త సమగ్రంగా అందుకునేలా మార్గాలను కనుగొంటాము.” —జీన్ బి. బింగమ్2

“నేను, నా భర్త కొత్త పట్టణానికి మారినప్పుడు కనీసం ఆరు సంవత్సరాలు ఎవరితోనూ కలవకుండా నిస్తేజంగా ఉన్నాము. నన్ను కలవడానికి ఒక సహోదరిని పంపుతానని అడిగేందుకు, మా ఉపశమన సమాజం కొత్త అధ్యక్షురాలు నన్ను సందర్శించడానికి వచ్చింది. కొంత సేపు సంశయించిన తర్వాత, నేను ఒప్పుకున్నాను. ఈ సహోదరికి కుక్కలు అంటే అస్సలు పడకపోయినా ప్రతి నెలా నన్ను కలుసుకోవడానికి వచ్చేది,—నా వద్ద ముద్దొచ్చే ఒక కుక్క ఉంది! నా పట్ల తన పరిచర్యను ఆమె రెండు ఏళ్లు కొనసాగించింది, ఇది నాపై అంతులేని ప్రభావం చూపింది.

ఆమె సందర్శనలు అత్యంత సహజంగా కేవలం పలకరించడానికి వచ్చినట్లుగా ఉన్నప్పటికీ, అప్పుడప్పుడు ఆమె నన్ను అడిగే ప్రశ్నలు ఆత్మసంబంధమైన సంభాషణలకు దారితీసేవి. ఇవి నాకు కొంచెం అసౌకర్యంగా ఉండేవి, కానీ సువార్తలో ముందుకు వెళ్లాలా లేదా నేను ఉన్న చోట ఉండిపోవాలా అని నిర్ణయించుకోవడానికి నాకు ప్రేరణ కలిగించాయి. దీని గురించి నిర్ణయం తీసుకోవడానికి నాలో నేను ఎంతో మదనపడాల్సి వచ్చింది, కానీ నేను సహోదరి సువార్తపరిచారకులను కలుసుకోవాలని ఎంచుకున్నాను.

”నేను ఆరు సంవత్సరాలలో మొదటిసారి ఒక రోజు సంస్కార సమావేశానికి హాజరు కావడానికి వెళ్ళాను, అక్కడ లోపలికి వెళ్ళడానికి భయపడ్డాను. నేను సంఘములోకి వెళ్ళినప్పుడు, నాకు పరిచర్య చేసే సహోదరి నా కోసం వేచి ఉంది, ఆమె నాకు తోడుగా ఉండి, ప్రార్థనా మందిరంలోకి తీసుకెళ్లింది. తర్వాత, ఆమె నా వెంటే వస్తూ తిరిగి నా కారు దగ్గర దిగబెట్టి, నేను రక్షకుడికి దగ్గరవ్వడానికి తన నుండి నాకు ఇంకా ఎలాంటి సహాయం కావాలన్నా చెప్పమని అడిగింది.

“నా పరిచర్య చేయు సహోదరి కేటాయించిన సమయం, ప్రేమ నేను తిరిగి మామూలు అయ్యేలా మార్గనిర్దేశం చేయడంలో సహాయపడ్డాయి, ఆమె చేసిన ప్రయత్నాలు నాకు ఇచ్చిన గొప్ప బహుమతులలో ఒకటిగా నేను భావిస్తున్నాను. నేను రక్షకుని సంఘానికి తిరిగి వెళ్లే ప్రయాణంలో ఆమె నాకు తోడుగా ఉన్నందుకు నేను చాలా కృతజ్ఞురాలిని.”

పేరు గోప్యంగా ఉంచబడింది, బ్రిటీష్ కొలంబియా, కెనడా

పరిగణించవలసిన సూత్రములు

“ప్రతి నెలా నన్ను సందర్శించారు”

ఇతర విషయాల కంటే మీరు పరిచర్య చేయు వారి గురించి మీరు ఎక్కువ శ్రద్ధ చూపుతారని ఎలా వ్యక్తపర్చగలరు? (సిద్ధాంతము మరియు నిబంధనలు 121:44 చూడండి).

“ప్రశ్నలు”

సరైన ప్రశ్నలను అడగడం స్వీయ విశ్లేషణను రేకెత్తించడంలో సహాయపడగలదు. మన పరిచర్య కేవలం సామాజిక పలకరింపులతో ముగియకుండా అంతకు మించిన గొప్ప ఉద్దేశ్యం ఉందని గుర్తుంచుకోండి.3

“నా కోసం వేచి ఉన్నారు”

ప్రతి ఒక్కరు స్వాగతించబడినట్లుగా భావించాలి (3 నీఫై 18:32 చూడండి).

“నా తిరుగు ప్రయాణంలో ఆమె నాకు తోడుగా ఉంది”

రక్షకుని యొద్దకు తిరిగి వచ్చి, స్వస్థత పొందటానికి తడబడే వారికి మనం అందించే మద్దతు వారిలో ఎంతో మార్పును తీసుకొస్తుంది (హెబ్రీయులకు 12:12–13 చూడండి).

పరిచర్య చెయ్యడం మరియు పోగుచెయ్యడం

“యేసు క్రీస్తు, ఆయన సంఘము మీకు ఎందుకు అంత ప్రాముఖ్యమో, మీకు సహజముగాను, స్వాభావికముగాను అనిపించే మార్గాలలో ప్రజలతో పంచుకోండి. …

“… మీ పాత్ర ఏమిటంటే మీ హృదయములో ఉన్న దానిని పంచుకొని, మీ నమ్మకాలకు అనుగుణంగా మీరు జీవించడం.” —ఎల్డర్ డీటర్ ఎఫ్. ఉఖ్‌డార్ఫ్4

పరిచర్య చెయ్యడం మరియు సువార్తను పంచుకోవడం కలిసికట్టుగా జరుగుతాయి. మనం పరిచర్య చేసేటప్పుడు మన స్నేహితులు, పొరుగువారిని పోగుచెయ్యడానికి లేదా—మన స్నేహితులు, పొరుగువారిని పోగుచేసినప్పుడు పరిచర్య చెయ్యడానికి మనం పాటించాల్సిన కొన్ని మార్గాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:

  • కలిసి సేవచెయ్యండి. ఒకరి అవసరాలను తీర్చడానికి పరిచర్య చెయ్యడంలో మీతో కలవడానికి స్నేహితులను లేదా పొరుగువారిని ఆహ్వానించడానికి అవకాశాల కోసం చూడండి. ఇటీవల బిడ్డను ప్రసవించిన తల్లికి వంట తయారు చేయడంలో, వృద్ధులైన పొరుగింటి వారిని పలకరించడం లేదా అనారోగ్యంతో బాధపడుతున్న వారి ఇంటిని శుభ్రపరచడంలో మీతో చెయ్యి కలిపి సహాయం అందించాల్సిందిగా వారిని కోరండి.

  • కలిసి బోధించండి. సంఘానికి తరచూ హాజరవ్వని స్నేహితుని లేదా పొరుగింటి వ్యక్తిని ఎంచుకుని, పరిచర్యకులతో కలుసుకొను ఎవరైనా ఒకరి కొరకు పాఠ్యాంశ సమావేశం వారి ఇంటిలో ఏర్పాటు చెయ్యడానికి ఆహ్వానించండి. లేదంటే, మీ స్నేహితుడు మీ ఇంటిలో పాఠ్యాంశ సమావేశాన్ని నిర్వహించడంలో లేదా మీతో పాటు మరొకరి ఇంటిలో పాఠ్యాంశ సమావేశానికి వెళ్లడంలో మీకు తోడు ఉండేలా సాయం తీసుకోవచ్చు.

  • మీరు ఒక అవసరాన్ని చూసినప్పుడు ఇతరులను సంప్రదించండి. సంఘానికి వెళ్లి, రావడానికి రవాణా ఏర్పాటు చేయండి. యువత లేదా పిల్లల కార్యక్రమాలకు పిల్లల్ని ఆహ్వానించండి. మీరు ఇంకా ఏయే ఇతర మార్గాలలో పరిచర్య చెయ్యగలరు మరియు పోగుచెయ్యగలరు?

  • సంఘము అందించిన వనరులను ఉపయోగించండి. సువార్తను పంచడంలో సభ్యులకు సహాయపడటానికి సంఘం అనేక రకాల వనరులను అందిస్తుంది. మన సమాజాలలో ఇశ్రాయేలీయులను ఎలా పోగుచెయ్యాలో ఉపాయాల కోసం గాస్పెల్ లైబ్రరీ యాప్‌లోని “పరిచర్యకుడు” విభాగంలో బ్రౌజ్ చేయవచ్చు, అలాగే ComeUntoChrist.org ను సందర్శించవచ్చు.

వివరణలు

  1. రసెల్ ఎమ్. నెల్సన్, “ఇశ్రాయేలు కోసం నిరీక్షణ” (ప్రపంచవ్యాప్త యువత భక్తి మార్గం, జూన్ 3, 2018), HopeOfIsrael.ChurchofJesusChrist.org.

  2. జీన్ బి. బింగం, “రక్షకుడు చూపిన మార్గంలో పరిచర్య చేయడం,” లియహోనా, మే 2018, 106.

  3. “పరిచర్య సూత్రములు: మన పరిచర్యను మార్చే ఆ ఉద్దేశము,” జన. 2019.

  4. డీటర్ ఎఫ్. ఉఖ్‌డార్ఫ్, “పరిచర్య కార్యము: మీ హృదయంలో ఉన్నది పంచుకోవడం,” లియహోనా, మే 2019, 17.