2019
పరిచర్య చేయుటకు ఆత్మ మీకు ఏవిధంగా సహాయము చేయగలదు (చేయును)
2019 సెప్టెంబర్


పరిచర్య సూత్రములు, 2019 సెప్టెంబర్

పరిచర్య చేయుటకు ఆత్మ మీకు ఏవిధంగా సహాయము చేయగలదు (చేయును)

స్త్రీ పురుషులు ఇరువురికి ఇవ్వబడిన పరిచర్య చేయుట అనే యాజకత్వపు నియమితకార్యము బయల్పాటును పొందే హక్కును కలిగియున్నది.

చిత్రం
ministering

గెట్టి చిత్రాలనుండి దృష్టాంతములు

పరిచర్య మరియు సేవ చేయుటకు, రక్షకుని వలే ప్రేమించుటకు ఇవ్వబడిన పిలుపు కొన్నిసార్లు, మరి ముఖ్యముగా మనకు బాగా పరిచయము లేని వారికి సహాయము చేయవలసి వచ్చినప్పుడు సవాలుతో కూడినదిగా అనిపించవచ్చును. పరిచర్య చేయుటకు ఒక మిలియన్ విధానాలు ఉండగా, మనకు నియమించబడియున్న వారికి సహాయము చేయుటకు ఉత్తమమైన మార్గాలను ఏవిధంగా తెలుసుకోగలమని మనం ఆశ్చర్యపడతాము.

మనం ఎక్కువ సేపు ఆశ్చర్యపడనవసరం లేదు ఎందుకంటే మన చిత్తశుద్ధిగల ప్రయత్నాలు పరిశుద్ధాత్మ చేత నడిపింపబడగలవు.

“మీ పవిత్రమైన పరిచర్య చేయు నియమితకార్యము ప్రేరేపణ పొందుటకు మీకు దైవికమైన హక్కును ఇచ్చును,” అని యువతుల ప్రధాన అధ్యక్షురాలు సహోదరి బోన్నీ హెచ్. కార్డన్ చెప్పారు. “ఆ ప్రేరేపణను మీరు నమ్మకముతో వెదకవచ్చును.”1

రక్షకుని వలె మనం కూడా సేవ చేయుటకు వెదకినప్పుడు, ఆయనను నడిపించిన అదే ఆత్మచేత మనం కూడా నడిపించబడగలము. బిషప్పు యొక్క యాజకత్వపు తాళపు చెవుల అధికారము క్రింద చేయబడిన పరిచర్య వంటి నియమితకార్యములలో సేవ చేస్తున్నప్పుడు ఇది మరిముఖ్యముగా సత్యమైనది. ఆత్మతో పరిచర్య చేయుటకు ఆరు సలహాలు ఇక్కడున్నాయి.

పరిచర్య చేస్తున్నప్పుడు ఆత్మను నేనేవిధంగా కలిగియుండగలను?

  • నడిపింపు కొరకు అడుగుము. ప్రార్థన ద్వారా మనం ఆయనతో సంభాషించాలని పరలోక తండ్రి మనల్ని కోరుచున్నారు. ప్రార్థన మనల్ని ఆయనకు చేరువగుటకు అనుమతించడమే కాకుండా, “దేవుడు ఇంతకుముందే దయచేయుటకు సంసిద్ధతగల దీవెనలు అయితే అవి మనం అడిగితేనే ఇవ్వబడునన్న షరతుపై చేయబడిన” వాటిని కూడా భద్రపరచును.”2 “వారి హృదయాలను మనము అర్ధము చేసుకొనుటకు ప్రార్థించి, వెదకినప్పుడు, పరలోక తండ్రి మనల్ని నడిపించి, ఆయన ఆత్మ మనతో వచ్చునని నేను సాక్ష్యమిస్తున్నాను”3 అని సహోదరి కార్డన్ చెప్పారు.

  • ఒక ప్రేరణ కొరకు వేచిచూడవద్దు. చురుకుగా ఉండుము. “ఆతృతతో నిమగ్నమై” యుండుడి (సిద్ధాంతము మరియు నిబంధనలు 58:27), మరియు మీ ప్రయత్నాలు నడిపింపును పొందగలవని, హెచ్చించబడగలవని మీరు కనుగొందురు. “మన సేవ మరియు పనితో ముందుకు సాగుట బయల్పాటు పొందుటకు అర్హత పొందుటకు ఒక ముఖ్యమైన మార్గము,” అని ప్రథమ అధ్యక్షత్వములో మొదటి సలహాదారులైన అధ్యక్షులు డాలిన్ హెచ్. ఓక్స్ చెప్పారు. “దేవుని పిల్లలకు వచ్చు బయల్పాటులో అధికము వారు గమనములో ఉన్నప్పుడే వచ్చును గాని, తీసుకోవలసిన మొదటి మెట్టును తీసుకోమని ప్రభువు వారికి చెప్పునని వారి నివాసస్థలములలో కూర్చొని వేచి చూస్తున్నప్పుడు కాదని నా లేఖన పఠనములో నేను గమనించాను.”4

పరిచర్య చేయుటకు వచ్చు ప్రేరణలను నేనేవిధంగా గుర్తించగలను?

  • మోర్మన్ సలహాను తీసుకోండి. ఒక తలంపును అది ప్రేరణ లేక ప్రేరణ కాదా అని ఆందోళన చెందవలసిన అవసరం లేదు. దానిని తెలుసుకొనుటకు మోర్మన్ యొక్క సులభమైన మార్గము ఉన్నప్పుడు ఆందోళన అసలే వద్దు: మేలు చేయుటకు మరియు క్రీస్తుయందు నమ్మకముంచుటకు లేదా నమ్ముటకు ఇతరులకు సహాయము చేయమనే ప్రేరణను కలిగించు ఒక ఆలోచనను మీరు కలిగియున్నట్లైతే, అది దేవుని నుండి కలిగినదని మీరు తెలుసుకొనవచ్చును (మోరోనై 7:16 చూడుము).

  • దాని గురించి చింతించవద్దు. “కొలనులో దూకి, ఈత కొట్టండి,” అని పన్నెండుమంది అపొస్తలుల సమూహమునకు చెందిన ఎల్డర్ జెఫ్రీ ఆర్. హాలాండ్ చెప్పారు. “అవసరతలో ఉన్నవారి వైపుకు సాగండి. వెనుకవైపుకు ఈత కొట్టాలా లేదా శునకము వలె ఈదాలా అని ఆలోచిస్తూ కదలకుండా ఉండవద్దు. బోధించబడిన ప్రాథమిక సూత్రాలను మనం అనుసరించి, యాజకత్వపు తాళపుచెవులతో అనుసంధానముగా నిలిచి, మనల్ని నడిపించుటకు పరిశుద్ధాత్మను వెదకినప్పుడు మనం విఫలము కాలేము.”5

ఒక ప్రేరణను అనుసరించుటకు గల ఉత్తమమైన మార్గము ఏమిటి?

  • వెనువెంటనే. సహోదరి సూజన్ బెడ్నార్ (పన్నెండుమంది అపొస్తలుల సమూహమునకు చెందిన ఎల్డర్ డేవిడ్ ఏ. బెడ్నార్ గారి భార్య) ప్రేరణలు అనుసరించుటలో గొప్ప మాదిరిగా ఉన్నారు. “అవసరతలో ఉన్న వారిని చూచుటకు ఆత్మీయ నేత్రములు ఇమ్మని” ప్రార్థించిన తరువాత, ఆమె చుట్టూ ఉన్న సమూహమును చూచును మరియు తరచు “ఒక ప్రత్యేకమైన వ్యక్తిని దర్శించమని లేదా ఫోను చెయ్యమని ఒక ఆత్మీయ సంజ్ఞను భావించును” అని ఎల్డర్ బెడ్నార్ అని తన అనుభవమును పంచుకొన్నారు. “మరియు సహోదరి బెడ్నార్ అటువంటి భావాన్ని పొందినప్పుడు, ఆమె తక్షణమే స్పందించి, గైకొనును. ముగింపు ప్రార్థనలో ‘ఆమేన్’ అని చెప్పబడిన వెంటనే, ఒక యౌవనస్తునితో మాట్లాడుట, ఒక సహోదరిని కౌగిలించుకొనుట లేదా ఇంటికి తిరిగి వచ్చిన వెంటనే ఫోను తీసుకొని ఫోను చేయుట అనేది తరచు జరిగే విషయము.”6

  • ధైర్యముగా. తిరస్కార భయము, బిడియము, అసమర్ధత, లేదా అసౌకర్యముగా ఉండే భావాలు పరిచర్య చెయ్యాలనే ప్రేరణను అనుసరించకుండా మనలను ఆటంకపరచవచ్చును. “వేర్వేరు సమయాలలో మరియు మార్గాలలో, మనమందరము అసమర్ధతను, అనిశ్చయతను బహుశా అవిధేయతను భావిస్తాము” అని పన్నెండుమంది అపొస్తలుల సమూహమునకు చెందిన ఎల్డర్ గెరిట్ డబ్ల్యూ. గాంగ్ చెప్పారు. “ఐనప్పటికి దేవుని ప్రేమించుటకు, మన పొరుగువారికి పరిచర్య చేయుటకు చేయు మన విశ్వాసపూరితమైన ప్రయత్నాలలో, దేవుని ప్రేమను, అవసరమైన ప్రేరేపణను వారి జీవితాలలో, మన జీవితాలలో ఒక నూతనమైన, పరిశుద్ధమైన విధానాలలో మనం భావించగలము.”7

    ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిన ఒక స్త్రీ యొక్క భర్తను కలుసుకొనుటకు అతడు ఏవిధంగా సందేహించాడో ఒక సహోదరుడు తన అనుభవాన్ని పంచుకొన్నాడు. కాని చివరకు ఆ భర్తను మధ్నాహ్న భోజనానికి పిలిచాడు. “మీ భార్య ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. అది మిమ్మల్ని ముంచివేసినట్లుగా అనిపించి ఉండవచ్చు. ”దాని గురించి మీరు మాట్లాడాలనుకొంటున్నారా?’ అని నేను అన్నప్పుడు, అతడు గట్టిగా ఏడ్చాడు,” అతడు పంచుకొన్నాడు. “మేము మృదువైన, అన్యోన్యమైన సంభాషణ చేసి, నిముషాలలో విశేషమైన సాన్నిహిత్యమును, నమ్మకాన్ని వృద్ధి చేసుకున్నాము.”8

వివరణలు

  1. బోనీ హెచ్. కార్డన్, “Becoming a Shepherd,” Liahona, నవం. 2018, 76.

  2. బైబిల్ నిఘంటువు, “ప్రార్థన”

  3. బోనీ హెచ్. కార్డన్, “Becoming a Shepherd,” 76.

  4. డాలిన్ హెచ్. ఓక్స్, “In His Own Time, in His Own Way,” Liahona, ఆగష్టు. 2013, 24.

  5. జెఫ్రీ ఆర్. హాలాండ్, “The Ministry of Reconciliation,” Liahona, నవం. 2018, 77.

  6. డేవిడ్ ఏ. బెడ్నార్, “Quick to Observe,” Liahona, డిసెం. 2006, 17.

  7. గెరిట్ డబ్ల్యూ. గాంగ్, “Our Campfire of Faith,” Liahona, నవం. 2018, 42.

  8. బోనీ హెచ్. కార్డన్, “Becoming a Shepherd,” 76.